For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పౌర్ణమి తర్వాత ఈ 5 రాశుల వారు కోటీశ్వరులవుతారట... మీ రాశి కూడా ఉందేమో ఓ లుక్కేయండి...

|

ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుందో తెలియదు కానీ.. మీ నక్షత్రాలు, రాశులు, గ్రహాల అనుగ్రహాలను బట్టి మీరు కోటీశ్వరులుగా మారిపోతారంటున్నారు జ్యోతిష్యశాస్త్ర నిపుణులు. ప్రస్తుత కాలంలో మనం ఆనందంగా జీవించాలంటే ధనలక్ష్మీ అనుగ్రహం కచ్చితంగా కావాల్సిందే. అయితే డబ్బు సంపాదించడం అనేది అందరికీ కష్టమే. కానీ కొంచెం మనసు పెడితే చాలు అది అత్యంత సులభమే అవుతుంది.

ప్రస్తుతం కరోనా సంక్షోభ కాలంలో కొన్ని రాశుల వారు మాత్రం కోటీశ్వరులయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని జ్యోతిష్యశాస్త్ర పండితులు చెబుతున్నారు. సాధారణంగా కొన్ని రాశుల వారు పుట్టినప్పటి నుండే బిలీనియర్లుగా పుడితే, మరికొందరు మాత్రం కష్టపడి కోటీశ్వరులుగా మారుతూ ఉంటారు.

వీటన్నింటి సంగతి పక్కనబెడితే ప్రస్తుత తెలుగు క్యాలెండర్ ప్రకారం జ్యేష్ఠ మాసంలోని పౌర్ణమి తర్వాత ద్వాదశ రాశులలోని ఐదు రాశుల వారికి ధనానికి లోటు అనేది లేకుండా పోతుందట. ఈ పౌర్ణమి శుక్రవారం నాడు రావడంతో కొన్ని రాశుల వారికి కష్టాల నుండి విముక్తి లభించబోతోంది. ఇప్పటివరకు మీరు పడిన కష్టాలు తొలగిపోయి మీకు మంచి రోజులు రాబోతున్నాయి.

ఈ 5 రాశుల వారు పట్టిందల్లా బంగారమే అవుతుందట. అది కొంచెం కష్టమే అయినప్పటికీ అసాధ్యం మాత్రం కాదంటున్నారు జ్యోతిష్యశాస్త్ర పండితులు. ఈ సందర్భంగా 12 రాశుల వారిలో ఆ 5 రాశులు ఏవో.. ఆ రాశులలో మీ రాశి కూడా ఉందో లేదో చూసేయ్యండి మరి...

జూన్ నెలలో ఈ రాశుల వారికి ఉద్యోగావకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి... మీ రాశి కూడా ఉందేమో చూడండి...

జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి

పౌర్ణమి తిథి అంటే సకల దేవతలకు ప్రీతిదాయకమైన రోజు. ఈ పౌర్ణమి రోజున నియమ నిష్టలతో దేవుడిని ప్రార్థిస్తే ఎలాంటి కోరికలు కోరుకున్న తప్పక తీరుతాయని చాలా మంది హిందువులు నమ్ముతారు. అంతటి మహిమాన్వితమైన జూన్ 5వ తేదీన శుక్రవారం నాడు పౌర్ణమి నాడు రావడంతో సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశి వారు ఈ నెల 5వ తేదీ తర్వాత చాలా రోజులుగా పెండింగులో ఉన్న కోర్టు కేసులలో విజయం సాధిస్తారు. అంతేకాదు స్థిరాస్తులు సైతం కొనుగోలు చేస్తారు. వీరి రాశి ప్రకారం సూర్యుడు అధిపతి కాబట్టి, ఈ రాశి వారు ఎల్లప్పుడూ ఉన్నత స్థానంలో ఉండాలని భావిస్తారట. వీరికి పుట్టుక నుండి మరణం వరకు ధనం విషయంలో ఎలాంటి లోటు ఉండదు. అందుకే వీరు ఖరీదైన ఆభరణాలను అవలీలగా కొనుగోలు చేస్తారు. వీరు ఏ పని మొదలు పెట్టినా తమ జీవితంలో అనుకున్న దాని కంటే ఎక్కువ ధనాన్ని సంపాదించడమే కాదు. సేవింగ్స్ కూడా చేస్తారట.

మేష రాశి..

మేష రాశి..

మేష రాశి వారికి జూన్ 5వ తేదీ తర్వాత చాలా అద్భుతంగా ఉంటుంది. వీరికి సమాజంలో గౌరవం కూడా బాగా పెరుగుతుంది. అంతేకాదు వీరి కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. పిల్లల సంతానం వంటి శుభవార్తలను కూడా ఉంటారు. భార్యభర్తల మధ్య సాన్నిహిత్యం మరింత పెరుగతుంది. ఇక మేషరాశి వారు జూన్ 5వ తేదీ తర్వాత ఏ పని మొదలుపెట్టినా విజయం తప్పక వరిస్తుంది. వీరికి ధనానికి ఎలాంటి లోటు ఉండదు. అంటే దీని అర్థం ఏ పనీ చేయకుండా ఖాళీగా కూర్చుంటారని మాత్రం కాదు. వీరిలో కష్టపడే తత్వం కూడా ఎక్కువగా ఉంటుంది. అలా వీరి ఆలోచనలతో, ప్రణాళికలతో వీరి ఆదాయాన్ని పెంచుకోవడానికి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

ఈ రాశుల వారికి ప్రేమలో అంత ఈజీ కాదు... మీ రాశి కూడా ఉందేమో చూడండి...

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

ఈ రాశి వారికి జూన్ 5 వతేదీ జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి తర్వాత ప్రేమకు సంబంధించిన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే వైవాహిక జీవితంలో కూడా మీరు ఊహించని మార్పులొస్తాయి. పిల్లల కోసం ఎదురుచూసే వారికి శుభవార్తలు వినిపిస్తాయి. ఈ రాశి వారు అద్భుత ప్రదర్శనలతో ఇతరుల మన్ననలను పొందుతారు. అంతేకాదు స్థిర ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. దీని వల్ల వీరి ఆదాయం అమాంతం పెరిగే అవకాశం ఉంది. వీరు తమకు ఏమి కావాలంటే అవి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతారు. వీరి దగ్గర అవసరాన్ని మించి ధనం ఉంటుంది.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ రాశి వారు జూన్ 5 తర్వాత మంచి వాహనాలు కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తోంది. వీరి ఆరోగ్యం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాదు వీరి వైవాహిక జీవితంలో కూడా సఖ్యత ఉంటుంది. పిల్లల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇక ధనం విషయానికొస్తే మీరు అనుకున్న సమయానికి డబ్బు చేతికి అందుతుంది. మీకు సంఘంలో గౌరవం కూడా పెరుగుతుంది.

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ రాశి వారికి భావోద్వేగాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీరు వారి కోసం కాకుండా కుటుంబం, స్నేహితులు, బంధువుల సంతోషం కోసం డబ్బును ఎక్కువగా ఖర్చు చేస్తారు. వీరికి జీవితంలో ఏ స్థితిలోనూ డబ్బుకు లోటు అనేదే ఉండదు. వీరు తమ కాళ్లపై తాము నిలబడగలుగుతారు. పెద్దలు ఇచ్చిన ఆస్తినే కాకుండా తమ తెలివితేటలతో డబ్బును సంపాదించుకుంటారు. జూన్ 5 తర్వాత వీరు మరింత ధనవంతులయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే వీరు డబ్బును మాత్రం నీళ్లలా ఖర్చు చేస్తుంటారు.

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగుకు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

English summary

The billionaires of these 5 zodiac signs will be out after June 5

Here are the billionaires of these 5 zodiac signs will be out after June 5. Take a look.
Story first published: Monday, June 1, 2020, 18:50 [IST]