For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలర్ట్! ఆఫీసుల్లో కరోనా వైరస్ రాకుండా ఉండేందుకు వీటి పట్ల అప్రమత్తంగా ఉండండి...

మీ ఆఫీసులో ల్యాండ్ ఫోన్ పై కూడా బ్యాక్టీరియా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది చదరపు అంగుళానికి 25 వేల వరకు అణువులను విడుదల చేస్తుంది.

|

మీరు పని చేసే చోట ఎవరైనా ఎవరైనా అనారోగ్యానికి గురైతే, వారి ఆరోగ్యం సరిగా లేదని మీరు గమనించవచ్చు. దీని వెనుక ఉన్న కారణాలను చాలా సులభంగా గుర్తించవచ్చు. అదేంటంటే మీరు పని చేసే ప్రదేశంలో సూక్ష్మక్రిములు మరియు బ్యాక్టీరియాతో నిండి ఉండటమే అని గుర్తించవచ్చు.

Germiest Places in the Workplace

ఎందుకంటే అంటువ్యాధులు మరియు పెరుగుదలకు ఆఫీసు రూమ్స్ అత్యంత అనుకూలమైన ప్రదేశం. ముఖ్యంగా ఆఫీసుల్లో కొన్ని రూమ్స్ లో బ్యాక్టీరియా చాలా సులభంగా రెట్టింపు అవుతుంది. అలాగే ఇతరులను మీరు తాకడం ద్వారా గాలి మరియు ఇతర వస్తువుల ద్వారా అత్యంత వేగంగా ఇది వ్యాపిస్తుంది. మీరు ఆఫీసులో ఉన్న సమయంలోనూ, మీ శరీరం సహజంగా సూక్ష్మక్రిములతో చుట్టుముడుతుంది. మీరు ఎంత శుభ్రంగా ఉన్నా, వ్యాధుల వ్యాప్తి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడం అనేది చాలా కష్టమైన విషయం. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల, మీరు పని చేసే చోట్ల, ముఖ్యంగా ఆఫీసుల్లో బ్యాక్టీరియా ఎక్కడ ఎక్కువగా ఉంటుందో చూడండి...

వాటర్ కూలర్..

వాటర్ కూలర్..

ఆఫీసుల్లో లేదా ఇతర చోట్ల ఎక్కడైనా ప్రతి ఒక్కరూ మంచి నీటిని తాగేందుకు వాటర్ కూలర్ ను సంప్రదిస్తారు. మీరు నీటి కోసం వాటర్ కూలర్ ను తాకేటప్పుడు ఓ విషయం గుర్తుంచుకోవాలి. బ్యాక్టీరియాకు నీరు ఉత్తమమైన పదార్థం. ఆఫీసులో లేదా ఇంకా ఎక్కడైనా జలుబు లేదా ఫ్లూ ఉన్న వ్యక్తి తన శరీరంలోని బ్యాక్టీరియాను ఇతరులను వ్యాప్తి చేసేందుకు వాటర్ కూలర్ ను ఉపయోగిస్తారు.

ఎలివేటర్ బటన్..

ఎలివేటర్ బటన్..

ప్రస్తుతం చాలా చోట్ల లిఫ్టులు, ఎస్కలేటర్ లు ఉపయోగించడం అనేది సర్వసాధారణమైపోయింది. దీని వల్ల వాటిని ఉపయోగించే వారంతా ఎలివేటర్ బటన్ ను ఉపయోగిస్తుంటారు. లేదా ఎస్కలేటర్ రైలింగులపై చేతులు పెడుతుంటారు. ఈ ప్రాంతాల్లో కూడా ఎవరైనా జబ్బు పడిన వారు తాకితే, మీకు ఆ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. మీరు కూడా అక్కడ తాకి ఉంటే వెంటనే చేతులు కడుక్కోవడం మంచిది.

డోర్ హ్యాండిల్స్..

డోర్ హ్యాండిల్స్..

మీ డోర్ హ్యాండిల్స్ కు బ్యాక్టీరియాకు నివాసంగా ఉంటాయి. చాలా మంది వ్యక్తులు రోజుకు ఒకటి కంటే ఎక్కువసార్లు వాటిని తాకుతుంటారు. అందుకే ప్రతిరోజూ వాటిని శుభ్రం అనేదే చేయరు. అందుకే మీరు వాటిని తాకిన వెంటనే క్రమం తప్పకుండా చేతులు శుభ్రపరచుకోవాలి.

డెస్క్ టాప్..

డెస్క్ టాప్..

కంప్యూటర్ కు సంబంధించిన డెస్క్ టాపు మీద కూడా బ్యాక్టీరియా ఎక్కువగా వ్యాపించి ఉంటుంది. వీటిని వాడే ముందు.. వాడిన తర్వాత కూడా మీ చేతులను శుభ్రం చేసుకోవాలి. అలాగే స్క్రీన్ క్లీనర్ ను ఉపయోగించి మీ డెస్క్ టాప్ ను శుభ్రపరచుకుంటే మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

కీబోర్డు అండ్ మౌస్..

కీబోర్డు అండ్ మౌస్..

ప్రస్తుతం దాదాపు ప్రతి ఒక్కరూ ఆఫీసుల్లో ల్యాప్ టాప్ లేదా కంప్యూటర్లను ఉపయోగిస్తున్నారు. వీటి కంటే ముఖ్యంగా కీబోర్డు మరియు మౌస్ తో పని చేయడం అనేది సర్వసాధారణం. వీటిని ఉపయోగించే ముందు మరియు తర్వాత కూడా మీ చేతులను శుభ్రంగా కడుక్కోండి లేదా శానిటైజర్ వాడండి.

టెలిఫోన్..

టెలిఫోన్..

మీ ఆఫీసులో ల్యాండ్ ఫోన్ పై కూడా బ్యాక్టీరియా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది చదరపు అంగుళానికి 25 వేల వరకు అణువులను విడుదల చేస్తుంది. అందుకే శానిటైజర్ తో కనీసం రెండుసార్లు ఫోన్ ను శుభ్రపరచండి. ప్రత్యేకించి ఇతర వ్యక్తులు కూడా మీ ల్యాండ్ ఫోన్ ను ఉపయోగిస్తుంటే ఈ పనిని కచ్చితంగా చేయండి.

ఆఫీసు పరికరాలు..

ఆఫీసు పరికరాలు..

మీ ఆఫీసులోని పరికరాలు ప్రింటర్, ఫ్యాక్స్ మరియు ఇతర మిషన్ల బటన్లపై కూడా సూక్ష్మక్రిములు వేగంగా వృద్ధి చెందుతాయి. వీటిని శుభ్రపరచడం గురించి చాలా తక్కువగా ఆలోచిస్తారు. అందుకే మీరు మిషన్ ను ఉపయోగించిన ప్రతిసారీ దానిని శుభ్రం చేసేందుకు ఓ గుడ్డముక్కను దగ్గర్లో ఉంచుకోండి.

ఫ్రిజ్ లేదా మైక్రోవేవ్..

ఫ్రిజ్ లేదా మైక్రోవేవ్..

మీరు నిత్యం వాడే రిఫ్రిజరేటర్ మరియు మైక్రోవేవ్ ఓవెన్ లో బ్యాక్టీరియా చాలా ఎక్కువగా నిల్వ ఉండే అవకాశం ఉంది. ప్రతిరోజూ చాలా మంది రిఫ్రిజరేటర్ మరియు మైక్రోవేవ్ యొక్క హ్యాండిల్ ను తాకుతారు. అందుకే అలాంటి హ్యాండిల్స్ ను ప్రతిరోజూ శుభ్రపరచండి.

సింక్..

సింక్..

మీ ఇంట్లో మరియు ఆఫీసులో వాడే సింక్ లలో కూడా బ్యాక్టీరియా మరియు ఇతర సూక్ష్మక్రిములు పెరగడానికి గొప్ప ప్రదేశంగా మారతాయి. ఎందుకంటే అనేక ఆహార పదార్థాలు మరియు ఎన్నో రకాల చేతులు వాటిని తాకుతాయి. ఇక్కడ కూడా మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

వాష్ రూమ్స్..

వాష్ రూమ్స్..

మీ ఇంట్లో మాదిరిగానే ఆఫీసుల్లోని వాష్ రూమ్స్ లో కూడా బ్యాక్టీరియా వంటి సూక్ష్మక్రిములు చాలా వేగంగా పెరుగుతాయి. ఇక్కడ టాయిలెట్ ఫ్లష్ హ్యాండిల్ ను తాకేటప్పుడు మీరు ఓ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. తరచుగా దానిపై అందరూ చేతులు పెడుతుంటారు కాబట్టి, దానిని టిష్యూ పేపర్ తో తాకాలి.

English summary

The Most Germiest Places in the Workplace

Here are some of the surprising spots within your office that contain germs. Take a look
Story first published:Wednesday, March 11, 2020, 13:10 [IST]
Desktop Bottom Promotion