For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ ఆరుగురు బంధువు మిమ్మల్ని ఒంటరిగా అస్సలే వదలిపెట్టరు

ప్రతి మనిషికి ఆరుగురు నిజమైన బంధువులు ఉంటారని, ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి సమస్య వచ్చినా, ఆపద వచ్చినా వారు వదిలిపెట్టరని చాణక్యుడు చెప్పాడు.

|

ప్రతి మనిషికి ఆరుగురు నిజమైన బంధువులు ఉంటారని, ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి సమస్య వచ్చినా, ఆపద వచ్చినా వారు వదిలిపెట్టరని చాణక్యుడు చెప్పాడు. కష్టకాలంలో అందరూ విడిచిపెట్టినా వారు మాత్రం కడవరకు తోడుంటారని చెప్పాడు. వాళ్లే నిజమైన బంధువులని, వారు ఎప్పటికీ తోడు నీడలా ఉంటారని వివరించాడు. చాణక్యుడు చెప్పిన ఆ బంధువులు ఎవరు, ఎవరు అలా తోడుంటారో ఇప్పుడు తెలుసుకుందాం.

Chanakya Niti: These six relatives will never leave you alone in Telugu

సత్యం తల్లిలాంటిది:

నిజానికి ఎక్కడైనా ప్రత్యేక స్థానం ఉంటుంది. నిజాన్ని ఎవరూ మార్చలేరు. నిజాన్ని నిజంగా స్వీకరించాల్సిందే. అబద్ధాన్ని నిజంగా నిలబెట్టడానికి వెయ్యి మంది కావాల్సి ఉంటుంది. కానీ నిజం తనకు తానుగా నిలబడగలదు. దాని ముందు వెయ్యి అబద్ధాలు కూడా పని చేయవు. అందుకే ఎప్పుడూ సత్యాన్ని చెప్పాలని అంటాడు చాణక్యుడు. అలాగే నిజం ఎంతో విలువైనదని దానిని ఎవరు పడితే వారి దగ్గరి నుండి ఆశించవద్దని కూడా సూచించాడు.

తల్లి తన బిడ్డకు ఎప్పుడూ అండగా ఉన్నట్లుగానే నిజం కూడా ఎప్పుడూ మన వెంటే ఉంటుందని చెప్పాడు చాణక్యుడు. సత్యంతో ప్రపంచాన్ని కూడా జయించవచ్చని చెబుతాడు కౌటిల్యుడు.

Chanakya Niti: యవ్వనంలో చేసే ఈ చిన్న తప్పులు భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తాయిChanakya Niti: యవ్వనంలో చేసే ఈ చిన్న తప్పులు భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తాయి

జ్ఞానం తండ్రివంటిది:

జ్ఞానం తండ్రివంటిది:

జ్ఞానం ఉన్న వ్యక్తికి ప్రతి చోటా గౌరవం లభిస్తుంది. జ్ఞానం ఉన్న వాడి కంటే గొప్పవాడు లేడంటాడు చాణక్యుడు. జ్ఞానం ఉన్న వాళ్లు సమస్యల్లో ఉన్నా సులభంగా వాటిని పరిష్కరించుకుని సంతోషంగా జీవిస్తారని, కాలం కలిసిరాకపోయినా అవకాశాలు సృష్టించుకుంటారని చెప్పాడు చాణక్యుడు. తండ్రి వంటి జ్ఞానాన్ని పెంపొందించుకోవడం కోసం నిరంతరం శ్రమించాలని చెబుతాడు. నిరంతర విద్యార్థిలా ఉన్నవారే జీవితంలో వృద్ధి చెందుతారని, సంపద సృష్టిస్తారని చెప్పాడు చాణక్యుడు.

Chanakya Niti: తల్లిదండ్రులూ.. మీ పిల్లల ముందు ఈ పనులు అస్సలే చేయొద్దుChanakya Niti: తల్లిదండ్రులూ.. మీ పిల్లల ముందు ఈ పనులు అస్సలే చేయొద్దు

నిజం సోదరుని వంటిది:

నిజం సోదరుని వంటిది:

ధర్మం సోదరుడి వంటిదని చాణక్యుడు చెప్పాడు. జీవితంలోని అన్ని రంగాల్లో ఒక సోదరుడు మీకు అండగా ఉంటాడు. అదే విధంగా ధర్మం సోదరుడిగా భావిస్తే దానిని జీవితంలోని అన్ని చోట్ల ఆచరించాలని చాణక్యుడు సూచించాడు. నీతి ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ధర్మం మనుషులను నిలబెడుతుంది. ధర్మమే ఎప్పటికీ విజయం సాధిస్తుంది. సోదరుడు తప్పు చేయకుండా కాపాడినట్లుగానే నీతి తప్పు చేయకుండా ఆపుతుంది.

Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఇలాంటి స్త్రీలను అస్సలే పెళ్లి చేసుకోవద్దుChanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఇలాంటి స్త్రీలను అస్సలే పెళ్లి చేసుకోవద్దు

దయ స్నేహితుడు వంటిది:

దయ స్నేహితుడు వంటిది:

దయ స్నేహితుడిగా ఉండాలని చాణక్యుడు చెప్పాడు. దయ మిత్రుడు అయినప్పుడు ప్రతి ఒక్కరూ స్నేహితులు అవుతారని చెప్పాడు చాణక్యుడు. దయ ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తుంది. దయ ఉన్న వారిని ప్రతి ఒక్కరూ ఆదరిస్తారు. దయలేని వారిని ఎవరూ ఇష్టపడరు.

Chanakya Niti: ఈ గుణాలున్న వారు జీవితంలో అంతులేని సంపద పొందుతారుChanakya Niti: ఈ గుణాలున్న వారు జీవితంలో అంతులేని సంపద పొందుతారు

మనశ్శాంతి భార్య వంటిది:

మనశ్శాంతి భార్య వంటిది:

ప్రతి మనిషి మనశ్శాంతిని భార్యగా అంగీకరించాలి. తప్పైనా ఒప్పైనా జీవిత భాగస్వామి మన వెంటే ఉన్నట్లుగా ఏ పని చేసినా మనశ్శాంతి వెతుక్కోవాలి. మనశ్శాంతి లేని పని చేసినా ప్రయోజనం ఉండదు.

Chanakya Niti: ఈ చిట్కాలు పాటిస్తే దంపతుల మధ్య గొడవలుండవు, బంధం బలోపేతం అవుతుందిChanakya Niti: ఈ చిట్కాలు పాటిస్తే దంపతుల మధ్య గొడవలుండవు, బంధం బలోపేతం అవుతుంది

క్షమాపణ కొడుకు వంటిది:

క్షమాపణ కొడుకు వంటిది:

క్షమాపణను కొడుకుగా చూడాలని చెప్పాడు చాణక్యుడు. ప్రజలను క్షమించడం నేర్చుకోవాలి. ఇది అనుకున్నంత సులభమైనది కాదు. ఎందుకంటే మనకు చెడు చేసిన వారు, మనల్ని మోసం చేసిన వారు క్షమాపణ అడిగితే దానిని అంగీకరించే మనస్తత్వం ఉండాలని అంటాడు చాణక్యుడు. కానీ అది చెప్పుకున్నంత సులభమైనది కాదు. కానీ దాని వల్ల శత్రువులు తగ్గిపోయి మిత్రులు పెరుగుతారని చెప్పాడు చాణక్యుడు.



"సత్య మాతా పితా జ్ఞానమ్

ధర్మో భ్రాతా దయా శాఖా

శాంతిః పత్నీ క్షమా పుత్రాః

షడేతే మాం బాంధవ!"

చాణక్య నీతి ప్రకారం ఈ లక్షణాలున్న పురుషులంటే స్త్రీలకు ఎంతో ఇష్టం, అవేంటంటే..

English summary

Chanakya Niti: These six relatives will never leave you alone in Telugu

read this to know Chanakya Niti: These six relatives will never leave you alone in Telugu
Story first published:Friday, January 20, 2023, 18:37 [IST]
Desktop Bottom Promotion