Just In
- 41 min ago
మాంసాహారం కంటే ఈ పప్పుధాన్యాల్లో ప్రొటీన్లు ఎక్కువగా ఉండొచ్చు... దృఢమైన శరీరానికి ఇవి చాలు!
- 3 hrs ago
రొయ్యలతో చెట్టినాడ్ స్టైల్ పెప్పర్ ఫ్రైని ప్రయత్నించండి
- 4 hrs ago
Shani Jayanti 2022 Daan: శని మహాదశ కష్టాల నుండి ఉపశమనం కావాలంటే ఇవి దానం చేయండి...
- 4 hrs ago
తల చాలా దురదగా ఉందా? మీరు ఈ చిట్కాలను ప్రయత్నించిన వెంటనే దురద పోతుంది
Don't Miss
- News
Vastu tips: నిద్రకూ వాస్తు డైరెక్షన్: ఉత్తర దిక్కుకు తలపెట్టి పడుకుంటే ఏమవుతుందో తెలుసా?
- Sports
IPl Qualifier 1 : మనది కాని టైంలో కొన్నిసార్లు మింగేయాలి.. తప్పదు అన్న జోస్ బట్లర్
- Movies
Janaki Kalaganaledu May 25th: జ్ఞానాంబకు తెలియకుండా పెళ్లి ప్లాన్.. మధ్యలో ట్విస్ట్ ఇచ్చిన మల్లిక!
- Finance
Digit Insurance IPO: విరాట్ కోహ్లీ కంపెనీ పబ్లిక్ ఇష్యూ: 500 మిలియన్ డాలర్లు టార్గెట్
- Automobiles
Honda City e:HEV బుక్ చేసుకున్నారా.. అయితే ఇది మీ కోసమే
- Technology
Spicejet విమానాలపై Ransomware తో హ్యాకర్ల దాడి ! పూర్తి వివరాలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Shani Asta 2022 :రాశి మారడానికి 33 రోజులు ముందే శనిదేవుని అస్తమయం... ఈ రాశులకు ప్రతికూలం...!
Shani Asta 2022 : జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నవ గ్రహాలలో శని గ్రహానికి ఎంతో ప్రత్యేకత ఉంది. శని గ్రహ ప్రభావం వల్ల ఎవరైనా తమ కర్మ ప్రతి చర్యల ప్రకారం ప్రయోజనాలను పొందుతారు. అదే సమయంలో కొన్ని ప్రతికూల ఫలితాలను పొందాల్సి ఉంటుంది.
ఇదిలా ఉండగా.. శని గ్రహ ప్రయాణం అన్ని గ్రహాల కంటే చాలా నెమ్మదిగా ఉంటుంది. ఇలా శనిదేవుడు ఒక రాశి నుండి మరొక రాశికి మారేందుకు సుమారు రెండున్నర సంవత్సరాల సమయం పడుతుంది. ప్రస్తుతం మకర రాశిలో సంచారం చేస్తున్న శనిగ్రహం.. 2022 సంవత్సరంలో ఏప్రిల్ 29వ తేదీన కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు.
అయితే ఈ కుంభ రాశిలోకి ప్రవేశించడానికి 33 రోజుల ముందే అస్తమయం కానున్నాడు. ఆ తర్వాత ఫిబ్రవరి 24వ తేదీన శని భగవానుడు ఉదయించనున్నాడు. ఈ సమయంలో ద్వాదశ రాశులలోని కొన్ని రాశులపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ సందర్భంగా తీవ్రంగా నష్టపోయే రాశిచక్రాలేవి.. ఎవరెవరికి ఎలాంటి సమస్యలు ఎదురవుతాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మిధునరాశి
ఈ రాశి వారికి శని అస్తమయం వల్ల చాలా ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో మీరు మీ పనిలో నిరంతర వైఫల్యం కారణంగా చాలా నిరాశకు గురవుతారు. ఇప్పటికే మిథున రాశి వారు శనిగ్రహ ప్రభావాన్ని ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఈ సమయంలో వారు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. ఎక్కువ డబ్బు ఖర్చు చేయడం వల్ల మీ జీవిత భాగస్వామితో గొడవలు వస్తాయి. ఈ రోజుల్లో రుణాలు ఇవ్వడం విసుగు తెప్పిస్తుంది. మీ ఉద్యోగంలో సమస్యలు తలెత్తొచ్చు. ఈ 33 రోజులు వ్యాపారులకు అంత మంచిది కాదు.

కర్కాటక రాశి..
శని అస్తమయం కారణంగా జ్యోతిష్యులకు కొన్ని సమస్యలు వస్తాయి. మీరు ఎంత కష్టపడి పని చేసినా ఒత్తిడి పెరుగుతూనే ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో అధికారులతో విభేదాలు రావొచ్చు. దీంతో మీరు పని చేయకపోవడానికి ఇష్టపడకపోవచ్చు. ఈ కాలంలో మీరు ఆర్థిక పరంగా కూడా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. మీ అజాగ్రత్త వల్ల కొన్ని తీవ్రమైన పరిణామాలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.

కన్య రాశి..
33 రోజులు ముందుగా శని అస్తమయం కావడం వల్ల ఈ రాశి వారికి చెడు ఫలితాలు ఎదురుకావొచ్చు. ఈ సమయంలో ఏ పని చేయాలన్నా మీకు అనేక అడ్డంకులు ఎదురవుతాయి. మీకు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మీ తండ్రితో విభేదాల కారణంగా మీ ఇంటి వాతావరణం అధ్వాన్నంగా ఉంటుంది. అంతేకాకుండా ఏ పనీ మనస్పూర్తిగా చేయలేక బాధపడతారు.

తులా రాశి
ఈ రాశి వారికి శని అస్తమయం వల్ల అశుభ ఫలితాలు రావొచ్చు. ఈ కాలంలో మీ కుటుంబంలో మరియు వ్యాపారంలో, చర్చలు పెరిగేకొద్దీ మనస్సులో ఆందోళనలు పెరుగుతాయి. మీరు న్యాయపరమైన చిక్కుల్లో పడే అవకాశం ఉంది. ఇది అనేక మానసిక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఉద్యోగులకు పై అధికారులతో విబేధాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీకు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటాయి.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, శనిదేవుడు ఒక రాశి నుండి మరొక రాశికి మారేందుకు సుమారు రెండున్నర సంవత్సరాల సమయం పడుతుంది. ప్రస్తుతం మకర రాశిలో సంచారం చేస్తున్న శనిగ్రహం.. 2022 సంవత్సరంలో ఏప్రిల్ 29వ తేదీన కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. అయితే ఈ కుంభ రాశిలోకి ప్రవేశించడానికి 33 రోజుల ముందే అస్తమయం కానున్నాడు. ఆ తర్వాత ఫిబ్రవరి 24వ తేదీన శని భగవానుడు ఉదయించనున్నాడు.