రంగు రంగుల రోజా పువ్వుల వెనుక దాగి ఉన్న రహస్యం మీకు తెలుసా ?

By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

విభిన్న రంగుల రోజా పువ్వులు, విభిన్న రకాల అర్ధాలను తెలియజేస్తాయి అనే విషయం మీకు తెలుసా ? అతి త్వరలోనే వాలెంటైన్ వారం మొదలు కాబోతోంది. దానిని పురస్కరించుకొని ఈ రోజు రోజ్ డే ని జరుపుకోబోతున్నారు.

వాలెంటైన్ వారంలో ఒక్కో రోజు, ఒక్కో రకంగా జరుపుకుంటారు. అందులో ఈ రోజు రోజ్ డే, అంటే రోజా పూల దినం అని అర్ధం. విభిన్న రకాల రంగులు గల రోజా పువ్వులు ఏమి అర్ధం తెలియజేస్తాయి అనే విషయం మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా ? అయితే ఈ వ్యాసాన్ని చదవండి.

What Do The Different Rose Colours Reveal?

కేవలం తమ భాగస్వాములకు మాత్రమే రోజా పువ్వులు ఇవ్వాలి అని ఎక్కడ రాసి లేదు. రోజా పువ్వుల్ని స్నేహితులకు లేదా మన క్షేమాన్ని కోరుకునేవారికి లేదా మీరు ఇష్టపడే వారికి ఇలా ఎవ్వరికైనా రోజా పూలను బహుకరించవచ్చు.

కాబట్టి విభిన్న రకాల రంగులు కలిగిన రోజా పూల వెనుక ఉన్న అర్ధాన్ని తెలుసుకొని, సరైన వ్యక్తికి సరైన రోజా పువ్వుని ఇచ్చి వారు మీకు ఎంత ప్రత్యేకమో తెలియజేయండి. ముఖ్యంగా మీ భాగస్వామికి ఇలా చేయడం ద్వారా వారు ఎంతో సంతోషిస్తారు.

ఎర్రటి గులాబీ :

ఎర్రటి గులాబీ :

ఎరుపు రంగు ప్రేమని తెలియజేస్తుంది. కాబట్టి ఎరుపు రంగు ఇచ్చే సందేశం చాలా ముక్కు సూటిగా ఉంది కదా. అందుచేతనే ఈ రంగు రోజా పూలకు ఈరోజు ఎక్కువ గిరాకీ ఉంటుంది. ఎందుకంటే చాలామంది వ్యక్తులు తమ భాగస్వామికి ఈ రోజు ఈ రంగు రోజా పువ్వు ని ఇవ్వాలని భావిస్తారు.

పసుపు పచ్చ రోజా పువ్వు :

పసుపు పచ్చ రోజా పువ్వు :

ఈ రంగు రోజా పువ్వు సాధారణంగా స్నేహితులకు బహుకరిస్తారు. ఈ రంగు స్నేహాన్ని తెలియజేస్తుంది. ఆశావాదాన్ని స్ఫురిస్తుంది మరియు మంచి వైఖరిని మీ యొక్క స్నేహితుడికి తెలియజేస్తుంది. ఈ రంగు రోజా పువ్వుని మీ స్నేహితుడికి ఇవ్వడం ద్వారా, ఈ రోజు వారిని కొద్దిగా ఆశ్చర్యపరచవచ్చు. వారు మీకు ఎంత ప్రత్యేకమో తెలుపవచ్చు.

 గులాబీ రంగు రోజా పువ్వు :

గులాబీ రంగు రోజా పువ్వు :

సాధారణంగా ఈ రంగు రోజా పువ్వుని, ధన్యవాదాలు తెలియజేసే సమయంలో ఉపయోగిస్తుంటారు. ఈ రంగు రోజా పువ్వు ఆనందాన్ని, కృతజ్ఞత భావాన్ని మరియు ప్రశంసను ఎదుటి వ్యక్తికి తెలియజేస్తుంది. ఈ రంగు రోజా పూలని, అసాధారణంగా తమ యొక్క కృతజ్ఞత భావాన్ని తెలియజేయాలి అని అనుకున్నప్పుడు బహుకరించవచ్చు.

తెలుపు రంగు రోజా పువ్వు :

తెలుపు రంగు రోజా పువ్వు :

ఈ రోజు గనుక మిమ్మల్ని ప్రేమించే వారు ఈ రంగు రోజా పూలను మీకు గనుక బహుకరిస్తే మీరు అస్సలు ఆశ్చర్యపోకండి. ఎందుకంటే వారు మీతో శాంతంగా ఉండాలని, ఇద్దరి మధ్య సహృద్భావం ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ రంగు రోజా పువ్వుని ఈ రోజు మీకు బహూకరించి ఉంటారు. ఎప్పుడైతే వ్యక్తుల మధ్య విపరీతమైన దూరం పెరుగుతుందో లేదా గొడవ జరుగుతుందో, ఆ తర్వాత ఇద్దరి మధ్య బంధం బల పడాలంటే, ఈ రకమైన రోజా పూలు ఇవ్వడం ద్వారా మీతో గొడవపడిన వ్యక్తులకు మంచి సందేశం ఇచ్చినట్లు అవుతుంది.

నారింజ రంగు రోజా పువ్వు :

నారింజ రంగు రోజా పువ్వు :

ఎవరినైతే ఒక వ్యక్తి చాలా ప్రత్యేకంగా భావిస్తారో మరియు వారి పట్ల విపరీతమైన బావోద్వేగాన్ని ప్రదర్శిస్తారో, అటువంటి వారికి ఈ రంగు రోజా పువ్వు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే, ఈ రంగు రోజా పువ్వు ఆ లక్షణాలన్నింటికీ ప్రతిరూపంగా నిలుస్తుంది. తీవ్ర భావద్వేగాలను, అభిరుచి మరియు శక్తికి ప్రతి బింబముగా ఈ రంగు నిలుస్తుంది. ఈ రంగు రోజా పువ్వుల్ని, మిగతా రంగు రోజా పూలతో కలిపి మీరు ప్రేమించే వ్యక్తులకు ఇవ్వడం ద్వారా మీ యొక్క అసలైన ఉద్దేశాలు వారికి అర్ధం అవుతాయి.

పీచు రంగు రోజా పువ్వు :

పీచు రంగు రోజా పువ్వు :

ప్రేమ గురించి మొదటిసారి కలిగే భావనను ఈ రంగు రోజా పువ్వు తెలియజేస్తుంది. మీరు ఎవరినైనా గనుక విపరీతంగా ప్రేమిస్తూ ఉంటే మరియు మీలోని భావాలను ఇతర వ్యక్తులకు తెలియజేయాలని మీరు గనుక భవిస్తూ ఉంటే, ఈ రంగు రోజా పువ్వు సరిగ్గా సరిపోతుంది.

సాల్మన్ రంగు రోజా పువ్వు :

సాల్మన్ రంగు రోజా పువ్వు :

మీ భాగస్వామి పట్ల మీకు ఉన్న కోరికలు మరియు ఉత్సాహాన్ని సరిగ్గా తెలియజేయడానికి ఈ రంగు రోజా పువ్వు సరిగ్గా ఉపయోగపడుతుంది. నారింజ రంగు కంటే కూడా మరీ ఎక్కువ లేత ఎరుపు రంగులో మరియు పీచు రంగు కంటే కూడా మరింత ఎక్కువ రంగులో ఈ రోజా పువ్వు రంగు ఉంటుంది. ఈ రంగు రోజా పువ్వుని ఇచ్చేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే, ఈ రంగు పూలు ఇచ్చిన తర్వాత మీకు రావాల్సిన ఫలితం మీరు ఊహించినట్లు ఉండకపోవచ్చు.

కృష్ణ గులాబీ రంగు రోజా పువ్వు :

కృష్ణ గులాబీ రంగు రోజా పువ్వు :

కృతజ్ఞత భావాన్ని మరియు అభినందించడాన్ని ఈ రంగు రోజా పువ్వు తెలియజేస్తుంది. మీరు ఈ భావాలను ఎవరికైతే చెప్పదల్చుకుంటారో, అటువంటి వ్యక్తులకు ఈ రంగు రోజా పూలను బహుకరించండి. ఈ రంగు దయా గుణాన్ని కూడా తెలియజేస్తుంది. కాబట్టి ఈ లక్షణాలు ఉన్న వారు మీ మెదడులో ఎవరైతే ఉన్నారో వారికి బహూకరించాడు, ఈ రోజా పూలు అందుకు ఎంతగానో ఉపయోగపడతాయి.

బుర్గున్డి రంగు రోజా పువ్వు :

బుర్గున్డి రంగు రోజా పువ్వు :

ఈ రంగు రోజా పూలు ఎంతో ప్రేమపూరితమైనవి. ఈ రోజా పూలు లోతైన అభిరుచిని తెలియజేస్తాయి. ఎరుపు రంగు రోజా పువ్వులకు మించిన భావాలను కూడా ఈ రంగు రోజా పూలు తెలియజేయగలవు. కాబట్టి వాలెంటైన్ రోజున కానీ లేదా మరే ఇతర సందర్భంలో గాని మీరు మీ ప్రేమను వ్యక్తం చేయాలనుకుంటే, ఈ రంగు రోజా పూలను ఇవ్వడం మాత్రం మరచిపోకండి. ఆ సందర్భానికి ఇవి ఖచ్చితంగా అతికినట్లు సరిపోతాయి.

ఈరోజు మీరు ఏ రోజా పువ్వుని ఇవ్వాలని భావిస్తున్నారు. మీ యొక్క అభిప్రాయాన్ని క్రింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.

English summary

What Do The Different Rose Colours Reveal?

What Do The Different Rose Colours Reveal,Do you know that different rose colours have a different meaning to them? From the yellow rose for friendship, to the red one which means love, various different colours have a different meaning to them!
Story first published: Sunday, February 11, 2018, 9:00 [IST]
Subscribe Newsletter