For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సోమవారం మీ రాశిఫలాలు (30-09-2019)

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, ఆశ్వీయుజమాసం, సోమవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, తదితర విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి..

1) మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

1) మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈరోజు ప్రేమికుడు లేదా సన్నిహితుల నుండి ఆహ్లాదకరమైన, ఉత్తేజకరమైన ప్రయాణం కోసం ప్రణాళిక సూచించబడుతుంది. ప్రేమికుల మధ్య సఖ్యత కూడా కనబడుతుంది. ఈరోజు మీరు ఇతరులతో బాగా సంబంధం కలిగి ఉంటారు. స్నేహాలు దగ్గరవుతాయి. శృంగార సంబంధాలు మరింత సన్నిహితంగా మారతాయి. మొత్తానికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. కొత్త వాహనాలను కొనుగోలు చేసే అవకాశముంది. ప్రతి పనిని సరదాగా, ఆనందంగా ఉత్సాహంగా చేస్తారు. స్త్రీలకు కూడా ఈరోజు ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి మానసిక ఒత్తిడి, ఆందోళన ఉండదు. కుటుంబసభ్యులతో కలసిమెలసి ఉంటారు. ఉద్యోగులకు మంచి పదవీ యోగ్యతలు కనబడుతున్నాయి. విద్యార్థులకు విద్య పట్ల శ్రద్ధ పెరుగుతుంది. వ్యాపార విస్తరణకు అనుకూలంగా ఉంటుంది. ఈ రాశివారు ఈరోజు దగ్గర్లోని అమ్మవారి ఆలయాన్ని దర్శనం చేసుకోవాలి.

2) వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

2) వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

సృజనాత్మకత మరియు సాంకేతికతను కలిపే ప్రయోగాలు మీ ఆదాయాన్ని పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు కొత్త ఆలోచనలను స్వీకరిస్తున్నారు. కొత్త పనులకు సంబంధించిన ప్రయత్నం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీకు తెలియని కొత్త ప్రతిభను మీరు వెలికితీసే అవకాశం ఉంది. కష్టానికి తగిన ఫలితం వస్తుంది. అంతర్గత శత్రువులు ఇబ్బంది పెడతారు. ఆరోగ్యపరమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. స్త్రీలకు కుటుంబంలో వ్యతిరేకత పెరుగుతుంది. మీ మాటలు, ప్రవర్తన కుటుంబసభ్యులకు నచ్చకపోవచ్చు. జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగులకు ఉన్నతాధికారులతో ఇబ్బందులు ఉంటాయి. విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ తగ్గుతుంది. కంప్యూటర్, సెల్ ఫోన్లపై ఆసక్తి చూపి విద్యపై ఇంట్రస్ట్ ను తగ్గించుకుంటారు. వ్యాపారస్తులకు ఈరోజు మందకోడిగా ఉంటుంది. ప్రేమికులకు కూడా ఈరోజు అనుకూలంగా ఉండదు. ఈ రాశి వారు ఈరోజు దత్తాత్రేయ స్వామి వారిని లేదా దగ్గర్లోని శివాలయాన్ని సందర్శించుకోవాలి.

3) మిధున రాశి : మే 21 - జూన్ 20

3) మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈరోజు మీరు అసాధారణమైన కళారూపాలకు ఎక్కువగా ఆకర్షితులవుతారు. స్థానిక కళాకారుల ప్రదర్శనలు మీ దృష్టిని ఆకర్షిస్తాయి. లేదా మీరు ప్రత్యామ్నాయ సంగీతం పట్ల అభిరుచిని పెంచుకోవచ్చు. చాలా స్పెషల్ ఎఫెక్ట్స్ ఉన్న సినిమాలు మీకు నచ్చుతాయి. ఈ రంగాల్లో ఏదైనా కొత్తగా నేర్చుకోవడానికి ఈరోజు మంచి. అలాగే ఈ రోజు పెళ్లి కావాల్సిన వారికి సంబంధాలు సెట్ అవుతాయి. మీ జీవన విధానం అద్భుతంగా ఉంటుంది. గతంలో ఉన్న చెడు అలవాట్లను తగ్గించుకుని, మంచి అలవాట్లను పెంచుకుని కొత్త లైఫ్ స్టైల్ ను ప్రారంభిస్తారు. కోర్టు వ్యవహారాలు ఉన్న వారికి అనుకూలంగా కనబడుతుంది. స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది. భార్యభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఉద్యోగస్తులకు అనుకూలతలు కనబడుతున్నాయి. విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది. విద్యాపరంగా మంచి శ్రద్ధ చూపి విదేశీ విద్యపై ఆసక్తి చూపుతారు. ప్రేమికుల మధ్య అభిప్రాయభేదాలు తగ్గే అవకాశాలు కనబడుతున్నాయి. వ్యాపారాలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ రాశి వారు ఈరోజు వెంకటేశ్వరస్వామి లేదా విష్ణుమూర్తి ఆలయాన్ని సందర్శించాలి.

4) కర్కాటక రాశి : జూన్ 21 - జులై22

4) కర్కాటక రాశి : జూన్ 21 - జులై22

మీరు చాలా కాలంగా చూడని పాత స్నేహితుడు ఈరోజు మిమ్మల్ని చూడటానికి రావచ్చు. ఇది మీకు చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. అంతేకాదు ఆ వ్యక్తిని చూడటం మీకు ఆనందంగా కూడా అనిపిస్తుంది. మీరు ఈరోజు కొత్త పరికరాలను కొనుగోలు చేయవచ్చు. డబ్బులు వృథాగా ఖర్చవుతాయి. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు లేదా లాటరీలు తీయడం వల్ల ఇతర కారణాల వల్ల జరగొచ్చు.

స్త్రీలకు కూడా కొంత ఇబ్బందులు రావచ్చు. భార్యభర్తల మధ్య సరైన అవగాహన లేకపోవడం ఇందుకు కారణం కావచ్చు. ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ తగ్గుతుంది. ఉద్యోగస్తులకు ఆర్థిక ఇబ్బందులు వచ్చే అవకాశాలున్నాయి. పై అధికారులతోనూ సమస్యలు తప్పవు.

వ్యాపారస్తులకు పెద్దగా లాభాలుండవు. ఐటి పరమైన దాడులు కూడా ఉండొచ్చు. జాగ్రత్తగా ఉండండి.

ప్రేమికుల మధ్య అనుకోని సంఘటనలు జరిగి మనస్పర్దలు ఏర్పడొచ్చు. ఈ రాశి వారు ఈరోజు శివుడిని దర్శించుకోవాలి.

5) సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

5) సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

స్నేహితుడి నుండి ఊహించని ఆహ్వానం వస్తుంది. దీంతో మీరు ఒక చిన్న యాత్రకు వెళ్లొచ్చు. అందరినీ మీరు ఆకర్షించే ప్రయత్నం చేస్తారు. స్నేహితుల మధ్య మంచి సఖ్యత ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగానికి సంబంధించిన శుభవార్తను వింటారు. స్త్రీలకు కూడా ఈరోజు ఇంటా, బయట అనుకూలంగా ఉంటుంది. మీ మాటను అందరూ గౌరవిస్తారు. విద్యార్థులకు కూడా చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. అందరితోటి గౌరవంగా ఉంటారు. ఉద్యోగుస్తులకు ట్రాన్స్ ఫర్లు, పదోన్నతుల అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ప్రేమికుల మధ్య సఖ్యత, అన్యోన్యత ఉంటుంది. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామిని దర్శించుకోవాలి.

6) కన్యా రాశి ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

6) కన్యా రాశి ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

మీకు సంబంధించిన పురోగతి కోసం కొన్ని అసాధారణ అవకాశాలను మీరు చూడొచ్చు. ఇది కొంచెం భయపెట్టేలా ఉన్నా కానీ ఉత్తేజకరంగా ఉంటుంది. మీరు వాటిని పరిగణనలోని తీసుకునే వరకు మీకు ఎలాంటి అవకాశాలు లభించవు. ఆదాయం చేతికందినట్టే అంది మళ్లీ చేజారిపోతుంది. తొందరపాటు వల్ల కొంత నష్టం ఉంటుంది. దీంతో కొంచెం మనోధైర్యం తగ్గుతుంది. స్త్రీలకు రుతు సంబంధమైన రోగాలతో బాధపడే అవకాశాలున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ తగ్గుతుంది. తోటి స్నేహితులతో కలిసి సినిమాలకు తిరగడం, కాలక్షేపం చేయడం చేస్తారు. ఉద్యోగస్తులకు కూడా అనుకోని ఆటంకాలు ఏర్పడే అవకాశముంది. ప్రేమికుల మధ్య కొత్తగా ఎవరో వచ్చే అవకాశం కనబడుతోంది. బ్రేకప్స్ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. వ్యాపారస్తులకు ఎక్కువ నష్టాలు కనబడుతున్నాయి. గొడవలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారాలు మందకోడిగా ఉంటాయి.

ఈ రోజు ఈ రాశి వారు దుర్గమ్మ, లేదా లక్ష్మీదేవి లేదా దగ్గర్లోని గ్రామదేవత దర్శనం చేసుకోవాలి.

7) తులా రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

7) తులా రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈరోజు మీరు ఎన్నడూ చూడని ప్రదేశానికి సుదీర్ఘ ప్రయాణం కోసం ప్లాన్ చేయొచ్చు. బహుశా ప్రేమికుడు లేదా సన్నిహితుడితో కలిసి ఏర్పాట్లు చేయడంతో ఉత్సాహం మిమ్మల్ని దగ్గర చేస్తుంది. ఈరోజు మీరు పట్టిందల్లా బంగారమయ్యే అవకాశముంది. కోర్టు వ్యవహారాలు ఉన్న వారికి విజయం లభిస్తుంది. స్త్రీలకు గౌరవం లభిస్తుంది. కుటుంబంలో అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు. విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. మంచి మార్కులు సంపాదించుకునే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. పర్మినెంట్ కాని వారికి పర్మినెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు అద్భుతమైన లాభాలు వచ్చే అవకాశాలున్నాయి. ప్రేమికుల మధ్య సఖ్యత కనబడుతోంది. విడిపోయిన ప్రేమికులు కూడా కలిసే అవకాశాలున్నాయి. ఇద్దరు కలిసి ఎక్కడికైనా ప్రయాణించే అవకాశం కూడా కనబడుతోంది. ఈరోజు ఈ రాశి వారు దగ్గర్లోని వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి.

8) వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

8) వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈరోజు మీకు మానసిక మరియు భావోద్వేగ సమస్యలు ఎదుర్కోవచ్చు. ఈరోజు మీకంటే చిన్నవారితో గొడవలు పడే అవకాశాలున్నాయి. కోర్టు వ్యవహారాల్లో అపజయాలు, లేదా వాయిదా పడే అవకాశాలున్నాయి. ఈరోజు స్త్రీలకు ఆనందం లేకుండా పోతుంది. లేని పోని అపనిందలు ఎదుర్కోవాల్సి వస్తుంది. విచారంగా ఉంటారు. విద్యార్థులకు కూడా పోటీ పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు కూడా కొంత ఇబ్బందులొస్తాయి. సమయానికి ఆహారం తీసుకోలేని పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. ప్రేమికుల మధ్య మాట పట్టింపులు పెరిగి అవకాశాలున్నాయి. ఇవి విడిపోవడానికి దారి తీయవచ్చు. వ్యాపారస్తులకు కూడా మందకోడిగా ఉంటుంది. ఈ రాశి వారు ఈరోజు గాయత్రి మాత ఆలయాన్ని లేదా అమ్మవారి దర్శనం చేసుకోవాలి.

9) ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

9) ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈరోజు మీకు ప్రతి విషయంలో పై చేయిగా ఉంటుంది. విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకుంటే అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యంలో జాగ్రత్తలు పాటిస్తారు. సమాయానికి డబ్బు చేతికి అందుతుంది. ఈరోజు మీరు మొదటి చూపులోనే ప్రేమలో పడొచ్చు. ప్రేమికులు కొత్త కొత్త ప్రదేశాలు తిరుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. స్త్రీలల్లో కూడా మిమ్మల్ని ఇష్టపడే వారు పెరుగుతారు. కుటుంబంలో ఉండే పెద్దలు కూడా మీరు గౌరవిస్తారు. విద్యార్థులకు అద్భుతమైన విజయం లభిస్తుంది. ఉద్యోగులను కూడా పై అధికారులు బాగా మెచ్చుకుంటారు. వ్యాపారస్తులకు కూడా వ్యాపారాల్లో లాభాలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు దగ్గర్లోని సుబ్రమణ్యేశ్వర స్వామిని దర్శించుకోవాలి.

10) మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

10) మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి వారు ఈరోజు మంచితనంతో అందరినీ ఆకట్టుకుంటారు. కానీ మీ మంచితనం వల్ల మీకే ఇబ్బందులు వచ్చే అవకాశాలున్నాయి. ఏదైనా అద్భుతం చేయాలని ప్రయత్నించినా అది చివర్లో విఫలం కావచ్చు. నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేస్తారు. స్త్రీలకు ఇంట్లో ఏదో చికాకుగా ఉంటుంది. కుటుంబంలో తగాదాలు వచ్చే అవకాశాలున్నాయి. మిమ్మల్ని అనుమా

విద్యార్థులకు చదువుపై శ్రద్ధ తగ్గుతుంది. అనసవరంగా కాలక్షేపం చేస్తారు. ఆరోగ్యం కూడా పాడయ్యే అవకాశముంది. ఉద్యోగస్తులకు ఆర్థిక పరంగా ఇబ్బందులున్నాయి. ఆదాయానికి మించి ఖర్చులు ఎక్కువయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి. వ్యాపారస్తులకు అంతగా లాభాలు ఉండవు. ప్రేమికులకు కూడా ఈరోజు పెద్దగా విశేషంగా లేదని చెప్పొచ్చు. ఈరోజు ఇద్దరు కలవాలనుకున్నా, ఇద్దరు కలవలేని పరిస్థితి. ఈ రాశి వారు ఈరోజు అమ్మవారి ఆలయాన్ని లేదా గణపతి ఆలయాన్ని దర్శించుకోవాలి.

11) కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

11) కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

విహారయాత్రను ప్లాన్ చేయడానికి ఇది ఒక గొప్ప రోజు అవుతుంది. ఈరోజు మీరు అందరినీ ఆకట్టుకుంటారు. బంధు, మిత్రులతో అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తారు. కోర్టు వ్యవహారంలో అనుకూలంగా ఉంటుంది. స్త్రీలకు ఇంట్లో అనుకూలతలు కనబడుతున్నాయి. ఇరుగు పొరుగువారితో సఖ్యత ఉంటుంది. వ్యాపారస్తులకు అద్భుతమైన లాభాలు కనిపిస్తున్నాయి. ప్రేమికుల మధ్య సఖ్యత ఉంటుంది. వివాహం పట్ల కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రాశి వారు ఈరోజు శివాలయాన్ని దర్శించుకోవాలి.

12) మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

12) మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీరు ఊహించని సందర్శకులు మీ తలుపును తట్టవచ్చు. వ్యాపారులకు మందకోడిగా ఉంటుంది.

ఉద్యోగులకు ప్రతి విషయంలో ఆటంకాలు ఏర్పడతాయి. రావాల్సిన డబ్బులు చేతికొచ్చేనట్టే వచ్చి చివర్లో చేజారతాయి. మొండి బకాయిల వేధింపులు ఇబ్బందిపెడతాయి. విద్యార్థులకు ఏకాగ్రత తగ్గుతుంది. ఉద్యోగస్తులకు సంతకానికి సంబంధించిన ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్త్రీలకు కూడా ఈరోజు పెద్దగా విశేషంగా లేదు. ప్రేమికుల మధ్య అవగాహన రాహిత్యం వల్ల బ్రేకప్స్ జరిగే అవకాశాలున్నాయి. ఈ రాశి ఈరోజు గణపతి ఆలయాన్ని దర్శించుకోవాలి.

Read more about: astrology horoscope zodiac signs
English summary

Daily Horoscope September 30, 2019

Which signs are better if they postpone things? Do job efforts result? Can students excel in education? Is it convenient to express love? Travels & Travels Overseas Is it better to postpone? Investing in Business or Not? Read the full details of today's Bold Sky offerings in order to get a detailed look at the legal, court proceedings, property disputes, fortune teller, fortune teller, fate.
Story first published: Monday, September 30, 2019, 12:30 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more