For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ కాలి బ్రొటనవేలు మీ వ్యక్తిత్వాన్ని చెప్పగలదా?

|

చాలామంది ఇతరుల గురించి తమకు బాగా తెలుసు అన్న భ్రమలో ఉంటుంటారు. వీరి అంచనాలకు భిన్నంగా వారి శైలి ఉన్నప్పుడు, ఖిన్నులవుతుంటారు. కానీ ఒక వ్యక్తి యొక్క లక్షణాలను అర్ధం చేసుకోవడానికి వ్యక్తిత్వ పరీక్షలు ఎంతగానో సహాయం చేయగలవని తెలుసా? హస్త సాముద్రికం, నుదుటి మీద గీతలు, కాలి రేఖలు, కాలి పరిమాణం మరియు ఆకృతి వలనే, కాలి బ్రొటన వేలి ఆకారం మరియు పరిమాణం కూడా ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని అంచనా వేయగలదని చెప్పబడినది.

చిరోమాన్సీ వంటి వివిధ రూపాల ద్వారా అంచనాలు తయారు చేయబడతాయి, దీనిని హస్త సాముద్రికం యొక్క కళగా కూడా పిలువబడుతుంది.

అనేకమంది ఈ అంచనాలను విశ్వసిస్తున్నప్పటికీ, కొన్ని పద్దతుల గురించి పూర్తి అవగాహన లేని కారణంగా కాస్త అసౌకర్యానికి గురవుతుంటారు. కాలి వేళ్ళ ద్వారా, ముఖ్యంగా బ్రొటన వేలి ద్వారా కూడా వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చునని చెప్పబడుతున్నది, దీనికి సంబంధించిన వివరాలు ఈ వ్యాసంలో పొందుపరచబడ్డాయి.

This Is What Your Toes Say About Your Personality

సరిగ్గా మీ బ్రొటన వేలి ఆకారం బయట పెట్టే విషయాలను గురించి తెలుసుకోండి.

కాలి రూపు రేఖలను అద్యయనం చేసి వ్యక్తిత్వాన్ని నిర్వచించడాన్ని “సోలెస్ట్రీ” అని కూడా పిలుస్తారు. ఇది ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి మనకు తెలియజేయగల సాధనంగా చెప్పబడుతున్నది.

కాలిని చూసి వ్యక్తిత్వం చెప్పగలిగే వారి ప్రకారం, కాలి ఎత్తు, ఆకారం మరియు కాలి బ్రొటన వేలిని చూసి పర్యవేక్షించడం ద్వారా వ్యక్తి వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చునని చెప్పబడుతున్నది. వ్యక్తిత్వమే కాకుండా భవిష్యత్, ఆర్ధిక, కుటుంబ మరియు ప్రేమ సంబంధిత వ్యవహారాల గురించి కూడా అంచనా వేయవచ్చునని చెప్పబడుతున్నది.

మీ యొక్క కాలి ఆకారం మరియు పరిమాణం తెలుసుకోవడం ద్వారా మీ వ్యక్తిత్వాన్ని వెల్లడి చేయగల మార్గం గురించి తెలుసుకోండి.

పెద్ద బ్రొటన వేలిని కలిగి ఉన్న ఎడల:

పెద్ద బ్రొటన వేలిని కలిగి ఉన్న ఎడల:

మీరు పెద్ద కాలి బ్రొటన వేలిని కలిగి ఉన్న వ్యక్తి అయితే, అప్పుడు మీరు సృజనాత్మకంగా ఉంటారనడానికి సంకేతం కావచ్చు. మీరు ఒక పదునైన ఆలోచనాపరునిగా కూడా ఉన్నారని సూచిస్తుంది. తెలివితేటలతో లక్ష్య సాధనలో ఎల్లప్పుడూ ముందు ఉంటారని, ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా బెదరక ముందుకు అడుగువేసే ధైర్యవంతులుగా ఉంటారని చెప్పబడింది.

చిన్న బొటనవేలు కలిగి ఉన్న ఎడల:

చిన్న బొటనవేలు కలిగి ఉన్న ఎడల:

మీరు కాలి బ్రొటన వేలు చిన్నదిగా కలిగి ఉన్న ఎడల, మల్టీ టాస్కింగ్(బహువిధ) లక్షణాలు కలిగిన వారిగా చెప్పబడుతున్నారు. కాకపోతే చిన్న పిల్లల తత్వాన్ని కలిగి ఉంటారని చెప్పబడుతున్నది. ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేలా పరిసరాలను మార్చుకునే తత్వాన్ని కలిగి ఉంటారు. మరియు స్నేహశీలునిగా, మంచి చమత్కారం ఉన్న వ్యక్తిగా ఉంటారు. మీ ప్రియమైన వ్యక్తులు ఎల్లప్పుడూ మీ సాన్నిహిత్యాన్ని కోరుకుంటారు. మీ కుటుంబంలో మీకంటూ ఒక ప్రత్యెక స్థానం ఉంటుంది.

మీరు మీ బొటనవేలును కదిలించగలరా?

మీరు మీ బొటనవేలును కదిలించగలరా?

మీరు స్వయంగా మీ బొటన వేలును కదిలించగలిగితే, మీరు సాహసోపేత లక్షణాలను కలిగి ఉన్నవారిగా చెప్పబడుతున్నది. మరొక వైపు, వారి కాలి బ్రొటన వేలిని కదుపలేని వారు, విశ్వసనీయతకు నిలువెత్తు రూపంగా, మరియు జీవిత భాగస్వాములకు కట్టుబడి ఉన్నత జీవనాన్ని గడుపుతారని చెప్పబడింది.

కాలి బ్రొటన వేలి ఆకృతి కూడా వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది! ఎలా?

కాలి బ్రొటన వేలి ఆకృతి కూడా వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది! ఎలా?

బ్రొటన వేలి పరిమాణం, ఆకారం మరియు మీ పాదం యొక్క వంపు కూడా మీ వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది! తక్కువ వంపు కలిగిన వారు ఆరోగ్య సమస్యలు కొంచం ఎక్కువగా కలిగి ఉంటారని చెప్పబడింది. కాకపోతే సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి. మరోవైపు, అధిక వంపులు కలిగిన వ్యక్తులు స్వతంత్ర భావాలు కలిగిన వ్యక్తులుగా మరియు ఒంటరిగా ఉండేలా ఆలోచనలు చేస్తుంటారు.

బ్రొటన వేలికన్నా పక్క వేలు పొడవుగా ఉన్న ఎడల:

బ్రొటన వేలికన్నా పక్క వేలు పొడవుగా ఉన్న ఎడల:

మీరు మీ నాయకుడిని కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నట్లయితే, అప్పుడు ఆ వ్యక్తి యొక్క అడుగులను పరిశీలించండి. వ్యక్తి కాలి బ్రొటన వేలికన్నా పక్క వేలు పొడవుగా ఉన్న ఎడల, అతను / ఆమె ఒక గొప్ప నాయకునిగా ఉండగలరు. కానీ వీరిలోని గొప్ప ఆధిపత్య ధోరణిని ఆహ్వానించదగినది కాదు. వ్యవస్థీకృత మార్పులు తీసుకుని రావడంలో మంచి ఆలోచనాపరులుగా ఉంటారు.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే, మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆద్యాత్మిక, జ్యోతిష్య, ఆరోగ్య, తదితర సంబంధిత అంశాలకై బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ విలువైన అభిప్రాయాలను క్రింది వ్యాఖ్యల విభాగంలో మాకు తెలియజేయండి.

English summary

This Is What Your Toes Say About Your Personality

Most people like to think that they know themselves pretty well. But do you know that understanding the characteristics of an individual can be interesting with the help of personality tests?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more