For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  గుడ్ బై ముద్దుతో నాలిక కొరికేసిన మహిళ – చైనాలో దారుణం

  |

  ఈ కాలంలో సంబంధాలు ఆరోగ్యకరమైన రీతిలో ముగియడం లేదు మరియు వివాదాస్పదమై గందరగోళ పరిస్థితుల మద్య కొట్టుమిట్టాడుతున్నాయి. మనం ప్రేమలో ఉన్నప్పుడు, ప్రతిరోజూ కొత్తగానే ఉంటుంది, ప్రపంచం అంతా ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ పరిస్థితులు తారుమారైతే అదే సంబంధం ఒక పీడకలగా మారవచ్చు. అవునా కాదా?

  ఈ బ్రేకప్స్ ఆరోగ్యకర రీతిలో కూడా ముగియడం లేదు, ఇంకా చెప్పాలంటే దారుణమైన ముగింపును ఇస్తున్నాయి. ఇప్పుడు చెప్పబోయే విషయం కూడా అలాంటి అనారోగ్యకర బ్రేకప్ కు ఒక ఉదాహరణగా చెప్పవచ్చు.

  ఈ కథనంలో, ఒక మహిళ ప్రేమకు గుడ్బై చెప్పే క్రమంలో భాగంగా చివరిగా ఒక్క ముద్దు అడిగి, అతని నాలికను కొరికి గాయపరచింది.

  మరిన్ని వివరాలకు ఈ కథనం చదవండి.

  ఈ కథకు చైనా వేదికైంది :

  ఈ కథకు చైనా వేదికైంది :

  చైనా ఎప్పుడు కూడా విచిత్రమైన సంఘటనలకు అడ్డాగా ఉంటుందని మనకు తెలుసు. రికార్డుల ప్రకారం, తూర్పు చైనాలోని ఈ 23 ఏళ్ల వ్యక్తి పోలీసులచే రక్షించబడవలసి వచ్చింది. తన కాబోయే "మాజీ ప్రియురాలు" చివరి కోరికగా ముద్దుని కోరి, ముద్దులో భాగంగా నాలికను కొరికి, వదిలేయడానికి నిరాకరించింది. పోలీసులు వచ్చి విడిపించాల్సి వచ్చింది.

  కొంతమంది వీక్షకుల కథనం ప్రకారం, ఈ ప్రేమికుల మద్య బ్రేకప్ గురించిన విషయమై తీవ్రమైన వాదన వచ్చింది, వాదన తర్వాత ఆమె అతని నుండి చివరిసారిగా గుడ్బై ముద్దు కోరింది.

  ముద్దును ఇలా కూడా ఇస్తారా!

  ముద్దును ఇలా కూడా ఇస్తారా!

  వీడ్కోలు ముద్దుగా నిర్ణయించుకుని ఈ జంట ముద్దుకు సిద్దమయ్యారు. కానీ, అనుకోకుండా నాలికను గట్టిగా కొరికిపట్టి వదలడానికి నిరాకరించింది. ఈ అనూహ్య సంఘటనకు నివ్వెరపోయిన అతను ఏమీ చేయలేని నిస్సహాయ స్థితికి చేరుకున్నాడు.

  అతను పోలీసులచే బలవంతంగా రక్షించబడ్డాడు:

  అతను పోలీసులచే బలవంతంగా రక్షించబడ్డాడు:

  ఆమె అతని నాలుకను విడవడం అసాద్యమైన చర్యగా అనిపించింది. ఎన్ని ప్రయత్నాలను చేసినా గాంధారి పట్టు లా నాలికను ఒడిసిపట్టిన ఈవిడని దూరం చేసే ప్రక్రియలో పోలీసులు, పబ్లిక్ కూడా పూనుకోవలసి ఉంటుంది. చివరికి పెప్పర్ స్ప్రే ద్వారా దూరం చేయగలిగారు.

  ఎట్టకేలకు వదిలించుకున్నాడు:

  ఎట్టకేలకు వదిలించుకున్నాడు:

  ఆమె పట్టును విడవడం అసాధ్యమైన క్రమంలో భాగంగా, పెప్పర్ స్ప్రే ఒక ఆయుధంలా తోచింది ప్రజలకు. ఈ పరిస్థితికి గురికాబడిన వ్యక్తికి స్వల్ప గాయాలే కానీ, జీవితాన్నే మార్చేసే గాయాలు మాత్రం లేవని నిర్ధారించారు. కానీ అక్కడ ఉన్న వారు మాత్రం నాలిక తెగిపోయి ఉంటుందని భావించారు. ఆ దృశ్యం చూసి. ప్రాధమిక చికిత్స మరియు కొన్ని పరీక్షల తర్వాత అతన్ని డిశ్చార్జ్ చేశారు.

  ఆమె తల్లిదండ్రులు చెప్పిన కథనం ప్రకారం:

  ఆమె తల్లిదండ్రులు చెప్పిన కథనం ప్రకారం:

  ఆ మహిళ తల్లితండ్రులు, తమ కుమార్తె ఇటీవల ఆన్లైన్లో షాపింగ్ స్పాం వలన నష్టపోవడం కారణంగా మానసిక అస్థిరతకు లోనై ఇలాంటి పరిస్థితికి చేరుకుందని., తద్వారా ఇలాంటి చర్యలకు పూనుకున్నదని, కావున క్షమించవలసినదిగా కోరుతున్నారు.

  కారణం ఏదైనప్పటికీ :

  కారణం ఏదైనప్పటికీ :

  కారణం ఏదైనప్పటికీ, ఇలాంటి చర్యకు పూనుకోవడం మాత్రం సరైనది కాదు. ఇంతటి పరిస్థితుల్లో కూడా అతను స్వల్ప గాయాలతోనే బయటపడడం మాత్రం ఆహ్వానిoచదగ్గ విషయం.

  ఆ వీడియో ఇప్పుడు వైరల్:

  వాళ్ళిద్దరి మద్య జరిగిన అసలు కథ ఇప్పటికీ ఎవరికీ తెలీదు, ఎవరిది న్యాయమో ఎవరిది అన్యాయమో కూడా తెలీదు. ఎంతో కోపం వస్తే కానీ ఆ అమ్మాయి ఆ పనికి పూనుకోదు అని కొందరి వాదన అయితే, మానసిక స్థితి సరిలేదని తల్లిదండ్రుల వాదన. ఏది ఏమైనా పెద్ద అపాయం నుండి బయటపడ్డాడు కదా. కానీ ఆ వీడియో మాత్రం ప్రస్తుతం చైనా మీడియాలో, క్రమంగా సామాజిక మాధ్యమాలలో ఒక వైరల్ గా తిరుగుతూ ఉంది. ఈ వీడియో చూసిన వారు, ఇకపై బ్రేకప్ అంటే, ఫోన్లు, చాటింగులను ఆశ్రయిస్తారేమో చూడాలి. ఇతను కనీసం నాలిక తెగకుండా బయటపడ్డాడు. అందరికీ అలా రాసిపెట్టి ఉండదు కదా. కావున ఇకపై బ్రేకప్ చెప్పే ముందు ఆత్మరక్షణ చర్యలు తీసుకోక తప్పదేమో అనిపిస్తుంది కదా.

  ఇలాంటి పీడకలలు మీకేమైనా ఉన్నాయా? లేదా మీరేమైనా విన్నారా? ఒక వేళ మీ సమాధానం అవును అయితే, క్రింది వ్యాఖ్యల విభాగంలో మాకు తెలియజేయండి. ఇటువంటి విచిత్రమైన సంఘటనల గురించిన మరింత సమాచారానికై బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి.

  English summary

  Woman Asks For Goodbye Kiss After Boyfriend Breaks Up With Her, Ends Up Biting His Tongue

  A man in China had to be rescued after a woman held onto him by the tongue. It is said that he had asked to break up with the unnamed woman and she agreed to it and wanted a last kiss from him. The woman apparently would not stop biting until the officers came in to the scene.The Case Of A Goodbye Kiss Gone Wrong!
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more