For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గురువారం మీ రాశిఫలాలు (06-08-2020)

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, శ్రావణమాసం, గురువారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

ఆగస్టు నెలలో మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి... ఓ రాశి నిరుద్యోగులకు ఉద్యోగావకాశం వస్తుంది...!

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు మనస్సు సంతోషంగా ఉంటుంది. ఈ రోజు మీకు చాలా మంచి అనుభూతి కలుగుతుంది. ఉద్యోగులు ఆఫీసులో ఉత్తమ పనితీరును చూపితే, మీరు మంచి పురోగతిని సాధించవచ్చు. వ్యాపారులకు ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మెరుగ్గా ఉంటుంది. మరోవైపు ఈరోజు మీ జీవిత భాగస్వామిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే మీ వివాహ జీవితంలో ఒత్తిడి పెరుగుతుంది. ఇంకోవైపు మీ ఆరోగ్యం మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక పరంగా సన్నిహితుడికి సహాయం చేసే అవకాశాన్ని పొందవచ్చు. మీ సామర్థ్యం ప్రకారం మీరు వారికి సహాయం చేస్తే మంచిగా ఉంటుంది. ఉద్యోగులు ఈరోజు పనినిని సకాలంలో పూర్తి చేస్తారు. మరోవైపు వ్యాపారులు ఈరోజు మంచి లాభాలను పొందుతారు. అయితే మీరు, ఏదైనా ముఖ్యమైన వ్యాపార నిర్ణయం తీసుకునే ముందు మీరు మీ తండ్రి అభిప్రాయాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. మీ జీవిత భాగస్వామితో సంబంధం బాగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 15

లక్కీ టైమ్ : ఉదయం 7:50 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు పనికి సంబంధించిన సమస్యలు తొలగిపోవవచ్చు. ఈరోజు ఉద్యోగులకు మరియు వ్యాపారులకు మంచి ఫలితాలు వస్తాయి. వ్యాపారులు ఈరోజు ఒక ముఖ్యమైన వ్యక్తిని కలవొచ్చు. మీరు ఈరోజు పెద్ద ప్రయోజనం పొందొచ్చు. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. అకస్మాత్తుగా ఈ రోజు కొన్ని శుభవార్తలు వినిపిస్తాయి. లాక్ డౌన్ కారణంగా మీ వివాహం చాలా కాలం పాటు వాయిదా పడితే, త్వరలో మీరు ఏడడుగులు వేస్తారు. ఆర్థిక పరంగా నిర్ణయాలు మీరే తీసుకుంటే మంచిది. ఈ సమయంలో, మీరు ఆర్థిక విషయాలలో కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఆరోగ్యం పరంగా ఈరోజు బాగుంటుంది.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:15 నుండి సాయంత్రం 6 గంటల వరకు

ఆగస్టులో పుట్టిన వారంతా అద్భుత శక్తులను కలిగి ఉంటారా?

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారు ఈరోజు వ్యక్తిగత జీవితంలో సమస్యలు ఎదుర్కొంటుంటే, మొదట మీరు మీ ప్రవర్తనను మార్చుకోవాలి. మీరు మీ స్నేహితులతో మరియు బంధువులను మంచి సంబంధాలను కొనసాగించాలి. వ్యాపారులకు ఈరోజు సమయం అనుకూలంగా ఉంటుంది. మరోవైపు, మీరు ఉద్యోగాన్ని వదిలి వ్యాపారం చేయాలనుకుంటే, మీరు మీ నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి. ఆరోగ్య పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. మీరు మానసిక శాంతి పొందడానికి, మీరు ఆరాధనపై ఎక్కువ శ్రద్ధ వహించాలి.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 40

లక్కీ టైమ్ : ఉదయం 4:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారు ఈరోజు మానసికంగా చాలా బలంగా ఉంటారు. మీ మనస్సులో చాలా సానుకూల ఆలోచనలు వస్తాయి. ఉద్యోగులు కార్యాలయ పనిపై శ్రద్ధ వహించాలి. మీరు ఒక విదేశీ కంపెనీలో పనిచేస్తుంటే ఈ రోజు మీకు చాలా ముఖ్యమైనది. అదే సమయంలో, వ్యాపారులు ఈరోజు భారీ నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. మీరు బంగారం మరియు వెండి వ్యాపారం చేస్తే ఈ సమయం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీ ఇంటి వాతావరణం సరిగ్గా ఉండదు. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : డార్క్ గ్రీన్

లక్కీ నంబర్ : 23

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారిలో విద్యార్థులకు ఈరోజు గురువుల మద్దతు కారణంగా అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీరు శ్రద్ధగా అధ్యయనం చేయగలుగుతారు. మీరు ఈ రోజు కార్యాలయంలో చాలా చురుకుగా పని చేస్తారు. మీ అన్ని పనులను వేగంగా పూర్తి చేస్తారు. సహోద్యోగులతో సమన్వయం కూడా మెరుగ్గా ఉంటుంది మీరు పని చేయడంలో వేరే ఆనందం పొందుతారు. వ్యాపారులకు ఈరోజు ఒడిదుడుకులు ఎదురవుతాయి. దీని వల్ల మీకు నిరాశగా అనిపిస్తుంది. మరోవైపు ఆర్థిక పరంగా ఈరోజు మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు ఏదైనా సమస్య ఉంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 39

లక్కీ టైమ్ : ఉదయం 5:45 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

ఆగస్టు 2020 : ఈ నెలలో గణేష్ చతుర్థి, జన్మాష్టమితో పాటు ప్రధాన పండుగలివే...

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు పని భారం ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు మీరు ఏ పనిలోనూ ఎక్కువ అనుభూతి చెందరు. ఈ విధంగా, ఒత్తిడిలో పనిచేయడం కూడా మీ పనితీరును తగ్గిస్తుంది. దీని వల్ల మీకు ఆరోగ్య సమస్యలు రావచ్చు. మరోవైపు మీ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడితే, జీవిత భాగస్వామితో సంబంధం బలంగా ఉంటుంది. మీ సమస్యలను పరిష్కరించడంలో మీ ప్రియురాలు నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోవచ్చు.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 30

లక్కీ టైమ్ : ఉదయం 4 నుండి మధ్యాహ్నం 2:20 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు మానసిక శాంతిని అనుభవిస్తారు. మరోవైపు మీరు ఉద్యోగంలో మార్పు కోరుకుంటే, ఈరోజు సమయం అనుకూలంగా ఉంటుంది. ప్రత్యేకించి మీ ప్రస్తుత ఉద్యోగంలో మీరు సంతృప్తి చెందకపోతే, మీరు మరొక కంపెనీలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మీకు త్వరలో శుభవార్త రావచ్చు. వ్యాపారులకు ఈరోజు ప్రతికూల ప్రభావాలు ఎదురవుతాయి.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 14

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 9:45 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఎట్టి పరిస్థితిలో మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఉద్యోగులు కార్యాలయంలో పని చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటుంటే, మీరు మీ ఉన్నతాధికారులతో మాట్లాడాలి. మీరు వారి నుండి సహాయం పొందుతారు. ఈ రోజు ఆహారం మరియు పానీయాల వ్యాపారం చేసే వారికి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉండటానికి, మీరు ప్రతిరోజూ వ్యాయామం చేయాలి.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 6 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారు ఈరోజు కుటుంబ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ గురించి ఏవైనా అపార్థాలుంటే, వాటిని తొలగించే ప్రయత్నం చేయాలి. మరోవైపు ఈరోజు ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మీరు ఇటీవల రుణం తీసుకుంటే, మీ భారాన్ని తగ్గించడానికి వీలైనంత త్వరగా దాన్ని తిరిగి చెల్లించడానికి ప్రయత్నించాలి. మీరు మీడియా రంగంలో పని చేస్తుంటే, ఈరోజు చాలా బిజీగా ఉంటారు. మీరు త్వరలో మీ కృషిని పొందగలుగుతారు. వ్యాపారులు ఈ రోజు ప్రత్యేక ప్రయోజనం పొందలేరు.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : రాత్రి 7 నుండి రాత్రి 10 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారు ఈరోజు చాలా సానుకూలంగా ఉంటారు. ఈరోజు మీకు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మరోవైపు ఉద్యోగులు ఈరోజు ఆఫీసులో చక్కని ప్రవర్తన కలిగి ఉండాలి. అయితే మీ కోపం మిమ్మల్ని పెద్ద ఇబ్బందుల్లోకి నెట్టివేస్తుందనే వాస్తవాన్ని గ్రహ స్థానాలు సూచిస్తున్నాయి. మీరు కార్యాలయంలో మీ నిగ్రహాన్ని కోల్పోతే, పరిస్థితులు దారుణంగా తయారవుతాయి. అయితే మీరు నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదు. మీరు గట్టిగా ప్రయత్నం చేస్తే, త్వరలో మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈరోజు మీ ఆరోగ్యం బాగుంటుంది.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : ఉదయం 8:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ వహించాలి. మీ పెరుగుతున్న మానసిక ఒత్తిడి మీ ఆరోగ్యం క్షీణించడానికి కారణమవుతుంది. మీరు భాగస్వామ్యంతో కొత్త పనిని ప్రారంభించాలనుకుంటే, ఈ రోజు మీరు దానిలో విజయం సాధించవచ్చు. ఆఫీసులోని అతిచిన్న పనులను జాగ్రత్తగా చేయడం మీకు మంచిది. ఎందుకంటే ఈసారి మీ యజమాని కళ్ళు మీపై ఉంటాయి. మరోవైపు మీ కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. కుటుంబంతో మీ సంబంధం బలంగా ఉంటుంది. తల్లి ఆరోగ్యంలో మెరుగుదల ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 10:20 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

English summary

Daily Horoscope August 6, 2020

Check out what the stars of your destiny have to say about you today. There will be opportunities and challenges, therefore, it is essential that you know what lies ahead. Read your daily horoscope to know more.
Story first published: Thursday, August 6, 2020, 6:00 [IST]