For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వామ్మో! ఇది నేను చూడలా... Iphoneలతో ఏకంగా గోడనే కట్టేశాడండి బాబోయ్...

ఓ రిచ్ మ్యాన్ ఐఫోన్లతో ఏకంగా ప్రహరీగోడను కట్టిన వీడియోను మీరు చూడండి.

|

మన దేశంలో మధ్యతరగతి వాళ్లు చాలా ఎక్కువ. అలాంటి వారు కనీసం ఒక్కసారైనా ఐఫోన్ కొనుక్కోవాలని తెగ ఆరాటపడుతుంటారు. ఎందుకంటే ఎవరి చేతిలో అయినా ఐఫోన్ ఉందంటే వారు మాంచి సౌండ్ పార్టీ అన్నమాట. అలా మనతో ఐఫోన్ ఉంటే నీకెంటమ్మా నువ్వు మాంచి సౌండ్ పార్టీ ఐఫోన్ కొంటావు.. మ్యాక్ తీసుకుని మజా చేసుకుంటావు అంటూ ఉంటారు మన స్నేహితులు.

The Ultimate Apple Flex – Hundreds of iPhone 6 Phones Used as Decorative Tiles for House Fence

Image Curtosy

అయితే ఐఫోన్ కొనడమంటే అంత వీజీ కాదు. ఎందుకంటే అది ఎవ్వరికి దొరకనంత ఎత్తులో ఉంటుంది. అంటే అదొక సూపర్ బ్రాండ్. ఇప్పటికీ సూపర్ బ్రాండ్లలో అది నెంబర్ వన్ గా దూసుకెళ్తోంది. అది కూడా అందుకు తగ్గట్టే చాలా స్మార్ట్ గా ఉంటుంది. లుకింగ్ లోనూ దాని ప్రత్యేకతే వేరు. ఎందుకంటే అది ఐఫోన్. అంతేకాదు అందులోని ఫీచర్లు మరింత స్పెషల్. అందుకే దాన్ని కొనుక్కోవాలని చాలా మంది తెగ ఆరాటపడతారు.

అలాంటి ఐఫోన్ ను కొనడానికే మనం నానా తంటాలు పడుతుంటే.. ఒక వ్యక్తి మాత్రం ఏకంగా ఐఫోన్లతోనే ఇంటికి నిర్మించే గోడలనే కట్టేశాడు. దీంతో అందరూ ఆవాక్కైపోతున్నారు. అదేంటి ఐఫోన్ తో గోడలెలా కడతారు? అసలు ఇది సాధ్యమేనా? మీరేం చెబుతున్నారో మీకు అర్థమవుతుందా? అనే సందేహాలు మీకు రావొచ్చు. కానీ ఇది పచ్చి నిజం. కావాలంటే ఈ వీడియో చూడండి మీకే అర్థమవుతుంది.

The Ultimate Apple Flex – Hundreds of iPhone 6 Phones Used as Decorative Tiles for House Fence

వియత్నాం దేశానికి చెందిన ఓ వ్యక్తి టిక్ టాక్ యూజర్ ఈ ఐఫోన్ల ప్రహరీ గోడను వీడియో తీసి పోస్ట్ చేశాడు. దీంతో అది పిచ్చపిచ్చగా వైరల్ అవుతోంది. అది అప్ లోడ్ చేసిన కొన్ని గంటల్లోనే మిలియన్ల సంఖ్యలో వీవ్స్ వచ్చేశాయి. వస్తూనే ఉన్నాయి. దీనంతంటికి కారణం అందరూ ఇంటి ప్రహరీ గోడల నిర్మాణానికి టైల్స్ కు బదులుగా ఐఫోన్-6లను వాడటమే. అది కూడా ఒకటి కాదు..రెండు కాదు.. ఏకంగా కొన్ని వందల ఫోన్లను అతడు ఇంటి ప్రహరీగోడకు టైల్స్ లా వాడేశాడు.

The Ultimate Apple Flex – Hundreds of iPhone 6 Phones Used as Decorative Tiles for House Fence

అయితే ఆ ఇంటికి టైల్స్ లా కనిపిస్తున్న ఆ ఫోన్లన్నీIphone-6 మోడల్స్. ఈ మోడల్స్ ను యాపిల్ సంస్థ ఎప్పుడో నిలిపేసింది. వాటికి సంబంధించిన అప్ డేట్స్ కూడా రావడం లేదు. దీంతో ఐఫోన్-6 వినియోగదారులు.. ఆ ఫోన్లను అప్ డేట్ చేయలేక అమ్మేశారో లేదా ఏమి చేశారో తెలియదు కాని.. ఓ వ్యక్తి మాత్రం పని చేయని ఐఫోన్-6 ఫోన్లను కొనుగోలు చేసి ఆ వ్యక్తి ఇంటి ప్రహరీగోడ కోసం వాడేశాడు. అయితే ఐఫోన్ల వాల్ లుక్ మాత్రం భలే అందంగా కనిపిస్తోంది. ఈ వైరల్ వీడియో చూస్తే ఎవ్వరైనా అదుర్స్ అనే అంటారు.

English summary

The Ultimate Apple Flex – Hundreds of iPhone 6 Phones Used as Decorative Tiles for House Fence

A viral TikTok video of what looks likea concrete fence decorated with hundreds of iphone 6 smartphones has been doing the rounds online in Asia, sparking a heated debated about its authenticity.
Story first published:Saturday, June 6, 2020, 13:24 [IST]
Desktop Bottom Promotion