For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెళ్లి వద్దని వెళ్లింది..కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ గా తిరిగొచ్చింది.. త్వరలో కలెక్టరూ అవుతానంటోంది..

|

మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు... అంతరిక్షంలోకి సైతం అవలీలగా దూసుకెళ్తున్నారు.. అవకాశాలన్నింటినీ అందిపుచ్చుకుంటున్నారని మనం నిత్యం వార్తల్లో చూస్తూ ఉంటాం. అయితే ఆడవారి పెళ్లి విషయానికొచ్చేసరికి మాత్రం ఇప్పటికీ మెజార్టీ ఫ్యామిలీస్ లో ఒక లిమిట్ ఉంటుంది. అంతవరకే స్వేచ్ఛనిస్తారు. ఆ తర్వాత పరిధి దాటి స్వేచ్ఛ పొందాలంటే చాలా కష్టమే. అలాంటి వారి సంఖ్య చాలా తక్కువగా చెప్పొచ్చు.

ఎందుకంటే స్త్రీలకు 16 ఏళ్ల వయసు దాటితే చాలు వారికెలా పెళ్లి చేయాలా అని అన్ని తరగతుల వారు వరుడి కోసం వెతికే సమాజమిది. అది తరతరాల సంప్రదాయం అని పేరు కూడా ఒకటి. అయితే అమ్మాయిల మనోభావాలను ఏ మాత్రం లెక్క చేయకుండా వ్యవహరించే ఈ పురుషాధిక్య సమాజంలో ఓ అమ్మాయి ధైర్యంగా ఎదుర్కొంది.

అలాంటి కట్టుబాట్లకు కాలం చెల్లిందని చెబుతూ రికార్డు నెలకొల్పింది. ఏడు సంవత్సరాల క్రితం పెళ్లి వద్దని వెళ్లిపోయి.. సరిగ్గా ఏడేళ్ల తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ గా ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది సంజురాణి వర్మ. ఈ విషయం కాస్త సోషల్ మీడియాకు చేరడంతో ఇది బాగా వైరల్ అయిపోయింది. అందరికీ స్ఫూర్తినిచ్చే ఆమె కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

మై విలేజ్ షో నుండి బిగ్ బాస్ షో వరకు గంగవ్వ జీవితంలో ఎన్నో విషాదాలు..

చేతల్లో చూపిన సంజురాణి..

చేతల్లో చూపిన సంజురాణి..

మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కలలు కనడం కాదు.. వాటిని నిజం చేసుకోవాలని తరచుగా చెబుతుండేవారు. మనం ఇప్పటికీ ఆ మాటలను సందర్భం, సమయం వచ్చినప్పుడల్లా వాడుతూ ఉంటాం. కానీ ఆయన చెప్పిన దానిలో సగమే చేస్తారు చాలా మంది. అదేనండి కలలు కంటాం.. వాటిని నిజం చేసుకోవడంలో మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించే వారి సంఖ్యే ఎక్కువ. అయితే కొందరు మాత్రం పట్టుబట్టి తమ కలల్నిసాకారం చేసుకుంటారు. అలాంటి వారిలో సంజురాణి ఒకరు.

2013లో

2013లో

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ కు చెందిన సంజూరాణికి బాగా చదువుకోవాలని కోరికగా ఉండేది. అయితే ఆమె తల్లి 2013లో అనారోగ్య కారణాలతో మరణించింది. అప్పటికే ఆమె అండర్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసింది. ఢిల్లీలో పీజీ చేస్తుండేది.

పెళ్లి చేసుకోమని ఒత్తిడి...

పెళ్లి చేసుకోమని ఒత్తిడి...

అయితే ఆమె కళాశాలలో చదువుతున్న సమయంలోనే కుటుంబసభ్యులు చదువు ఆపేయమని, పెళ్లి చేసి అత్తారింటికి పంపుతామని తండ్రితో పాటు ఇతర కుటుంబసభ్యులు ఆమె ఒత్తిడి తెచ్చారు. అయితే ఆమెకు మాత్రం తన భవిష్యత్తుపై ఏవేవో ఆశలు, కలలు ఉన్నాయి. వాటిని నిజం చేసుకునే శక్తి, అంతకుమించిన పట్టుదల ఉన్నాయి. కానీ అప్పుడు ఏం చేయలేకపోయింది.

నిరాశపడకుండా...

నిరాశపడకుండా...

అయితే అలా అయోమయంలో ఉన్న సందర్భంలో ధైర్యం చేసి అడుగు ముందుకేసింది. అలా ఏడేళ్ల క్రితం ఎవ్వరికీ చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్లిపోయింది. కేవలం తన ఇంటిని మాత్రమే కాదు.. అప్పుడు చదువును కూడా మధ్యలోనే ఆపేసింది. కానీ ఆమె ఏ మాత్రం నిరాశపడలేదు. సంక్షోభ సమయాన్ని సవాలుగా తీసుకుని, స్థిరపడేందుకు ప్రయత్నించింది.

డబ్బు లేకపోయినా...

డబ్బు లేకపోయినా...

అప్పుడు అసలైన జీవితం అంటే ఏమిటో తెలిసొచ్చింది. ఒకవైపు పూట గడవటానికి డబ్బులు లేవు. మరోవైపు తల దాచుకోవడానికి గూడు లేదు. అయితే ఆమె ఎలాగోలా ఓ గదిని అద్దెకు తీసుకుంది. అక్కడే కాలనీ వాళ్ల పిల్లలకు ట్యూషన్ చెప్పడంతో పాటు.. తర్వాత ఓ ప్రైవేట్ స్కూల్ లో టీచర్ పోస్ట్ సంపాదించింది.

UPSC పరీక్షలకు ప్రిపేర్..

UPSC పరీక్షలకు ప్రిపేర్..

అలా తను లైవ్లీహుడ్ గడుపుతూ సివిల్స్ పరీక్షలకు సిద్ధమైంది. కట్ చేస్తే.. ఆమె ఏకంగా ఐఏఎస్ ర్యాంకు సాధించింది. ఇటీవలే ప్రకటించిన UPSC ఫలితాల్లో ఆమె అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ గా ఎంపికైంది. కొద్దిరోజుల్లోనే ఆమె తన బాధ్యతలను స్వీకరించబోతోంది. ఈ నేపథ్యంలో ఏడేళ్లుగా ఇంటికి దూరంగా ఉన్న ఆమె సొంతూరికి వెళ్లింది.

ఫ్యామిలీ గర్వపడేలా...

ఫ్యామిలీ గర్వపడేలా...

ఎవరైతే తనను పెళ్లి చేసి అత్తారింటికి పంపాలనుకున్నారో.. వారినే తల ఎత్తుకుని గర్వపడేలా చేసింది. అంతేకాదు సివిల్ సర్వీసెస్ లో ఐఏఎస్ అయ్యి.. ఓ జిల్లా మెజిస్ట్రేట్ గా ఎంపిక కావడమే తన తదుపరి లక్ష్యమని చెబుతోంది.

నా బాధ్యతేంటో తెలుసు..

నా బాధ్యతేంటో తెలుసు..

‘నేను ఇంట్లో నుంచి వెళ్లిపోయి స్వతహాగా బతకడం ప్రారంభించినప్పుడు మా కుటుంబ సభ్యులు కొంత బాధపడ్డారని.. కానీ ఓ కలెక్టరుగా నేను పొందే గౌరవాన్ని చూసి వారు ఆనందిస్తారనే విషయం తెలుసు' అని సంజూ చెప్పారు. అంతేకాదు ‘నా బాధ్యతలేంటో నాకు బాగా తెలుసు. నా కుటుంబానికి నేను వీలైనంత మేరకు అండగా ఉండాలనుకుంటున్నాను. కానీ మీ అమ్మాయి చదువు ఆపేసి పెళ్లి చేసేయ్ అనే లోకం తీరు నాకు అర్థం కావడం లేదు' అని సంజూ చెప్పుకొచ్చింది.

చూశారు కదా... కన్న తండ్రేమో కళ్యాణం అన్నాడు.. కానీ కూతురు పట్టుబట్టి కొలువు కొడతానంది.. కొట్టేసింది.. తర్వాత కలెక్టర్ కాబోతున్నానని కాన్ఫిడెంటుగా చెబుతున్న తీరు చూస్తుంటే నిజంగా ఈమె ఆడవారందరికీ ఎంతో ఆదర్శం.

ఈమె అభిప్రాయంపై మీరు ఏకీభవిస్తారా? లేదా వ్యతిరేకిస్తారా అనే విషయాన్ని కామెంట్స్ విభాగంలో తెలియజేయగలరు.

English summary

Story of meerut girl Sanju Rani verma in Telugu

Here we talking about the story of meerut girl sanju rani verma in telugu. Read on
Desktop Bottom Promotion