For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Sarojini Naidu Birth Anniversary:మన దేశంలో తొలి మహిళా గవర్నర్ ఎవరో తెలుసా...

భారత కోకిల, సరోజిని నాయుడు జయంతి సందర్భంగా తన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

|

Sarojini Naidu Birth Anniversary: భారతదేశంలో సరోజిని నాయుడును భారత కోకిల అని పిలుస్తారు. మహిళా చైతన్యానికి, అభ్యుదయానికి, మహిళా సాధికారతకు, స్వతంత్ర వ్యక్తిత్వానికి ప్రతీకగా సరోజిని నాయుడు నిలిచారు.

Sarojini Naidu Birth Anniversary: Interesting Facts about Nightingale of India in Telugu

ఆమె గొప్ప రచయిత్రి, గొప్ప వక్త. అంతేకాదు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న వీరనారులలో సరోజిని నాయుడు ఒకరు. పశ్చిమ బెంగాల్ లో 1879 సంవత్సరంలో డాక్టర్ అఘోరనాథ్ చటోపాధ్యాయ, వరద సుందరి దంపతులకు సరోజిని నాయుడు జన్మించారు. ఆయన తండ్రి ఎనిమిది భాషల్లో పండితుడు. తన తల్లి కూడా రచయిత్రిగా ఉండి ఎన్నో కావ్యాలు, కథలు రాశారు. వారి ఇంట్లో అందరూ చదువుకున్న వారే ఉండటంతో సరోజిని నాయుడుకు కూడా చిన్ననాటి నుండే విద్యపై మక్కువ పెంచుకున్నారు.

World Radio Day 2022:వరల్డ్ రేడియో డే ఎప్పుడు.. ఎందుకు జరుపుకుంటారంటే...World Radio Day 2022:వరల్డ్ రేడియో డే ఎప్పుడు.. ఎందుకు జరుపుకుంటారంటే...

13వ ఏటనే రచయితగా..

13వ ఏటనే రచయితగా..

సరోజిని నాయుడు తన 12 సంవత్సరాల వయసులోనే మద్రాసు యూనివర్సిటీ నుండి మెట్రిక్యులేషన్ పూర్తి చేసి గొప్ప రికార్డు నెలకొల్పారు. అంతేకాదు 13 ఏళ్ల వయసులోనే రచయితగా మారిపోయారు. తను రాసిన ‘లేడీ ఆఫ్ ది లేక్'ను చదివిన అప్పటి నిజాం నవాబు ఎంతగానో మెచ్చుకున్నారు. తను అలాంటి రచనలు ఎన్నో చేయాలని ప్రోత్సహించారు. అంతేకాదు తనకు కొంత ఆర్థిక సహాయం కూడా చేశారు. వివిధ రంగాల్లో రీసెర్చ్ చేయమని ఇంగ్లాండు వెళ్లడానికి సహాయం చేశారు.

ఆంగ్లంలోనూ అందవేసిన చేయి..

ఆంగ్లంలోనూ అందవేసిన చేయి..

ఆ తర్వాత లండన్ కింగ్స్ కాలేజీ, కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించిన సరోజిని నాయుడు.. తన రచనలతో బ్రిటీష్ వారిని సైతం మెప్పించారు. ‘బర్డ్ ఆఫ్ ది టైం' ‘ది గోల్డెన్ థ్రెషోల్డ్' ‘ది బ్రోకెన్ వింగ్స్', ‘ఫెదర్ ఆఫ్ డాన్' తన రచనలలో ప్రసిద్ధి గాంచినవి. తను కేవలం బెంగాలీలోనే కాదు ఇంగ్లీష్ లోనూ అద్భుతమైన రచనలు చేశారు. ‘ఫీస్ట్ ఆఫ్ యూత్, ది మ్యాజిక్ ట్రీ, ది విజార్డ్ మాస్క్, ఎ ట్రెజరీ ఆఫ్ పొయెం' వంటివి ఎంతగానో ప్రాచుర్యం పొందాయి.

భారత కోకిలగా..

భారత కోకిలగా..

తన ఆంగ్ల పద్యాలలో భారతీయతను ఉండేలా చూసుకున్నారు. అంతేకాదు తన పద్యాలను రాగయుక్తంగా, శ్రావ్యంగా వినసొంపుగా ఉండటంతో తనకు ‘భారత కోకిల'గా పిలిచేవారు. అనంతరం 1905 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకున్నారు. గాంధీజీ శిష్యుడి సూచనలతో ఆమె కాంగ్రెస్ లో చేరినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఆ తర్వాత ఆమె మహాత్మ గాంధీజీని కలిశారు. అప్పటినుండి జాతీయ ఉద్యమంలోకి అడుగుపెట్టారు. ఇక తన ప్రసంగాలు, ఉపన్యాసాలతో భారతీయులందరిలో స్వాతంత్య్ర కాంక్షను మరింత పెంచారు. ఐరిష్ వనిత అనిబిసెంట్ అధ్యక్షతన భారత మహిళా సమాఖ్య స్థాపన 1917లో ఏర్పాటుకు సహకరించారు. అప్పుడే మహిళలకు ఓటు హక్కు కోసం సిఫారసు చేశారు.

ఉద్యమాల్లో చురుగ్గా..

ఉద్యమాల్లో చురుగ్గా..

1919 సంవత్సరంలో మాంటెంగ్ ఛెమ్స్ ఫర్డ్ సంస్కరణకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో, ‘ఖలాఫత్' ఉద్యమంలో, రౌలత్ చట్టం, ఉప్పు సత్యాగ్రహం వంటి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఆ తర్వాత 1925 సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. అప్పుడే భారత హోం రూల్ ప్రతినిధిగా లండన్ వెళ్లి.. అక్కడ భారతీయుల జీవితాలను ప్రతిబింబిస్తూ రచనలు చేశారు. అనంతరం ప్రముఖ సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం ఆధ్వర్యంలో ముత్యాల గోవిందరాజులనాయుడిని కులాంతర వివాహం చేసుకున్నారు. మానవ జీవితానికి కుల, మతాల కన్నా మానవత్వమే ముఖ్యమని నమ్మారు.

తొలి మహిళా గవర్నర్ గా..

తొలి మహిళా గవర్నర్ గా..

స్వాతంత్య్రం లభించిన తర్వాత దేశంలో తొలి మహిళా గవర్నర్ గా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి నియమించబడ్డారు. సరోజిని నాయుడు స్వాతంత్య్రం వచ్చిన రెండేళ్లకే తుది శ్వాస విడిచారు. ఆమె 1949 సంవత్సరంలో మార్చి 2వ తేదీన కన్నుముశారు. తన సేవలను స్మరించుకుంటూ సరోజినినాయుడు జయంతి సందర్భంగా ఫిబ్రవరి 13వ తేదీన జాతీయ మహిళా దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆమె ఈ లోకాన్ని విడిచినప్పటికీ.. తన జీవితం, తను చేసిన సేవలు ఇప్పటితరానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి.

FAQ's
  • భారత కోకిల అని ఎవరిని అంటారు?

    భారతదేశంలో సరోజిని నాయుడును భారత కోకిల అని పిలుస్తారు. మహిళా చైతన్యానికి, అభ్యుదయానికి, మహిళా సాధికారతకు, స్వతంత్ర వ్యక్తిత్వానికి ప్రతీకగా సరోజిని నాయుడు నిలిచారు. ఆమె గొప్ప రచయిత్రి, గొప్ప వక్త. అంతేకాదు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న వీరనారులలో సరోజిని నాయుడు ఒకరు.

  • భారతదేశ తొలి మహిళా గవర్నర్ ఎవరు?

    స్వాతంత్య్రం లభించిన తర్వాత దేశంలో తొలి మహిళా గవర్నర్ గా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి నియమించబడ్డారు. సరోజిని నాయుడు స్వాతంత్య్రం వచ్చిన రెండేళ్లకే తుది శ్వాస విడిచారు. ఆమె 1949 సంవత్సరంలో మార్చి 2వ తేదీన కన్నుముశారు. తన సేవలను స్మరించుకుంటూ సరోజినినాయుడు జయంతి సందర్భంగా ఫిబ్రవరి 13వ తేదీన జాతీయ మహిళా దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

English summary

Sarojini Naidu Birth Anniversary: Interesting Facts about Nightingale of India in Telugu

Here we are talking about the sarojini naidu birth anniversary:intersting facts about nightingale of India in Telugu. Read on
Story first published:Saturday, February 12, 2022, 16:50 [IST]
Desktop Bottom Promotion