Latest Updates
-
జూన్ 25: ఈ 5 రాశుల వారికి అదృష్టం వరించనుంది.. మీ రాశి ఉందా? -
తుల, ధనుస్సు, మీన రాశుల వారికి గురు గ్రహ అనుగ్రహం.. భారీ లాభాలు! - గురువారం, 25 జూన్ 2026 -
రాజస్థానీ మటన్ కర్రీకి అంత క్రేజ్ ఎందుకు? ఈ సింపుల్ రెసిపీని ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది! -
మా దేశాన్ని అవమానిస్తావా? ఇటలీలో బంగ్లాదేశ్ వెయిటర్ కు చుక్కలు చూపించిన భారతీయ నారీమణులు -
అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటున్నారా.. మీకు కాబోయే భాగస్వామిలో ఈ సంకేతాలు చాలా డేంజర్.! -
ఆల్పైన్ డివోర్స్.. మహిళలను వణికిస్తున్న ఈ కొత్తరకం విడాకులు ఏంటి? -
వర్షాలొచ్చేశాయ్.. పేరెంట్స్‌కి అలర్ట్.. మీ పిల్లల స్కూల్ బ్యాగులో ఇవి తప్పనిసరి.! -
సర్వరోగ నివారిణి నేల వేము..ఈ ఆయుర్వేద మూలిక ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు! -
31 రోజుల ఆధ్యాత్మిక ప్రయాణం.. ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి: మీరు ఎంత మారారు? -
సలాడ్, జ్యూస్ లేదా స్టీమింగ్.. బీట్రూట్ను ఎలా తింటే ఎక్కువ లాభాలో తెలుసా.?
అవిశ్రాంతంగా ఉండటం ఈ జన్మరాశుల వారి అతిముఖ్య లక్షణం
అవిశ్రాంతంగా ఉండటం ఈ జన్మరాశుల వారి అతిముఖ్య లక్షణం
అదేపనిగా స్థానభ్రంశం చెందడం మీకు ఆనందాన్ని ఇస్తుందా? లేదంటే ఎప్పుడూ ఉరుకులు పరుగులు పెట్టడం లేదా ఎదో ఒక పనిలో ఎప్పుడు నిమగ్నమై ఉండటం మీకు ఆనందాన్ని ఇస్తుందా?
ఎప్పుడూ బిజీగా ఉండటం, కొత్త అనుభవాలు, అనుభూతులు, ఆలోచనలు, కలలు, ప్రదేశాలు మరియు వ్యక్తులతో సమయం గడపడం కొన్ని జన్మరాశుల వారికి ఆనందం కలుగజేస్తాయి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కొంతమంది వ్యక్తులు ఇలా అవిశ్రాంతంగా ఉండటానికి వారి జన్మరాశుల ప్రభావం ముఖ్య కారణం. కొన్ని జన్మరాశులలో పుట్టిన వారు ఎప్పుడూ ఏపీ ఒక హడావిడిలోనే ఉంటారు. వారెవరో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే మరెందుకు ఆలస్యం. చదివేయండి!
సాధారణంగా ఎప్పుడూ హడావిడిగా కనిపించే వ్యక్తులు, చాలా లోతైన ఆలోచనపరులని అంటారు. వారిలో సృజనాత్మకత అధికమే కాక వారి ఆలోచనలు కూడా వైవిధ్యంతో కూడుకుని ఉంటాయి. వారికేమి అవసరమో, దాని గురించి పూర్తి అవగాహన కలిగి ఉంటారు.వీరికి యధాలాపంగా ఉండే జీవితం పట్ల ఆసక్తి ఉండదు. ఇతరుల వలే నిత్యకృత్యమైన, నిస్సారమైన జీవితం గడపలేరు.
టూకీగా చెప్పాలంటే, ఈ వ్యక్తులు ఎప్పుడూ ఏదో ఒక మార్పును అన్వేషిస్తూ సాగుతారు. తమ చుట్టూ త్వరితగతిన జరిగే మార్పులను ఆస్వాదిస్తారు. మార్పు వీరిలో ఉత్తేజాన్ని కలిగిస్తుంది
ఈ జూన్ 2018లో వచ్చే అమావాస్య ఈ ఐదు రాశుల వారిపై స్వల్ప ప్రభావం చూపుతుంది.
మరి మీ రాశి ఆ జాబితాలో ఉందో లేదో చూసుకోండి.

కుంభరాశి: జనవరి 21- ఫిబ్రవరి 18
కుంభరాశికి చెందినవారు నిరంతరం కొత్త ఆలోచనలు మరియు ఏదైనా పనిచేయడంలో కొత్త పంథాలతో ముందుకువస్తారు. వారి మస్తిష్కంలో ఒకేసారి అనేక విషయాలను గురించిన ఆలోచనలు మెదులుతుంటాయి. వారు వైవిధ్యతను ప్రదర్శించడంలో లోతైన జ్ఞానం కలిగి ఉంటారు. వారిని నియమాలు మరియు కట్టుబాట్లకు లోబడి ఉండమనడాన్ని సహించలేరు.వారికి నచ్చిన రీతిలో ఏ పనైనా చేయనిస్తే, అద్భుతాలు చేస్తారు. వీరిని తిరగనివ్వకుండా, మారనివ్వకుండా మరియు ఎడగనివ్వకుండా చేస్తే,వారు స్తబ్దుగా ఉండిపోతారు. వారిలో సృజనాత్మక శక్తి అభివృద్ధి చెందదు. దీనికై వారి దినచర్య అనుక్షణం కొత్తగా ఉండేటట్లు ప్రణాళిక వేసుకోవాలి

సింహరాశి: జులై 23-ఆగస్టు 23
జీవితంలో చిన్న చిన్న ఆనందాలతో సంతృప్తిపడే వర్గానికి, సింహరాశివారు చెందరు. వారి లక్ష్యాలు ఎప్పుడూ ఉన్నతంగా ఉంటాయి. సాధారణంగా, వారి జీవితం ఆశ్చర్యం మరియు ఉత్సుకతతో నిండి ఉంటుంది. అంతేకాకుండా, వారు తమ జీవితంలో ఎదుగుతూ ఉండడాన్ని ఇష్టపడతారు. కొత్త అనుభవాలు, వ్యక్గులు మరియు ఆలోచనల గురించి తెలుసుకోవాలనుకుంటారు. వారు మిగిలిన అవిశ్రాంత జన్మరాశుల వారివలే స్థలమార్పిడి చెందకపోయినప్పటికి, వారి మెదడులో ఎప్పుడు జీవితాన్ని మెరుగుపరుచుకువడానికి అవసరమైన కొత్త ఆలోచనలు నిరవధికంగా జరుగుతూ ఉంటాయి.

మిథునరాశి: మే 21-జూన్ 20
మిథునరాశి వారు చాలా లోతైన ఆలోచనలు చేస్తారని ప్రతీతి. వీరు తమ జీవితం గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తారు. వీరు ఏ పనిని ఇతరుల మెప్పు కొరకు చేయరు. వీరు ఇతరులతో కలిసిపోయి లేదా ఇతరులను అనుసరించి పనిచేయనవసరం లేదు. వీరు జీవితంలో అందాన్ని ఆస్వాదిస్తారు. వారి ఏకాగ్రతను సారించడానికి కఠినమనిపించిన ఏ పనిని కూడా, ఎదుర్కోకుండా విడిచిపెట్టరు.ఒకే ప్రదేశంలో నిలకడగా ఉండలేరు.

ధనుస్సు: నవంబర్ 23-డిసెంబర్ 22
వీరు ఎల్లప్పుడూ కొత్తవారిని పరిచయం చేసుకోవడాన్ని ఇష్టపడతారు. ఈ పనిలో వారెప్పుడు బిజీగా ఉంటారు. వారికి కొత్త ముఖాలు, కొత్త ఆలోచనలు మరియు కొత్త సంప్రదాయాల పట్ల మక్కువ ఎక్కువ. వీరు కొత్త స్నేహితులతో సమయం గడుపుతున్నప్పుడు లేదా వారితో ప్రయాణం చేస్తున్నప్పుడు, కొత్త విషయాలను ఎప్పుడూ నేర్చుకుంటారు.

మేషం: మార్చ్ 21-ఏప్రిల్ 19
వీరు ఏ సమయంలో అయినా అవిశ్రాంతంగా, సాహసోపేతమైన వ్యాపకాలతో తీరిక లేకుండా ఉంటారు. వారికి కొత్త అనుభవాలు మరియు సవాళ్లు ఉత్తేజాన్ని ఇస్తాయి. వీరికి ప్రతిరోజూ ఒక సాహసమే. వీరికి ఏ నగరంలో అయినా మారుమూల ప్రదేశాలను గురించి కూడా తెలుసుకోవాలని ఉంటుంది. వారి చుట్టూ ఎప్పుడు సానుకూల మార్పులతో కూడిన వాతావరణం ఉంటుంది. వీరికి ఏకాగ్రత చాలా తక్కువ సమయం పాటు నిలిచి ఉండటం వలన త్వరగా విసిగిపోతారు, కనుక వీరిని చాలామంది అపార్థం చేసుకుంటారు.



Click it and Unblock the Notifications