For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు జీవితంలో సక్సెస్ కావాలంటే.. ఈ రహస్యాలను ఎవ్వరితోనూ షేర్ చేసుకోకండి..

|

ప్రస్తుత సమాజంలో రహస్యం అనేది చాలా ముఖ్యమైనది. మీరు మీ గురించి విషయాలను ఎంత రహస్యంగా ఉంచుకుంటే మీరు మీ జీవితంలో అంత విజయవంతమవుతారు. పొరపాటున మీ రహస్యాలను ఎవరితో అయినా షేర్ చేసుకుంటే మీకు ఇబ్బందులు కలిగే అవకాశాలున్నాయంట. ఇదంతా మేము చెబుతున్నది కాదు.

Upanishadas
 

ఇదంతా ఉపనిషత్తులలో ఉన్న విషయం. మీరు మీ జీవితంలో సక్సెస్ సాధించాలంటే ఈ కింది రహస్యాలను ఎవ్వరితోనూ షేర్ చేసుకోకూడదని తెలుసా.. ఇంతకీ ఆ రహస్యాలెంటో తెలుసా.. అయితే వాటిని తెలుసుకోవడానికి కిందివరకు పూర్తిగా స్క్రోల్ చేయండి. ఎందుకంటే మీకు సంబంధించిన ప్రతి రహస్యం ప్రత్యేకమైనది మరియు ముఖ్యమైనది మరి.

1) బ్రహ్మవిద్య..

1) బ్రహ్మవిద్య..

PC

ముందుగా రహస్యాల గురించి తెలుసుకోవాలంటే వీటి గురించి కూడా క్లుప్తంగా తెలుసుకోవాలి. అప్పుడే విషయాలన్నీ అర్థమవుతాయి. ఈ సృష్టిలో ప్రతి జీవికి యదార్థ స్వరూపం పరమాత్మనే. అయితే మనుషులు మాత్రం తమలోని పరమాత్మను మరచిపోతున్నారు. కేవలం మనిషిగా మాత్రమే జీవిస్తున్నారు. అలాంటి మనుషులను మహోన్నతమైన వ్యక్తులుగా మలిచేందుకు మార్గం చూపేవే ఉపనిషత్తులు. వీటిని వేదంతాలు అని కూడా అంటారు. వేద అంటే తెలుసుకోవడం అని అర్థం. అంటే మొత్తం తెలుసుకోవడం అన్నమాట. అప్పుడే ఆత్మజ్ఞానం పొందగలరు. పురాణాల ప్రకారం ఈ వేద జ్ఞానాన్ని మొదట తెలుసుకున్నది బ్రహ్మదేవుడు అని చెబుతారు. ఆయన ఈ విద్యను ఇతరులకు బోధించడం వల్ల దీనికి బ్రహ్మ విద్య అనే పేరు వచ్చింది.

2) నాలుగు భాగాలు వేదాలు..

2) నాలుగు భాగాలు వేదాలు..

వేద వ్యాసుడు అనే మహర్షి ఒక్కటిగా ఉన్న వేదాలను నాలుగు భాగాలు విభజించి ఒక రూపం తెచ్చారు. అందులోనూ ప్రతి వేదం తిరిగి ఒక్కొక్కటి నాలుగు భాగాలుగా విభజించబడింది. అవేంటంటే 1) సంహిత (మంత్రభాగం), 2) బ్రాహ్మణాలు (పూజలు, యజ్ఞయాగాదులు ఇతరములు), 3) ఆరణ్యకాలు (ఉపాసనలు), 4) ఉపనిషత్తు (పరమాత్వతత్వం). ఇవి మానవులకు మోక్షమార్గాన్ని చూపే ఉపనిషత్తులు. ఇవి వేదాలకు చివర్లో ఉండటం వల్ల వేదాంతాలు అని పేరు వచ్చింది.

3) ఉపనిషత్ అంటే ఏమిటి?
 

3) ఉపనిషత్ అంటే ఏమిటి?

ఉప అంటే దగ్గరగా, ని అంటే కిందకు, షత అంటే కూర్చోవడం. మొత్తం ఉపనిషత అంటే దగ్గరగా కింద కూర్చోవడం అని అర్థం. అంటే శిష్యులు గురువుకు సమీపంగా కింద కూర్చుని విషయాలను తెలుసుకోవాలి. దగ్గరగా అంటే గురువుకు దగ్గరగా అని కాదు. గురు బోధనకు దగ్గరగా, గురువులు చెప్పే తత్వానికి దగ్గరగా, గురువు మనోభావాలను సక్రమంగా గ్రహించి ఆయన మనసుతో మన మనసును అనుసంధానం చేస్తూ దగ్గరగా చేరుకోవాలి.

ఇక అసలు విషయానికొస్తే కింద ఉన్న ఈ రహస్యాలను ఎవ్వరితోనూ షేర్ చేసుకోకూడదట. అవేంటో చూసేయండి మరి.

4) మీ గోల్స్..

4) మీ గోల్స్..

PC

మీరు మీ జీవితంలో సాధించాల్సిన గోల్స్ గురించి ఎవ్వరితోనూ అస్సలు చర్చించొద్దు. ఓ సర్వే ప్రకారం మీరు మీ లక్ష్యాల గురించి ఎవ్వరితో అయినా చర్చిస్తే ఇది మీ మైండ్ సెట్ పై ప్రభావం చూపే అవకాశం ఉందట. అందుకనే మీరు మీ గోల్స్ పైనే ఫోకస్ పెట్టాలి. మీరు లక్ష్యాలను సాధించిన తర్వాత వాటిని రివీల్ చేయాలి. ఉదాహరణకు పాము నిదానంగా పాకుతూ వెళుతుంది. కానీ అది ఒక్కసారిగా లేచి బుసకొడితే ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో తెలుసు కదా.

5) మీ ఇన్ కమ్..

5) మీ ఇన్ కమ్..

మీరు ఎవ్వరి దగ్గర మీ ఇన్ కమ్ ప్రస్తావన తీసుకురాకండి. ఇది ఇతరులకు అవనసరమైన విషయం అని మీరు గుర్తించాలి. ఎందుకంటే మీరు సంపాదించి మీ కోసం, మీకు కావాల్సిన కోసం ఖర్చు పెడతారు కాబట్టి. మీకు తెలుసా ఇతరులు లేదా అందరూ ఎంత సంపాదిస్తున్నారా అని? అలాంటప్పుడు మన ఇన్ కమ్ గురించి ఇతరులకు చెప్పడం ఎందుకు. అందుకనే మీ ఇన్ కమ్ ఇతరుల వద్ద చర్చించడాన్ని మరచిపోండి.

6) మీ ఆస్తులు..

6) మీ ఆస్తులు..

మీకు ఉన్న ఆస్తుల గురించి ఎవ్వరితోనూ షేర్ చేసుకోవద్దు. మీ ఇల్లు, అపార్ట్ మెంట్, కారు, భూమి, బైక్, జ్యువెలరీ, బ్యాంకు బ్యాలెన్సు వంటి వాటితో పాటు ఇంకా ఇలాంటి రహస్యాలను అస్సలు షేర్ చేసుకోవద్దు. దీని నుండి మీకు సమాజం నుండి గౌరవం వస్తుంది అని అనుకుంటే అది అత్యాశే అవుతుంది. మీ ఆస్తుల గురించి సమాజానికి అవనసరం. అందుకనే కేవలం మీ ఫ్యామిలీతో తప్ప ఎవ్వరితోనూ మీ ఆస్తుల రహస్యాలను పంచుకోవద్దు.

7) పర్సనల్ లైఫ్

7) పర్సనల్ లైఫ్

మీరు మీ పర్సనల్ లైఫ్ ఎట్టి పరిస్థితుల్లోనూ బంధువుల వద్ద షేర్ చేసుకోవద్దు. ఎందుకంటే మీ పర్సనల్ లైఫ్ మీకు వారికి తేలికగా అనిపించవచ్చు. దీనికి సంబంధించి ఓ సినిమాలో మంచి డైలాగ్ కూడా ఉంది. ‘ఎవడి లైఫ్ వాడికి వెయిట్ గా అనిపిస్తుంది‘. అందుకనే మీ లైఫ్ గురించి ఇతరులకు అనవసరం. మీకు ఎవరైతే క్లోజ్ గా ఉంటారో.. మీరు ఎవరినైతే బాగా నమ్ముతారో, లేదా మీ ఫ్యామిలీలో మీతో స్నేహంగా ఉండేవారితో మీ పర్సనల్ లైఫ్ విషయాలను షేర్ చేసుకోండి. మిమ్మల్ని ఎవరైతే ప్రోత్సహిస్తారో వారి దగ్గర విషయాలను రివీల్ చేయండి. మీకు అవసరమైన సలహాలను తీసుకోండి.

8) గాసిప్స్..

8) గాసిప్స్..

మన దేశంలో సుమారు 80 శాతం మందికి పైగా ఇతరుల గురించి గాసిప్స్ స్ప్రెడ్ చేస్తుంటారు. వీరు ఇలా.. వారు ఇలా.. ఇంకొకరు అలా అని, వారి సమస్యలేంటి, మీ సమస్యలేంటి అని రకరకాల గాసిప్స్ చెబుతుంటారు. ఇదొక చెడ్డ అలవాటు. ఇంకొకరి జీవితం గురించి కామెంట్స్ చేయడం, గాసిప్స్ మాట్లాడటం చాలా అసహ్యకరంగా ఉంటుంది. వీటి వల్ల చాలాసార్లు మనం నష్టపోవాల్సి ఉంటుంది. ఇలాంటి అలవాటు ఉంటే వెంటనే మానేయండి. అందుకనే మన హద్దులో మనం ఉండటం మంచిది.

9) ధైర్యం..

9) ధైర్యం..

మీకు ధైర్యం ఉందని మీకు తెలిస్తే చాలు. మీరు అందరి ముందు మీ ధైర్యం గురించి ప్రదర్శనలు చేయాల్సిన అవసరం లేదు. నేను ఏదైనా చేయగలను. నాకు అంతా తెలుసు. నేను ఎవ్వరినీ పట్టించుకోను. అలాంటి ఉద్దేశాలు ఉండటం మంచిది కాదు. మీకు ధైర్యం ఉందని ఎలా పడితే అలా కూడా మాట్లాడకూడదు. ఎక్కడైనా ఆచితూచి మాట్లాడాలి. ఎందుకంటే మీ మాటలు మీ బాస్ ను లేదా ఇంకా ఎవరినైనా ప్రభావితం చేయొచ్చు. కానీ ఎప్పుడైతే ధైర్యం చూపించాల్సిన సమయం వస్తుందో అప్పుడు మాత్రం ఎవ్వరి ముందు అయినా నిస్సంకోచంగా దానిని ప్రదర్శించవచ్చు. ధైర్యసాహసాలు చూపవచ్చు.

10) మంచి పనులు & దానధర్మాలు

10) మంచి పనులు & దానధర్మాలు

మీలో చాలా మంచి గుణాలు ఉండొచ్చు. మీరు మంచి పనులు చేస్తు ఉండొచ్చు. మీకు కొన్ని ఛారిటీ సంస్థలు ఉండొచ్చు. మీరు అప్పుడప్పుడు దానధర్మాలు చేస్తూ ఉండొచ్చు. ఇవన్నీ మీరు పేరు, ప్రఖ్యాతలు తీసుకొస్తాయనుకుంటే పొరపాటే. ఎందుకంటే మనం చేసిన మనం అది చేశాం. ఇది చేశాం అని చెప్పుకుంటే అదంతా వృథా ప్రయాసే అవుతుంది. మీరెన్ని దానధర్మాలు చేసినా వాటిని ఆ కాసేపు మాత్రమే గుర్తుంచుకుని, ఆ తర్వాత మరచిపోతారు. ఉదాహరణకు మనకు ఒక చేతి నుండి వస్తుంటే మరో చేతి నుండి పోతుంది. అంతే తప్ప ఏమి ఉండదని గ్రహించాలి. అందుకనే మంచి పనులు, ధానధర్మాల గురంచి కూడా ఎవ్వరి దగ్గర చెప్పకూడదు.

11) గుడ్ హెల్త్..

11) గుడ్ హెల్త్..

మీ ఆరోగ్యం గురించి కూడా ఎవ్వరితోనూ షేర్ చేసుకోకండి. కొంతమంది ఇలా చెబుతుంటారు. నాకు ఎప్పటికీ జ్వరం రాదు. నాకు ఎప్పుడూ చికెన్ గున్యా, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి రోగాలకు నా డిక్షనరీలోనే ప్లేస్ లేదు అని గొప్పగా చెప్పుకుంటుంటుారు. కానీ ఇలా ఎప్పుడు చెప్పకండి. మీకు గుడ్ హెల్త్ కావాలంటే మీరు అలాంటి రోగాలు వచ్చిన వారి నుండి సలహాలు తీసుకోండి తప్ప పై మాటలు మాత్రం మాట్లాడకండి. ఇది అంత మంచిది కాదు.

12) మీ నమ్మకాలు, ప్రాధాన్యతలు..

12) మీ నమ్మకాలు, ప్రాధాన్యతలు..

ప్రతి ఒక్కరి వివిధ రకాల నమ్మకాలు ఉంటాయి. మతం పరంగా, వర్గాల పరంగా, వ్యక్తిగతంగా గానీ రకరకాల నమ్మకాలు, ప్రాధాన్యతలు వేర్వేరుగా ఉంటాయి. అలాగే మీకు కూడా కొన్ని నమ్మకాలు, ప్రాధాన్యతలుంటాయి. కాబట్టి మీరు వాటిని ఎదుటివారితో పంచుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఏదైతే నమ్ముతారో దాన్నే చేయండి. చాలా మంది ప్రజలు మన నమ్మకాలు, ప్రాధాన్యతల్ని వదిలేసి జనరల్ టాపిక్స్ ఎక్కువగా మాట్లాడుతుంటారు. అలాగే ఆధిపత్యం చేలాయించాలని చూస్తారు. మీ నమ్మకం, ప్రాధాన్యతను పట్టించుకోరు. అందుకనే మీరు ఈ విషయాలను అస్సలు షేర్ చేసుకోవద్దు.

సో ఈరోజు మీరు ఎలాంటి రహస్యాలను షేర్ చేసుకోకూడదని తెలుసుకున్నారు కదా.. సో వీటిని ఫాలో అవ్వండి. మీ జీవితంలో మీరు విజేతలుగా నిలవండి.

Read more about: insync pulse
English summary

As per Upanishadas "9 secrets not to share with everyone"

Do not share your personal life with relatives under any circumstances. Because your personal life may seem easy to them. There is a good dialogue in this movie. Someone's life feels weighty. That is why you need to tell others about your life. Share your personal life matters with whomever you trust .
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more