Latest Updates
-
గురు గ్రహ సంచారం..ఈ 3 రాశులకు కోటీశ్వర యోగం..మీ రాశి ఇందులో ఉందా? -
షుగర్ పేషెంట్స్,బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ..ఎలా చేసుకోవాలంటే.. -
గుడిలో ప్రసాదంలా రోజంతా కమ్మగా ఉండే దద్దోజనం..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రెషర్ కుక్కర్ మూత పక్కల నుండి ఆవిరి లీక్ అవుతోందా? ఈ చిట్కాతో ఆ సమస్యకు చెక్! -
సిరిసంపదలు పెరగాలంటే ఇల్లు ఎలా తుడవాలి? కచ్చితంగా పాటించాల్సిన వాస్తు నియమాలు -
నవరాత్రి ఉపవాస స్పెషల్.. నానబెట్టే పనే లేకుండా అప్పటికప్పుడు సగ్గుబియ్యం వడలు..ఎలా చేసుకోవాలంటే.. -
క్రిస్పీ సొరకాయ ఫింగర్స్..ఏం టేస్ట్ రా బాబు తింటుంటే అలా పోతూ ఉంటాయ్..ఈజీగా చేసుకోండిలా.. -
Shocking: మెట్రో రైలులో సీటు కోసం గొడవ..ఒకరు మృతి..అసలేం జరిగిందంటే..? -
హార్ట్ ఎటాక్ ముప్పును ముందుగానే పసిగట్టే కాలి బీపీ టెస్ట్.. ఎలా చేయాలంటే? -
నవరాత్రి స్పెషల్: ఉపవాసంలో తక్షణ శక్తినిచ్చే మఖానా లడ్డూ..ఈజీగా చేసుకోండిలా..
బ్రతుకున్న ఆక్టోపస్ తినడానికి దైర్యం చూపిన మహిళకు షాక్.!
బ్లాగింగ్ రోజులు పోయి, వ్లోగింగ్ రోజులు వచ్చాయి, క్రమంగా ఇదే కొత్త ట్రెండ్ గా ఉంది, ప్రజలు తాము చేసే సాహసాలను, అలవాట్లను, మరేదైనా ఇతర అంశాలను వీడియోలు తీసి సామాజిక మాధ్యమాలలో పంచుకోవడానికి ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. క్రమంగా ఇతరుల అభిప్రాయాలు, లైక్స్, షేర్స్ ఆకాంక్షిస్తూ ఉంటారు.
తమ ఫాలోవర్లను నవ్వించడానికి, లేదా తమ ఘనతను చాటుకోవడానికి, సృజనాత్మకతకు పనిచెబుతూ, కొన్ని ప్రత్యేక మార్గాలను ప్రయత్నించటం ద్వారా, ఈ వ్లోగర్స్ విజయం సాధించడానికి పూనుకుంటూ ఉంటారు.

ఆక్రమంలో భాగంగా, ఈ వ్లోగర్ కూడా ఒక బ్రతికున్న ఆక్టోపస్ను తినడానికి ప్రయత్నించగా, అది ఆమె ముఖంపై ఇరుక్కుపోయి, చేదు అనుభవాన్ని మిగిల్చింది.
ఈ వింత సంఘటన గురించిన మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు వ్యాసంలో ముందుకు సాగండి. వ్యాసం చివర్లో వీడియో పొందుపరచబడింది.

ఆమె రెగ్యులర్ వ్లోగర్ :
"సీ సైడ్ గాళ్ లిటిల్ సెవెన్ " అనబడే ఈ సోషల్ మీడియా వోగర్, తరచుగా సముద్రపు ఆహారాన్ని తింటూ వాటిని సామాజిక మాధ్యమాలలో లైవ్ స్ట్రీమింగ్ ఇస్తుంటుంది. ఆ క్రమంలో భాగంగానే, ఒక బ్రతికున్న భారీ ఆక్టోపస్ను తినడం ద్వారా, తన చానెల్ను ఒక మెట్టు పైకి తీసుకెళ్లాలని ఆమె నిర్ణయించుకుంది.

బ్రతికున్న ఆక్టోపస్ను చేతితో పట్టుకుని నిలబడింది ..
వీడియోలో చూపినట్లు ఆమె, ఒక పెద్ద ఆక్టోపస్ను పట్టుకొని నిలబడింది. మరికొద్దిసేపటిలో దాన్ని తినాలని నిర్ణయించుకుంది.

ఆ గిలిగింతలు, ఏడుపుగా మారడానికి ఎంతో సమయం పట్టలేదు …
ఆమె ఆక్టోపస్ను కొరికిన వెంటనే, పరిస్థితి తారుమారైంది. ఆ ఆక్టోపస్ హింసాత్మకంగా ఆ వ్లోగర్ ముఖం మీద దాడిచేయడం ప్రారంభించింది. గట్టిగా విడువకుండా పట్టుకుని ఆమెని ప్రతిఘటించింది. ప్రారంభంలో ఆక్టోపస్ చర్యను గిలిగింతలుగా భావించినా, కొన్ని సెకన్ల వ్యవధిలోనే ఆమె నవ్వు బాధగా మారిపోయింది.

చివరికి ఆక్టోపస్ను వదిలించుకుంది …
సుదీర్ఘ పోరాటం తర్వాత, ఆమె తన ముఖం నుండి ఆక్టోపస్ను విడదీయగలిగింది. కానీ ఆ ఆక్టోపస్ ఆమె ముఖంపై చేసిన రక్తగాయాన్ని చూపుతూ , దీనిని తదుపరి వీడియోలో ఖచ్చితంగా తింటానని చెప్పుకొచ్చింది.
కావున, ఇటువంటివి చేసేముందు తగిన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ఈమధ్య సామాజిక మాధ్యమాలలో అనేక కొత్త కొత్త చాలెంజ్లు కూడా హల్చల్ చేస్తున్నాయి. అవి, కొందరికి ప్రాణాల మీదకు కూడా తీసుకొస్తున్నాయి. ఇటువంటి వాటిని అనుసరించే వాళ్ళు, అనవసరంగా ఒక జీవితాన్ని పణంగా పెడుతున్నారని గుర్తుంచుకోవడం మంచిది.
ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర విషయాలతో పాటు. ఆరోగ్య, జీవనశైలి, మాతృ, శిశు సంక్షేమ, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి.



Click it and Unblock the Notifications
