Latest Updates
-
ప్రధానినైనా అరెస్ట్ చేయొచ్చు..కానీ మనదేశంలో ఈ ఇద్దరినీ ఎవ్వరూ టచ్ చేయలేరు! -
ఒంట్లో వేడిని తగ్గించే, ఇమ్యూనిటీ పెంచే సూపర్ టేస్టీ చిన్న ఉల్లిపాయల సాంబార్.. -
ప్రెగ్నెన్సీ ప్రయత్నాల్లో ఉన్నారా.. పీరియడ్స్‌లో ఈ మార్పులను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
Viral Video: సాఫ్ట్ వేర్ జాబ్ దండగ..ఈ ఐడియా సూపర్!..పెట్టుబడి లేకుండా 3 గంటల పనితో నెలకు రూ. 70 వేల ఆదాయం -
పూజలో ఉపయోగించే ఐదు దీపాల అర్థం ఏమిటి? -
నెలకు రూ.2.8 లక్షల జీతం..పని ఏంటంటే ఇతరుల తరపున 'బ్రేకప్' చెప్పడమే! -
ప్రొటీన్ పవర్.. అదిరిపోయే ఫ్లేవర్..అఫ్ఘానీ సోయా కర్రీ తయారీ విధానం ఇదే.. -
ఏం తిన్నా పొట్ట ఉబ్బరంగా అనిపిస్తోందా? అసలు కారణం ఫుడ్ కాదు.. -
చేపల కూర అంటే ఇలా ఉండాలి భయ్యా.. ఘుమఘుమలాడే బిహారీ స్టైల్ ఫిష్ కర్రీ! -
సాధారణ నొప్పులే కదా అని లైట్ తీసుకుంటున్నారా? క్యాన్సర్ ముప్పు కావచ్చు!
3వారాలు లిక్విడ్ డైట్ ఫాలో అయ్యింది చివరికి పర్మనెంట్ గా బ్రెయిన్ డ్యామేజ్ అయ్యింది
శరీరాన్ని ఫిట్ గా, ఆరోగ్యంగా ఉంచాలని ఎవరు మాత్రం కోరుకోరు చెప్పండి. ఒక ప్రొఫెషనల్ నుండి సలహాలు, సూచనలు తీసుకోవడం నుండి, ఆహార ప్రణాళికలు అనుసరించడం, జీవనశైలిలో మార్పులు చేర్పులు చేయడం, బరువు కోల్పోవడం గురించిన అనేక ఉపాయాలను తెలుసుకుని అనుసరించడం వంటి అనేక అంశాలను పాటించడం జరుగుతుంటుంది. అవునా ? కానీ అందరూ తమ తమ శరీరాలకి తగినట్లుగా ఆహార ప్రణాళికలు అవలంభిస్తే పర్వాలేదు కానీ, ఒకరిని ఆదర్శంగా తీసుకుని వారిలాగే పాటించి ఫలితాన్ని పొందాలని భావిస్తే, అది ఒక్కోసారి తీవ్ర దుష్ప్రభావాలకు కూడా దారితీయవచ్చు. ఎందుకంటే, అందరి శరీర తత్వాలు ఒకటిగా ఉండవు కాబట్టి.

ఇక్కడ ఈ కథనంలో ఒక మహిళ ' ప్రత్యామ్నాయ థెరపిస్ట్ ' ఇచ్చిన సూచనల ఆధారంగా లిక్విడ్ డైట్ అనుసరించి, దుష్ప్రభావాలను ఎదుర్కొన్న సంఘటన గురించిన వివరాలను తెలుసుకుందాం. ఈ ప్రత్యామ్నాయ థెరపిస్ట్లులలో అనేక శాతం, సరైన ధృవీకరణ లేకుండా, తమను తాము వైద్యులుగా ప్రకటించుకుంటూ సూచనలు ఇస్తూ ఉంటారు. ఒకరిద్దరు విజయం సాధిస్తే, అదే నిజమైన ఆహార ప్రణాళిక అంటూ ప్రజల మీద రుద్డడం ప్రారంభిస్తారు. వీటివలన కలిగే దుష్ప్రభావాల గురించి వైద్యులు హెచ్చరిస్తున్నా కూడా, చాప కింద నీరులా కొన్ని ఆహార ప్రణాళికలు విస్తరిస్తూనే ఉంటున్నాయి. క్రమంగా అనేకమంది ఆసుపత్రుల పాలయ్యాక కానీ, నిజనిర్ధారణకు రాలేకున్నారు.
ఆ ప్రత్యామ్నాయ థెరపిస్ట్ ఇచ్చిన సలహా ప్రకారం, ద్రవాహార ప్రణాళికను అనుసరించిన ఆ మహిళకు శాశ్వతంగా మెదడు దెబ్బతినినింది. అసలేం జరిగిందో తెలుసుకోవడానికి వ్యాసంలో ముందుకు సాగండి.

ఆమె ఖచ్చితమైన ద్రవాహార ప్రణాళికను అనుసరించింది….
ఇజ్రాయెల్లోని టెల్ అవివ్ అనే ఆసుపత్రికి చేరుకున్న ఆ మహిళ వయసు 40 సంవత్సరాల పైమాటే. ఆ మహిళను పూర్తిస్థాయిలో ఖచ్చితమైన జ్యూస్ డైట్ లో ఉన్న కారణంగా, ఆమె ఈ పరిస్థితిని ఎదుర్కొనవలసి వచ్చింది.

ఆమె 3 వారాల పాటు ఈ ద్రవాహార ప్రణాళికను అనుసరించింది..
స్పష్టంగా ఆ మహిళ మూడు వారాల పాటు ఈ ద్రవాహార ప్రణాళికను, టెల్ అవివ్ ప్రాంతంలోని 'ప్రత్యామ్నాయ థెరపిస్ట్' సూచనల మేరకు అనుసరించింది.

ఆమె డైట్ వివరాలు ...
ఆహారంలో భాగంగా ఆ మహిళకు పండ్ల రసాలు, నీరు మాత్రమే సేవించడానికి అనుమతినిచ్చారు. ఆహార ప్రణాళిక అనుసరించినన్ని రోజులూ ఎటువంటి ఘనాహారం ముట్టడానికి వీలులేదని సూచించారు. దీంతో ఆమె శరీరంలో సోడియం అసమతుల్యత ఏర్పడింది. ఈ దశలో ఆమె బరువు 90 lb (40 kg) దిగువకు జారింది.

ఆమె పరిస్థితి మరింత విషమంగా...
వైద్యుల ప్రకారం, ఈ మహిళకు హైపో నెట్రోమియా అని పిలువబడే సమస్య కూడా తలెత్తింది. ఇది రక్తంలో తక్కువ స్థాయిలో సోడియం ఉండడం వలన కలిగే ఒక తీవ్ర పరిస్థితి, మరియు ఎటువంటి కడుపు సంబంధిత సమస్య ఉన్నా, ఎలక్ట్రోలైట్స్ భర్తీ చేయకుండా కేవలం నీటిని మాత్రమే తాగుతూ ఉండే ప్రజలలో ఇది తరచుగా సంభవిస్తుంటుందని వైద్యులు చెప్తున్నారు. ఇప్పుడు ఆమెకు శాశ్వత మెదడు నష్టం వాటిల్లింది. క్రమంగా ఆలోచనా స్థాయిలు తగ్గిపోవడం జరిగింది. ప్రస్తుతం, ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉంది.

ఇక ఆ ప్రొఫెషనల్ గురించి…
ఇజ్రాయిల్లోని నియమాల ప్రకారం, అక్కడి ప్రజలకు తమను తాము థెరపిస్ట్లుగా ప్రకటించుకోవడానికి ఎటువంటి అర్హతా అవసరం లేదు కూడా. క్రమంగా ఆరోగ్యపరమైన సలహాలను కూడా ఇవ్వడం ప్రారంభిస్తారు. అంతేకాకుండా, వైద్యశాలలను కూడా ఏర్పాటు చేసుకుని ప్రచారాలు నిర్వహిస్తుంటారు. క్రమంగా ఇటువంటి పరిస్థితులు సర్వసాధారణంగా ఉంటాయి. కానీ అనేక దేశాలలో చట్టాలు అమలులో ఉన్నా కూడా, కొందరు యధేచ్చగా ఇటువంటి ప్రణాళికలను సూచిస్తూ ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటూ ఉంటారు.
కావున మీరేదైనా ఆహార ప్రణాళికను అనుసరించాలని భావించిన ఎడల, ఒకటికి నాలుగు సార్లు ఆలోచన చేయండి. పరిశోధన చేయండి. క్రమంగా మీ శరీరానికి సరిపోయే ఉత్తమ ఆహార ప్రణాళికను ఎన్నుకుని, అనుసరించండి.
ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.



Click it and Unblock the Notifications