Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
16 అడుగుల కొండచిలువతో అనుబంధం పెంచుకున్న చిన్నది
16 అడుగుల కొండచిలువతో అనుబంధం పెంచుకున్న చిన్నది
జంతుప్రేమికురాలొకరు తన ఇంటిని పాముల ఆస్థానంలా మార్చుకున్న ఉదంతం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆమె ఇంటినిండా పాములు సందడి చేస్తాయి. వాటిలో 16 అడుగుల పైథాన్ కూడా మరింత సందడి చేస్తోంది.
ఇది 21 ఏళ్ళ వయుస్సున్న జీ అనే యువతి కథ. వెటెరినరీ నర్స్ చదువుతున్న ఈ యువతి తనకు ఆరేళ్ళ వయసున్నప్పుడు ఒక పామును చూసింది. అప్పటినుంచి పాములపై మక్కువ పెంచుకుంది.

14 ఏళ్ళ వయసున్నప్పుడు, ఓ పామును తనతో పాటే పెంచుకోవడం ప్రారంభించింది. పాములపై శ్రద్ధ కనబరచడం ప్రారంభించింది. సాధారణంగా ఆ వయసులో ఉన్న పిల్లలు ఆటాపాటలపై శ్రద్ధ కనబరుస్తారు. కానీ, ఈమె జంతు ప్రేమికురాలిగా మారింది.
ప్రస్తుతం, జీ ఇంట్లో 16 పాములున్నాయి. వాటిలో 16 అడుగుల బర్మీస్ పైథాన్ కూడా ఉంది. దీనికి పాకడం అంటే మహా ఇష్టం. లాబీలలో మనఃస్ఫూర్తిగా ప్రాకుతుంది.
ఒక ఇంటర్వ్యూలో ఆమె ఒళ్ళు గగుర్పొడిచే విషయాలెన్నో వ్యక్తీకరించింది. ఈ పాములతో ఆమె ఎన్నో సాహసాలను ఎదుర్కోవలసి వచ్చిందని తెలిపింది. అయితే, పాములు హానీ చేయాలని ముందుకు రావని, వాటికి క్యూరియాసిటీ ఎక్కువని అందుకే పైపైకి వస్తాయని తెలిపింది. వాటిని కంట్రోల్ చేయాలంటే లిక్కర్ ని వాడాలని పేర్కొంది.
ఆ విధంగా పాములతో సహజీవనం చేస్తూ పాముల గురించి ఎన్నో విషయాలను తెలుసుకుంది. వాటి మీద ఉన్న అపోహలను తొలగించాలని ప్రయత్నిస్తోంది.
ఆమె వద్ద నున్న అతి పెద్ద స్నేక్ బరువు 28 కిలోగ్రాములు కాగా, దాన్ని ఇద్దరు వ్యక్తులు కలిసి ఎత్తగలుగుతారు.
తన ఫెవరెట్ పెట్ డైట్ గురించి ఆసక్తిగా పంచుకుంది జీ. నెలకొకసారి తన కొండచిలువలకు 3 నుంచి 6 కేజీల బరువున్న అతిపెద్ద కుందేళ్ళని ఆహారంగా అందించాలని, చిన్న వాటికి ఎలుకలను అలాగే కోడిపిల్లలు ఆహారంగా అందిస్తానని వెల్లడించింది.
తన 16 అడుగుల కొండచిలువతో నిద్రించడం తనకు ఎంతో రిలాక్సేషన్ ను అందిస్తుందని వెల్లడించింది
ఈ విషయంపై మీ అభిప్రాయాలేంటి? కామెంట్ సెక్షన్ లో మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి.



Click it and Unblock the Notifications
