For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దిన ఫలాలు: సోమవారం మీ రాశిఫలాలు (09-09-2019)

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాల మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీవికారినామ సంవత్సరం, భాద్రపదమాసం, ఏకాదశి సోమవారం రోజున ఏఏ రాశుల వారికి ఏవిషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏ రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏ రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope September 9, 2019 In Telugu

ఏ రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రానించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టవచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేషం:

మేషం:

మీరు ఆర్థిక పరంగా అనిశ్చితులను ఎదుర్కొంటారు. మీ భాగస్వామి సహాయంతో మీ బడ్జెట్‌ను బ్యాలెన్స్ చేస్తారు. మీరు వ్యక్తిగత విషయాల్లోఒక పెద్ద సమస్యను ఎదుర్కొంటారు, ఈ రోజు ఒక మలుపు తిరగబోతుంది. మీ జీవిత భాగస్వామితో అవగాహన లేకపోవడం మీ ఇద్దరికీ అసౌకర్యాన్ని కలిగిస్తుంది, కాని ఇద్దరు మాట్లాడు కోవడం వల్ల త్వరలో సాధారణ స్థితికి వస్తుంది. తల్లిదండ్రులకు చాలా కాలం తర్వాత మానసిక శాంతి ఉంటుంది అందువల్ల ఈ దశను ఆనందిస్తారు. మీ ప్రియమైనవారితో ఈరోజు మీకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది. సుదూర సంబంధంలో ఉన్నవారు చివరకు ఒకరితో ఒకరు గడపడానికి సమయం పొందుతారు. ఉద్యోగంలో పనిని ఆలస్యం చేయకుండా ఉండండి, లేదంటే తరువాత వాదనకు దారితీస్తుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది, కానీ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

లక్కీ కలర్: క్రీమ్

అదృష్ట సంఖ్య: 22

అదృష్ట సమయం: ఉదయం 4:15 నుండి మధ్యాహ్నం 12:45 వరకు

వృషభం:

వృషభం:

మీ పని పూర్తి చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు. కార్పొరేట్ లో పనిచేసే వారు మీ వద్ద తియ్యగా మాట్లాడే వారికి దూరంగా ఉండటం మంచిది వ్యాపారస్తులకు లాభదాయకమైన రోజు. రాభోయే రోజుల్లో వ్యాపారంలో మెరుగుదలను ఆశించవచ్చు. కుటుంబంతో ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేసుకుంటారు. ఆర్థికపరంగా అనుకూలమైన రోజు. కుటుంబంలో విషయాలు సున్నితంగా ఉంటాయి మరియు మీ జీవిత భాగస్వామితో సంబంధం వృద్ధి చెందుతుంది- అందమైన అనుభవంగా మారుతుంది. నిర్ణయం తీసుకోవడానికి ఇది అనుకూలమైన రోజు- కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకోండి. పిల్లలు తమ విజయాన్ని స్నేహితులతో సెలబ్రేట్ చేసుకుంటారు.

లక్కీ కలర్: ఆరెంజ్

అదృష్ట సంఖ్య: 15

అదృష్ట సమయం: సాయంత్రం 5:00 నుండి రాత్రి 10:00 వరకు

మిథునం:

మిథునం:

మొత్తంగా ఈరోజు మీకు అనుకూలమైన రోజుగా భావిస్తారు. మీరు కుటుంబంలో ఒకరితో ఒకరు నాణ్యమైన సమయాన్ని గడపడం వలన ఈరోజు కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం కనబడుతుంది. మీరందరూ అభివృద్ధి చెందుతుండటం వల్ల తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారు. మీ తోబుట్టువులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలని పట్టుబట్టవచ్చు. సన్నిహితుడు / బంధువు ఆర్థిక సహాయం కోరతారు. మీ భాగస్వామి సహాయంతో ఇంటి పునరుద్ధరణ కోసం మీరు ప్లాన్ చేయవచ్చు. ఈ రోజు మీ పనిలో పూర్తిగా నిమగ్నం అవుతారు. మీ రోజు- అన్ని విషయాలలో మీ యజమాని మీకు సపోర్ట్ గా ఉంటారు. వ్యాపారవేత్తలకు సాధారణ రోజు ఉంటుంది. మీరు కుటుంబంలో అవసరమైన డిమాండ్లను నెరవేరుస్తారు, ఇది గౌరవప్రదంగా ఉంటుంది.

లక్కీ కలర్: వైట్

అదృష్ట సంఖ్య: 12

అదృష్ట సమయం: ఉదయం 11:00 నుండి రాత్రి 8:00 వరకు

కర్కాటకం:

కర్కాటకం:

ఈరోజు పనిలో బిజీగా ఉంటారు. ముఖ్యంగా మీటింగ్స్ మరియు ప్రయాణాలతో బిజీగా గడుపుతారు. రోజు చివరలో అలసట చెందడం మీకు సాధారణమే. శారీరక మరియు మానసిక శ్రమ రోజులో ఒక భాగం అవుతుంది. ఫ్యామిలీ విషయాలు అసమతుల్యతతో ఉంటాయి. వీలైనంత త్వరగా ఒక చెడు సంబంధాల నుండి బయటపడటానికి ప్రయత్నించండి. మీరు చదివే అలవాటును పెంచుకోవాలి, అది ఉపయోగకరంగా ఉంటుంది. విద్యార్థులు చదువుల్లో బిజీగా ఉంటారు. మీ అజాగ్రత్త వైఖరిని మీ భాగస్వామి అంగీకరించరు, అందువల్ల మీరు దాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నించాలి. వ్యాపారవేత్తలు భారీ లాభం పొందుతారు. ఆరోగ్యం మెరుగుపడటం ప్రయోజనకరంగా ఉంటుంది.

లక్కీ కలర్: పర్పుల్

అదృష్ట సంఖ్య: 30

అదృష్ట సమయం: మధ్యాహ్నం 2:45 నుండి 7:05 వరకు

సింహం:

సింహం:

ఈ రోజు ఆర్థికపరంగా అస్థిరంగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఊహించినదానికంటే విరుద్దంగా ఉంటుంది. అకస్మాత్ గా ఖర్చులు పెరగడం వల్ల కుటుంబంలో ఆందోళన కలిగిస్తుంది. మీరు సన్నిహితుడు / బంధువు నుండి ఆర్థిక సహాయం కోరవచ్చు. పనిచేసే ప్రదేశంలో మీ కృషి ప్రశంసించబడుతుంది మరియు వ్యక్తులు మీ మార్గదర్శకత్వం కోరుకుంటారు. వ్యాపారవేత్తలు వారి పనికి సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు, ఇది వారి భవిష్యత్తుకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రోజు ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేసుకోవడం వల్ల రిఫ్రెష్ అవుతారు. మీ తల్లిదండ్రులను ఆశ్చర్యపరిచేందుకు మీరు ఒక చిన్నట్రిప్ ను ప్లాన్ చేయవచ్చు. విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి కాబట్టి మీరు రోజంతా ఉత్సహాంగా గడపడానికి తగిన మార్గాన్ని కనుగొనాలి. ఏదైనా క్రీడల అలవాటును ఎంచుకోండి, ఎందుకంటే ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా మరియు బిజీగా ఉంచుతుంది.

లక్కీ కలర్: బ్లూ

అదృష్ట సంఖ్య: 5

అదృష్ట సమయం: సాయంత్రం 5: 00 నుండి 9:00 వరకు

కన్య:

కన్య:

మీ సహచరులు మీ సాధనకు అసూయపడతారు కాబట్టి మీరు కార్యాలయంలో చర్చలో భాగం కావచ్చు. మీరు ఉద్యోగంలో పదోన్నతి పొందే అవకాశం ఉంది. అందువల్ల జీతం కూడా పెరిగే అవకాశం ఉంది. మీరు ఈ రోజును మీ సన్నిహితులు / బంధువులతో గడుపుతారు. ఆరోగ్యం విషయంలో మీకు కొంచెం నలతగా అనిపించవచ్చు, కానీ మీ బలమైన సంకల్పం శక్తిని మెరుగుపరుస్తుంది. మీ ఓర్పు మరింత కష్టపడి పనిచేయడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. చదువులో మీ అసాధారణ పనితీరు మీ తల్లిదండ్రులకు గర్వంగా అనిపిస్తుంది. మీ ప్రియమైనవారి కోసం ముఖ్యమైన తేదీలను మీరు నిర్ణయిస్తున్నందున మీ సంబంధాన్ని పదిలం చేసుకోవడానికి మీకు గొప్ప అవకాశాలు ఉంటాయి. మీరు ఊహించని నిబద్ధత మీ తలుపు తట్టవచ్చు తల్లిదండ్రుల ఆరోగ్యంలో మెరుగుదలతో రిలాక్స్ అవుతారు.

లక్కీ కలర్: పింక్

అదృష్ట సంఖ్య: 4

అదృష్ట సమయం: ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:30 వరకు

తుల

తుల

ఈ రోజు మీకు అత్యంత శ్రావ్యమైన మరియు సౌకర్యవంతమైన రోజు. తెల్లవారుజామున శుభవార్త వినవచ్చు. మీ రోజును మరింత సంతోషంగా మరియు ప్రకాశవంతంగా చేస్తుంది. కొన్ని విషయాల్లో మీరు ఓపికగా, ప్రశాంతంగా ఉండాలి. మీరు అనుభవజ్ఞులైన వ్యక్తుల నుండి సలహా మరియు సహకారం కోరితే మంచిది. మీరు కెరీర్ రంగంలో కొంత మార్పును పొందుతారు. భగవంతుని ఆశీర్వాదంతో, కుటుంబ పరిస్థితి తేలికయ్యే మార్గంలో ఉంది. మీ కృషిని తల్లిదండ్రులు అభినందిస్తారు. మీ ఆర్థిక స్థితి కొంచెం మెరుగ్గా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మీరు మంచి పనిని కనుగొంటారు. మీ కుటుంబ వ్యాపారాల్లో మీలో ఒకరు చూసుకోవాల్సి ఉంటుంది. పిల్లల ఆరోగ్యంలో సానుకూల మెరుగుదల జ్వరం మరియు జలుబు కొద్దిగా ముందు జాగ్రత్తతో తీసుకోవాలి.

అదృష్ట రంగు: బ్లడ్ రెడ్

అదృష్ట సంఖ్య: 28

అదృష్ట సమయం: ఉదయం 10:00 నుండి సాయంత్రం 4:00 వరకు.

వృశ్చికం

వృశ్చికం

వివాహిత జంట సెలవులకు వెళ్ళే అవకాశం ఎక్కువ. విహారయాత్రతో సౌకర్యవంతంగా ఉండండి. కుటుంబంతో ఎక్కువ సమయం గడపడం వల్ల మీకు కొంత విశ్రాంతి లభిస్తుంది. మంచి వివాహ ప్రతిపాదన మీకు సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. జీవిత భాగస్వామితో దూర ప్రాంతానికి వెళ్లడం మానసిక స్థితిని ఆనందంగా చేస్తుంది. మీ జీవిత భాగస్వామితో మీ భావాలను పంచుకోవడం జీవితాన్ని అందంగా చేస్తుంది. మీ జీవిత భాగస్వామికి ఉన్న అవగాహన గురించి గర్వపడేలా చేస్తుంది. చాలా కాలం తరువాత మీరు తల్లిదండ్రుల ఆరోగ్యంలో మెరుగుదల పొందుతారు. మీరు విధేయత మరియు కృషిని చూపిస్తే, జీవితం ప్రకాశవంతంగా ప్రకాశిస్తుంది. వ్యక్తులు మీ ప్రవర్త మరియు మర్యాదలతో మిమ్మల్ని పొడగడ్తలతో ముంచెత్తుతారు. మీరు చట్టపరమైన విషయాలలో గెలుస్తారు. మీ ప్రియమైనవారితో సమయం గడపడానికి మంచి రోజు.

లక్కీ కలర్: ఊదారంగు

అదృష్ట సంఖ్య: 16

అదృష్ట సమయం: మధ్యాహ్నం 12:30 నుండి 6:00 వరకు.

ధనుస్సు

ధనుస్సు

మీ సానుకూల ప్రవర్తన ఆకర్షణీయంగా ఉంటుంది. కొంత మంది వ్యక్తులు మిమ్మల్ని అనుసరిస్తారు మరియు సన్నిహితంగా ఉండాలని కోరుకుంటారు. మీ అనుభవం కారణంగా, సహచరులు మీ కింద పనిచేయాలని కోరుకుంటారు. అగ్రస్థానంలో ఉన్న వ్యక్తులతో ఒక చిన్నఊహించని సంఘర్షణ కెరీర్ రంగంలో కొంత మార్పును కలిగిస్తుంది. కుటుంబ జీవితంలో కొన్ని అంశాలు మీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఇంకా మీరు పరిస్థితులను అనుభవపూర్వకంగా నిర్వహిస్తారు. కొత్త ఉపాధి మిమ్మల్ని ఆకర్షించవచ్చు. మీరు ఆర్థిక పరంగా ప్రయోజనాన్ని పొందుతారు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి.

లక్కీ కలర్ పసుపు

అదృష్ట సంఖ్య: 29

అదృష్ట సమయం: ఉదయం 8:00 నుండి మధ్యాహ్నం 2:30 వరకు.

మకరం

మకరం

కెరీర్ రంగంలో చాలా పని ఒత్తిడి మిమ్మల్ని ప్రభావితం చేస్తున్నందున ఈ రోజు మీకు ఒత్తిడితో కూడిన రోజు. మీ పనిని వాయిదా వేయడానికి ప్రయత్నించవద్దు. మీ కార్యాలయంలో మీరు పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరిస్తారు. పని పట్ల ఉదాసీనంగా ఉండటం మీకు హాని కలిగిస్తుంది. జీవితాన్ని మెరుగుపర్చడానికి వేరే ఉద్యోగం కనుగొనే అవకాశాలు ఉన్నాయి. మీరు కొన్ని విషయాల్లో తీసుకునే విలువైన సమయం కూడా విజయం సాధించలేకపోవచ్చు. మిమ్మల్ని మీరు గౌరవించడం నేర్చుకోండి. జీవిత భాగస్వామితో కొంత విభేదాలు ఏర్పడవచ్చు.సాయంత్రానికి పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంటుంది. సంబంధాల ప్రాముఖ్యతను మీరు గ్రహిస్తారు. మీరు కుటుంబ బాధ్యతలను సరిగ్గా ఆనందంగా నిర్వహిస్తారు. ఈ రోజు పారిశ్రామికవేత్తలకు సాధారణ రోజు. మీరు పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనం పొందుతారు. కాబట్టి ఈ రోజు ఆర్థిక విషయాల విషయానికి వస్తే మీకు చాలా లాభదాయకమైన రోజు.

లక్కీ కలర్: నీలం

అదృష్ట సంఖ్య: 26

అదృష్ట సమయం: మధ్యాహ్నం 2:00 నుండి 4:30 వరకు

కుంభం

కుంభం

ఈ రోజు మీకు అత్యంత లాభదాయకమైన రోజు. కెరీర్ పరంగా చాలా గందరగోళం ఉంటుంది. ఎటువంటి విషయాల్లోనూ నిరాశ చెందకండి. సహోద్యోగులతో మీ ప్రవర్తన ఆందోళనకు ప్రధాన కారణం. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలు మీకు భారంగా మారుతాయి. మీ స్నేహితులు లేదా బంధువులు మిమ్మల్ని విరామసమయానికి తీసుకువెళతారు. ఇది మీ మనస్సును చైతన్యం నింపుతుంది. వ్యక్తిగత జీవితం చాలా అందంగా ఉంది. కుటుంబ నిబద్ధత మిమ్మల్ని బిజీగా ఉంచుతుంది. వైద్య విద్యార్థులు తమ చదువులో బాగా రాణిస్తారు. ఆరోగ్యంగా ఉండాలంటే ఆయిల్ ఫుడ్స్ కు దూరంగా ఉండండి.

లక్కీ కలర్: తెలుపు

అదృష్ట సంఖ్య: 18

అదృష్ట సమయం: సాయంత్రం 5:00 - రాత్రి 9:00.

మీనం

మీనం

ఉదయం బద్దకంతో రోజు ప్రారంభమవుతుంది. మీ రోజు నెమ్మదిగా సాగుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా లేదు. కాబట్టి కొంత సమస్య ఉంది. మీ తల్లిదండ్రులకు ఆనందాన్ని కోరుకుంటారు. వారు ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కోరుకుంటారు. మీరు మీ స్నేహితులతో మాట్లాడాలని మరియు వారితో కొంత సమయం గడపాలని కోరుకుంటారు. మీ భాగస్వామి కుటుంబం కోసం చేసే పని మరియు కృషి గురించి తెలుసుకోండి. వ్యాపారానికి కొత్తగా ఉన్నవారు కొన్ని నిబంధనలను అర్థం చేసుకోవడానికి చాలా కష్టం అవుతుంది. మీ ప్రియమైన వారు దూరంలో ఉన్నా సంబంధాలను కొనసాగిస్తారు, మీకు అసురక్షితంగా అనిపిస్తుంది. మీ క్రీడా నైపుణ్యం మీకు అదృష్టం తెస్తుంది.

లక్కీ కలర్: లేత గోధుమరంగు

అదృష్ట సంఖ్య: 18

అదృష్ట సమయం: సాయంత్రం 5:00 - రాత్రి 9:00.

English summary

Daily Horoscope September 9, 2019 In Telugu

Horoscope is an astrological chart or diagram representing the positions of the Sun, Moon, planets, astrological aspects and sensitive angles at the time of an event, such as the moment of a person's birth. The word horoscope is derived from Greek words "wpa" and scopos meaning "time" and "observer".
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more