For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టీమిండియా క్రికెటర్ల క్యూట్ పిల్లల అరుదైన ఫొటోలపై ఓ లుక్కేయండి...

|

చిన్నపిల్లలు దైవంతో సమానం అని చాలా మంది నమ్ముతారు. క్యూట్ క్యూట్ గా కనిపించే వారి మోములో స్వచ్ఛమైన నవ్వును చూడటానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. చాలా మంది చిన్నపిల్లల చిరునవ్వుతో తమ జీవితాల్లో వెలుగులొస్తాయని కూడా భావిస్తారు.

వీటన్నింటి సంగతి పక్కనబెడితే టీమిండియా క్రికెటర్లలో ఇటీవలే హార్దిక్ పాండ్య తనకు పండంటి బిడ్డ పుట్టినట్లు సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా తనకు ఎంతో గర్వంగా ఉందని కూడా ప్రకటించాడు. మరి కొన్ని గంటల్లోనే విరాట్ కోహ్లీ కూడా అనుష్కశర్మ గర్భంతో ఉందని, మరి కొన్ని రోజుల్లో తాము ముగ్గురిగా మారబోతున్నామంటూ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు శుభవార్త చేప్పాడు. ఈ నేపథ్యంలో ఇతర క్రికెటర్లు తమకు పిల్లలంటే ఎంత ఇష్టమో... వారి ముఖాల్లో ఎలాంటి కల్మషం లేని చిరునవ్వును చూస్తే, తమ ఒత్తిడి అంతా ఇట్టే ఎగిరిపోతుందని చెబుతున్నారు. ఈ సందర్భంగా ఆ క్రికెటర్లు ఎవరు? వారి పిల్లలు ఎవరు? వారి గురించి ఆ తల్లిదండ్రులు ఏమంటున్నారో అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ధోని కూతురు జీవా..

ధోని కూతురు జీవా..

ధోనీ, సాక్షి జంటకు 2015 సంవత్సరంలో ఫిబ్రవరి 6వ తేదీన జీవా పుట్టింది. ఈ అందమైన క్షణాలను ధోని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘నా బిడ్డ ముఖంలో చిరునవ్వు చూసిన తర్వాత నా జీవితం మారుతోంది. నేను నా దేశం కోసం ఆడుతున్నానా లేదా చెన్నై వంటి ఫ్రాంచైజీ కోసం ఆడుతున్నానా అనే విషయాలను తను పట్టించుకోవదు. తను ఏడవాలనుకుంటే ఏడుస్తుంది.. నవ్వాలనుకుంటే నవ్వుతుంది. ఇది నాకు చాలా మంది అనుభూతిని ఇస్తుంది' అని చెన్నై సూపర్ కింగ్స్(సిఎస్ కె) కెప్టెన్ ధోని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

‘ది వాల్’ పిల్లలు..

‘ది వాల్’ పిల్లలు..

భారత క్రికెట్లో ‘ది వాల్'గా పేరొందిన ఒకే ఒక్క ఆటగాడు రాహుల్ ద్రవిడ్. ఈ ఆటగాడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో ఒకరు సమిత్ 2005లో జన్మించారు. అన్వే ద్రవిడ్ 2009లో ఈ భూమి మీదకు అడుగు పెట్టాడు. వీరిద్దరూ ఇప్పటికే క్రికెట్లో మంచి శిక్షణ పొందుతున్నారు. త్వరలో వీరిద్దరూ టీమిండియా తరపున ఆడే అవకాశం కూడా ఉంది. ‘నేను వారితో సమయాన్ని గడపడాన్ని చాలా ఇష్టపడతాను. వారికి కథ పుస్తకాలు చదివి వినిపించడం అంటే నాకు చాలా ఇష్టం' అని ద్రవిడ్ అంటున్నాడు.

శిఖర్ ధావన్

శిఖర్ ధావన్

శిఖర్ ధావన్ ఆయేషా ముఖర్జీని రెండో వివాహం చేసుకున్నాడు. ఆయేషాకు అప్పటికే ఇద్దరు కుమార్తెలు ఉన్నందున వారు ధావన్‌ను తమ తండ్రిగా అంగీకరించారు. ఆ తరువాత జోర్వార్ అనే మౌస్ బాయ్ 2014లో ధావన్ మరియు ఈషా దంపతులకు జన్మించాడు. ఈ అందమైన బిడ్డ శిఖర్ మరియు ఆయేషా ప్రేమకు ప్రతీకగా చెబుతుంటారు. అతని సోదరీలు కూడా అతన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటారని ధావన్ చెబుతున్నాడు.

గౌతమ్ గంభీర్

గౌతమ్ గంభీర్

గౌతమ్ గంభీర్ కు జన్మించిన దేవత పేరు అసిన్. అతను 2014 లో జన్మించాడు. ఇది ఓవర్ డాడ్ డార్లింగ్. తన జన్మ తన జీవిత అదృష్టం అని గంభీర్ భావించాడు. తన కుమార్తె వచ్చినందుకు కలకత్తా నైట్ రైడర్స్ నాయకత్వం అదృష్టమని గంభీర్ ఎప్పుడూ చెబుతారు.

అనిల్ కుంబ్లే..

అనిల్ కుంబ్లే..

అనిల్ కుంబ్లే అనగానే అందరికీ గుర్తొచ్చేది పది వికెట్లు తీసిన ఏకైక బౌలర్. అది కూడా దాయది జట్టు పాకిస్థాన్ వికెట్లను మొత్తం పేకమేడలా కూల్చేశాడు. ఈయన తన వ్యక్తి జీవితంలో రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడట. మొదటి భార్య చేతనకు మాయాస్, స్వస్తిలతో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అయితే వీరిద్దరూ విడిపోయాక కుంబ్లే మరో కళ్యాణం కూడా చేసుకున్నాడు. అయినప్పటికీ తొలి భార్య పిల్లల్ని ఇప్పటికీ తన పిల్లలుగానే భావిస్తున్నాడు. ఈ ఆటగాడు మైదానంలో లేని సమయంలో ఎక్కువగా తన పిల్లలతో గడపడానికి ఇష్టపడతాడట.

శ్రీశాంత్

శ్రీశాంత్

కేరళ రాష్ట్రానికి చెందిన ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ ఐపిఎల్ సమయంలో వివాదస్పదమైన ఆటగాడిగా చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. దీని కారణంగానే జాతీయ జట్టులో కూడా చోటు కోల్పోయాడు. అయితే తనకు తర్వాత క్లీన్ చిట్ లభించింది. వీటి సంగతి పక్కనబెడితే శ్రీశాంత్ దంపతులకు 2015లో మే 9వ తేదీన ఆడపిల్ల పుట్టింది. తనపేరు శ్రీసాన్సిక. ఇక 2016లో నవంబర్ 22న ముంబైలో ఓ అందమైన మగపిల్లాడు పుట్టాడు. తన పేరు సూర్యశ్రీ.

హర్భజన్ సింగ్

హర్భజన్ సింగ్

హర్భజన్ సింగ్, బాలీవుడ్ బ్యూటీ గీతా బాస్రా యొక్క చిన్న దేవదూత జులై 27, 2016న పుట్టింది. వీరిద్దరూ తమ బిడ్డకు హినాయ హీర్ ప్లాహా అని పేరు పెట్టారు. వీరిద్దరూ తమ చిన్నారితో కలిసి ఉన్న క్యూట్ అండ్ బ్యూటిఫుల్ ఫొటోలను సోషల్ మీడియాలో రెగ్యులర్ గా పంచుకుంటూ ఉంటారు.

సురేష్ రైనా

సురేష్ రైనా

మరో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేష్ రైనా తన చిన్ననాటి ప్రియురాలు ప్రియాంక చౌదరిని ఏప్రిల్ 3వ తేదీ, 2015లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఏడాదిలోనే అంటే 2016 మే 13వ తేదీకి వీరిద్దరూ గ్రేసియా రైనా కొత్త ప్రపంచానికి స్వాగతం పలికారు. ఈ సందర్భానికి గుర్తుగా రైనా తన కుమార్తె పేరును తన ఎడమ మోచేతిపై టాటూ వేయించుకున్నాడు.

మాస్టర్ బ్లాస్టర్ సచిన్..

మాస్టర్ బ్లాస్టర్ సచిన్..

సచిన్, అంజలి మధ్య ప్రేమకథ అందరికీ తెలిసిందే. తనకన్నా పెద్ద వయసున్న స్త్రీని ప్రేమించి పెళ్లి చేసుకున్న సచిన్ టెండూల్కర్ చాలా మందికి రోల్ మోడల్. క్రికెట్‌లో విజయం సాధించాలనుకునే వారికి కూడా ఆయన గొప్ప రోల్ మోడల్. ఈ గొప్ప ఆటగాడికి కూడా ఇద్దరు పిల్లలు. కూతురు షరా, కుమారుడు అర్జున్ టెండూల్కర్. వీరిద్దరి వివాహం 1995 మే 24వ తేదీన జరిగింది. 1997లో అక్టోబర్ 12న ముందుగా కూతురు పుట్టింది. మళ్లీ రెండేళ్ల తర్వాత 1999, సెప్టెంబర్ 24వ తేదీన అర్జున్ కు జన్మనిచ్చారు

గంగూలీ దాదా

గంగూలీ దాదా

ఇండియన్ క్రికెట్లో దాదా పేరు గడించిన సౌరవ్ గంగూలీ తన బాల్య స్నేహితురాలు డోనా గంగూలీని ప్రేమించి 1997లో ఫిబ్రవరి 1వ తేదీన అధికారిక వివాహం చేసుకున్నాడు. వారి కుటుంబంలోకి సనా గంగూలీ వచ్చింది. ఆమె ఇప్పుడు ఎంతో అందంగా కనిపిస్తోంది. సనా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది. తన మరియు తన కుటుంబ సభ్యుల చిత్రాలను పోస్ట్ చేయడమంటే తనకు చాలా ఇష్టం.

English summary

Adorable Babies pics of Indian Cricketers

Here we are sharing a adorable babies pics of indian cricketers. see it.