For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కిమ్ చాలా పిరికివాడు, రాత్రి భార్యతో సరిగ్గా పడుకోడు, ఇంగ్లిష్ రాదు, టాయ్ లెట్ అందుకే తీసుకెళ్తాడు

|

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్‌ ఉన్ దేశాధినేతల్లో విలక్షణమైన వ్యక్తి. విచిత్రమైన పనులు చేస్తూ వార్తల్లోకి ఎక్కుతుంటారు. కిమ్ జంగ్‌ ఉత్తర కొరియాకు సంబంధించిన ఏ పని చేసినా రహస్యంగా చేస్తుంటారు. అణుపరీక్షలు నిర్వహించడంలో, శత్రువులను హెచ్చరించడంలో వినూత్నంగా వ్యవహరిస్తుంటారు. ఇక తాజా గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో శిఖరాగ్ర చర్యలకు సింగపూర్ వెళ్లిన కిమ్ జంగ్ తన బలహీనతలు ప్రత్యర్థులు తెలుసుకునేందుకు అవకాశం లేకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నారు.

కిమ్‌లో మరో మనిషి

కిమ్‌లో మరో మనిషి

కిమ్‌లో మరో మనిషి కూడా ఉన్నాడు. ఎప్పుడూ అణుబాంబులూ, ఖండాంతర క్షిపణులేనా? మనిషన్నాక కూసింత కళాపోషణుండాలి అనుకునేరకం కిమ్. కిమ్‌ పళ్లెంలో ముప్పొద్దులా షడ్రసోపేతమైన విందు ఉండాల్సిందే. ఆ జిహ్వ చాపల్యం వల్లే... విపరీతంగా బరువు పెరిగిపోయాడు. కొవ్వు తగ్గించుకోకపోతే నువ్వు బతకవని డాక్టర్లు హెచ్చరించారు కూడా.

పాటనచ్చి పెళ్లి చేసుకున్నాడు

పాటనచ్చి పెళ్లి చేసుకున్నాడు

కిమ్ సంగీతమంటే చెవి కోసుకుంటాడు. ఖాళీ దొరికినప్పుడల్లా ఏ ఫిడేలో వాయిస్తుంటాడు. మైఖేల్‌జాక్సన్‌ అంటే ప్రాణమిస్తాడు. రిసోల్‌జూతో పెళ్లి వెనుకా సంగీతమే ఉంది. ఆ అమ్మాయి మంచి గాయని. ఆమె పాటనచ్చి, తనదాన్ని చేసుకున్నాడట. కిమ్‌కు బాస్కెట్‌బాల్‌ అన్నా పిచ్చే. మైఖేల్‌జోర్డాన్‌కు వీరాభిమాని. రోజూ ఓ గంటైనా బాస్కెట్‌బాల్‌ ఆడతాడు.

మహాపిరికివాడు

మహాపిరికివాడు

కిమ్ అంతరాంతరాల్లో మహాపిరికివాడు కిమ్‌. నిద్రలోనూ అతనికి ప్రాణభయమే. తనను గద్దె దించడానికి, అమెరికా నేతృత్వంలో కుట్రలూ కుతంత్రాలూ జరుగుతున్నాయని అనుమానిస్తుంటాడు. నాలుగేళ్ల క్రితం నిజంగానే హత్యాయత్నం జరిగింది. అప్పటి నుంచీ మృత్యుభీతి మరింత ముదిరింది. హఠాత్తుగా పళ్లెం ముందు నుంచీ లేచిపోతాడు. శత్రువులు ఆహారంలో విషం కలిపారేమో అన్న అనుమానం కిమ్ కు ఎక్కువగా ఉంటుంది.

నిద్రలోంచి మేల్కొంటాడు

నిద్రలోంచి మేల్కొంటాడు

కిమ్ అప్పుడప్పుడు ఉలిక్కిపడినట్టు నిద్రలోంచి మేల్కొంటాడు. భార్య పక్కన రాత్రి సరిగ్గా పడుకోవడానికి కూడా భయపడతాడు. ఎవరో తన వెనుక నిలబడినట్టు చిత్తభ్రాంతికి గురవుతాడు. సైన్యంలోని ప్రధాన అధికారుల మీదా ఓ కన్నేసి ఉంచుతాడు. ఆరేళ్ల పాలనలో... ఆరేడుగురు రక్షణ మంత్రుల్ని మార్చేశాడు. అధికారం చేపట్టి చాలాకాలంవరకు అంటే మొన్న సింగపూర్ కు వచ్చే వరకు ఉత్తర కొరియా సరిహద్దులు కూడా దాటలేదు కిమ్‌. కారణం... పీఠాన్ని సైన్యం లాగేసుకుంటుందేమో అనే భయం కిమ్ కు ఉంటుంది.

కిమ్ కు చాలా నమ్మకాలు

కిమ్ కు చాలా నమ్మకాలు

ఇక ట్రంప్‌తో భేటీకి సింగపూర్‌‌కు అయిన వెళ్లిన కిమ్ పెద్ద భద్రతా సిబ్బందితో పాటు తన వ్యక్తిగత సహాయకులను కూడా భేటీకి వెంట తీసుకెళ్లారు. కానీ కిమ్ కు చాలా నమ్మకాలున్నాయి. చాలా బలహీనతులున్నాయి. అవన్నీ ఎవరికీ తెలియకుండా, వాటిని బయటపెట్టకుండా ఉండేందుకు కిమ్ రకరకాల ప్రయత్నాలు చేసేవారు. స్థూలకాయుడైన కిమ్‌కు స్వతహాగా ఫాటీ లీవర్‌ ఉంది. మధుమేహం, అధిక రక్తపోటు, కీళ్ల వాతం వంటి వ్యాధులతో బాధపడుతున్నారు.

మొబైలట్‌ టాయ్‌లెట్‌

మొబైలట్‌ టాయ్‌లెట్‌

ప్రత్యర్థులు ఆరోగ్య సమస్యలను తెలుసుకుంటారన్న భయంతో కిమ్‌ .నార్త్ కొరియా నుంచే మొబైలట్‌ టాయ్‌లెట్‌ను వెంట తెచ్చుకున్నారు. తన మల, మూత్రాలను పరీక్షించిశత్రుదేశాలు ఆరోగ్య సమస్యను అంచనా వేస్తారన్న అనుమానంతో జాగ్రత్తలు తీసుకున్నారు.

అత్యాధునికమైన టాయ్‌లెట్‌

అత్యాధునికమైన టాయ్‌లెట్‌

ఎటువంటి పరీక్షలకు లొంగని రీతిలో విసర్జనను డిస్పోజ్‌ చేయగల అత్యాధునికమైన టాయ్‌లెట్‌ను కిమ్ సింగపూర్ కు తెచ్చుకున్నాడు. శత్రువులకు ఒక్క క్లూ ఇవ్వకుండా జాగ్రత్తపడడంతో కిమ్ చిన్నప్పటి నుంచి కింగే. ట్రంప్ సదస్సులో పాల్గొనేందుకు ఒక రోజు ముందుగానే సింగపూర్‌కు కిమ్ వచ్చారు.

సూపర్ పవర్స్

సూపర్ పవర్స్

అయితే కిమ్ జంగ్ ఉన్‌కు సూపర్ పవర్స్ ఉన్నాయని ఆ మధ్య కొన్ని వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ అక్కడి అధికారిక మీడియా కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ కిమ్ పై అప్పుడు ఓ పెద్ద వ్యాసాన్నే రాసింది.

కిమ్ జంగ్

కిమ్ జంగ్

ఉన్ గతంలో 9వేల అడుగుల ఎత్తున్న మౌంట్ పక్తూ పర్వతాన్ని అధిరోహించాడు. దానికి సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారగా, అందులో అంతుచిక్కని విషయాలు బయటపడ్డాయి. అవేంటంటే అంత ఎత్తు పర్వతాలు ఎక్కినప్పటికీ కిమ్ కాస్త కూడా అలసిపోలేదు.. అలాగే అతడు వేసుకున్న షూస్‌కు కూడా ఏ మాత్రం మంచు అంటుకోలేదు.

అతీత శక్తులు

అతీత శక్తులు

దీంతో అతడికి అతీత శక్తులు ఉన్నాయంటూ ఆ పత్రిక రాసుకొచ్చింది. అంతేకాకుండా కిమ్ వాతావరణాన్ని కూడా నియంత్రించగలడని, అతడు ఎండ కావాలంటే ఎండ, వాన కావాలంటే వాన కురుస్తుందని తెలిపింది.

ఎయిడ్స్, ఎబోలాకు మందులు

ఎయిడ్స్, ఎబోలాకు మందులు

అలాగే కిమ్ ఆధ్వర్యంలో ఉత్తరకొరియా శాస్త్రవేత్తలు ఓ సరికొత్త ఔషధాన్ని కూడా తయారు చేశారట. ఆ ఔషధంతో ఎయిడ్స్, ఎబోలా సహా పలు ప్రాణాంతక వ్యాధులు నయమవుతాయని అందులో వెల్లడించింది. ఇలా కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ కిమ్ పై పలు రకాల వార్తలు ప్రచురిస్తూనే ఉంది.

సరదాగా చక్కర్లు కొట్టారు

సరదాగా చక్కర్లు కొట్టారు

ఇక కిమ్‌ జోంగ్‌ ఉన్‌ సింగపూర్‌ ప్రజలను మొన్న ఆశ్చర్యంలో ముంచెత్తారు. తాను బస చేసిన సెయింట్‌ రెజిస్‌ హోటల్‌ నుంచి బయటకు వచ్చి వీధుల్లో సరదాగా చక్కర్లు కొట్టారు. ఆయన్ని అలా చూసే సరికి ప్రజలంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. కిమ్ తో సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ఆ సమయంలో ఆయన వెంట సోదరి కిమ్‌ యో జోంగ్‌ కూడా ఉన్నారు.

చెల్లి వ్యూహాలు కూడా ఉన్నాయట

చెల్లి వ్యూహాలు కూడా ఉన్నాయట

ఇక కిమ్ జాంగ్ ఉన్ అంత దుందుడుకుగా నడుచుకోవడం వెనుక ఆయన చెల్లి వ్యూహాలు కూడా ఉన్నాయట. కిమ్ జాంగ్ చెల్లి పేరు కిమ్ యో జాంగ్(30). కంప్యూటర్ గ్రాడ్యుయేట్ అయిన ఆమె కిమ్ జాంగ్‌కు సంబంధించిన ప్రచార బాధ్యతలు నిర్వహించింది.

పార్టీపై ప్రజల్లో నమ్మకం పెంచడానికి

పార్టీపై ప్రజల్లో నమ్మకం పెంచడానికి

నార్త్ కొరియా వర్కర్స్ పార్టీపై ప్రజల్లో నమ్మకం పెంచడానికి కిమ్ యో జాంగ్ సహాయసహకారాలను అందించిందని, ఈ విషయంలో కిమ్ జాంగ్ ఆమెను పూర్తిగా విశ్వసించాడని అంతర్జాతీయ మీడియా కథనాలు వివరించాయి.

అన్నకు అండగా ఉంటూ

అన్నకు అండగా ఉంటూ

కిమ్ యో జాంగ్ బయట కనిపించడం చాలా తక్కువ. ఆమె 2010లో కొరియన్ వర్కర్స్ పార్టీ కాన్ఫరెన్స్‌లో కనిపించింది. డిసెంబర్ 2011లో తండ్రి చనిపోవడంతో అప్పటి నుంచి అన్నకు అండగా ఉంటూ తెర వెనుక వ్యూహాలు రచిస్తోంది. వర్కర్స్ పార్టీ వైస్ చైర్మన్ చియో రియాంగ్-హ్యో కుమారుడితో కిమ్ యో జాంగ్‌కు 2015లో వివాహమైంది. ఆమెకు ఒక బిడ్డ కూడా.

కిమ్ కు ఇంగ్లిష్ రాదు

కిమ్ కు ఇంగ్లిష్ రాదు

ఇక మొన్న సింగపూర్ కు వచ్చినప్పుడు కిమ్ కు భాష సమస్య ఏర్పడింది. డోనాల్డ్ ట్రంప్‌కు కొరియా భాష రాదు.. అలాగే, కిమ్ జాంగ్ ఉన్‌కు ఇంగ్లీషు రాదు. అయితే ఇరు దేశాధినేతల మాటలను ఆయా భాషల్లోకి తర్జుమా చేసేందుకు దుబాసీలను (అనువాదకులు)ను ఇరు దేశాలు ముందుగానే నియమించుకున్నాయి. ఇంగ్లీషు - కొరియా భాషలపై మంచిపట్టున్న అనువాదకులను ఇరు దేశాధినేతతో పాటు శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యారు. దీంతో ఇక ఒకరు మాట్లాడిన మాటలు మరొకరికి అనువదించారు. ఇంగ్లీష్, కొరియన్ భాషలు తెలిసిన అనువాదకులు కిమ్, ట్రంప్ మాట్లాడిన మాటలు ఎదుటివారికి అర్థమయ్యేలా వివరించి చెప్పారు. ఇక ఉత్తరకొరియా మానవ హక్కులను కాలరాస్తోందంటూ అమెరికా గతంలో చేసిన ఆరోపణల్లో కిమ్ యో జాంగ్ ప్రస్తావన కూడా ఉంది. మొత్తానికి ఈ అన్నాచెల్లెలు ప్రపంచం మొత్తంలో ప్రత్యేక మనుషులుగా నిలిచారు. ఇలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు. లోపల ఎన్నో భయాలున్నా బయటికి మాత్రం ప్రపంచంలో మా అంత ధైర్యవంతులే లేరు అన్నట్లు బిల్డప్ ఇస్తారు.

English summary

why did kim jong un bring his own toilet to the singapore summit

why did kim jong un bring his own toilet to the singapore summit
Story first published: Wednesday, June 13, 2018, 14:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more