For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దాడికి గురయిన తన సంరక్షకుని కాపాడే క్రమంలో పరుగున వచ్చిన ఏనుగు

దాడికి గురయిన తన సంరక్షకుని కాపాడే క్రమంలో పరుగున వచ్చిన ఏనుగు

|

పెంపుడు జంతువులు మానవుని ఉత్తమ శ్రేయోభిలాషులుగా ఉన్నాయి అనడంలో అతిశయోక్తి లేదు. ఎటువంటి కఠినమైన పరిస్థితుల్లో కూడా ఎల్లప్పుడూ మీ వెన్నంటే ఉండే గొప్ప సహచరులుగా ఉండే ఈ పెంపుడు జంతువులు, మన నుండి ఏమైనా ఆశిస్తాయి అంటే, అవి ప్రేమ, గౌరవం, నమ్మకం, ఆప్యాయత.

ఈ వీడియోలో చిత్రీకరించిన సందర్భాన్ని చూస్తే, అవి యజమాని పట్ల ఎంత నిబద్దతను కలిగి ఉంటాయో వేరే చెప్పనవసరం లేదు అన్నట్లుగా ఉంది. ఇక్కడ 17 ఏళ్ల ఆడ ఏనుగు తాంగ్స్రీ తన సంరక్షకుని కాపాడే క్రమంలో పరుగున వచ్చిన ఈ వీడియో, ఇప్పుడు వైరల్ అవుతోంది. ఏనుగు తన సంరక్షకునికి రక్షణ కవచం వలె ఉంటుందని చెప్పబడింది. యజమాని ఎటువంటి కష్టంలో ఉన్నా, తానే ముందు ఉంటానన్న భరోసా ఇస్తుంది.

Video Of Elephant Rushing To Rescue Her Caretaker When He Is Attacked

ఏనుగులు తమ యజమానుల పట్ల కనికరం, ప్రేమ మరియు నిబద్దతను కలిగి ఉంటాయని అందరికీ తెలిసిన విషయమే. ఇవి మానవుల మాదిరిగానే ఆనందం, దుఃఖం మరియు భావోద్వేగాలను కూడా కలిగి ఉంటాయని నిరూపించబడింది కూడా. వీటిని జాగ్రత్తగా చూసుకునే వ్యక్తులకు తమ జీవితాన్నే అంకితం చేసేలా ఈ ఏనుగులు నిబద్దతను కలిగి ఉంటాయి.

ఈ వీడియోలో, సంరక్షకుడు ఆ ఏనుగు తనపై చూపే ప్రేమను రికార్డు చేయాలని భావించాడు. క్రమంగా, ఆ సంరక్షకులు ఏనుగులపై చూపే ప్రేమ కూడా అందరికీ అర్ధమవుతుంది.


తన సంరక్షుని మీదకు దాడికి యత్నించిన వారి మీద యుద్ద ప్రాతిపదికన పరిగెత్తుకుంటూ వచ్చి, వారిని తరిమిన 17 ఏళ్ళ ఏనుగు కథ ఇది. కాకపోతే ఇదంతా నాటకం అని ఆ ఏనుగుకి తెలీదు.

ఇక్కడ ఆ ఏనుగు తన సంరక్షకుని శ్రేయస్సు గురించి ఆందోళన చెందిన దృశ్యాలు కనిపిస్తాయి. అతని చుట్టూతా గుండ్రంగా తిరగడం, అతని బాగోగులను గమనించడం వంటి చర్యలు ఆశ్చర్యం కలిగించేవిలా ఉన్నాయి. క్రమంగా వీటి నుండి నేర్చుకోవలసినది ఎంతో ఉందని చెప్పకనే చెప్తున్నట్లు ఉంది ఈ వీడియో.

ఏనుగులు అత్యంత తెలివైన జంతువులుగా ప్రసిద్ది చెందినవి. తమకు హాని చేసిన వారిని, కానీ ప్రేమగా చూసుకున్న వారిని కానీ అస్సలు మరచిపోనివిగా ఉంటాయి. తన పట్ల రాక్షసత్వాన్ని ప్రదర్శించిన ఒక సంరక్షకుని నడిరోడ్డులో తరిమి తరిమి గాయపరచి, చంపిన ఘటనలు కూడా మనం చూశాం. వీటి తెలివి కారణంగానే ఏ కథలో అయినా, మృగరాజు సింహానికి ఇచ్చినంత గుర్తింపు ఏనుగుకి కూడా ఇవ్వడం జరుగుతుంటుంది.

ఈ వీడియో చూస్తుంటే నిజంగా ఒక పెట్ కలిగి ఉండాలన్న ఆలోచన మనసుకు స్పురిస్తుంది కదూ? ప్రేమ, ఆప్యాయత, గౌరవం, నిబద్దత వంటి లక్షణాలు మనుషుల వలె, వీటికి కూడా ఉంటాయి. కానీ ఎక్కువగా మనుషులలో ఉండే స్వభావం, వీటిలో లేనిది “వెన్నుపోటు తనం”. తమ యజమానికి ఆజన్మాంతం ఋణపడి ఉండేలా నిబద్దతను ప్రదర్శించే ఈ సాదుజీవులు మానవాళికి దేవుడిచ్చిన వరం అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.

ఈవ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర అంశాలకోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈవ్యాసంపై మీ విలువైన అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింది వ్యాఖ్యల విభాగంలో మాకు తెలియజేయండి.

English summary

Video Of Elephant Rushing To Rescue Her Caretaker When He Is Attacked

A 17-year-old female elephant named Thongsri is seen coming to the rescue of her caretaker when she sees him being attacked by a colleague.Though the situation of being attacked was fake and created to check the love and possessiveness of the elephant, it proves how caring she is regarding her caretaker and shoos away any potential threats.
Desktop Bottom Promotion