For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రైల్వే స్టేషన్ లో నోటితో శ్వాస అందించి, సీపీఆర్ ట్రీట్ మెంట్ చేసి ప్రాణం పోసిన వైద్య విద్యార్థిని

చైనా లోని జింజూకు దగ్గర్లోని ఒక రైల్వే స్టేషన్ లో ఒక వృద్ధుడు గుండెపోటు వచ్చి పడి పోయాడు. అతని కుమారుడు అంబులెన్స్ కు ఫోన్ చేస్తూ, తండ్రిని ఎలా రక్షించుకోవాలని ఆరాటపడ్డాడు.

|

గుండెపోటు అనేది ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. చాలా మందికి ఎక్కడంటే అక్కడ గుండెపోటు వచ్చి కిందపడిపోతుంటారు. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతుంటాయి. అయితే ఆ సమయంలో ప్రథమ చికిత్స అందిస్తే ఆ వ్యక్తి ప్రాణాలు నిలబడతాయి. కానీ చాలా మందికి దీనిపై అవగాహన లేకపోవడం, ఉన్నా కూడా మనకెందుకు వచ్చిందిలే అని పట్టించుకపోవడం వల్ల ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటాయి. అయితే తాజాగా చైనాలో ఒక అమ్మాయి సీపీఆర్ ద్వారా ఒక వృద్ధుడి ప్రాణాలు కాపాడింది.

వృద్ధుడు గుండెపోటు వచ్చి పడి పోయాడు

చైనా లోని జింజూకు దగ్గర్లోని ఒక రైల్వే స్టేషన్ లో ఒక

వృద్ధుడు గుండెపోటు వచ్చి పడి పోయాడు. అతని కుమారుడు అంబులెన్స్ కు ఫోన్ చేస్తూ, తండ్రిని ఎలా రక్షించుకోవాలని ఆరాటపడ్డాడు. ఇంతలో అక్కడే ఉన్న మెడికల్ స్టూడెంట్ డింగ్ హుయ్ పరుగున వృద్ధుడి దగ్గరకు వెళ్లింది. ఈ వృద్ధుడి వయస్సు 81 సంవత్సరాలు.

ఛాతిపై గట్టిగా నొక్కుతూ సీపీఆర్ ట్రీట్ మెంట్

ఛాతిపై గట్టిగా నొక్కుతూ సీపీఆర్ ట్రీట్ మెంట్

వృద్ధుడి ఛాతిపై గట్టిగా నొక్కుతూ సీపీఆర్ ట్రీట్ మెంట్ చేసింది. దీన్నే కార్డియో పల్మ నరీ రిసస్సీ టేషన్ అని అంటారు. అలా ఆమె దాదాపు పదిహేను నిమిషాల పాటు సీపీఆర్ ట్రీట్ మెంట్ అందిచింది. అలాగే ఆ వృద్ధుడికి శ్వాస అందేందుకు వీలుగా నోటి ద్వారా శ్వాస కూడా అందించింది.

మళ్లీ ప్రాణాలతో బయటపట్టాడు

మళ్లీ ప్రాణాలతో బయటపట్టాడు

కుప్పకూలిపోయిన ఆ వృద్ధుడు చివరకు మళ్లీ ప్రాణాలతో బయటపట్టాడు. ఇక డిండ్ హుయ్ జింజూ లోని మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చేస్తోంది. దాదాపు అరగంట పాటు డింగ్ హుయ్ అక్కడే ఉండి వృద్ధుడికి ప్రాణం పోసింది. తన తండ్రి ప్రాణాలు కాపాడినందుకు అతని కుమారుడు డింగ్ హుయ్ కు డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నించాడు. కానీ ఆమె సున్నితంగా తిరస్కరించింది.

డింగ్ హుయ్ ని అందరూ మెచ్చుకుంటున్నారు

డింగ్ హుయ్ ని అందరూ మెచ్చుకుంటున్నారు

ఈ క్రమంలో తన ట్రైన్ ను కూడా మిస్సైంది. తర్వాత చాలా సేపు ట్రైన్ కోసం ఆమె వేచి చూసింది. ఇక డింగ్ హుయ్ చేసిన మేలును రైల్వే స్టేషన్ లో అందరూ మెచ్చుకున్నారు. అక్కడే ఉన్న ఒక వ్యక్తి డింగ్ హుయ్ అందించిన ప్రథమ చికిత్స మొత్తాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా డింగ్ హుయ్ ని అందరూ మెచ్చుకుంటున్నారు.

English summary

video viral college girl performs cpr on elderly man at railway station

video viral college girl performs cpr on elderly man at railway station
Story first published:Monday, July 23, 2018, 14:32 [IST]
Desktop Bottom Promotion