For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వైరల్ : సరిలేరు ‘సోను’కెవ్వరు... తాజాగా ఓ వ్యక్తికి ఆరాధ్య దైవంగా మారిపోయారు...

|

సోను సూద్ ఒకప్పుడు 1990 దశకంలో సినిమాల్లో అవకాశాల కోసం కేవలం 420 రూపాయల సీజన్ పాస్ తీసుకుని ముంబై వీధుల్లో తిరిగేవాడు. అలా వలస కూలీగా వచ్చిన సోను సూద్ ఎన్నో కష్టాలనుభవించి సినిమాల్లో అవకాశం సంపాదించాడు. అంతేకాదు తనేంటో పూర్తిగా నిరూపించుకున్నాడు.

రీల్ లైఫ్ లో విలన్ గా ఉండే సోను రియల్ లైఫ్ లో మాత్రం మంచి మనసున్న మారాజుగా ప్రతి ఒక్కరి ప్రశంసలను అందుకుంటున్నాడు. కరోనా లాక్ డౌన్ కారణంగా ఎక్కడికక్కడ చిక్కుకుపోయిన వలస కార్మికులందరికీ తనకు తోచిన సహాయం చేస్తూనే ఉన్నాడు.

ఇప్పటికే ప్రత్యేక బస్సులు, ప్రత్యేక రైళ్లు.. ఏకంగా విమానాలను సైతం తన సొంత ఖర్చులతో బుక్ చేసి ప్రతి ఒక్కరినీ వారి గమ్య స్థానాలకు చేర్చేందుకు తన శాయశక్తులా శక్తి వంచన లేకుండా పని చేస్తున్నాడు.

ఇప్పటికే వందలాది మందిని వారి సొంతూళ్లకు చేర్చిన సోను సూద్ తన సహాయాన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తన తల్లి దగ్గరకు క్షేమంగా చేరుకున్న ఓ యువకుడు సోను సూద్ దేవుడిలా భావించి అతనికి ప్రార్థనలు చేయడం మొదలు పెట్టాడు.

ఈ వీడియోను ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో సోను సూద్ నిజమైన దేవుడు అంటూ ఆ వీడియో ఒక్కసారిగా వైరల్ అయిపోయింది. అయితే ఈ విషయం తెలుసుకున్న సోను సూద్ 'బాయ్ ఐసా మత్ కర్'(దయచేసి అలా చేయొద్దు) అంటూ విన్నవించాడు.

ఇదిలా ఉండగా సోను సూద్ వలస కూలీలను ఆదుకునేందుకు, ప్రతి ఒక్కరికీ సహాయం చేయాలని భావించాడు. అందుకే సహాయం కోసం ఎదురుచూస్తున్న వలస కార్మికులందరి కోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేసేశాడు.

ఎవరైనా సహాయం కావాలని అని ఫోన్ చేస్తే వెంటనే స్పందిస్తున్నారు. ఇది చూసిన పలువురు సోషల్ మీడియా ద్వారా తమకు తోచిన విధంగా సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు.

భార్య పోరు..భర్త బేజారు..వెంటనే విడాకులు ఖరారు..కానీ భరణంగా ఎన్ని వేల కోట్లిచ్చాడో తెలిస్తే షాకవుతారు

టోల్ ఫ్రీ నెంబర్..

టోల్ ఫ్రీ నెంబర్..

సోను సూద్ ప్రత్యేకంగా బస్సులను, రైళ్లను బుక్ చేసి వలస కార్మికులను గమ్య స్థానాలకు చేర్చేందుకు చకచకా ఏర్పాట్లు చేశాడు. చేస్తున్నాడు. అయితే ఇదే సమయంలో అతనికి సహాయం కోసం ఎక్కువగా కాల్స్, మెసెజ్ లు వచ్చాయంట. అందుకే ప్రతి ఒక్కరికీ సహాయం చేయాలని ఉద్దేశ్యంతో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసినట్లు చెప్పాడు.

అందరికీ ధన్యవాదాలు..

అందరికీ ధన్యవాదాలు..

ఇలా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయడం వల్ల ఎక్కువ మందిని రైళ్లలో పంపేందుకు అవకాశం ఉంటుందని, అందుకే ఈ పని చేసినట్లు తెలిపారు. అలాగే ఈ మహోన్నత కార్యక్రమంలో తనకు సహాయం చేస్తున్న సినీ పరిశ్రమ, ఇతర స్నేహితులకు తాను ధన్యవాదాలు కూడా తెలిపాడు.

పుట్టిన బిడ్డకు సోను పేరు..

పుట్టిన బిడ్డకు సోను పేరు..

ఇదిలా ఉండగా తనకు సొంతూరు వెళ్లేందుకు సహాయం చేసినందుకు గుర్తుగా ఓ వలస కార్మికురాలు తనకు పుట్టిన బిడ్డకు సోను సూద్ అని పేరు పెట్టడం గమనార్హం. ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు సోను సురక్షితంగా ఇంటికి చేర్చేందుకు సహాయం చేశారన్న ఒకే ఒక్క కారణంతో తన అభిమానాన్ని ఇలా చాటుకున్నట్లు ఆమె చెప్పింది.

వామ్మో! విడాకులిస్తే 24 వేల కోట్ల భరణం చెల్లించుకోవాలా?

సోనుకు పూజలు..

సోనుకు పూజలు..

మరోవైపు సోను సూద్ కు ఓ వ్యక్తి ఏకంగా పూజలు చేసేశాడు. అంతేకాదు ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో అది వెంటనే వైరల్ అయిపోయింది. ‘‘పిల్లలను తల్లివద్దకు చేర్చే వాళ్లు దేవుడితో సమానం. మనుషులంతా సోను సూద్ లా దేవుడు కాలేరు. నేను సోను సూద్ ను దేవుడిగా భావిస్తాను. ఆయన నా కలలను కాపాడారు. నన్ను అమ్మ వద్దకు చేర్చారు‘‘ అని ట్విట్టర్లో పేర్కొన్నాడు.

‘తమ్ముడు అలా చేయొద్దు‘

‘తమ్ముడు అలా చేయొద్దు‘

ఈ వీడియోను చూసిన సోను సూద్ ‘బాయ్ ఐసా మత్ కరో‘(తమ్ముడు అలా చేయొద్దు). కావాలంటే అమ్మను ప్రార్థించమని సోను బదులిచ్చాడు.

నెటిజన్ల కామెంట్లు ఇలా..

నెటిజన్ల కామెంట్లు ఇలా..

అయితే ఈ వీడియో పోస్టు చేసిన మనీష్ అనే వ్యక్తి సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇతను జూనియర్ ఆర్టిస్ట్ కావడమే అందుకు కారణం. ఈ వీడియో చాలా డ్రామటిక్ గా ఉందని, కొంచెం ఎక్కువైందని కొందరు నెటిజన్లంటే.. మరికొందరు బతికున్న మనిషికి అగర్ బత్తులతో పూజ చేయకూడదని మరికొందరు నెటిజన్లు క్లాస్ పీకారు. దీనిపై మీరేమంటారు. కామెంట్స్ బాక్స్ లో తెలియజేయండి.

పాక్షిక చంద్ర గ్రహణం వల్ల ఎలాంటి ప్రభావాలుంటాయో చూడండి...

సోను భార్యకు కూడా..

సోను భార్యకు కూడా..

అయితే సోను సూద్ దక్కుతున్న ప్రశంసల్లో అధిక భాగం ఆయన భార్య సోనాలికి దక్కాల్సిందే. ఎందుకంటే ఉన్నదంతా ఊడ్చేస్తున్నావ్.. నాకెలా.. పిల్లలకెలా.. అసలు రేపేలా అనే ప్రశ్నే ఆమె నోటి వెంట రాలేదు.

హ్యాట్సాఫ్ సోనూ.. సోనాలి..

హ్యాట్సాఫ్ సోనూ.. సోనాలి..

అందుకే ‘బోల్డ్ స్కై తెలుగు‘ తరపున సోను సూద్ కు హ్యాట్సాఫ్.. సోనాలి కూడా అభినందనలు. మీరు ఈ స్ఫూర్తిని ఇలాగే కొనసాగిస్తూ.. మరెందరికో ఆదర్శంగా నిలుస్తారని ఆశిస్తూ.. మీకు మరిన్ని శక్తి సంపదలు సమకూరాలని మనసారా కోరుకుంటున్నాం.

English summary

Man worships Sonu Sood for getting him to his mother

Here we talking about man worships Sonu Sood for getting him to his mother, calls him god; actor says ‘Bhai aise mat kar’. Read on.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more