Just In
- 48 min ago
జూలై 12 నుండి మకరరాశిలోకి శని సంచారం; రాబోయే 6 నెలలు, శని ఈ రాశులపై కోపంగా ఉంటారు..జాగ్రత్త!!
- 3 hrs ago
Dandruff problem: మౌత్ వాష్ వల్ల చుండ్రు పూర్తిగా పోతుంది... వెంటనే ట్రై చేయండి...
- 5 hrs ago
Asthma: ఆస్తమాకు సరైన సమయంలో చికిత్స అందివ్వకపోతే..ఈ ప్రధాన సమస్యలతో పాటు ప్రాణాంతకం అని తెలుసుకోండి..
- 11 hrs ago
Today Rasi Phalalu :ఈ రోజు మీ జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదురవుతాయి, తెలుసుకోవాలనే ఆసక్తి మీకు ఉందా?
Don't Miss
- Finance
LIC Policy: మహిళలకు LIC స్పెషల్.. రోజూ రూ.29 చెల్లిస్తే రూ.4 లక్షల రాబడి.. పూర్తి వివరాలు
- Automobiles
కొత్త 2022 కియా సెల్టోస్ టెలివిజన్ కమర్షియల్ రిలీజ్.. ఇది భారత మార్కెట్లో విడుదలయ్యేనా?
- Sports
టీ20 ప్రపంచకప్ జట్టులోకి ఉమ్రాన్ మాలిక్‌ను తీసుకుంటాం: రోహిత్ శర్మ
- News
విగ్గు రాజాకా అన్నీ భయాలే-కానిస్టేబుల్ అన్నా, ట్రైన్ అన్నా.. సాయిరెడ్డి సెటైర్ ట్వీట్స్
- Movies
Top Telugu Movies 2022 First Half: ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ సాధించిన తెలుగు సినిమాలు.. టాప్ 3లో KGF 2
- Technology
టెక్నో స్పార్క్ 8P బడ్జెట్ ధరలో లాంచ్ అయింది!! ధరలు, ఫీచర్స్ ఇవిగో
- Travel
మన్యంలో మరుపురాని దృశ్యాలు..!
Today Rasi Phalalu :ఈ రాశుల వారికి ఆదాయం కంటే ఎక్కువ ఖర్చులు...!
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ 'శుభకృత్' నామ సంవత్సరం, వైశాఖ మాసంలో ఆదివారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.
ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...
Surya
Gochar
2022:
వృషభంలోకి
సూర్యుడి
సంచారం..
ఈ
రాశులపై
తీవ్ర
ప్రభావం..!

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది. అకస్మాత్తుగా మీ ఆదాయం పెరగొచ్చు. అయితే మీరు ఆలోచించకుండా ఖర్చు చేస్తే, మీరు పెద్ద ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. పని విషయంలో ఈరోజు మంచిగా ఉంటుంది. వ్యాపారులు ఈరోజు ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా ఈరోజు నష్టపోయే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో ఈరోజు అప్రమత్తంగా ఉండాలి.
లక్కీ కలర్ : డార్క్ ఎల్లో
లక్కీ నంబర్ :8
లక్కీ టైమ్ : సాయంత్రం 5:15 నుండి రాత్రి 9:20 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20
ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో చాలా మంచిగా ఉంటుంది. ఉద్యోగులు ఈరోజు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. వ్యాపారులు ఈరోజు ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీరు సకాలంలో పనులు పూర్తి చేయాలి. ఆర్థిక పరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలొస్తాయి. మీరు పొదుపుపై ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ఆరోగ్య పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : ఎల్లో
లక్కీ నంబర్ :28
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:30 నుండి సాయంత్రం 6:15 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20
ఈ రాశి వారికి ఈరోజు ప్రేమ విషయంలో మంచిగా ఉండొచ్చు. మీకు కొంతకాలంగా మీ భాగస్వామితో విభేదాలు కలిగి ఉన్నట్లయితే, ఈరోజు అపార్థాలన్నీ తొలగిపోతాయి. మరోవైపు ఈరోజు వివాహితులకు చాలా ప్రత్యేకమైన రోజు కానుంది. మీరు మీ జీవిత భాగస్వామితో కొన్ని శుభవార్తలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులు కోరుకున్న బదిలీని పొందొచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.
లక్కీ కలర్ : బ్రౌన్
లక్కీ నంబర్ :22
లక్కీ టైమ్ : ఉదయం 7:30 నుండి మధ్యాహ్నం 3:40 గంటల వరకు
ఈ
5
రాశుల
వారు
ఎప్పుడూ
భార్యకు
లొంగిపోతారు...
అయినా
మంచి
భర్తగా
ఉంటారు!

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21
ఈ రాశి వారికి ఈరోజు చాలా విషయాల్లో చిరాకుగా అనిపించొచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. మీరు విశ్రాంతిపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. మీరు ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నిస్తుంటే, మీరు మీ ప్రయత్నాలను వేగవంతం చేయాలి. మీరు ఎంత కష్టపడి పని చేస్తే అంత మంచి ఫలితాలొస్తాయి. వ్యాపారులకు ఈరోజు మంచిగా ఉంటుంది. మీ బడ్జెట్ ను ద్రుష్టిలో ఉంచుకుని ఖర్చులు చేయండి.
లక్కీ కలర్ : డార్క్ రెడ్
లక్కీ నంబర్ :28
లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):
ఈ రాశి వారు ఈరోజు ఇంటి సభ్యులతో చాలా ఆహ్లాదకరంగా గడుపుతారు. మరోవైపు మీరు పూర్వీకుల వ్యాపారంతో సంబంధం కలిగి ఉంటే, ఈరోజు మీరు వారి నుండి కొన్ని మంచి సలహాలు పొందొచ్చు. ఉద్యోగులకు ఈరోజు పురోభివ్రుద్ధికి అవకాశం ఉంది. మీరు ఉద్యోగంతో పాటు సొంతంగా చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే, మీరు తొందరపడి అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. మీ ఆర్థిక పరిస్థితి సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది.
లక్కీ కలర్ : బ్లూ
లక్కీ నంబర్ :12
లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12:55 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21
ఈ రాశి వారు ఈరోజు మంచి మానసిక స్థితిని కలిగి ఉంటారు. మీరు మీ జీవితంలో ఆనందం మరియు శాంతిని అనుభవిస్తారు. ఈరోజు మీరు మీ ప్రతి ముఖ్యమైన నిర్ణయాన్ని చాలా జాగ్రత్తగా తీసుకుంటారు. వ్యక్తిగత జీవితంలో పరిస్థితులు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీ కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడతాయి. మీకు తల్లిదండ్రుల మద్దతు లభిస్తుందది. ఉద్యోగులకు కార్యాలయంలో ఉన్నతాధికారులు సహోద్యోగుల మద్దతు పొందుతారు.
లక్కీ కలర్ : ఆరెంజ్
లక్కీ నంబర్ :14
లక్కీ టైమ్ : ఉదయం 8:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు
వృషభంలో
బుధుడి
అస్తమయం..
రాశిచక్రాలపై
పడే
ప్రభావం..
పాటించాల్సిన
పరిహారాలివే...!

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22
ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మీ వ్యక్తిగత జీవితంలోని కొన్ని సమస్యలు వస్తాయి. ఉద్యోగులు, వ్యాపారులు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. మీకు మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం బాగుంటుంది. ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. పెరుగుతున్న ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి.
లక్కీ కలర్ : కుంకుమ
లక్కీ నంబర్ : 20
లక్కీ టైమ్ : ఉదయం 9:20 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21
ఈ రాశి వారిలో ఉద్యోగులు ఏదైనా పెద్ద ప్రాజెక్టులో పనిచేస్తుంటే, మీకు సంబంధించిన ప్లాన్లను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. మీరు తొందరపాటు మరియు భయాందోళనలను నివారించాలి. భాగస్వామ్యంతో వ్యాపారం చేసే వ్యక్తులు ఈరోజు భారీ ఆర్థిక లాభాలను పొందొచ్చు. మీ వ్యాపారం పెరుగుతుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ తల్లి ఆరోగ్యంలో మెరుగ్గా ఉంటుంది. ఈరోజు మీరు మీ ప్రియమైన వారితో ఎక్కువ సమయం గడపగలుగుతారు. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : రోజ్
లక్కీ నంబర్ :4
లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21
ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈరోజు మంచి అవకాశాలు లభిస్తాయి. భాగస్వామ్యంతో ఏదైనా కొత్త పనిని ప్రారంభించబోతున్నట్లయితే, ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీరు ఆఫీసులో పనిపై ఫోకస్ పెట్టాలి. ఈరోజు మీ ఇంటి వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు అజాగ్రత్తగా ఉండొద్దు. ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని సమస్యలు ఉండొచ్చు.
లక్కీ కలర్ : రోజ్
లక్కీ నంబర్ :6
లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 10:15 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19
ఈ రాశి వారిలో ఉద్యోగులు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సమస్య ఉంటే, మీరు ప్రశాంతంగా పని చేయాలి. వ్యాపారస్తులు ఈరోజు దూర ప్రయాణాలకు దూరంగా ఉండాలి. ఈరోజు అనవసరమైన ఖర్చులు కూడా పెరగొచ్చు. ఆరోగ్యంగా ఉండాలంటే రాత్రిపూట పని చేయకుండా ఉండాలి.
లక్కీ కలర్ : మెరూన్
లక్కీ నంబర్ :31
లక్కీ టైమ్ : ఉదయం 10:30 నుండి సాయంత్రం 4:50 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18
ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామికి తగినంత సమయం ఇవ్వగలరు. మీరు మీ ప్రియమైన వారితో భవిష్యత్తు ప్రణాళికలను కూడా చర్చించొచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు చాలా ఖరీదైనది. ఉద్యోగులు కార్యాలయంలో సహోద్యోగులతో వివాదాలకు దూరంగా ఉండాలి. మీరు ఇటీవల ఏదైనా పెట్టుబడి పెట్టినట్లయితే, దాని నుండి మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఆరోగ్య పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : రెడ్
లక్కీ నంబర్ :21
లక్కీ టైమ్ : ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా ప్రతికూలంగా ఉంటుంది. మీకు ఆదాయం కంటే ఎక్కువ ఖర్చులు ఉండొచ్చు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు ప్రతికూలంగా ఉండొచ్చు. ఉద్యోగులకు పురోగతికి మంచి అవకాశం లభిస్తుంది. మీకు ప్రమోషన్ గురించి కొన్ని శుభవార్తలు వినిపించొచ్చు. ఈరోజు మీరు మంచి ఆర్థిక లాభాలను పొందే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో ఈరోజు అజాగ్రత్తగా ఉండకండి.
లక్కీ కలర్ : డార్క్ బ్లూ
లక్కీ నంబర్ : 10
లక్కీ టైమ్ : సాయంత్రం 4:30 నుండి రాత్రి 9:05 గంటల వరకు
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.