For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చాణక్య నీతి : ఈ లక్షణాలుండే స్త్రీలను పెళ్లి చేసుకుంటే అంతే సంగతులట...!

వైవాహిక జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి, భార్యభర్తల మధ్య అన్యోన్యత ఎందుకు లోపిస్తుంది అనే వివరాల గురించి చాణక్యుడు ఏమి చెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాం...

|

భారతదేశ పురాతన ఆర్థికవేత్త, తత్వవేత్త అయిన చాణక్యుడు అప్పట్లోనే మనకు ఎన్నో విలువైన సూత్రాలను, నియమాలను తన రచనల తెలియజేశాడు. అతని సూత్రాలను, చిట్కాలను ఇప్పటికీ మనకు తెలియకుండానే వాడుతున్నాం. అయితే ఈ విషయం చాలా మందికి తెలీదు. ఇక ఈరోజు విషయానికొస్తే చాణక్యుడు వివాహానికి సంబంధించి అనేక సూచనలు చేశాడు.

Tips For Successful Marriage By Chanakya

ఇక పెళ్లి విషయానికొస్తే, చాలా మంది పురుషులు పెళ్లికి ముందు ఎలా ఉన్నా.. పెళ్లి తర్వాత, భార్య, పిల్లలతో అనేక బాధ్యతలను మోయాల్సి ఉంటుంది. వాటన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కొని సంతోషంగా, సుఖంగా జీవించాలంటే మంచి భార్య వారి జీవితంలోకి రావాలి. అందుకే ప్రతి మగాడి వెనుక ఒక ఆడది ఉంటుందని అంటూ ఉంటారు.

Tips For Successful Marriage By Chanakya

అదే విధంగా మీరు మీ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరుకోవాలంటే, మీకు మీ భాగస్వామి యొక్క ప్రోత్సాహం కచ్చితంగా ఉండాలట. అందుకనే మానసిక శాస్త్రాన్ని అవకోశన పట్టిన చాణక్యుడు ఏడు లక్షణాలున్న అమ్మాయిల గురించి చెప్పాడు. ఈ లక్షణాలున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అంతే సంగతులని చెప్పాడు. ఈ సందర్భంగా ఆ లక్షణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

అమ్మాయిల స్వభావం.

అమ్మాయిల స్వభావం.

చాణక్యుని నీతిలో రెండో అధ్యాయంలో ‘‘అన్రితం సహనం మాయ ముర్గట్రామడిలుప్తా అశోకచత్వం నిర్మ్వాద్వం శ్రీనం తోషా స్వాభాషా‘‘ అని వివరించారు. దీని అర్థం ఏమిటంటే అబద్ధం అనే ఆలోచన లేకుండా ధైర్యం, వంచన, తెలివితక్కువ పనులు, దురాశ, మరియు క్రూరత్వం. ఒక అమ్మాయి స్వభానికి ఇవే ఆధారమన్నారు.

వివాహ ప్రాధాన్యత..

వివాహ ప్రాధాన్యత..

వివాహం అనే ఘట్టం ప్రతి ఒక్కరికీ వారి జీవితంలో చాలా ముఖ్యమైనది. ప్రతి ఒక్కరూ తాము విజయవంతమైన వివాహం చేసుకోవాలని కోరుకుంటారు. దీంతోనే వారికి శాంతి మరియు ఆనందం లభిస్తుందని చెప్పాడు. అందుకు సంబంధించిన కొన్ని వాస్తవాలను మనకు అందించాడు.

వాస్తవం -1

వాస్తవం -1

ఈ ప్రపంచంలో చాలా మంది పురుషులు అందమైన అమ్మాయినే వివాహం చేసుకోవాలనుకుంటారు. కానీ చాణక్యుని అభిప్రాయం అందుకు భిన్నంగా ఉంటుంది. చాణక్యుని నీతి ప్రకారం, ఒక అమ్మాయిని వివాహం చేసుకోవాలంటే కేవలం అందంగా ఉంటే సరిపోదు, ఆమె మంచి కుటుంబానికి కూడా చెందిన స్త్రీ అయ్యుండాలట. అప్పుడే అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంట. ఒకవేళ అమ్మాయి అందంగా ఉన్నప్పటికీ, తల్లిదండ్రుల ప్రవర్తన, వారి కుటుంబ నేపథ్యం మంచిగా లేకపోతే, అలాంటి అమ్మాయిలను వివాహం చేసుకోవద్దన్నాడు.

వాస్తవం - 2

వాస్తవం - 2

ఒక వ్యక్తి తన సామాజిక స్థితి కంటే సమానంగా లేదా అంతకంటే తక్కువగా ఉండే కుటుంబంతోనే వైవాహిక సంబంధం కలిగి ఉండాలి. వివాహం ఎప్పుడూ దాని హోదా కంటే ఉన్నత స్థాయిలో ఉండకూడదు. దీని వల్ల సమాజంలో తనకున్న గౌరవాన్ని కోల్పోతారని చెప్పారు.

వాస్తవం -3

వాస్తవం -3

అందంగా కాకపోయినా, సమాజంలో మంచి పేరున్న కుటుంబంలో జన్మించిన స్త్రీని వివాహం చేసుకోవడం విజయవంతమైన వివాహానికి దారితీస్తుంది. రెండు కుటుంబాలు ఆరోగ్యంగా ఉండాలని ఆయన సలహా ఇస్తున్నారు.

వాస్తవం - 4

వాస్తవం - 4

మీ వివాహం విజయవంతం కావాలంటే, అమ్మాయిలైనా, అబ్బాయిలైనా ఇద్దరూ ఒకే రకంగా ప్రేమించేందుకు ప్రయత్నించాలి. ఇలా చేయలేని వారు ప్రేమ మరియు భావాలకు విధేయులుగా ఉండేందుకు ప్రయత్నించాలి. అలాగే అమ్మాయి యొక్క గుణగణాలను బాగా పరిశీలించాలట. ముఖ్యంగా మీతో ఎంత నమ్మకంగా ఉంటుందో చూడాలట.

వాస్తవం- 5

వాస్తవం- 5

మీకు బయట ఎన్న ఇబ్బందులున్నా, ఇంటికొచ్చేసరికి కాస్త విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటారు. మరి మీరు ఇంట్లో రిలాక్స్ కావాలంటే, ఆ ఇల్లు శుభ్రంగా మరియు అందంగా అలంకరించి ఉండాలి. అలా ఉన్న ఇంట్లోకి వెళ్లగానే మీరు హాయిగా విశ్రాంతి తీసుకుంటారట. అదే ఆ ఇల్లు అశుభ్రంగా ఉండి, ఇంటి నిండా వస్తువులన్నీ చిందవందరగా ఉంటే, మీకు చికాకు పుడుతుందట. ఇవన్నీ జరగాలంటే మీ ఇల్లాలికి ఇంటి పని, వంట పనిపై మంచి అవగాహన ఉండాలట.

వాస్తవం-6

వాస్తవం-6

సాధారణంగా అమ్మాయిలు తమ అందానికి చాలా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. అందరికంటే అందంగా కనిపించాలని భావిస్తారు.అయితే అలా ఉండటంలో ఎలాంటి తప్పు లేదట. అయితే అందమే ప్రపంచమే బతికేవారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోకూడదట. ఎందుకంటే అలాంటి లక్షణాలుండే అమ్మాయిలు తమతో పాటు తమ చుట్టూ ప్రతిదీ అందంగా ఉండాలని కోరుకుంటారట. అంతేకాదు వీరు అందం మీద పెట్టిన శ్రద్ధ మరేదానిపై పెట్టారట. ఒకవేళ మీకేదైనా జరిగి, మీరు అందవికారంగా మారితే, మిమ్మల్ని వదిలేయడానికి కూడా సిద్ధపడతారట.

వాస్తవం - 7

వాస్తవం - 7

ఏ అమ్మాయి అయినా ప్రతి చిన్న విషయానికీ గొడవ పడటం. ప్రతి సందర్భంలోనూ మీతో వాదన చేస్తే, అటువంటి అమ్మాయిల జోలికి అస్సలు వెళ్లొద్దంటున్నాడు. ఎందుకంటే వీరు తాము చెప్పిందే జరగాలనే మొండి పట్టుదలతో ఉంటారట. తమతో ఉండే వారిని తమ అదుపులో ఉంచుకునేందుకు ఎంత దూరమైన వెళ్తారట. అలాంటి అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే మీకు ప్రత్యక్ష నరకం కనిపిస్తుందని హెచ్చరించాడు.

వాస్తవం -8

వాస్తవం -8

హైందవ ధర్మంలో దైవరాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. భక్తి శ్రద్ధలతో భగవంతుడిని కొలవడం వల్ల మనకు మంచి బుద్ధి వస్తుందని చాలా మంది నమ్మకం. అందువల్ల మీరు వివాహం చేసుకునే అమ్మాయికి దైవ భక్తి ఉండాలట. అలాంటి లక్షణాలుండే అమ్మాయి తనతో పాటు తన కుటుంబీకులకు మంచి పేరు తెచ్చిపెడుతుందట.

వాస్తవం - 9

వాస్తవం - 9

ప్రతి ఒక్క మహిళ తన కుటుంబంతో చాలా విశ్వాసంగా ఉండాలట. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా, మీకు మీ కుటుంబ సభ్యులకు వెన్నుదన్నుగా ఉండే మహిళనే పెళ్లి చేసుకోవాలట. ఇలాంటి లక్షణాలుండే అమ్మాయిలను ఎలాంటి సందేహం లేకుండా పెళ్లి చేసుకోవచ్చట.

వాస్తవం -10

వాస్తవం -10

అయితే అమ్మాయిలలో చాలా మంది స్వార్థపరులు ఎక్కువగా ఉంటారట. తను మాత్రం బాగుంటే చాలని, తన భాగస్వామి, తన కుటుంబ సభ్యులు ఏమైపోయినా పర్వాలేదు అనుకునే వారికి అస్సలు వివాహం చేసుకోకూడదట.

వాస్తవం -11

వాస్తవం -11

అబద్ధాలు చెప్పే అమ్మాయిలను ఎప్పటికీ వివాహం చేసుకోకూడదట. ఒకవేళ వారు మీకు అబద్ధం చెప్పినప్పుడు మీ మీద ప్రేమతో చెప్పారనుకుంటే,మీరు పొరబడినట్టేనట. ఇలాంటి అమ్మాయిలు కుటుంబాలను విడదీసేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతారట. అందుకనే ఇలాంటి అమ్మాయిలను వివాహం చేసుకోకూడదని చెబుతున్నాడు చాణక్యుడు.

వాస్తవం -12

వాస్తవం -12

తనను, తన కుటుంబ సభ్యులను నమ్మక ద్రోహం చేసే అమ్మాయిలను ఎప్పటికీ పెళ్లి చేసుకోకూడదట. అలా కాకుండా మీరు ఇలాంటి లక్షణాలుండే అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే, మీ జీవితాన్ని మీరే చేతులారా నాశనం చేసుకున్నట్టే అని చెబుతున్నాడు చాణక్యుడు.

చాణక్యుని ప్రకారం వివాహానికి సంబంధించిన ఎన్నో కీలకమైన విషయాలను చూశారు కదా ఫ్రెండ్స్. మీకు ఈ స్టోరీ నచ్చితే మీ స్నేహితులకు, బంధుమిత్రులకు షేర్ చేయండి. వివాహం గురించి వారిని కూడా అప్రమత్తం చేయండి...

English summary

Tips For Successful Marriage By Chanakya

Here are the tips for successful marriage by chanakya. Take a look
Desktop Bottom Promotion