For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దీపావళికి ముందు ఈ పనులను అస్సలు చేయకండి.. ఎందుకంటే..

ఇదే సందర్భంలో దీపావళి సందర్భంగా మీరు కొన్ని పనులను అస్సలు చేయకూడదు. అలా చేస్తే వాటిని లక్ష్మీదేవి అపవిత్రంగా భావిస్తుంది.

|

దీపావళి అంటే అందరికీ గుర్తొచ్చేది టపాసుల పండుగ అని. ఈ పండుగను చిన్నపిల్లల నుండి పెద్దవారి దాకా చాలా ఇష్టపడతారు. ఈ పండుగను మన దేశంలో చాలా మంది ఘనంగా జరుపుకునే పండుగ. ఈ పండుగ ద్వారా ప్రతి ఒక్కరూ తమ జీవితంలో చీకట్లు తొలగిపోయి కాంతుల వలె వెలిగిపోవాలని ఆశిస్తుంటారు.

Dont do these things during the Diwali week

అంతేకాదు ఈ పండుగను లక్ష్మీదేవిని ఆహ్వానించే పండుగ అని కూడా అంటారు. ఈ పండుగకు లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తే ఇంటిల్లి పాది అందరూ సుఖంగా, సంతోషంగా ఉంటారని చాలా మంది భక్తులు నమ్ముతారు. కానీ ఇందుకు దీపావళి సందర్భంగా మీరు సరైన పనులు చేస్తే మీ జీవితంలో ఆనందం అనేది వస్తుంది. ఇదే సందర్భంలో దీపావళి సందర్భంగా మీరు కొన్ని పనులను అస్సలు చేయకూడదు. అలా చేస్తే వాటిని లక్ష్మీదేవి అపవిత్రంగా భావిస్తుంది. ఇంతకీ దీపావళికి చేయకూడని పనులేంటో తెలుసుకోవాలంటే కిందికి పూర్తిగా స్క్రోల్ చేయండి.

1) ఆలస్యంగా నిద్ర లేవకూడదు..

1) ఆలస్యంగా నిద్ర లేవకూడదు..

దీపావళి పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ విధిగా ఉదయాన్నే లేవాలి. ఉదయం అంటే ఏ ఏడు లేదా ఎనిమిది లేదా తొమ్మిది గంటలకు అనుకుంటే పొరపాటే. ఉదయం అంటే సూర్యుడు ఉదయించక ముందే ప్రతి ఒక్కరూ నిద్ర లేవాలి. అప్పుడే మీకు లక్ష్మీదేవి కరుణ చూపుతుంది. అలా కాకుండా ఆ పండుగ రోజు కూడా ఎక్కువ సేపు నిద్రపోతే లక్ష్మీ దేవి అనుగ్రహం మీకు కచ్చితంగా కలగదు అని పురాణాలలో చెప్పబడింది. ఇదే విషయాన్ని చాలా మంది భక్తులు నమ్ముతారు.

2) శుభ్రత చాలా ముఖ్యం..

2) శుభ్రత చాలా ముఖ్యం..

దీపావళి పండుగ సందర్భంగా మీ ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అంత మంచిది. ఎందుకంటే లక్ష్మీదేవి శుచి, శుభ్రత, పరిశుభ్రత అంటే చాలా ఇష్టం. అందుకనే మీ ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకునేందుకు ప్రయత్నించండి. ముఖ్యంగా మీ ఇంట్లో పాత వస్తువులు మరియు బూజు వంటి ప్రాంతాలు లేకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి వాటిని తొలగించుకోవాలి. అంతే కాదు మీ ఇంట్లో మంచి సువాసన వచ్చేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకు గాను మంచి అగర్ బత్తిలు అంటించాలి. దీని వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని పురాణాల్లో పేర్కొనబడింది.

3) కోపాన్ని కంట్రోల్ చేసుకోండి..

3) కోపాన్ని కంట్రోల్ చేసుకోండి..

దీపావళి పండుగ రోజు అనవసరంగా కోపం పడటం, ఎవరినైనా అరవడం చాలా తప్పుగా పురాణాల్లో చెప్పబడింది. అంతేకాదు ఇది చాలా అపవిత్రమైనది. అందుకే దీపావళి పండుగ సందర్భంగా మీ మానసిక స్థితిని ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమతో చూసుకోవడం మీకు, మీ కుటుంబానికి, మీ శ్రేయోభిలాషులకు, బంధుమిత్రులకు చాలా మంచిది. అంతే కాని ఎట్టి పరిస్థితుల్లోనూ కోపం పడవద్దు. ఒకవేళ అలా కాదని మీరు కోపం పడితే మీకే తీవ్ర నష్టం జరుగుతుంది. మీరే అందరిలోనూ చులకన అయ్యే అవకాశం కూడా ఉంది. అందుకే ప్రశాంతంగా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోండి.

4) సానుకూల వాతావరణం..

4) సానుకూల వాతావరణం..

దీపావళి పండుగ సందర్భంగా మీ ఇంట్లోని కుటుంబ సభ్యులతో మరియు స్నేహితులతో సానుకూల వాతావరణం ఉండేలా చూసుకోండి. అంతేకాదు మీ చుట్టుపక్కల కూడా ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూసుకోండి. అప్పుడే ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారు. అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంటి ఆహ్వానాన్ని మన్నించి వస్తుంది. అలా కాకుండా మీరు దీపావళి పండుగ నాడు మీ స్నేహితులతోనూ, మీ కుటుంబ సభ్యులతోనో లేదా మీ చుట్టు పక్కల వారితోనో గొడవ పడితే అప్పుడు ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. అది లక్ష్మీదేవికి కోపం తెప్పిస్తుంది. మీ ఇంటికి రావడానికి నిరాకరిస్తుంది. దీని వల్ల మీరే నష్టపోవాల్సి వస్తుంది. అందుకే సాధ్యమైనంత వరకు శాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి.

5) ధూమపానం లేదా మద్యపానం చేయొద్దు..

5) ధూమపానం లేదా మద్యపానం చేయొద్దు..

దీపావళి సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ధూమపానం లేదా మద్యపానం చేయకూడదు. అలాంటి అలవాటు ఉన్న వారు ఈ పండుగ సమయంలో వీటి జోలికి వెళ్లకపోవడం చాలా మంచిది. ఎందుకంటే లక్ష్మీదేవికి ఇవి చాలా చికాకు కలిగిస్తాయి. అంతేకాదు లక్ష్మీదేవి మీకు శాపం కూడా ఇస్తుందని పురాణాలలో పేర్కొనబడింది. అందుకే ధూమపానం లేదా మద్యపానం అలవాట్లు ఉండే వారు ఈ పండుగ సమయంలో వీటి గురించి ఆలోచించడం మానేయండి. ఆధ్యాత్మిక చింతనతో ఉండండి. అప్పుడే మీకు ఆనందం అనేది కలుగుతుంది.

6) ఎవ్వరినీ అవమానించొద్దు..

6) ఎవ్వరినీ అవమానించొద్దు..

దీపావళి పండుగ సమయంలో ఎవ్వరినీ అవమానానికి గురి చేయకండి. ముఖ్యంగా మీ కంటే వయసులో పెద్దవారిని అస్సలు ఇబ్బంది పెట్టకండి. వారిని పూర్తిగా గౌరవించండి. వారితో పాటు మీ కుటుంబ సభ్యులను కూడా గౌరవించండి. టపాసులు కాల్చే చిన్న పిల్లలకు సలహాలు, సూచనలు ఇవ్వండి. దీపావళి పండుగ విశిష్టత గురించి చెప్పండి. జాగ్రత్తలు పాటించమని చెప్పండి. ముఖ్యంగా టపాసులు కాల్చే సమయంలో అప్రమత్తంగా ఉండేలా చూడండి. ఇలా వారందరికీ మంచి సహాయం చేయటానికి ప్రయత్నించండి. ఒకవేళ అది వీలు కాకపోయినా వారికి మాత్రం ఎలాంటి ఇబ్బంది కలిగించకండి. దీని వల్ల లక్ష్మీదేవి మిమ్మల్ని కరుణిస్తుంది.

English summary

Don't do these things during the Diwali week

Here are few things that are considered inauspicious which you should not do during diwali week
Desktop Bottom Promotion