For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మిడతల మీద మన్నుపడ...అసలే కరోనాతో చచ్చిపోతుంటే.. గోరుచుట్టిపై రోకటిపోటులా దాడి చేస్తున్నాయి...

అమ్మో మిడతల వల్ల ఎంత ప్రమాదమో పొంది ఉందో చూడండి...

|

అదేంటో గానీ దక్షిణాది హీరో సూర్య ఇటీవల తీసిన సినిమాలలో కొన్ని రియల్ లైఫ్ కు చాలా దగ్గరగా ఉంటున్నాయి. ఇంతకుముందు బందోబస్తు సినిమాలో మిడతల దండు గురించి కొన్ని షాట్స్ ఉన్నాయి. అయితే అచ్చం అలాంటి సీన్స్ ఇప్పుడు రియల్ లైఫ్ లో కూడా కనిపిస్తున్నాయి.

India suffers worst locust swarm attack in decades

తాజాగా భారతదేశంపై మిడతల దండు ప్రవేశించింది. ఇవి తొలుత రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, యుపి, మహారాష్ట్ర మీదుగా ప్రస్తుతం తాజాగా తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. అసలే కరోనా వైరస్ మహమ్మారితో విలవిలలాడుతున్న మన దేశానికి గోరుచుట్టు మీద రోకలిపోటులా మిడతల బెడద వచ్చి పడింది.

India suffers worst locust swarm attack in decades

ఇవి ఒకేసారి గుంపులుగుంపులుగా కోట్ల సంఖ్యలో వచ్చి పంటల మీద పడి దాడి చేస్తున్నాయి. ఈ మిడతల దండును చూసి ఏకంగా రాష్ట్రాలకు రాష్ట్రాలే వణికిపోతున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర, యుపి, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.

India suffers worst locust swarm attack in decades

అయితే ఇవి తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తే.. ఏంటి పరిస్థితి.. వీటి నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఎక్కడి నుండి వచ్చాయి..

ఎక్కడి నుండి వచ్చాయి..

ఈ మిడతలు దక్షిణ అరేబియా ద్వీపకల్పంలో ఉద్బవించాయి. ఆ సమయంలో ఎడారిలో అక్కడక్కడా తాత్కాలిక నీటి చెలమలు ఏర్పడ్డాయి. ఎడారి మిడతలు ఇబ్బడిముబ్బడిగా పెరుగుదలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఇవి కేవలం 9 నెలల్లోనే 8 వేల రెట్లకు పైగా పెరిగిపోయాయి. అక్కడి నుండి పాకిస్థాన్ సరిహద్దు రాజస్థాన్ మీదుగా భారతదేశంపై దాడి చేయడం ప్రారంభించాయి. ఈ మిడతల ప్రమాదం ప్రస్తుతం ఇప్పటివరకు రాజస్థాన్ లోని 18 జిల్లాలను ముంచెత్తింది. అంతేకాదు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల వరకు వ్యాపించింది.

ఎప్పుడు ప్రయణిస్తాయి.

ఎప్పుడు ప్రయణిస్తాయి.

నిపుణుల అభిప్రాయాల ప్రకారం, మిడతల సమూహం రాత్రి పూట ప్రయాణించదు. ఎక్కువగా పగటిపూట ప్రయాణిస్తాయి. అలాగే గాలి ఎలా వీస్తే దాని ప్రకారం ఎగురుతాయి. ఇదిలా ఉండగా 1812 నుండి 1997 వరకు భారతదేశం అనేక మిడత తెగుళ్లు మరియు తిరుగుబాట్లను చూసింది. అయితే 2011 నుండి మిడతల పెరుగుదల పెద్దగా లేదు.

ఎఫ్ఓఓ హెచ్చరిక..

ఎఫ్ఓఓ హెచ్చరిక..

ఈ మిడతల దాడుల గురించి ఐక్యరాజ్య సమితి ఆహార మరియు వ్యవసాయ సంస్థ(ఎఫ్ఓఓ) ముందే హెచ్చరించింది. అయితే జులై ఆరంభం వరకు వీటి ప్రభావం ఉంటుందని చెప్పింది.

అప్రమత్తం అయ్యేలోపు..

అప్రమత్తం అయ్యేలోపు..

ఈ విషయం తెలుసుకున్న రాష్ట్రాలు, కేంద్ర సంస్థలు, రైతులను అప్రమత్తం చేశాయి. అయితే అన్నదాతలు అప్రమత్తమయ్యేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.ఇప్పటికే ఈ మిడతలు వేలాది ఎకరాల పంటలను నాశనం చేసేశాయి.

ఒక్కరోజులో..

ఒక్కరోజులో..

ఈ మిడతల దండు 35 వేల మందికి సరిపడా ఆహారాన్ని కేవలం ఒకేఒక్క రోజులోనే తినేశాయంటే వీటి కెపాసిటీ ఎంటో.. ఎంత భయంకరంగా ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇవి కనిపించిన చోటే పచ్చదనం కనుమరుగవ్వడం ఖాయమనే చెప్పొచ్చు.

రోజుకు 150 కిలోమీటర్లు..

రోజుకు 150 కిలోమీటర్లు..

మిడతలు ఒక రోజులో సుమారు 150 కిలోమీటర్ల మేరకు ప్రయాణం చేస్తాయట. అంతేకాదు గంటకు 15 నుండి 20 కిలోమీటర్ల వేగంతో గాలి ఎటు వీస్తే అటు పగలంతా ప్రయాణం చేస్తాయట. ఎక్కడ పచ్చదనం కనిపిస్తే, అక్కడ వాటన్నింటిని కబళిస్తాయట. అయితే రాత్రిళ్లు మాత్రం ఎక్కడికక్కడే ఆగిపోతాయట. ఇప్పటివరకు దాదాపు 8 కోట్ల మిడతలు ప్రయాణం ప్రారంభించాయట. ఒక్కో మిడత సుమారు 20 కిలోమీటర్లను ఆక్రమిస్తుందట.

ఎన్నడూ లేనంతగా..

ఎన్నడూ లేనంతగా..

భారతదేశంలోని రాజస్థాన్ లో 18 జిల్లాలు ఇప్పటికే మిడతల బారిన పడ్డాయి. ఉత్తరప్రదేశ్ లో కూడా హైఅలర్ట్ ప్రకటించారు. ఎన్ని చర్యలు తీసుకున్నా మిడతల తుఫాను కారణంగా వేలాది కోట్ల మేర పంట నష్టం వాటిల్లొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. 27 ఏళ్లలో ఎన్నడూ లేనంత మిడతల విపత్తును ఎదుర్కొంటున్నామని మధ్యప్రదేశ్ రైతులు చెబుతున్నారు.

45 రోజుల్లోనే..

45 రోజుల్లోనే..

ఈ మిడతలు మూడు నెలల వ్యవధిలోనే పెరిగి పెద్దవి అవుతాయంట. ఇవి బతికే 90 రోజుల్లో ఒక్కో మిడత సుమారు రెండు గుడ్లు పెడుతుంది. ఆ గుడ్లు కేవలం 45 రోజుల్లోనే పెద్దవై తర్వాతి నెలరోజుల్లో అవి కూడా గుడ్లను పెడతాయి.

పచ్చగా కనిపిస్తే చాలు..

పచ్చగా కనిపిస్తే చాలు..

మిడతలకు ఫలానా పంటే తినాలన్న రూలేమీ లేదు. పచ్చగా కళకళలాడుతూ ఏ మొక్క కనిపించినా వాటికి విందు భోజనమే. ఒక్కో దండులో లక్షల కొద్దీ ఉండే మిడతలు వాటి శరీర బరువుకు ఎన్నో రెట్లు ఎక్కువ స్వాహా చేసేస్తాయి.

ఎలా ఎదుర్కోవాలంటే..

ఎలా ఎదుర్కోవాలంటే..

మిడతల దాడిని ఒక్కసారిగా ఎదుర్కోవడం ఇప్పటికైతే స్పష్టమైన పరిష్కారమైతే ఏదీ లేదు. అయితే పురుగుల మందు కలిపిన నీటిని ట్రాక్టర్లు, ఇతర మార్గాల ద్వారా పంటపొలాల్లో చల్లడం వల్ల కొంతమేర ప్రయోజనం చూపిస్తుంది. మిడతల దండును తరిమి కొట్టేందుకు రైతులు డప్పుల్ని కొట్టడం, టపాసులు పేల్చడం, పెద్దశబ్దాలను చేయడం వంటివి చేస్తున్నారు. అయితే నిపుణులు ఏమి చెబుతున్నారంటే మట్టిని దున్నడం ద్వారా మిడతల సంతానోత్పత్తికి పరిస్థితులు అనుకూలించవంటున్నారు. మరోవైపు ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు వైవిధ్యమైన పరిష్కారాన్ని సూచించారు. మిడతల్లో ప్రోటీన్లు బాగా పుష్కలంగా ఉంటాయని, అవి లక్షలాదిగా లభ్యమవుతున్న కారణంగా వాటిని ఆహారంగా మార్చుకోవచ్చని ప్రతిపాదించారు. చరిత్రలో చాలా దేశాలు వీటిని ఆహారంగా తిని, వీటి బెడదను తగ్గించుకున్నాయని వారు చెబుతున్నారు.

English summary

India suffers worst locust swarm attack in decades

Here we talking about India suffers worst locust swarm attack in decades. Read on
Desktop Bottom Promotion