For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ డైవర్ వాహనాలపై భయంకరమైన ఇమేజ్ లు చూసి డ్రైవింగ్ మానేశాడు

|

రాత్రిపూట హై-బీం లైట్లను నియంత్రించడానికి మరియు వేగాన్ని తగ్గించడానికి చైనీస్ డ్రైవర్లు అవలంభిస్తున్న వినూత్న పద్దతి ఏమిటో తెలుసా ?

ఈ ప్రపంచంలో అత్యధిక శాతం ప్రమాదాలు రాత్రివేళల్లోనే జరుగుతున్నాయని మనందరికీ తెలియని విషయమేమీ కాదు. ఇటీవల జరిగిన ఒక సర్వేలో కూడా గత సంవత్సరాలతో పోలిస్తే ఎక్కువ ప్రమాదాలు రాత్రివేళల్లోనే, అది కూడా హై-బీం లైట్స్ వినియోగించడం మూలంగానే నమోదు అయినట్లు తేలింది. దీనికి అనేక కారణాలు ఉన్నా, సగానికి సగం నిద్ర మరియు హై-బీం లైట్ల వాడకం కారణంగానే ప్రమాదాల బారినపడుతున్నారు అన్నది జగమెరిగిన సత్యం. అవునా ? క్రమంగా రాత్రి సమయంలో ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ప్రజలు రకరకాల ట్రిక్స్ అవలంభిస్తూ ఉన్నారు. కానీ అందులో కొన్ని వినూత్న ఆలోచనలు వైరల్ గా మారాయి.

చైనాలో కారు డ్రైవర్లు రిఫ్లెక్టివ్ దెయ్యాల ఫోటోలను ఉపయోగించడమనేది అందరినీ ఆకట్టుకుంది. ఒక విధంగా చెప్పాలంటే, దీని ఫలితంగా ప్రమాదాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయిందని చెప్పబడింది. వాస్తవానికి అధికశాతం ప్రజలు అభూతకల్పనలు, దెయ్యాలు వంటి వాటిని విపరీతంగా నమ్ముతూ ఉంటారు. క్రమంగా ఈ భయమే ఈ డ్రైవర్ల పాలిటి వరమైంది.

ఈ విషయానికి సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు వ్యాసంలో ముందుకు సాగండి.

అనేక ఆన్లైన్ వెబ్సైట్లు సైతం ఈ స్టిక్కర్లను విక్రయించడం మొదలుపెట్టాయి.

అనేక ఆన్లైన్ ఈ -కామర్స్ వెబ్సైట్లు ఈ భయానక హారర్ రేర్-విండో చిత్రాలను ప్రత్యేకించి డిజైన్ చేయించి అమ్మడం మొదలు పెట్టాయి. భీతిగొల్పే రక్తం నిండిన నోరు, కోర పళ్ళు మొదలైన వాటితో గ్రాఫిక్స్ జోడించిన ఈ చిత్రాలు ప్రజలను భయపెట్టడంలో విజయం సాధించాయనే చెప్పవచ్చు. ముఖ్యంగా రేర్-విండో చిత్రాలు 3D పోలి ఉండేలా డిజైన్ చేయడం జరుగుతుంటుంది. క్రమంగా వెనుక వచ్చే వాహన వినియోగదారులు ఒకింత ఆందోళనకు లోనై, వేగాన్ని తగ్గించడం, హై-బీం లైట్స్ ఆఫ్ చేయడం జరుగుతూఉంది.

వాస్తవానికి ప్రజలు డ్రైవర్ల వేగాన్ని నియంత్రించేందుకు మరియు హై-బీం లైట్లను ఆపించేందుకు వీటిని ఉపయోగిస్తున్నారు..

వాస్తవానికి ప్రజలు డ్రైవర్ల వేగాన్ని నియంత్రించేందుకు మరియు హై-బీం లైట్లను ఆపించేందుకు వీటిని ఉపయోగిస్తున్నారు..

వెనుక నుండి వస్తున్న వాహన చోదకులు, తమ హై బీమ్ హెడ్లైట్ల కాంతిలో, ముందు వాహనాల రేర్-విండోలో కనిపించే ఈ చిత్రాలను చూడడం ద్వారా, ఒకింత ఆందోళనకులోనై వేగాన్ని కూడా తగ్గిస్తున్నారని చెప్తున్నారు. పైగా ఈ హై-బీం లైట్ల కారణంగా ముందు వెళ్తున్న డ్రైవర్లు అసౌకర్యానికి గురవకుండా, లైట్లు డౌన్ చేస్తున్నారని చెప్తున్నారు.

ఈ స్టిక్కర్లు డిం-లైట్లలో కనపడవు ..

ఈ స్టిక్కర్లు డిం-లైట్లలో కనపడవు ..

ఈ వింత స్టిక్కర్ల గురించిన వినూత్నమైన విషయమేమిటంటే, అవి చీకటి లేదా సాధారణ లైటింగ్ స్థితులలో కనపడవు. ఒక ప్రకాశవంతమైన కాంతి వాటిపై పడినప్పుడు మాత్రమే, ఈ స్టిక్కర్ల పనితనం బయటపడుతుంది. ఈ కాన్సెప్ట్ చట్టవిరుద్ధమైనదిగా భావించినప్పటికీ, ఇది వెనుక వస్తున్న డ్రైవర్లను భయపెట్టవచ్చునని మరియు అధిక ప్రమాదాలకి దారితీస్తుందని పోలీసులు విశ్వసిస్తున్నా, అటువంటి కేసు మాత్రం ఇప్పటికీ ఒక్కటి కూడా నివేదించబడలేదు.

భయానకమైన చిత్రాలను ఉపయోగించడం ఇష్టపడని వారు, వారు ఈ కిందిరకం చిత్రాన్ని ఉపయోగించుకోవచ్చు!

భయానకమైన చిత్రాలను ఉపయోగించడం ఇష్టపడని వారు, వారు ఈ కిందిరకం చిత్రాన్ని ఉపయోగించుకోవచ్చు!

కొందరు హారర్ చిత్రాలను ఉపయోగించడానికి ఇష్టపడరు. అటువంటి వారు, ఇక్కడ చూపిన ఈ చిత్ర రకాన్ని ఎంచుకోవడం జరుగుతుంది.

ఇంతకీ ఈ కాన్సెప్ట్ మీకెలా అనిపించింది ? ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి.

English summary

Chinese Drivers Try to Deter Nighttime High-Beam Use With Scary Decals

Chinese drivers are equipping the rear windows of their cars with scary reflective pictures of ghosts, vampires or monsters. This interesting concept has worked well with the traffic as there are less number of accidents.These Drivers Try To Avoid Nighttime High-Beam By Using Scary Images
Story first published: Tuesday, April 16, 2019, 15:05 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more