Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
అమ్మో! జలగ ఓ కుర్రాడి పురుషాంగంలోకి దూరేసింది... ఈత కొట్టే వారు తస్మాత్ జాగ్రత్త...
స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతుంటే, జలగ పురుషాంగంలో దూరింది. ఆ తర్వాత ఏమి జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.
జలగ.. అంటే ఎంత డేంజరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇది మనిషి చర్మంలో దూరి రక్తాన్ని పీల్చేస్తుంది. దీన్ని వదిలించుకోవాలని మనం ఎంత ప్రయత్నించినా... అది అంత సులభం కాదు.

ఆ జలగకు కావాల్సిన రక్తాన్ని, మనిషి శరీరంలో నుండి పూర్తిగా పీల్చేసిన తర్వాత గానీ వదలదు. అయితే అలాంటి ఓ జలగ.. ఓ వ్యక్తి పురుషాంగంలోకి దూరితే ఏంటి పరిస్థితి. అమ్మో తలచుకుంటేనే ఎంత నరకంగా ఉంటుందో అనిపిస్తోంది కదూ..

అయితే ఓ యువకుడికి ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. దీంతో ఆ కుర్రాడు నరకయాతను అనుభవించాడు. ఇంతకీ ఆ కుర్రాడికి జలగ కరెక్టుగా అక్కడే ఎలా దూరింది? ఈ సంఘటన ఎక్కడ చోటు చేసుకుంది? ఆ కుర్రాడు ఈ సమస్య నుండి ఎలా బయటపడ్డాడు.. అనే పూర్తి వివరాలను ఇప్పడు తెలుసుకుందాం....

భరించలేని నొప్పి...
ఓ యువకుడి పురుషాంగంలోకి జలగ దూరిన సంఘటన కాంబోడియాలో చోటు చేసుకుంది. ఈత కొట్టేందుకు సరదాగా నీటిలోకి దిగితే ఒక్కసారిగా ఆ కుర్రాడికి భరించలేనంత కడుపు నొప్పి పెరిగిపోయింది.

రెగ్యులర్ గా స్విమ్మింగ్..
కాంబోడియాకు చెందిన ఆ కుర్రాడు తన ఇంటికి సమీపంలోని ఓ నీటి సరస్సు వద్దకు వెళ్లాడు. అతను అక్కడికి రెగ్యులర్ గా వెళ్తుంటాడట. ఆరోజు కూడా ఎప్పటిలాగానే సరదాగా ఈత కొట్టేందుకు అందులోకి దిగాడు.

ఉన్నట్టుండి పురుషాంగం వద్ద..
ఆ కుర్రాడు చాలా సేపు హాయిగా ఈతకొట్టాడు. అయితే అకస్మాత్తుగా అతనికి పురుషాంగం వద్ద, కడుపులో తీవ్రమైన నొప్పి స్టార్టయ్యింది. వెంటనే టాయిలెట్ కు వెళ్లాడు.

జలగ దూరినట్లు..
ఆ తర్వాత నొప్పి మరింత ఎక్కువ అవ్వడంతో.. ఆ నొప్పిని భరించలేక వెంటనే ఆస్ప్రతికి వెళ్లాడు. అక్కడ ఆ కుర్రాడిని పరీక్షించాక అసలు నిజం బయటపడింది. అక్కడి వైద్యులు అతని బాడీని పూర్తిగా స్కాన్ చేశాక, తన పురుషాంగంలో ఓ జలగ దూరినట్లు గుర్తించారు.

అలా చొచ్చుకెళ్లింది..
ఆ జలగ ఆ యువకుడు ఈత కొట్టే సమయంలో అంగం యొక్క మూత్రాశయం లోపలికి చొచ్చుకెళ్లింది. ఆ తర్వాత అది అక్కడుండే రక్తాన్నీ మొత్తం పీల్చేసింది.

దాని ఆకారం పెద్దగా..
అంతే దాని ఆకారం కూడా ఒక్కసారిగా పెద్దగా మారిపోయింది. దీని కారణంగా అతడికి నొప్పి మరింత తీవ్రమైంది.

అలా బయటకు తీశారు..
అది చర్మానికి అంటుకుని ఉంటే బయటకు తీయడం చాలా ప్రమాదకరం. దీంతో వైద్యులు ఆ మూత్రాశయంలోకి బైపోలార్ రెసెక్టోస్కోపును పంపి ఆ జలగను చంపేశారు. ఆ తర్వాత దాన్ని బయటకు తీశారు.

అప్పటికే చాలా రక్తాన్ని..
ఆ జలగ చనిపోవడానికి ముందే ఆ కుర్రాడి శరీరంలోని సుమారు 500 మిల్లీలీటర్ల రక్తాన్ని తాగేసిందని వైద్యులు తెలిపారు.

జాగ్రత్తగా ఉండండి..
అసలే ఇది వర్షాకాలం.. చెరువుల్లో, నదుల్లో, కాల్వల్లో ఈతలు కొట్టడం అంత శ్రేయస్కరం కాదని వైద్యులు సూచించారు. ఈ జలగలు లాంటివి మన శరీరంలో దూరితే చాలా ప్రమాదకరమని అందరూ జాగ్రత్తగా ఉండాలని వెల్లడించారు.



Click it and Unblock the Notifications
