For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బుధుడు వృషభంలోకి ఎంట్రీ.. ఈ రాశుల వారికి అద్భుత ఫలితాలు...!

|

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, గ్రహాలలో బుధ గ్రహానికి ఎంతో విశిష్టత ఉంది. బుధుడిని గ్రహాలలో రారాజుగా భావిస్తారు. బుధుని అనుగ్రహం ఉంటే, ప్రతి ఒక్కరి తెలివితేటలు, వ్యాపారంతో పాటు మరిన్ని బాగా మెరుగవుతాయని పండితులు చెబుతుంటారు.

అంతటి గొప్ప ప్రాముఖ్యత ఉన్న బుధుడు 2021లో మే 1వ తేదీ ఉదయం 5:32 గంటల నుండి మేష రాశి నుండి వృషభరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇక్కడే మే 26వ తేదీ ఉదయం 7:50 గంటల వరకు నివాసం ఉండనున్నాడు.

అనంతరం మిధున రాశిలోకి సంచారం చేయనున్నాడు. ప్రస్తుతం కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో బుధుడి ప్రయాణం వల్ల ద్వాదశ రాశిచక్రాలలోని ఐదు రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు రానున్నాయట.

అలాగే మరిన్ని ఫలితాల కోసం కొన్ని పరిహారాలు పాటించాలట.. ఇంతకీ ఆ రాశులేవీ.. ఆ రాశుల జాబితాలో మీ రాశి కూడా ఉందో లేదో తెలుసుకోవడానికి ఇక్కడ ఓ లుక్కేయండి...

Mercury Transit in Taurus on 1st May : వృషభంలోకి బుధుడి సంచారం... ఈ రాశులకు ప్రత్యేకం...!

వృషభ రాశి..

వృషభ రాశి..

జ్యోతిష్యశాస్త్ర ప్రకారం బుధుడు మేష రాశి నుండి ఇదే రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ సమయంలో మూడు, ఐదో పాదం యజమానిగా బుధుడిని భావిస్తారు. ఈ సమయంలో రెండో స్థానం నుండి రవాణా చేయనున్నాడు. దీంతో వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా అద్భుతమైన ఫలితాలు రావొచ్చు. మీకు చాలా విషయాల్లో శుభ ఫలితాలు వస్తాయి. వ్యాపారులకు ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది. మీరు పెట్టిన పెట్టుబడుల నుండి భారీ లాభాలను పొందుతారు. మీ మొండి బకాయిలు కూడా రాబడతారు. ఈ కాలంలో మీ బంధువులు, స్నేహితులతో రిలేషన్ మెరుగవుతుంది.

పరిహారం : సూర్యోదయం సమయంలో రామ రక్ష స్తోత్రాన్ని పఠించడం వల్ల శుభఫలితాలొస్తాయి.

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ రాశి వారికి బుధుడి రవాణా వల్ల ప్రత్యేక ప్రయోజనాలు వస్తాయి. ఈ రాశి నుండి 11వ పాదంలో బుధుడు ప్రవేశించనున్నాడు. ఈ కాలంలో విదేశాలకు సంబంధించిన వ్యాపారులు భారీ లాభాలను పొందుతారు. ఉద్యోగులు కూడా నూతన ప్రయోజనాలను పొందుతారు. మల్టీ నేషనల్ కంపెనీల్లో పని చేసే వారికి అద్భుతంగా ఉంటుంది. మీరు ఊహించిన విధంగా ఫలితాలు వస్తాయి. మీ ప్రేమ వ్యవహారంలో ఉంటే.. అది వివాహం వరకు వెళ్తుంది. మీ వైవాహిక జీవితంలో మాత్రం కొంత గజిబిజీగా ఉంటుంది.

పరిహారం : మీ ఇంట్లో మొక్కలను లేదా మనీ ప్లాంట్ ను నాటితే ఫలితం ఉంటుంది.

తుల రాశి..

తుల రాశి..

ఈ రాశి వారికి బుధుడి సంచారం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. బుధుడి రవాణా సమయంలో ఈ రాశి వారికి శుక్రుడు యజమానిగా ఉంటాడు. ఈ రాశి నుండి 8వ స్థానం గుండా బుధుడి ప్రయాణం జరుగుతుంది. ఈ సమయంలో మీకు సమాజంలో ప్రత్యేక గౌరవం లభిస్తుంది. ఆర్థిక పరంగా మీరు కొత్త మార్గాలను అన్వేషిస్తారు. ఆదాయం కూడా బాగా పెరుగుతుంది. ఉద్యోగులు మాత్రం ఆఫీసులో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఉన్నతాధికారులతో వాదనలు పెంచుకోవద్దు.

పరిహారం : వారంలో రెండుసార్లు దేవునికి కర్పూరంతో హారతి ఇస్తే ప్రతికూలతలు దూరమవుతాయి.

ఈ రాశుల వారు ఎక్కువ డబ్బు సంపాదిస్తారట.. ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూసెయ్యండి....!

మకర రాశి..

మకర రాశి..

ఈ రాశి నుండి ఐదో స్థానం గుండా బుధుడి రవాణా జరుగుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి ప్రేమ, రొమాంటిక్ జీవితంలో మాధుర్యంగా ఉంటుంది. మీకు పిల్లల నుండి కొన్ని శుభవార్తలు వినిపిస్తాయి. ప్రేమలో ఉండే వారికి పెళ్లికి కుటుంబ సభ్యుల నుండి గ్రీన్ సిగ్నల్ లభించొచ్చు.అయితే మీరు వీలైనంత మేరకు ఇతరులతో గొడవ పడకుండా ఉండాలి. ఏదైనా సమస్య ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోడానికి ప్రయత్నించలి. వ్యాపారుతు ఈ కాలంలో మంచి ప్రయోజనాలు పొందుతారు. మీరు నూతన ఆదాయ మర్గాలను కనుగొంటారు.

పరిహారం : వినాయకుడిని పూజిస్తే శుభ ఫలితం ఉంటుది.

మీన రాశి..

మీన రాశి..

వృషభంలోకి బుధుడి రవాణా వల్ల ఈ రాశి వారికి అద్భుత ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ రాశి నుండి బుధుడు నాలుగు, ఏడో పాదంలో యజమానిగా పరిగణించబడటం.. మూడో స్థానంలో ప్రయాణం వల్ల ఈ రాశి వారికి ధైర్యం పెరుగుతుంది. ఈ కాలంలో మీన రాశి వారు తమ స్కిల్స్ ను మెరుగుపరచుకుంటారు. గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ప్రస్తుతం భారీ ప్రయోజనాలను పొందుతారు. ఉద్యోగులకు ఆఫీసులో ఉన్నతాధికారులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ఈ కాలంలో మీరు ఊహించిన పనులన్నీ పూర్తి చేసుకుంటారు.

పరిహారం : బుధవారం రోజున పేదలకు దానం చేస్తే మంచి ఫలితాలొస్తాయి.

English summary

Mercury Transit in Taurus on 1st May 2021, These Zodiac signs will be benefitted in Telugu

Here we are talking about the mercury transit in taurus on 1st may 2021, these zodiac signs will be benefitted in telugu. Have a look.