For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బుల్లి తెర ఎప్పటి నుండి సందడి చేస్తుందో తెలుసా..

టెలివిజన్ మొదట బ్లాక్ అండ్ వైట్ కలర్లో ఉండేది. దాన్ని రోజురోజుకు డెవలప్ చేస్తూ కలర్ టీవీగా మార్చారు.

|

టెలి'విజన్' అందరికీ ప్రపంచం అంటే ఏంటో తెలియజేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ప్రపంచంలో జరిగే ఎన్నో వింతలను, విశేషాలను ప్రతిరోజూ మన కళ్ల ముందు కట్టినట్టు చూపింది. చూపుతోంది. పిల్లలు, పెద్దలు, యువత అనే తేడా లేకుండా అందరినీ తన కంట్రోల్ లోకి తెచ్చుకుంది.

television

ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు దాని మీదే ఆధారపడేలా చేసింది. సీరియల్స్ నుండి సినిమాలు, క్రికెట్, రియాలిటీ షోలు, ఇతర కార్యక్రమాల పేరిట అందరినీ టివికి అతుక్కుపోయేలా చేసింది.

television

ఈ అలవాటు మన దేశంలో ఇప్పుడప్పుడే మారేలా కనబడటం లేదు. ఈరోజు (నవంబర్ 21వ తేదీ) అంతర్జాతీయ టెలివిజన్ దినోత్సవం సందర్భం టివి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం...

మొట్టమొదటి టెలివిజన్ అక్కడే..

మొట్టమొదటి టెలివిజన్ అక్కడే..

రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత టెలివిజన్ బాగా ప్రాచుర్యం పొందింది. ఒకప్పుడు దీన్ని వేస్ట్ బాక్సుగా పిలిచినా.. తర్వాత దీనిని బెస్ట్ బాక్సుగా పిలవడం మొదలెట్టారు. ఇలాంటి టెలివిజన్ మొట్టమొదట అమెరికాలో ఇళ్లలో కనిపించింది. అక్కడ 1948లోనే 1 మిలియన్ మంది ఇళ్లలో టెలివిజన్లు ఉండేవట.మొట్టమొదటి టెలివిజన్ ప్రకటన జూలై 1941న న్యూయార్క్ నగరంలో ప్రసారం చేయబడింది. ఈ ప్రకటన బులోవా వాచ్ కోసం 20 సెకన్ల పాటు కొనసాగింది.

బ్లాక్ అండ్ వైట్ నుండి కలర్ లోకి..

బ్లాక్ అండ్ వైట్ నుండి కలర్ లోకి..

టెలివిజన్ మొదట బ్లాక్ అండ్ వైట్ కలర్లో ఉండేది. దాన్ని రోజురోజుకు డెవలప్ చేస్తూ కలర్ టీవీగా మార్చారు. అది కాస్త ప్రస్తుతం స్మార్ట్ టీవీగా మారిపోయింది. ఇక ఇంటర్నెట్ వాడకం పెరిగాక చాలా మంది ప్రజలు స్మార్ట్ ఫోన్లలోనే టివి ఛానెళ్ల కార్యక్రమాలను చూస్తున్నారు. ఇక ఇండియాలో అయితే దీనికి చాలా మంది బానిసలుగా మారిపోయారు. అంతలా ప్రభావితం చేస్తోంది టెలివిజన్.

ఒకప్పుడు దూరదర్శన్..

ఒకప్పుడు దూరదర్శన్..

ఒకప్పుడు మన దేశంలో బ్లాక్ అండ్ వైట్ టీవలో దూరదర్శన్ మాత్రమే వచ్చేది. అందులో వచ్చే కార్యక్రమాలకు చాలా విలువ ఉండేది. ఓ అరగంట పాటలకు, ఓ అరగంట వార్తలకు, ఓ అరగంట కల్చరల్ ప్రోగ్రామ్స్ కు ఇలా ఓ పద్దతిగా కార్యక్రమాలు వచ్చేవి. కానీ కాలం మారుతున్న కొద్దీ దూరదర్శన్ ప్రాధాన్యత పడిపోయింది. డిష్ ఛానెల్స్ వచ్చి వీక్షకులకు విపరీతమైన ఆప్షన్లు ఇచ్చేశాయి..

ప్రాంతీయ భాషల్లోనూ..

ప్రాంతీయ భాషల్లోనూ..

ఇది వరకు అనేక రకాల ఛానెళ్లు కేవలం ఇంగ్లీష్ లో మాత్రమే వచ్చేవి. కానీ టెక్నాలజీ పుణ్యమా అని ఎవరికి ఏ ప్రాంతీయ భాషలో కావాలో వారికి అర్థమయ్యే విధంగా అనువాదం చేసి మరి చూపుతున్నాయి. ప్రపంచంలోని ప్రతి వీక్షకుడికి తమ కార్యక్రమం గురించి తెలిపే ప్రయత్నం చేస్తున్నాయి. ఇలాంటి ఛానెళ్లకు రోజురోజుకు మద్దతు కూడా బాగా పెరుగుతోంది.

ఎలాంటి సమాచారమైనా..

ఎలాంటి సమాచారమైనా..

టీవీ ఛానెళ్లు విపరీతంగా పెరిగిపోయిన తర్వాత భిన్నరకాల ప్రజలకు భిన్నమైన సమాచారం అందించడమే లక్ష్యంగా ఛానెళ్లు ప్రసారం చేయడం ప్రారంభించాయి. ఉదాహరణకు సినిమాలకు, సంగీతాలకు, క్రీడలకు, వార్తలకు, వినోదాత్మక కార్యక్రమాలకు, బ్యాంకింగ్, ఆరోగ్యం, వైద్యం, వంటలు ఇలా అన్ని రకాల సమాచారాన్ని మన కళ్ల ముందుకు క్షణాల్లో కట్టిపడేస్తున్నాయి.

టెలివిజన్ దినోత్సవానికి గల కారణమేంటంటే..

టెలివిజన్ దినోత్సవానికి గల కారణమేంటంటే..

ఐక్య రాజ్య సమితి టెలివిజన్ కు సంబంధించి నవంబర్ 21వ తేదీనే ఎందుకు ప్రకటించిందంటే ప్రపంచంలో అత్యంత ప్రభావాత్మకంగా జనాలకు సామాజిక, రాజకీయ, అంశాలతో పాటు ఇతర సమాచారాలను క్షణాల్లో చేరవేసే శక్తివంతమైన సాధనంగా టెలివిజన్ ను గుర్తించినందుకే.

అంతులేని వినోదం..

అంతులేని వినోదం..

నేటి ఆధునిక యుగంలో అనేక మంది అంతులేని వినోదాన్ని కోరుకుంటున్నారు. ప్రతిరోజూ కొన్ని కోట్ల మంది జీవితంలో టీవి చూడటం అనేది దినచర్యగా మారిపోయింది. ప్రతిరోజూ వారికి ఇష్టమైన సీరియల్స్ ను, కార్యక్రమాలను, ప్రదర్శనలను, వార్తలను చూడటానికి టీవిల ముందు గంటల కొద్దీ గడుపుతున్నారు. బయట ఎన్నో పనులు చేసి వచ్చిన వారు ఈ టివిలో వారికి నచ్చిన షోలను చూసి వారి అలసట నుండి ఉపశమనం పొందుతున్నారు.

800 కోట్ల మంది..

800 కోట్ల మంది..

ఐక్యరాజ్య సమితి అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 2020కి 800 కోట్ల మంది వీక్షకులు నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. దీని వల్ల లక్ష కోట్ల రూపాయల మార్కెట్ టెలివిజన్ బ్రాడ్ కాస్టింగ్ కు వచ్చే అవకాశం ఉందని ప్రకటించింది. ఉదాహరణకు మన దేశంలో గతేడాది జరిగిన ఐపిఎల్ టోర్నమెంటును 85 కోట్లకు మందికి పైగా చూసినట్లు గణంకాలు చెబుతున్నాయి. ఇంకా చెప్పాలంటే ఈ ప్రపంచంలో ప్రతి వంద మందిలో 90 మంది కచ్చితంగా టీవీని తప్పక చూస్తున్నారు.

English summary

Interesting facts about television

Here we talking about interesting facts about television. Read on
Story first published:Thursday, November 21, 2019, 14:56 [IST]
Desktop Bottom Promotion