For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

షాకింగ్ : కరోనా ఫేక్ న్యూస్ నే కోట్లాది మంది ప్రజలు చూస్తున్నారట... తాజా అధ్యయనంలో వెల్లడి...

|

మన ప్రపంచంలో అతి జాగ్రత్తపరులు, అతి తెలివిపరులు ఉంటారు. అంతేకాదు అతి శుభ్రత పాటిస్తూ అందరీ ముందు ఫోజులు కొడుతూ ఉంటారు. ఇక కరోనా వచ్చినప్పటి నుండి అలాంటి వారంతా కోవిద్-19 సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై యూట్యూబ్ లో వారు చూడని వీడియో లేదంటే అతిశయోక్తి కాదేమో.

Survey reveals half of people have seen coronavirus fake news online

అయితే వారు అక్కడే తప్పులో కాలేస్తున్నారు. కరోనా వైరస్ గురించి జాగ్రత్తల విషయంలో తప్పుదోవ పట్టించే వీడియోలను ఎక్కువగా చూస్తున్నారు. ఇప్పటివరకు యూట్యూబ్ లో ఎక్కువమంది చూసిన కరోనా వైరస్ వీడియోల్లో నాలుగో వంతుకుపైగా ఫేక్ న్యూస్ లేదా తప్పుదోవ పట్టించేవే ఎక్కువగా ఉన్నాయని తాజా అధ్యయనంలో తేలింది.

Survey reveals half of people have seen coronavirus fake news online

ఎందుకంటే కరోనా సర్వంతర్యామిగా మారిపోయింది. ఉదయం నిద్రలేచిన వెంటనే పాల ప్యాకెట్లలో కరోనా ఉండొచ్చు. న్యూస్ పేపర్ల నుండి రావచ్చు. కూరగాయలు, పళ్లు, బియ్యం, నిత్యావసర సరుకులు, నీళ్లు, గాలి, ఆకాశం, భూమితో సహా ఇందుగలదు అందులేదని సందేహం లేకుండా కరోనా వైరస్ సాగుతూ పోతోంది తప్ప.. ఎక్కడా ఆగడం లేదు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ రాకుండా తప్పుదారి పట్టించే వీడియోలను నెటిజన్లు 6.2కోట్ల సార్లు చూశారట. ఇంతకీ ఎలాంటి వీడియోలను యూజర్లు ఎక్కువగా చూశారో ఇప్పుడు తెలుసుకుందాం...

వ్యాక్సిన్ తయారైనట్లు..

వ్యాక్సిన్ తయారైనట్లు..

ఆయా దేశాల్లో ఫార్మా కంపెనీలు కరోనా వైరస్ కు మందు కనుగొన్నాయని, అయితే ఆ వ్యాక్సిన్లను కావాలనే విక్రయించడం లేదని అసత్య సమాచారాన్ని ఎక్కువగా చూశారట. ఇలాంటి ప్రమాదక, తప్పుదారి పట్టించే సమాచారానికి కళ్లెం వేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని యూట్యూబ్ తెలిపింది.

న్యూస్ ఛానెళ్ల ద్వారా..

న్యూస్ ఛానెళ్ల ద్వారా..

కరోనా వైరస్ గురించి తప్పుడు సమాచారమున్న వీడియోల్లో మూడో వంతు వీడియోలు ఎంటర్ టైన్ మెంట్ న్యూస్ ఛానెళ్ల ద్వారా వచ్చాయట. నాలుగో వంతు వీడియోలు నేషనల్ న్యూస్ సంస్థల నుండి వచ్చాయట.

ఇంటర్నెట్ న్యూస్ ఛానెళ్లలోనూ..

ఇంటర్నెట్ న్యూస్ ఛానెళ్లలోనూ..

అంతేకాదు ఇంటర్నెట్ న్యూస్ ఛానెళ్లలోనూ ఇలా తప్పుదారి పట్టించే వీడియోలు దాదాపు నాలుగో వంతు వీడియోలు అప్ లోడ్ అయ్యాయట.

యూట్యూబ్ వీడియోలపై..

యూట్యూబ్ వీడియోలపై..

బీఎంజే గ్లోబల్ హెల్త్ లో ప్రచురితమైన ఈ అధ్యయనంలో మార్చి 21వ తేదీ వరకూ ఎక్కువ మంది కరోనా వైరస్ కు సంబంధించిన యూట్యూబ్ వీడియోలపై ఎక్కువ శ్రద్ధ చూపారు.

ఒకే తరహా వీడియోలు..

ఒకే తరహా వీడియోలు..

సుమారు గంట సమయం కంటే ఎక్కువ నిడివి ఉన్నవి, తగిన ఆడియో లేదా విజువల్స్ లేనివి, ఒకే తరహా వీడియోలను జాబితాలో నుండి తొలగించగా, ఈ అధ్యయనంలో 69 మాత్రమే మిగిలాయి.

మంచి స్కోర్ దేనికంటే..

మంచి స్కోర్ దేనికంటే..

వైరస్ వ్యాప్తి లక్షణాలు, నియంత్రణ, జాగ్రత్తలు, రోగనిరోధక శక్తి పెంపుదల వంటి వాటితో కరోనా చికిత్స విధానాలపై కచ్చితమైన సమాచారం ఆధారంగా వీడియోలకు స్కోరింగ్ ఇచ్చారు. ఇక్కడ ఇతర వీడియోల కంటే ప్రభుత్వ సంస్థల వీడియోలకు మంచి స్కోర్ వచ్చింది. అయితే వీటిని చాలా తక్కువ మంది చూశారు.

వారితో చేతులు కలపాలి..

వారితో చేతులు కలపాలి..

స్పష్టమైన సమచారం ఉన్న వీడియోలను ఎక్కువ మంది చూడాలంటే, ఎంటర్ టైన్ మెంట్ న్యూస్ అందించే సంస్థలు, సోషల్ మీడియాను ప్రభావితం చేసే వ్యక్తులతో ప్రభుత్వ సంస్థలు, ఆరోగ్య నిపుణులు చేతులు కలపాలని అధ్యయనం సూచించింది.

యూట్యూబ్ ప్యానెల్స్..

యూట్యూబ్ ప్యానెల్స్..

‘‘ప్రస్తుతం ఉన్న క్లిష్ట సమయంలో అందరికీ అవసరమయ్యే సమాచారాన్ని సకాలంలో చేరవేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రమాదకర, తప్పుడు దారి పట్టించే వార్తలకు అడ్డుకట్ట వేసేందుకు కట్టుబడి ఉన్నాం. ఇలాంటి పొరపాటు ఇకపై జరగకుండా ఎన్ హెచ్ ఎస్, ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యుహెచ్ఓ) విడుదల చేసే వివరాలతో ప్రత్యేక సమాచార ప్యానెల్స్ ను రూపొందిస్తున్నాం‘‘ అని యూటబ్యూబ్ ఓ ప్రకటన కూడా విడుదల చేసింది.

తప్పుడు వీడియోలు..

తప్పుడు వీడియోలు..

‘‘కరోనా వైరస్ కట్టడికి వైద్య చికిత్సలకు బదులుగా నిరాధారమైన చికిత్సా విధానాలను ప్రోత్సహించే వీడియోలను అడ్డుకోవాలని మాకు స్పష్టమైన విధానాలు ఉన్నాయి. అలాంటి వీడియోలు కనిపించిన వెంటనే తొలగిస్తున్నాం. కోవిద్-19 వ్యాప్తి నియంత్రణకు సంబంధించి.. డబ్ల్యూహెచ్ఓ, ఎన్ హెచ్ ఎస్ ల సమాచారానికి విరుద్ధంగా ఉండే వీడియోలన్నీ యూట్యూబ్ విధానాలను ఉల్లంఘించే వీడియోల కిందకే వస్తాయి. మరోవైపు సమాచారం కొంచెం అటూఇటూగా ఉన్నా కూడా వాటిని ప్రమోట్ చేయడం తగ్గించాం.

ఎప్పటికప్పుడు అంచనా..

ఎప్పటికప్పుడు అంచనా..

‘‘ప్రపంచంలో ఉన్న ప్రజలపై ఇలాంటి వీడియోల ప్రభావాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నాం. ఇటీవల కాలంలో యూట్యూబ్ లో అసత్య వార్తలు ఎక్కువయ్యాయి. వీటినే నెటిజన్లు ఎక్కువగా చూస్తున్నారు. తాజా పరిశోధనలో వెలుగుచూసిన అంశాలు ఆందోళన కలిగిస్తున్నప్పటికీ, ఆశ్చర్యంగా మాత్రం అనిపించడం లేదు.

సంక్లిష్టంగా..

సంక్లిష్టంగా..

అయితే యూట్యూబ్ లో ప్రభుత్వ సంస్థలు షేర్ చేసే సమాచారం కచ్చితంగా ఉంటున్నప్పటికీ, సంక్లిష్టంగా ఉంటోంది. మరోవైపు ఇన్ఫెక్షన్ త్వరగా తగ్గిపోయే చికిత్సల కోసం ఎందురుచూసే ప్రజలను ఫేక్ వీడియోలు ఎక్కువగా ఆకర్షిస్తుంటాయి. దీని వల్ల ప్రభుత్వ సంస్థలు అప్ లోడ్ చేసే వీడియోలకు వీటిలా ప్రజాదరణ రావడం లేదు.

ప్రజలను నమ్మించేలా..

ప్రజలను నమ్మించేలా..

చాలా వరకు ఇలాంటి వాటిల్లో నిర్మాణ విలువలు మెరుగ్గా ఉండటం, నిపుణులతో చెప్పించే సమాధానాలు, మధ్యమధ్యలో సంబంధం లేని లెక్కలు చెబుతూ ప్రజలను నమ్మించేలా ఈ వీడియోలను తయారు చేస్తున్నారు.

టామ్ అండ్ జెర్రీ ఫైటే..

టామ్ అండ్ జెర్రీ ఫైటే..

అయితే ఇలాంటి వీడియోలను సోషల్ మీడియాలో నియంత్రించడమంటే టామ్ అండ్ జెర్రీ ఫైటింగే అవుతుంది. ఎందుకంటే ఒకసారి వీడియో వైరల్ అయ్యాక.. సొంత ఛానెల్ దాన్ని తొలగించినా వినియోగదారులు అలాంటి వాటిని పదే పదే అప్ లోడ్ చేస్తూ ఉంటారు.

న్యూస్ తో సంబంధం లేని..

న్యూస్ తో సంబంధం లేని..

కేవలం న్యూస్ తో సంబంధం లేని సంస్థలు మాత్రమే తప్పుదోవ పట్టించే వీడియోలను అప్ లోడ్ చేయడం లేదనే సంగతిని నెటిజన్లు గుర్తు పెట్టుకోవాలి. వ్యూస్ కోసమో లేదా క్లిక్స్ కోసమో కొన్ని ప్రధాన మీడియా సంస్థతూ తప్పదారి పట్టించే వార్తలను ఎంచుకుంటున్నాయని తాజా అధ్యయనం చెబుతోంది.

నాణ్యమైన సమాచారం కోసం..

నాణ్యమైన సమాచారం కోసం..

అందుకే నెటిజన్లంతా ప్రభుత్వ సంస్థలు, ఆరోగ్య నిపుణులు అప్ లోడ్ చేసిన వీడియోల్లో కచ్చితమైన, నాణ్యమైన సమాచారం ఉందని తాజా పరిశోధన చెబుతోంది.

వీరు లేకపోవడంతో..

వీరు లేకపోవడంతో..

అయితే చాలా సార్లు ఈ వీడియోల్లో యూట్యూబ్ స్టార్లు, వ్లాగర్లు లేకపోవడంతో ఎక్కువ మందికి చేరువ కావడం లేదని, కొన్నిసార్లు ఇవి సామాన్యులకు అర్థమయ్యే రీతిలో ఉండటం లేదని వివరిస్తోంది.

English summary

Survey reveals half of people have seen coronavirus fake news online

Here we talking about survey reveals half of people have seen coronavirus fake news online. Read on
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more