For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మన జాతీయ గీతానికి సంగీతాన్ని స్వరపరిచింది ఎవరో తెలుసా...

భారత జాతీయ గేయానికి సంగీతాన్ని అందించిన వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం.

|

మన దేశ జాతీయ గీతాన్ని, గేయాన్ని రచించింది ఎవరన్నా... 'జన గణ మన' అనే పదం వినబడినా మనందరికీ టక్కున గుర్తుకొచ్చే గొప్ప కవి రవీంద్ర నాథ్ ఠాగూర్.

Ram singh thakuri the composer of tune of indian national anthem

ఈ విషయం చాలా మందికి తెలిసినప్పటికీ, ఈ 'జన గణ మన' గేయానికి సంగీతాన్నిస్వరపరచిన వ్యక్తి ఎవరంటే చాలా మంది దగ్గరి నుండి తెలియదు అనే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది.

Ram singh thakuri the composer of tune of indian national anthem

ఇప్పటికీ మీకు ఈ పాటకు సంగీతాన్ని ఎవరు సమకూర్చారో గుర్తుకు రావడం లేదా? లేక అసలే తేలీదా? అయితే మీరు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆ వ్యక్తి ఎవరో మేము మీకు తెలియజేస్తాం..

Ram singh thakuri the composer of tune of indian national anthem

జాతీయ గీతానికి సంగీతాన్ని స్వరపరిచింది ఎవరో కాదు ఒక స్వాతంత్య్ర సమరయోథుడు. అతను హిమచల్ ప్రదేశ్ ప్రాంతానికి చెందిన వాడు. ఇతని గురించి చాలా మందికి పెద్దలకు తెలుసు. ఇప్పటి తరం వారికే పెద్దగా తెలియదు.

2020 స్వాతంత్ర్య దినోత్సవాన్ని సంతోషంగా జరుపుకునేందుకు 10 మార్గాలు...2020 స్వాతంత్ర్య దినోత్సవాన్ని సంతోషంగా జరుపుకునేందుకు 10 మార్గాలు...

సంగీతాన్ని అందించిన సమరయోథుడు..

సంగీతాన్ని అందించిన సమరయోథుడు..

అయితే ఈ వ్యక్తి గురించి చాలా మందికి తెలిసినప్పటికీ, ఇతనే జాతీయ గీతానికి మ్యూజిక్ అందించాడనే విషయం చాలా మందికి తెలియదు. అతని పేరే రామ్ సింగ్. స్వాతంత్య్ర సమరయోధుడిగా పేరు తెచ్చుకున్న రామ్ సింగ్ ధర్మశాలలోని చిల్గాడి లో 1914లో ఆగస్టు 15వ తేదీన జన్మించాడు. ఇతని బాల్యం అంతా దౌలాధర్ ఒడిలో ఖనియారా గ్రామంలో సాగింది.

14వ ఏటలోనే..

14వ ఏటలోనే..

తన చిన్నతనంలోనే ఒక జంతువు యొక్క కొమ్ము నుండి ఒక సంగీత పరికరాన్ని తయారు చేసిన రామ్ సింగ్ 14వ సంవత్సరంలోనే గుర్జా బాయ్ కంపెనీలో చేరాడు. ఆ తర్వాత బ్రిటీష్ సైన్యంలో పని చేశాడు. తర్వాత నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క ఆజాద్ హింద్ ఆర్మీలో చేరాడు. స్వాతంత్య్ర సమరయోధుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

రెండో ప్రపంచ యుద్ధంలో..

రెండో ప్రపంచ యుద్ధంలో..

1941లో రెండో ప్రపంచ యుద్ధంలో సైన్యంతో కలిసి మలేషియా మరియు సింగపూరుకు వెళ్లాడు. అక్కడ జపాన్ సైన్యం చాలా బ్రిటీష్ ఆర్మీ సైనికులను యుద్ధ సమయంలో బందీలుగా తీసుకుంది. ఈ సైనికులలో సుమారు 200 మంది భారతీయ సైనికులు, వారి రామ్ సింగ్ కూడా ఒకరు. 1942లో సుభాష్ చంద్రబోస్ విడుదలైన తర్వాత బందిఖానాలో ఉన్న భారత సైనికులను ఏకం చేయడం ద్వారా ‘ఆజాద్ హింద్ ఫౌజ్'ను స్థాపించారు. రామ్ సింగ్ మొదటిసారి నేతాజీని కలిసినప్పుడు, ఆయన గౌరవార్థం ముంతాజ్ హుస్సేన్ స్వరపరచిన పాటను కూడా కంపోజ్ చేశారు.

సంగీత నైపుణ్యంతో..

సంగీత నైపుణ్యంతో..

ఆ సమయంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ అతను స్వరపరిచిన సంగీతం గురించి తెలుసుకున్నాడు. తనను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఆ సమయంలోనే నేతాజీ రామ్ సింగుకు వయోలిన్ ను బహుమతిగా అందించాడు.

జాతీయ గీతానికి..

జాతీయ గీతానికి..

ఆ స్ఫూర్తితోనే మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన పాటలకు సంగీతాన్ని స్వరపరచడం మొదలుపెట్టారు. ఈరోజు మనం పాడే జాతీయ గీతం పాటకు అసలైన ట్యూన్ ను కూడా కెప్టెన్ రామ్ సింగ్ ఠాకూరినే స్వరపరిచారు. ఆజాద్ హింద్ ఫౌజ్ ఏర్పడటానికి ఒక సంవత్సరం ముందు, నేతాజీ తన పార్టీ జాతీయ గీతాన్ని నిర్ణయించారు. ఇందుకోసం ఠాగూర్ బెంగాలీ కవితి భరతో భాగ్యో-బిధాటాను ఎంచుకున్నారు.

అనేక దేశభక్తి పాటలకు..

అనేక దేశభక్తి పాటలకు..

తన సైనిక ప్రయాణంలో, కెప్టెన్ రామ్ సింగ్ ఠాకూర్ కదమ్ కదమ్ ఖేడాన్ జాయ్ వంటి అనేక దేశభక్తి గీతాలను స్వరపరిచారు. ఆగస్టు 15, 1947న కెప్టెన్ రామ్ సింగ్ నాయకత్వంలో ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఐఎన్ఎ) యొక్క ఆర్కెస్ట్రా ఎర్రకోట వద్ద శుభ్ సుఖ్ చాన్ కి బర్దా బార్సే.. ఈ పాట రవీంద్రనాథ్ ఠాగూరు యొక్క జన గణ మన యొక్క హిందీ అనువాదం జరిగింది.

English summary

Ram singh thakuri the composer of tune of indian national anthem

Here we taking about ram singh thakuri the composer of tune of indian national anthem. Read on
Desktop Bottom Promotion