For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Teachers Day 2021:మీకు ఇష్టమైన టీచర్లకు నచ్చే బెస్ట్ గిఫ్ట్స్ ఇవే...!

టీచర్స్ డే సందర్భంగా మీ టీచర్లకు ఎలాంటి బహుమతిలివ్వాలో తెలుసుకోవడానికి ఇక్కడ ఓ లుక్కేయండి.

|

మన సమాజంలో తల్లిదండ్రుల తర్వాతి స్థానం ఎవరికైనా ఉందంటే.. అది గురువులకే. మన జీవితాలను తీర్చిదిద్దుతున్న టీచర్లను గౌరవించేందుకే.. ప్రతి ఏటా సెప్టెంబర్ ఐదో తేదీన ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.

Teachers Day 2021:Teachers Day Gift Ideas in Telugu

అంతేకాదు ఉపాధ్యాయ రంగం నుండి భారత ప్రథమ పౌరుడైన రాష్ట్రపతి వంటి అత్యున్నత స్థానాన్ని అధిరోహించిన డాక్టర్ సర్వేపల్లి జన్మదినాన్ని పురస్కరించుకుని మనం టీచర్స్ డే జరుపుకుంటున్నాం.

Teachers Day 2021:Teachers Day Gift Ideas in Telugu

ఈ రోజున మీకు ఇష్టమైన టీచర్ కు మంచి బహుమతులిచ్చి.. వారి మనసులో మీ చోటును పదిలం చేసుకోండి. అయితే ఈ ఏడాది మీ గురువుకు ఎలాంటి బహుమతి ఇవ్వాలని ఆలోచిస్తున్నారా? ఏ రకమైన గిఫ్టులిస్తే.. మీ టీచర్ ను ఆకట్టుకోవచ్చు అనుకుంటున్నారా? గురువులను ఆకట్టుకునేందుకు ఖరీదైన బహుమతులను కొనాల్సిన అవసరం లేదు... మీరిచ్చే చిన్న బహుమతి వారి మనసును హత్తుకునేలా ఉంటే చాలు.. అలాంటి బహుమతులేవో ఇప్పుడే చూసెయ్యండి...

టీచర్స్ డే గురించి ఈ విశేషాలు తెలుసా...టీచర్స్ డే గురించి ఈ విశేషాలు తెలుసా...

ప్రేమతో గిఫ్టులు..

ప్రేమతో గిఫ్టులు..

మీరు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రెగ్యులర్ గా పరిమిత బడ్జెట్లో బహుమతులను కొనేందుకు ప్రయత్నించొచ్చు. అయితే అవి ఖరీదైనవి కానంత మాత్రాన.. మీరు చింతించాల్సిన పనిలేదు. మీరు ప్రేమతో ఎంత చిన్న బహుమతి ఇచ్చినా.. మీ టీచర్ వాటిని ఇష్టపడతారు. ఇలాంటి గిఫ్టులు బోలెడన్నీ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

డబ్బులు లేకపోతే..

డబ్బులు లేకపోతే..

ఒకవేళ మీ వద్ద డబ్బులు లేకుంటే.. మీరు కొన్ని డ్రాయింగులను డ్రా చేయొచ్చే లేదా నోట్ రాయొచ్చు. అంతేకాదు మీ మనసులో గురువు మీద ఉన్న గౌరవం, ప్రేమను, మీ భావాలను పేపర్ పై రాసి మంచి ప్రెజెంటేషన్ కూడా ఇవ్వొచ్చు. ఇలా కూడా మీరు మీ గురువులకు టీచర్స్ డే విషెస్ చెప్పొచ్చు.

సోషల్ మీడియా ద్వారా..

సోషల్ మీడియా ద్వారా..

ఒకప్పుడు టెక్నాలజీ ఉండేది కాదు.. అందుకే అప్పుడు ఉత్తరాలు, కవితలు.. ఇతర మార్గాల్లో టీచర్లకు విషెస్ చెప్పేవారు. అయితే ఇప్పుడంతా స్మార్ట్ యుగం. ఇదివరికట్లా ఉత్తరాలు రాయడం.. ఫోన్లో మాట్లాడటం అంతా ఓల్డ్ ట్రెండ్. ఇప్పుడు మీ స్మార్ట్ ఫోన్ ద్వారా మీ గురువుతో మీకు ఉన్న అనుబంధాన్ని ఓ వీడియోలో రికార్డు చేయండి. మీ క్లాసులో జరిగిన ఏదైనా ఫన్నీ మూమెంట్ ను అందులో గుర్తు చేస్తూ.. మీ టీచర్ కు సెండ్ చేయండి చాలు.

ఈ రాశుల వారు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఉంటారట...!ఈ రాశుల వారు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఉంటారట...!

అందమైన పూల మొక్క..

అందమైన పూల మొక్క..

మీకు స్మార్ట్ ఫోన్ ద్వారా విషెస్ చెప్పడం ఇష్టం లేకుంటే.. మీరు ఒక అరుదైన మొక్కను లేదా ఒక అందమైన పూల కుండీని మీ గురువుకు బహుమతిగా ఇవ్వొచ్చు. ఆ మొక్క పెరిగి పెద్దదై పూలు పూసిన ప్రతిసారీ.. మిమ్మల్ని వారికి గుర్తు చేస్తూ ఉంటుంది.

ఇలాంటి గిఫ్టులు..

ఇలాంటి గిఫ్టులు..

మీకు ఇష్టమైన గురువులకు స్ప్కాక్ బుక్ ని బహుమతిగా ఇవ్వండి. అందులో మీ స్నేహితులు, క్లాస్ మేట్స్ అందరి ఆటోగ్రాఫ్లతో ఆ పుస్తకాన్ని నింపేయండి. ఇలాంటివి మీ గురువులకు కచ్చితంగా నచ్చుతుంది. విద్యార్థులందరూ గురువును ఇంకా గుర్తుంచుకున్నారని.. ఇలాంటి బహుమతి ఇస్తే.. దాన్ని మీ టీచర్ ఎప్పటికీ మరచిపోలేరు.

డైరీ, పెన్..

డైరీ, పెన్..

ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి డైరీ, కలం అనేది కచ్చితంగా అవసరం. కాబట్టి ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వారికి ఆకర్షణీయమైన డైరీ, మంచి కలాన్ని బహుమతిగా ఇవ్వొచ్చు. వీటితో పాటు ఫ్లవర్ బోకేలు, ఫ్లవర్ వాజ్, మీ గురువులకు ఇష్టమైన కొత్త పుస్తకాలను, మీ టీచర్ కిష్టమైన చాక్లెట్లను కూడా ఇవ్వొచ్చు.

English summary

Teachers Day 2021:Teachers Day Gift Ideas in Telugu

Here we are talking about the Teacher's Day 2021: Teachers day gift ideas in Telugu. Have a look
Desktop Bottom Promotion