For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భర్తను విడిచిపెట్టి నాతో రా, 3 లక్షలు ఇవ్వకుంటే నెట్ లో ఫొటోలు పెడతా, ఫ్రిజ్ రిపేరీకి వెళ్లి..

ఇక గత జూన్ లో షీ టీమ్స్ 63 కేసులు ఫైల్ చేశాయి. అందులో 43 మందికి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇక ఒక ప్రబుద్ధుడు భర్తను వదిలి తనతో వచ్చేయాలని వివాహితకు రోజూ ఫోన్ కాల్స చేసేవాడు.షీ టీమ్స్ మత్తు వదిలించాయి

|

రోడ్డుమీద పోతూ ఉంటే పోకిరీల వెకిలిచేష్టలు.. బస్టాప్‌లో నిలబడి ఉంటే చిల్లరగాళ్ల అభ్యంతరకర సైగలు.. ఫోన్లలో వేధింపులు.. ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో భరించలేని అసభ్య సందేశాలు.. మహిళలు, యువతులు, విద్యార్థినులు.. ఆఖరుకు చిన్నపిల్లలనే విచక్షణ కూడా లేకుండా కమ్మేసిన కండకావరం.. యువతుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా పెరుగుతున్న ఆకతాయిల వికృత చేష్టలు! వీటికి అడ్డుకట్ట వేసేదెలా?

అలాంటి బాధితులకు అండగా మేమున్నామంటున్నది తెలంగాణ పోలీసుల ప్రత్యేక విభాగం షీ టీమ్స్. మహిళలను వేధిస్తున్నవారిని గుర్తించి.. కటకటాల వెనక్కు పంపి.. బాధితులకు అభయం ఇస్తున్నారు.
షీటీమ్స్ ఆధ్వర్యంలో వందలమంది యువకులకు కౌన్సెలింగ్ నిర్వహించి వారిలో పరివర్తన తీసుకువచ్చారు.

63 కేసులు

63 కేసులు

ఇక గత జూన్ లో షీ టీమ్స్ 63 కేసులు ఫైల్ చేశాయి. అందులో 43 మందికి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇక ఒక ప్రబుద్ధుడు భర్తను వదిలి తనతో వచ్చేయాలని వివాహితకు రోజూ ఫోన్ కాల్స చేసేవాడు. మరొక దుర్మార్గుడు నాకు డబ్బు ఇవ్వకుంటే నీ చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేస్తానంటూ వేధించేవాడు. పబ్లిక్‌ టాయ్‌లెట్‌ వద్ద మహిళల చిత్రాలను చిత్రీకరించేవాడు మరొకడు. రిఫ్రిజిరేటర్‌ మరమ్మతులకు ఇంటికొచ్చి బాలికను వేధించేవాడు మరొకడు. వీరందరి మత్తు వదిలించడంలో సైబరాబాద్‌ షీ బృందాలు బాగా పని చేశాయి.

3 లక్షలు ఇవ్వకుంటే నీ ఫొటోలు నెట్ లో పెడతా

3 లక్షలు ఇవ్వకుంటే నీ ఫొటోలు నెట్ లో పెడతా

జూన్‌ నెలలో షీ బృందాలకు అందిన ఫిర్యాదుల్లో కొన్నింటి వివరాలివి.రూ.3లక్షలు ఇవ్వాలంటూ మహిళను డిమాండ్‌ చేశాడు ఒకడు.కేపీహెచ్‌బీకి చెందిన ఓ మహిళ వాట్సప్‌కు నాలుగు రోజుల పాటు గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు సందేశాలు వెల్లువెత్తాయి. బాధితురాలి గురించి సమాచారాన్ని సేకరించిన ఆగంతుకుడు ఆమెను బ్లాక్‌మెయిల్‌ చేశాడు. రూ.3లక్షలు ఇవ్వకపోతే ఆమెకు సంబంధించిన చిత్రాల్ని సోషల్ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తానంటూ బెదిరించాడు. బెంబేలెత్తిన బాధితురాలు గత నెల 8న షీ బృందాలకు పిర్యాదు చేసింది. దర్యాప్తు క్రమంలో నిందితుడిని గుర్తించిన షీ బృందాలు.. కేసు తీవ్రత దృష్ట్యా అతడిని కటకటాల్లోకి పంపించారు.

పక్కింటోడు భర్తను వదిలేసి రమ్మనేవాడు

పక్కింటోడు భర్తను వదిలేసి రమ్మనేవాడు

కూకట్‌పల్లికి చెందిన వివాహితకు భర్త, ఇద్దరు పిల్లలున్నారు. పొరుగింట్లో ఉండే యువకుడు ఆమెను ప్రేమ పేరుతో వేధించడం ఆరంభించాడు. భర్తను వదిలి వచ్చేయాలంటూ వాట్సప్‌లో ఒత్తిడి చేశాడు. బాధితురాల్ని స్నేహితురాలు వారించినా వేధింపులు ఆగలేదు. చివరకు బాధితురాలు గత నెల 14న షీ బృందాల్ని ఆశ్రయించడంతో నిందితుడిని అరెస్ట్‌ చేశారు.

నాతో వచ్చేయ్ అంటూ బలవంతం చేసిన బంధువు

నాతో వచ్చేయ్ అంటూ బలవంతం చేసిన బంధువు

కూకట్‌పల్లికి చెందిన బాలికను కొన్నాళ్లుగా దూరపు బంధువు ఒకడు తరచూ అనుసరిస్తున్నాడు. బాలిక ఇంటి నుంచి బయటికి వెళ్లి వచ్చే క్రమంలో వెంటపడుతూ ప్రేమించాలని ఒత్తిడి చేస్తున్నాడు. గత నెల 25న బాలిక వివేకానందనగర్‌ బస్‌స్టాప్‌ వద్ద ఉండగా.. బైక్ పై వచ్చిన నిందితుడు వచ్చి తనతో రావాలంటూ చేయి పట్టుకొని లాగాడు. బాధితురాలి ఫిర్యాదుతో అతడిని రిమాండ్‌కు తరలించారు.

ఒంటిరిగా ఉన్న బాలికపై అత్యాచారం

ఒంటిరిగా ఉన్న బాలికపై అత్యాచారం

శంషాబాద్‌ ప్రాంతానికి బాలికను స్థానిక యువకుడు రెండేళ్లుగా ప్రేమ పేరుతో మభ్యపెడుతున్నాడు. గత ఫిబ్రవరి 15న మధ్యాహ్నం బాలిక ఒంటరిగా ఇంట్లో ఉన్న సమయంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయాన్ని బాధితురాలు తన వదినకు చెప్పడంతో అఘాయిత్యం బహిర్గతమైంది. బాధితురాల్ని పెళ్లి చేసుకోవాలని ఆమె కుటుంబసభ్యులు యువకుడితో ప్రతిపాదించగా నిరాకరించాడు. గత నెల 20న బాధితురాలు షీ బృందాలకు ఫిర్యాదు చేయడంతో పొక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు.

ఫ్రిజ్ రిపేరీ చెయ్యడానికి వచ్చి

ఫ్రిజ్ రిపేరీ చెయ్యడానికి వచ్చి

కూకట్‌పల్లికే చెందిన ఓ వృద్ధుడు తన ఇంట్లో ఫ్రిజ్‌ మరమ్మతులు చేయాలంటూ మెకానిక్‌కు ఫోన్‌ చేశాడు. అలా ఇంటికి వెళ్లిన మెకానిక్‌.. ఆ వృద్ధుడి మనవరాలిపై కన్నేశాడు. మరోవైపు వృద్ధుడు ఫోన్ చేసిన మొబైల్ మనవరాలిదే కావడంతో తరచూ ఆ నంబరుకు ఫోన్‌ చేస్తూ వేధింపులు మొదలుపెట్టాడు. ఆ వేధింపులు తారస్థాయికి చేరడంతో బాధితురాలి ఫిర్యాదుతో షీ బృందాలు అతడిని అరెస్ట్‌ చేశాయి.

పబ్లియ్ టాయిలెట్ వద్ద మొబైల్ లో ఫొటోలు

పబ్లియ్ టాయిలెట్ వద్ద మొబైల్ లో ఫొటోలు

ప్రగతినగర్‌లోని పబ్లిక్‌ టాయిలెట్‌ నిర్వాహకుడి నిర్వాకమిది. అక్కడ డబ్బులు వసూలు చేసే వ్యక్తి తన మొబైల్ ద్వారా మహిళల చిత్రాలను, వీడియోలను తీస్తుండగా ఓ మహిళ చూసి గత నెల 28న షీ బృందాలకు ఫిర్యాదు చేసింది. నిఘా ఉంచి అతడి నిర్వాకాన్ని పసిగట్టిన షీ బృందాలు రిమాండ్‌కు తరలించాయి. ఇలా మొత్తం 43 మంది షీ టీమ్స్ కౌన్సెలింగ్ ఇచ్చాయి.

English summary

woman from kukatpally was harassed by a stalker she teams nab 43 for harassing women in hyderabad

woman from kukatpally was harassed by a stalker she teams nab 43 for harassing women in hyderabad
Story first published:Wednesday, July 4, 2018, 14:47 [IST]
Desktop Bottom Promotion