For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Today Rasi Phalalu :ఓ రాశి వారు ఈరోజు శుభవార్తలు వింటారు...!

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ 'శుభకృత్' నామ సంవత్సరం, ఛైత్ర మాసంలో మంగళవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

Guru Gochar 2022 :12 ఏళ్ల తర్వాత మీనంలోకి గురుడి సంచారం... ఈ రాశుల వారికి శుభ ఫలితాలు...!

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు మంచిగా ఉంటుంది. మీ సంబంధంలో కొనసాగుతున్న కొన్ని సమస్యలు అధిగమించబడతాయి. మీరు మీ ప్రియమైనవారితో మంచి సమయాన్ని గడపగలుగుతారు. మీరు వివాహం చేసుకుంటే మీ వైవాహిక జీవితంలో ఆనందం వస్తుంది. మరోవైపు, ప్రేమ విషయంలో కూడా మీరు ఈరోజు మంచి ఫలితాలను పొందొచ్చు. ఈరోజు మీ భాగస్వామి మీతో తన మనసును బహిరంగంగా పంచుకుంటారు. దీంతో మీ సంబంధం మరింత బలపడుతుంది. ఈరోజు ఉద్యోగమైనా లేదా వ్యాపారమైనా మీరు కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. అయితే, మీరు మీ కష్టానికి తగిన ఫలాన్ని త్వరలో పొందుతారు. ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలొస్తాయి. ఆరోగ్యం విషయంలో ఒత్తిడి లేకుండా ఉండాలి.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ :9

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 8:15 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారు ఈరోజు పనిపై పూర్తి శ్రద్ధ వహించాలి. ఉద్యోగులు కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయడానికి చాలా కష్టపడతారు. మరోవైపు, వ్యాపారులకు ఈరోజు చాలా బిజీగా ఉంటుంది. మీరు కొన్ని పెద్ద మరియు ముఖ్యమైన వ్యాపార నిర్ణయాలు తీసుకోవచ్చు. మీ జీవిత భాగస్వామితో సంబంధంలో పారదర్శకంగా ఉండండి. మీ మనసులో ఏదైనా విషయం ఉంటే దానిని మీ ప్రియమైన వారితో పంచుకోవడానికి ప్రయత్నించండి. మౌనంగా ఉండడం వల్ల మీ మధ్య అపార్థాలు పెరుగుతాయి. ఆర్థిక పరంగా ఈరోజు ఖరీదైన రోజు. మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు, మీకు చేతులు మరియు కాళ్ళకు సంబంధించిన కొన్ని సమస్యలు ఉండొచ్చు.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ :15

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:15 నుండి రాత్రి 9 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు వైవాహిక జీవితంలో సంతోషం పెరుగుతుంది. మీరు మీ గృహ జీవితానికి పూర్తి శ్రద్ధ ఇవ్వగలరు. మీరు మీ ప్రియమైన వారిని డేటింగుకి కూడా తీసుకెళ్లొచ్చు. మీరు ఒంటరిగా ఉండి, మీకు వివాహ ప్రతిపాదన వస్తే, అటువంటి విషయాలలో మీరు తొందరపాటుకు దూరంగా ఉండాలి. మీరు తెలివిగా నిర్ణయం తీసుకోండి. మీరు కార్యాలయంలోని సహోద్యోగులపై ఎక్కువగా ఆధారపడటం హానికరం. మీకు సంబంధించిన రహస్య విషయాలను ఎక్కువగా వ్యాప్తి చేయడం మానుకోండి. వ్యాపారస్తులు తమ ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన కొనుగోళ్లు కూడా చేయొచ్చు. ఈరోజు మీ ఆరోగ్యం బాగుంటుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ :31

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి రాత్రి 7 గంటల వరకు

Ketu Transit 2022 :తుల రాశిలోకి కేతువు సంచారం.. 12 రాశుల జీవితాలు ఎలా మారతాయంటే...!

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

ఈ రాశి వారిలో వ్యాపారులు మంచి ఫలితాలను పొందొచ్చు. మీరు మీ కృషి మరియు అవగాహనతో ఈరోజు మంచి లాభాలను పొందొచ్చు. మరోవైపు ఉపాధి కూలీలకు ఆశించిన ఫలితాలు రాకపోతే నిరాశ చెందాల్సిన పనిలేదు. త్వరలో మీ కష్టానికి తగిన ఫలితం పొందుతారు. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు మీరు అతని నుండి ప్రత్యేక బహుమతిని పొందొచ్చు. మీ ప్రియమైన వారి ప్రేమ మరియు మద్దతు పొందడం ద్వారా మీరు చాలా సానుకూలంగా భావిస్తారు. మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడానికి మీరు ఈరోజు కొన్ని బలమైన చర్యలు తీసుకోవచ్చు.

లక్కీ కలర్ : లైట్ గ్రీన్

లక్కీ నంబర్ :11

లక్కీ టైమ్ : ఉదయం 5:45 నుండి మధ్యాహ్నం 1:25 గంటల వరకు

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):

ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఈరోజు చాలా అదృష్ట దినంగా ఉంటుంది. మీ కృషి మీకు గొప్ప విజయాన్ని అందించగలదు. మీరు ఉన్నత పదవిని పొందొచ్చు. అలాగే మీ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. వ్యాపార విషయాలలో మరింత జాగ్రత్తగా ఉండాలి. మీకు కొత్త బిజినెస్ ఆఫర్ వస్తే, తొందరపడి నిర్ణయం తీసుకోకండి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈరోజు మీరు మీ కష్టార్జితం నుండి అదనపు డబ్బు సంపాదించగలరు. మీ ఇంటి వాతావరణం బాగుంటుంది. ఈరోజు ప్రియమైన వారితో సంతోషకరమైన రోజు అవుతుంది. మీరు మీ జీవిత భాగస్వామితో చాలా శృంగార సమయాన్ని గడుపుతారు. మీరు మీ ప్రియమైనవారి కోసం ఆశ్చర్యాన్ని కూడా ప్లాన్ చేయొచ్చు. ఆరోగ్య పరంగా మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : డార్క్ ఎల్లో

లక్కీ నంబర్ :14

లక్కీ టైమ్ : సాయంత్రం 4:05 నుండి రాత్రి 9 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈరోజు కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. ఈరోజు మీరు ఏ కొత్త పనిని ప్రారంభించకుండా ఉండాలి. ఈ సమయంలో మీరు ఏ కొత్త పనిని చేతిలోకి తీసుకోకుండా ఉంటే మంచిది. ఉద్యోగస్తులు అహంకారానికి దూరంగా ఉండాలి. ఇతరులను మీ కంటే తక్కువగా భావించే తప్పు చేయొద్దు. గవర్నమెంట్ జాబ్ చేస్తే పెద్ద పదవి వస్తుంది. ఈరోజు ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలొస్తాయి. మీరు మీ ఆదాయం మరియు ఖర్చుల మధ్య బ్యాలెన్స్ పాటించాలి. మీ జీవిత భాగస్వామితో వివాదాలు ఉండొచ్చు. మీ పరస్పర అవగాహన కారణంగా మీ మధ్య పెద్ద సమస్య ఏమీ ఉండదు. మీ ఆహారం మరియు పానీయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి, ముఖ్యంగా పాత ఆహారాన్ని నివారించండి.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ :20

లక్కీ టైమ్ : ఉదయం 8:40 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు

Rahu Transit 2022 :మేషంలోకి రాహు సంచారం.. ఈ రాశుల వారు జాగ్రత్త...!

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారిలో ఈరోజు ప్రేమికులకు అద్భుతంగా ఉంటుంది. మీరు ఒంటరిగా ఉండి ఎవరినైనా ప్రపోజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటే, ఈరోజు దానికి అనుకూలమైన రోజు. మీరు మీ అభిప్రాయాన్ని నమ్మకంగా మరియు బహిరంగంగా మాట్లాడినట్లయితే, మీరు సానుకూల సమాధానం పొందే అవకాశం ఉంది. మరోవైపు, ఈ రాశిచక్రంలోని వివాహితులు తమ వైవాహిక జీవితంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. పనితో పాటు, మీరు మీ ప్రియమైన వ్యక్తి కోసం కూడా సమయాన్ని వెచ్చించాలి. ఉద్యోగస్తులు ఈరోజు ఉద్యోగానికి సంబంధించి ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. మరోవైపు, వ్యాపారులు డబ్బు కష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది. మీ పెరుగుతున్న ఖర్చులకు మీరు అడ్డుకట్ట వేయాలి. మీ ఆరోగ్యం క్షీణించొచ్చు.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ :5

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:30 నుండి సాయంత్రం 7 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారిలో విద్యార్థులకు కొంత ఉపశమనం కలిగిస్తుంది. మీ చదువులో వస్తున్న ఆటంకాలు తొలగిపోయి శ్రద్ధగా చదువుకోగలుగుతారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారికి మరికొన్ని శుభవార్తలు అందే అవకాశం ఉంది. ఉద్యోగాలు చేసే వ్యక్తులు కార్యాలయంలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈరోజు బాస్ మీ పనితీరు పట్ల చాలా అసంతృప్తిగా ఉంటారు. వ్యాపారానికి సంబంధించిన వ్యక్తులు అనవసరంగా పరుగులు తీయాల్సి రావొచ్చు. ఈరోజు మీరు అనవసరమైన విషయాల కోసం చాలా డబ్బు ఖర్చు చేయొచ్చు. మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు.

లక్కీ కలర్ : డార్క్ రోజ్

లక్కీ నంబర్ : 4

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ప్రారంభంలో మంచిగా ఉంటుంది. ఉదయాన్నే మీరు కొన్ని శుభవార్తలు వింటారు. దీంతో మీ మనసు చాలా సంతోషంగా ఉంటుంది. మీరు మీ ఆనందాన్ని మీ ప్రియమైన వారితో పంచుకుంటారు. ఉద్యోగులు తమ సోమరితనాన్ని వదిలేసి, వారి ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టాలి. ప్రత్యేకించి బాస్ మీకు ఏదైనా పనిని అప్పగించినట్లయితే, మీ ఉత్తమమైనదాన్ని అందించడానికి ప్రయత్నించండి. త్వరలో మీ కోసం కొత్త పురోగతి మార్గాలు తెరవబడతాయి. వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు ఈరోజు పెద్ద ఆర్థిక లాభాలను పొందొచ్చు. మీ వ్యాపారం పుంజుకుంటుంది. మీరు ఆర్థిక పరంగా ఈరోజు అదృష్టవంతులు అవుతారు. మీరు ఆకస్మికంగా డబ్బు అందే అవకాశం ఉంది. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ :38

లక్కీ టైమ్ : ఉదయం 7:55 నుండి ఉదయం 10:30 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారికి ఈరోజు చాలా బిజీగా ఉంటుంది. మీరు ఈరోజు పనికి సంబంధించి సుదీర్ఘ ప్రయాణం చేయొచ్చు. ఆస్తి, రవాణా, మీడియా, ప్రింటింగ్ మొదలైన వాటికి సంబంధించిన వ్యక్తులు ఈరోజు మంచి ఫలితాలను పొందుతారు. మీ కష్టానికి తగిన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు ఆహ్లాదకరంగా ఉంటాయి. ఈరోజు ఇంట్లో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించొచ్చు. ఈరోజు మీరు స్వేచ్ఛగా ఆనందిస్తారు. మీరు మీ బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని మాత్రమే ఖర్చు చేయాలి. నిద్రలేమి సమస్యలతో బాధపడేవారు, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ :19

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు చాలా కష్టంగా ఉంటుంది. గ్రహాల ప్రతికూల ప్రభావాల కారణంగా, మీ ప్రవర్తన మరియు మాటలలో చాలా చేదు ఉండొచ్చు. మీ చుట్టుపక్కల వారితో కూడా వాగ్వాదాలు జరిగే అవకాశం ఉంది. చిన్న చిన్న విషయాలకే కోపం రావొచ్చు. కార్యాలయంలో పని భారం ఎక్కువగా ఉంటుంది, అలాగే పై అధికారుల ఒత్తిడి కూడా మీపై ఉంటుంది. మరోవైపు, వ్యాపారవేత్తలు కఠినమైన పోరాటం తర్వాత మంచి లాభాలను పొందొచ్చు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. మీ మాటలు పిల్లలకు చికాకు కలిగిస్తాయి. మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఒత్తిడి మరియు అలసట కారణంగా ఆరోగ్యం క్షీణిస్తుంది.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ :10

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1:20 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారు ఈరోజు స్నేహితులతో సరదాగా గడుపుతారు. పని విషయంలో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ హార్డ్ వర్క్ మరియు పాజిటివ్‌ని చూసి బాస్ కూడా చాలా ఇంప్రెస్ అవుతారు. భాగస్వామ్యంతో వ్యాపారం చేసే వ్యక్తులకు ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. మీ భాగస్వామితో సత్సంబంధాలు మెరుగ్గా ఉంటాయి. ఈరోజు మీరు ఆశించిన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామితో ఉన్న అపార్థాలన్నీ తొలగిపోతాయి. మీరు మీ ప్రియురాలితో కలిసి వారికి ఇష్టమైన ప్రదేశానికి నడకకు వెళ్లొచ్చు. ఈరోజు ఎక్కువసేపు ఎండలో ఉండకుండా ఉండండి.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ :29

లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

English summary

Today Rasi Phalalu -19 April 2022 Daily Horoscope in Telugu, Today Horoscope in Telugu

Read your daily horoscope if you are eager to know about your day. Here you will get all the important information related to your personal life, financial life, business, job, married life, etc. So let's see what is in your fate today.
Story first published:Tuesday, April 19, 2022, 11:16 [IST]
Desktop Bottom Promotion