For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉద్యోగం కోల్పోయారా, ప్రమోషన్ రావట్లేదా, నచ్చిన జాబ్ దొరకట్లేదా.. మీకోసమే ఈ వాస్తు చిట్కాలు

ఉద్యోగంలో ఎదురయ్యే ఒత్తిడి, సమస్యలు, జాబ్ రాకపోవడం లాంటి ఎన్నో సమస్యలకు వాస్తు శాస్త్రంలో పరిహారాలు ఉన్నాయి. కొన్ని వాస్తు నియమాలు పాటిస్తే వృత్తిగత జీవితం సాఫీగా సాగడంతో పాటు వ్యక్తిగత జీవితం ఆనందంగా ఉంటుంది. ఆ వాస్తు చ

|

ఉద్యోగమో, వ్యాపారమో ఆదాయం కోసం ఏదో ఒకటి చేయాల్సిందే. వ్యాపారాన్ని వదిలేస్తే ఉద్యోగం అనేది సవాళ్లతో కూడుకుని ఉంటుంది. ప్రైవేటు ఉద్యోగుల బాధలు ఎంత చెప్పినా తక్కువే. మనకు నచ్చకపోయినా మనకే నష్టం, యజమానులకు నచ్చకపోయినా మనకే నష్టం. ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు ఊడుతుందో తెలియని పరిస్థితిలో పని చేయాల్సి వస్తుంది. దీనికి తోడు టార్గెట్లు. టార్గెట్లు రీచ్ అవ్వడంకోసం పడే ఒత్తిడి, అవ్వకపోతే తిట్లు, చివాట్లు. ఇంకా ఈ మధ్య లేఆఫ్స్‌ వల్ల మిమ్మల్ని ఊడబీకేశాం అనే వార్త ఎప్పుడు వింటామో తెలియని దయనీయ పరిస్థితి.

Vastu tips for growth in work life in Telugu

ఉద్యోగంలో ఎదురయ్యే ఒత్తిడి, సమస్యలు, జాబ్ రాకపోవడం లాంటి ఎన్నో సమస్యలకు వాస్తు శాస్త్రంలో పరిహారాలు ఉన్నాయి. కొన్ని వాస్తు నియమాలు పాటిస్తే వృత్తిగత జీవితం సాఫీగా సాగడంతో పాటు వ్యక్తిగత జీవితం ఆనందంగా ఉంటుంది. ఆ వాస్తు చిట్కాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈశాన్య మూలలో వాటర్ ఫౌంటెన్:

ఈశాన్య మూలలో వాటర్ ఫౌంటెన్:

వాస్తు ప్రకారం ఇంటి ఈశాన్యం ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. జీవితంలో పెరుగుదల, సంతోషాన్ని పెంచడానికి ఈశాన్యంలో బరువులు ఉంచకూడదు. ఈశాన్య మూల జీవితంలో వృద్ధిని, విజయాన్ని, శ్రేయస్సును సూచిస్తుంది. ఆనందాన్ని అందిస్తుంది. ఈశాన్య మూల పనిలో వృద్ధికి ప్రయోజనం చేకూరుస్తుంది. కెరీర్ మార్పులు, పురోగతికి ఈశాన్యం కీలకం.

ఈశాన్య మూలలో ఫౌంటెన్ ఉంచితే మంచి జరుగుతుంది. వృత్తిలో అభివృద్ధి సాధిస్తారు. కెరీర్ లో ముందుకు వెళ్తారు. విజయాలు సాధిస్తారు. ఈశాన్య మూలలో జలపాతం ఉంచితే నదిలో నీటి ప్రవాహంలో జీవితంలో ముందుకు సాగుతుంటారు. అయితే వాటర్ ఫౌంటెన్ ఉంచినట్లయితే దానికి లైట్లు లేకుండా చూసుకోవాలి. లేకపోతే దాని నుండి వచ్చే ప్రయోజనం చేకూరదు.

డబ్బు ఎక్కడ ఉంచాలి:

డబ్బు ఎక్కడ ఉంచాలి:

డబ్బు ఎప్పుడూ ఉత్తరం వైపు ఉన్న అల్మారాలోనే దాచాలి. ఎందుకంటే ఇది జీవితంలో విజయం, శ్రేయస్సును తీసుకువస్తుంది. ఉత్తరం వైపు ఉన్న అల్మారాలో డబ్బు ఉంచితే అది పెరుగుదలను సూచిస్తుంది. వ్యక్తిగతంగా, వృత్తిగతంగా అభివృద్ధి చెందుతారు. ఉత్తరం వైపు ఉన్న అల్మారాలో విలువైన వస్తువు దాచుకోవాలి.

పూజ గది ప్రాముఖ్యత:

పూజ గది ప్రాముఖ్యత:

జీవితంలో విజయం సాధించాలంటే, కెరీర్‌లో మార్పు రావాలంటే పూజా గది విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. పూజా గదిని ఏర్పాటు చేసినప్పుడు అది సరైన దిశలో ఉండాలి. అలా ఉంటే కుటుంబసభ్యుల మధ్య సంతోషం ఉంటుంది. ఎలాంటి గొడవలు జరగకుండా ఉంటాయి. కెరీర్ లో ఊహించని మార్పులు వస్తాయి.

ఎటువైపు నిద్రించాలి:

ఎటువైపు నిద్రించాలి:

నిద్ర పోవడం కూడా వాస్తు శాస్త్రంలో కీలకంగా పరిగణించబడుతోంది. నిద్రపోయేటప్పుడు తల ఏ దిక్కున పెట్టుకోవాలని అనే సందేహం చాలా మందికి ఉంటుంది. నిద్రించేటప్పుడు తల పడమర వైపు ఉండాలి. కాళ్లు తూర్పు వైపు చూడాలి. ఇలా నిద్రిస్తే ఉద్యోగం సాఫీగా సాగుతుంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది.

పని చేసే చోట తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

పని చేసే చోట తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

పని చేసే చోట కూడా సాధ్యమైనంత వరకు వాస్తు నియమాలు పాటించాలి. ఎదుగుదలకు ఇంటి వాస్తే ప్రధానమైనప్పటికీ, పని చేసే చోటు కూడా ముఖ్య భూమిక పోషిస్తుంది. మీరు ప్రత్యేక క్యాబిన్‌లో పని చేస్తుంటే అది చతురస్రాకారపు ఉండేలా చూసుకోవాలి. దీని వల్ల ఉద్యోగంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు.

English summary

Vastu tips for growth in work life in Telugu

read this to know Vastu tips for growth in work life in Telugu
Story first published:Friday, January 20, 2023, 16:34 [IST]
Desktop Bottom Promotion