For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అనగనగా ఓ మంచి దొంగ... తాను దొంగిలించిన బైక్ పార్సిల్ ద్వారా ఓనర్ కు అప్పగింత...

కరోనా లాక్ డౌన్ కారణంగా తన ఊరికి వెళ్లడానికి బైక్ దొంగిలించిన దొంగ, తిరిగి బైక్ ఓనర్ పార్సిల్ చేశాడు.

|

నేటి తరం దొంగలు బాగా అప్ డేట్ అయ్యారు. ఇంతకుముందు మాదిరిగా రాత్రి వేళల్లో కాకుండా ఇప్పుడు పట్టపగలే దొంగతనాలకు పాల్పడుతున్నారు. అది కూడా నిత్యం రద్దీగా ఉండే జనసాంద్రత వంటి ప్రాంతంలో అని మనం నిత్యం ఏదో ఒక న్యూస్ ఛానెల్ లో లేదా న్యూస్ పేపర్లలో వార్తలను చూస్తుంటాం.

Man Travels 200 km With Wife And Kid On Stolen Bike, Returns It After Reaching Home

అయితే కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా దొంగలకు పని లేకుండా పోయింది. కోవిద్-19 దెబ్బకు దొంగతనాలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. ఈ కరోనా మహమ్మారి దొంగలను కూడా బాగా కట్టడి చేసింది. ఇదిలా ఉండగా కరోనా లాక్ డౌన్ కారణంగా ప్రతి ఒక్కరూ ఎక్కడికక్కడ ఇరుక్కుపోయిన సంగతి తెలిసిందే.

జూన్ 5 తర్వాత ఈ 5 రాశుల వారు బిలీనియర్లు అయ్యే అవకాశముందట...జూన్ 5 తర్వాత ఈ 5 రాశుల వారు బిలీనియర్లు అయ్యే అవకాశముందట...

దొంగలా మారిన వలస కూలీ..

దొంగలా మారిన వలస కూలీ..

ముఖ్యంగా వలస కూలీలు తమ సొంత ఊళ్లకు చేరేందుకు పడ్డ కష్టాలు అంతా ఇంతా కాదు. వారి బాధలు వర్ణనాతీతం. అయితే ఇటీవలే తన సొంతూరిని వెళ్లేందు ఓ వ్యక్తి ఆర్టీసీ బస్సునే దొంగిలించాడు. అయితే పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడంతో అనంతపురం జిల్లాలోనే కొన్ని గంటల వ్యవధిలోనే దొరికిపోయాడు. అయితే తాజాగా మరో తన సొంతూరికి వెళ్లేందుకు బైక్ దొంగగా మారిపోయాడు.

సొంతూరికి వెళ్లేందుకు

సొంతూరికి వెళ్లేందుకు

ఓ వ్యక్తి కరోనా లాక్ డౌన్ కారణంగా తన సొంత ఊరికి వెళ్లేందుకు ఓ బైక్ ను దొంగిలించాడు. అదే బైక్ లో తన భార్య, పిల్లలతో కిలిసి 200 కిలోమీటర్లు ప్రయాణించి సొంత ఊరికి చేరుకున్నాడు.

కరోనా అప్ డేట్ : ఇకపై వాట్సాప్ ద్వారా క్షణాల్లో గ్యాస్ బుకింగ్ చేసేయ్యండి ఇలా...కరోనా అప్ డేట్ : ఇకపై వాట్సాప్ ద్వారా క్షణాల్లో గ్యాస్ బుకింగ్ చేసేయ్యండి ఇలా...

తమిళనాడులో

తమిళనాడులో

ఆ తర్వాత ఎంచక్కా ఆ బైక్ ను వాడుకోకుండా ఆ దొంగ ఆ బైక్ ను పార్సిల్ ఆఫీసుకు వెళ్లి తను ఎక్కడి నుండి దాన్ని తీసుకొచ్చాడో అక్కడికే పంపాలని నిర్ణయించుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత అంటే ప్రస్తుతం లాక్ డౌన్ సడలింపుల వల్ల అన్ని కార్యాలయాలు, ఆఫీసులు ఓపెన్ కావడంతో, ఓ పార్సిల్ ఆఫీసులో ఆ బైక్ ను బుక్ చేశాడు. ఎట్టకేలకు ఆ బైక్ ను తన ఓనర్ కు అందేలా చేశాడు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో తాజాగా వెలుగు చూసింది.

దొంగను అభినందించిన ఓనర్..

దొంగను అభినందించిన ఓనర్..

అంతకుముందు కోయంబత్తూరు నగరంలోని పల్లపాలాయం ప్రాంతంలో మే నెల 18వ తేదీన తన షాపు ముందు పార్క్ చేసిన బైక్ ను ఎవరో దొంగిలించారని సురేష్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. అయితే అకస్మాత్తుగా 15 రోజుల తర్వాత సురేష్ కు ఓ పార్సిల్ ఏజెన్సీ నుండి పార్సిల్ వచ్చిందంటూ ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఆ పార్సిల్ లో దొంగిలించబడిన బైక్ ను చూసి సురేష్ ఆశ్చర్యానికి గురయ్యాడు. వెంటనే 1400 రూపాయలు ఆ పార్సిల్ ఏజెంటుకు చెల్లించి తన బైక్ ను తీసుకున్నాడు. ఎవరో వలస కార్మికుడు ఈ బైక్ ను చోరీ చేసి ఉంటాడని, తన సొంతూరికి వెళ్లాక, దాన్ని తిరిగి పార్సిల్ ద్వారా పంపించాడని సురేష్ చెప్పారు.

ఇదిలా ఉండగా ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తామని పోలీసులు చెప్పారు. బైక్ చోరీ చేసి తిరిగి ఇచ్చిన మంచి దొంగను సురేష్ అభినందించడం విశేషం.

English summary

Man Travels 200 km With Wife And Kid On Stolen Bike, Returns It After Reaching Home

Here we talking about honest thief travels 200 km with wife and kid on stolen bike, return it after reaching home. Read on
Story first published:Tuesday, June 2, 2020, 11:07 [IST]
Desktop Bottom Promotion