For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎక్కువగా తత్తరపాటుకు గురయ్యే రాశిచక్రాల గురించి తెలుసా ?

|

ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఆందోళనలు లేదా తత్తరపాటులకు గురయ్యే ఉంటారు. ఇది మానవ సహజ లక్షణం. కానీ, ప్రతి చిన్నవిషయానికి కూడా భయపడుతూ, ఆందోళనలకు గురయ్యే వ్యక్తులు కూడా ఉన్నారు. ప్రత్యేకంగా కొన్ని రాశి చక్రాలకు సంబందించిన వారు.

వారి గురించి తెలుసుకునేందుకు జ్యోతిష్యం మనకు సహాయం చేయగలదు. అవును, మీ రాశి చక్రం గుర్తు ఆధారితంగా, మిమ్ములను పర్యవేక్షించినప్పుడు మీ ఆందోళనా స్థాయిలను లెక్కించవచ్చునని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. ఇక్కడ అటువంటి రాశిచక్రాలను పొందుపరచబడి ఉన్నాయి. మీరు కూడా ఆ జాబితాలో ఉన్నారో లేదో చూసుకోండి.

Zodiac Signs That Are Most Nervous
 మిధున రాశి :

మిధున రాశి :

మిధున రాశి వారు ఏదైనా ఒక ఉత్తమమైన పనిని చేపట్టినప్పుడు, తాము అంత సమర్ధులం కాదేమోనన్న అనుమానాలను కూడుకుని ఉంటారు. అంతేకాకుండా తమ సామర్ధ్యాన్ని తామే తక్కువ చేసుకునేలా ఆత్మన్యూనతా భావాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా ఏదైనా ఉన్నతమైన, గౌరవప్రదమైన స్థానం లేదా ఉద్యోగాలలో ఉన్నప్పుడు, తాము చేపట్టే పనుల ఫలితాల పట్ల నిరంతరం ఆందోళనలను కలిగి ఉంటారు. తమ కారణంగా ఇతరులు ఎట్టిపరిస్థితుల్లో ఇబ్బందులకు గురికాకూడదు అన్న భావన బలంగా ఉండడం కూడా ఈ పరిస్థితికి కారణంగా ఉంటుంది. ఈ ఆందోళనలు కొన్ని సందర్భాలలో నిర్ణయాలు తీసుకోవడంలో ఆటంకంగా తయారవుతుంటాయి.

కన్యా రాశి :

కన్యా రాశి :

నిజానికి కన్యా రాశి వారు, ఆందోళనలకు దూరం. ఎందుకంటే ఏ పని చేపట్టినా ఒక ప్రణాళికాబద్ధంగా స్టెప్-బై-స్టెప్ అన్నట్లు ముందుకు సాగుతుంటారు. అయినా కూడా, నిష్క్రియాత్మకంగా ఉన్నప్పుడు, వారు తమ ఆలోచనలను మించిన విషయాల గురించి మరియు ప్రతికూల అంశాలతో కూడిన విషయాల గురించిన ఆలోచనలను అధికంగా కలిగి ఉంటారు. క్రమంగా మానసిక చింత, మరియు ఆందోళనలను అనుభవిస్తుంటారు. ఏదైనా టీవీ ప్రోగ్రాం, లేదా ఇంటర్నెట్ వీడియోలలో హత్యలను, లేదా మర్డర్ మిస్టరీలను చూసినప్పుడు, తమకే అలా జరిగితే అన్న ఆలోచనలను కలిగి ఉంటారు. అంత సున్నితమైన భావాలను కలిగి ఉంటారు. అంతేకాక, పరిపూర్ణవాదులుగా ఉంటారు. క్రమంగా ఒక మంచిపని కోసం, తమ శక్తిని మొత్తం ధారపోసి, ఒత్తిళ్ళతో పోరాడుతూ లక్ష్య సాధన పట్ల తీవ్రమైన ఆలోచనలను కలిగి ఉన్న కారణంగా కూడా ఆందోళనలు సర్వసాధారణంగా ఉంటాయి.

మీన రాశి :

మీన రాశి :

మీన రాశి వారు కేవలం భావోద్వేగాలను కలిగి, ఇతరులకు సహాయం చేసేలా ఉత్తమ లక్షణాలను కలిగి ఉండడంతోపాటు, లోలోపల తీవ్రంగా ఆలోచించే స్వభావాలను కూడా కలిగి ఉంటారు. ఏ విషయంలో కూడా బాహాటంగా తమ అభిప్రాయాలను చెప్పేలా ఉండరు, తాము ఎంతగానో నమ్మితే తప్ప. ప్రజలను అంత తేలికగా విశ్వసించే లక్షణాలను కలిగి ఉండరు. ఏదైనా ఒక అంశం పట్ల ప్రస్తావన వచ్చినప్పుడు, అది తమకు అన్వయించినట్లు కనిపించినా, లేదా తాము కొన్ని విషయాలను పాటించడంలేదని మనసుకు తోచినా, కొంతమేర ఆందోళనలకు లోనవుతూ ఉంటారు. వారి స్వభావం ప్రజలకు దగ్గర చేస్తుంది, కానీ వారి భయాలను అధిగమించడంలో మాత్రం వారెప్పుడూ విఫలమవుతూనే ఉంటారు.

తులా రాశి :

తులా రాశి :

తులా రాశి వారు, భావోద్వేగాలతో కూడిన రాశి చక్రాలలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటారు. వీరు తీసుకునే నిర్ణయాల పట్లనే సహజంగా ఆందోళనలను కలిగి ఉంటారు. ఒకరు తమపట్ల అయిష్టం కలిగి ఉండడం కూడా వీరికి నచ్చని మరియు ఆందోళనలను కలిగించే అంశంగా ఉంటుంది. ప్రవర్తనా సరళి నుండి కనిపించే విధానం వరకు ప్రతి అంశంలో ఒకటికి రెండు మార్లు ఆలోచించే భిన్నమైన ఆలోచనా సరళిని కలిగి ఉండడం వీరి ప్రత్యేకత. అలా ఆలోచించడం ద్వారా ఎటువంటి తప్పులు దొర్లకుండా, ఉత్తమ ఫలితాలు సాధిస్తారని వీరి నమ్మకం, కానీ అదే సమయంలో ఆందోళనలకు కూడా ఈ ఆలోచనా విధానమే కారణంగా ఉంటుంది. వీరి చుట్టూతా సౌకర్యవంతమైన మరియు స్నేహపూర్వక వాతావరణం ఉండాలని ఆలోచిస్తుంటారు. అలా లేనప్పుడు, తెలియని వారి మద్యలో ఉన్నట్లుగా ఒంటరితనాన్ని అనుభవిస్తుంటారు. ముఖ్యంగా వీరికి స్నేహితులు కూడా తక్కువ సంఖ్యలో ఉంటారు. మరియు స్నేహానికి ఎంతో విలువనిచ్చే వారిలా ఉంటారు. క్రమంగా, ఏ చిన్న అంశం కూడా స్నేహితులను, ప్రియమైన వారిని దూరం చేయకూడదని తీవ్రమైన ఆలోచనలు చేస్తుంటారు. క్రమంగా ఆందోళనలు సర్వసాధారణం.

కర్కాటక రాశి :

కర్కాటక రాశి :

సున్నితమైన నీటి ఆధారిత సంకేతమైన కర్కాటక రాశి కూడా ఈ జాబితాలో ఉంది. వీరు అత్యంత జాగ్రత్తపరులుగా, భావోద్వేగాల గనిగా ఉంటారు. తమను ఇతరులు ఎంతమేర ప్రేమిస్తున్నారు అన్న అనుమానమే సగం వీరి ఆందోళనలకు ప్రధాన కారణంగా ఉంటుంది. వారి భయము, సిగ్గు కూడా వీరి ఆందోళనలకు గల మరో ప్రధాన కారణం. ఓడిపోవడం అంత సులువైన అంశం కాదు వీరి ఆలోచనల్లో. క్రమంగా నలుగురిలో అవహేళనలకు గురవుతామన్న భయాన్ని కలిగి ఉంటారు. వీరు భయాలను త్యజించిన తర్వాతనే, తిరిగి మామూలు వ్యక్తులుగా నలుగురిలోకి రాగలరు. క్రమంగా, వీరికి స్నేహితులు మరియు ప్రియమైనవారి సహకారం ఖచ్చితంగా అవసరం ఉంటుంది.

ఈవ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర జ్యోతిష్య, ఆద్యాత్మిక, హస్త సాముద్రికం, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈవ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి

English summary

Zodiac Signs That Are Most Nervous

Though feelings are pretty much natural and being nervous is probably the commonest of all the feelings, there are some people who display this trait more than others when it comes to being nervous. Based on your zodiac sign, you can easily know how nervous you are, what is the reason and whether you are on the list or not.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more