For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనా దెబ్బకు రంజాన్ కోలహాలాన్నీ కోల్పోతున్న హైదరాబాద్... మొట్టమొదటిసారి హలీమ్ లేనట్టే?

|

రంజాన్ (Ramadan) అనే పేరు వినగానే ప్రతి ఒక్కరికీ గుర్తుకొచ్చేది హైదరాబాదీ హలీమ్. మన దేశంలో ఈ హలీమ్ అనే వంటకం మనకు ఎక్కువగా రంజాన్ సీజన్ లోనే ఎక్కువగా కనిపిస్తుంది. అయితే రంజాన్ ఉపవాస దీక్షల సమయంలో హైదరాబాద్ నగరంతో పాటు విజయవాడ, గుంటూరు వంటి నగరాల్లో మనకు లభించే ప్రత్యేక వంటకాల్లో ఇది కేవలం ఒక వంటకం మాత్రమే.

ఈ పండుగ సందర్భంగా ఇదొక్కటే ప్రత్యేకమైన పండుగ అనుకుంటే మీరు పొరబడినట్లే. ఎందుకంటే ఛార్మినార్ పరిసర ప్రాంతాల్లో రంజాన్ సీజన్ లో లభ్యమయ్యే ప్రత్యేక వంటకాలు చాలానే ఉన్నాయి. అలాంటి వంటకాల్లో సెహ్రీ(Sehri)తో పాటు ఇంకా ఎన్నో ఉన్నాయి. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా హైదరాబాద్ నగర వీధుల్లో రంజాన్ కోలాహాలం అంతా కోల్పోయే పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. చరిత్రలో ఇంతవరకు ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదని, మొట్టమొదటిసారి హైదరాబాద్ నగరంలో హలీమ్ తయారీ పరిస్థితులు కనిపించడం లేదు.

కరోనా మహమ్మారి రంజాన్ మాసం యొక్క కళను కప్పి వేస్తోంది. లాక్ డౌన్ కారణంగా నగరంలో ఎలాంటి దుకాణాలు తెరచుకునే పరిస్థితి లేదు. అంతేకాదు మసీదులలో ఇఫ్తార్ విందులు, సమ్మేళనాల వంటి పరిస్థితి కూడా కనిపించడం లేదు. రంజాన్ అంటే చాలా మందికి హలీమ్ గురించే అందరికీ తెలుసు. అయితే దీంతో పాటు మనం అనేక రకాల ప్రత్యేక వంటకాలను మిస్సవుతున్నాం. అవేంటో మీరే చూడండి...

భేజా ఫ్రై లేనట్టే..

భేజా ఫ్రై లేనట్టే..

హైదరాబాద్ లో హలీమ్ తో పాటు మరికొన్ని ప్రత్యేక వంటలు రంజాన్ సమయంలో ప్రతి ఏడాది భోజన ప్రియులను నోరూరిస్తుండేది. వాటిలో భేజా ఫ్రై వంటకం ఒకటి అని చెప్పాలి. మేక లేదా గొర్రె ‘మెదడు‘తో తయారు చేసే వంటకమే ఈ భేజా ఫ్రై. ఈ వంటకాన్ని ప్రధానంగా తెల్లవారుజామున 3 నుండి 4.30 గంటల సమయంలో హోటళ్లలో వడ్డించేవారట. అయితే ఇవన్నీ ప్రస్తుతం కరోనా కారణంగా మాయమైనట్టే.

‘పాయా‘ మసాలా

‘పాయా‘ మసాలా

పాయా అంటే హిందీ మరియు ఉర్దూలో ఎముకలు అని అర్థం. దీన్ని కూడా మేక లేదా గొర్రె ఎముకలతో చేసే ఈ వంటకానికి అభిమానులు పెద్దఎత్తునే ఉంటారు. ఈ ప్రత్యేకమైన వంటకం కోసం భోజన ప్రియులు క్యూ కడుతూ ఉంటారు. ముఖ్యంగా ఎముకలు విరిగిన సమయంలో.. దీనిని ఆహారంగా తీసుకుంటే త్వరగా కోలుకునే అవకాశం ఉంటుందని చెబుతుంటారు. కోవిద్-19 కారణంగా ఇవన్నీ కనుమరయ్యే పరిస్థితి ఏర్పడింది.

లాక్ డౌన్ పొడిగించంతో..

లాక్ డౌన్ పొడిగించంతో..

కరోనా వైరస్ రోజురోజుకు పెరుగుతూ ఉండటంతో తెలంగాణ సీఎం కేసీఆర్ ఏకంగా మే 7వ తేదీ వరకు లాక్ డౌన్ పొడిగించిన సంగతి తెలిసిందే. చరిత్రలో ఇలాంటి మినార్ల కాలం నాటి ముత్యాల నగరంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా రంజాన్ కోలాహాలన్నీ కోల్పోతుంది.

మసీదులో ప్రార్థనలపై ఆంక్షలు..

మసీదులో ప్రార్థనలపై ఆంక్షలు..

కరోనా వైరస్ కారణంగా మసీదులలో సమ్మేళన ప్రార్థనలపై ఆంక్షలు విధించారు. ఇటీవలే కేటీఆర్ కూడా ముస్లిం మత పెద్దలను కలిసి లాక్ డౌన్ కు సహకరించాలని కోరారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో తిరగడానికి కూడా అనుమతులను నిషేధించారు.

ఇఫ్తార్ విందులు లేనట్టే..

ఇఫ్తార్ విందులు లేనట్టే..

రంజాన్ మాసం అంటేనే ఇఫ్తార్ విందులకు ప్రత్యేకం. ఇస్లాం మతంలో ఈ ఆచారం ఆనాది కాలం నుండి కొనసాగుతూ వస్తుంది. అయితే ప్రస్తుతం కోవిద్-19 కారణంగా ముస్లింలు ఈసారీ ఇఫ్తార్ విందులు ఇవ్వడం అనేది కష్టమే.

ఇళ్లలోనే ప్రార్థనలు..

ఇళ్లలోనే ప్రార్థనలు..

ఈ సంవత్సరం రంజాన్ పండుగను ఇళ్లలోనే జరుపుకోవాలని ఇస్లామిక్ పెద్దలు ఇప్పటికే ముస్లింలకు సూచనలు చేశారు. కుటుంబంతో కలిసి తమ ఇళ్లలోనే సామాజిక దూరం పాటిస్తూ నమాజ్ చేయాలని సూచించారు.

వేల కోట్ల నష్టం..

వేల కోట్ల నష్టం..

సాధారణంగా రంజాన్ పవిత్ర మాసం సమయంలో అసంఘటిత రంగంలో ఎక్కువగా వ్యాపారం జరిగేది. కొన్ని అధ్యయనాల ప్రకారం కేవలం ఆహారం, బట్టలు, పాదరక్షలకు సంబంధించిన సుమారు 2 వేల కోట్ల వ్యాపారం జరిగేదట. ఇప్పుడు దానంతటికి నష్టం వచ్చినట్టే అని నిపుణులు చెబుతున్నారు.

English summary

Hyderabad to miss all hustle bustle of Ramadan

Hyderabad : The holy month of Ramadan every year is a period of not spiritual activity but also of unprecedented business and trade in this.
Story first published: Tuesday, April 21, 2020, 15:41 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more