For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మకరంలోకి శుక్రుడి సంచారం.. 12 రాశులపై ఎలాంటి ప్రభావం.. ఏ పరిహారాలు పాటిస్తే శుభఫలితాలొస్తాయంటే..!

|

నవగ్రహాలలో శుక్రుడి స్థానం ప్రత్యేకం అని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చెబుతుంటారు. ఎందుకంటే ఈ గ్రహం భూమికి చాలా దగ్గరగా ఉంటుంది. జ్యోతిష్యశాస్త్రాన్ని నమ్మే వారంతా శుక్రుడి అనుగ్రహం తప్పకుండా ఉండాలని కోరుకుంటారు.

ఎందుకంటే శుక్రుడు ఆనందం, సంతోషం, అందరి శ్రేయస్సుకు కారకంగా భావిస్తారు. అలాంటి శుక్రుడు జనవరి 28వ తేదీన తెల్లవారుజామున 3:18 గంటలకు ధనస్సు రాశి నుండి మకరరాశిలోకి సంచారం చేయనున్నాడు.

ఇప్పటికే ఈ రాశిలో సూర్యుడు, బుధుడు, గురుడు, శని గ్రహాలు కూడా నివాసముంటున్నాయి. ఇదే రాశిలో శుక్రుడు సుమారు నెల రోజుల పాటు నివాసముండనున్నాడు. ఆ తర్వాత కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు.

అయితే ఈ సమయంలో ద్వాదశ రాశుల వారిపై కచ్చితంగా ఎంతో కొంత ప్రభావం అనేది పడుతుంది. శుక్రుడు ఇలా ఒక రాశి నుండి మరో రాశిలోకి మారడం వల్ల ఏయే రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది.. ఏయే రాశుల ప్రతికూలంగా ఉంటుంది.. శుక్రుడి అనుగ్రహం కోసం ద్వాదశ రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఆర్థిక, రాహు-కేతు సమస్యలా? కర్పూరంలో లవంగాలు వేసి కాల్చండి .. అప్పుడు జరిగే అద్భుతాలను చూడండి .. ఆశ్చర్యపోతారు

మేష రాశి..

మేష రాశి..

శుక్రుడు మకరరాశిలోకి ప్రవేశించే సమయంలో మేష రాశి నుండి పదో స్థానంలో ఉంటాడు. ఈ సమయంలో మేష రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మరోవైపు మీరు శత్రువులను పెంచుకోవచ్చు. అయితే కుటుంబం మరియు వ్యాపారంలో మంచి ఫలితాలు ఉంటాయి. మీ భాగస్వామితో సంబంధం మంచిగా ఉంటుంది. విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.

పరిహారం : శుక్ర సంచారం సమయంలో శుక్ర మంత్రాన్ని జపించాలి.

వృషభ రాశి..

వృషభ రాశి..

శుక్రుడు మకరరాశిలోకి సంచారం సమయంలో ఈ రాశి నుండి తొమ్మిదో స్థానంలో ఉంటాడు. ఈ సమయంలో ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీరు చాలా విషయాల్లో విజయం సాధిస్తారు. మీ ఆరోగ్యం మంచిగా ఉంటుంది. పని విషయంలో అన్ని సజావుగా సాగుతాయి. మీ తండ్రి నుండి మద్దతు పొందుతారు. మీ తోబుట్టువుల నుండి మీకు ఆప్యాయత లభిస్తుంది. మీరు ఈ సమయంలో తీర్థయాత్రలకు వెళ్లడం, విరాళాలు, దానం ఇవ్వడం వంటివి చేస్తే, మీకు మనశ్శాంతిగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.

పరిహారం : శుక్రుడి సంచారం సమయంలో పరశురాముని పౌరాణిక కథలను చదవాలి.

మిధున రాశి..

మిధున రాశి..

ఈ రాశి నుండి శుక్రుడు ఎనిమిదో పాదం గుండా రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో మిధున రాశి వారికి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. శుక్రుడి సంచారం కారణంగా ఈ రాశి వారికి కష్టాలు తగ్గిపోతాయి. వ్యాపారులు ఊహించని లాభాలను పొందుతారు. ఉద్యోగులు కొన్ని మంచి మార్పులు చేస్తారు. మీరు ఈ కాలంలో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు విద్యార్థులు తమ అధ్యయనాలపై ఎక్కువ శ్రద్ధ వహిస్తారు.

పరిహారం : గోమాతకు ఆహారం ఇవ్వండి మరియు వాటితో కాసేపు గడపండి.

మీ రాశిని బట్టి ఏ రత్నం ధరిస్తే.. శుభఫలితాలొస్తాయంటే...!

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ రాశి నుండి శుక్రుడు ఏడో స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ జీవిత భాగస్వామితో సంబంధంలో కొన్ని విబేదాలు రావొచ్చు. మరోవైపు వ్యాపారులు ఈ సమయంలో శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

పరిహారం : ప్రతిరోజూ ఉదయాన్నే మహాలక్ష్మీ దేవిని స్తుతిస్తూ ‘మహాలక్ష్మీ అష్టకం' పఠించాలి.

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశి నుండి శుక్రుడు ఆరో స్థానం గుండా రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో సింహ రాశి వారికి ఆర్థిక పరంగా అద్భుతంగా ఉంటుంది. అయితే ఖర్చులు కూడా పెరుగుతాయి. ఈ సమయంలో వ్యాపారులకు సానుకూల ప్రయోజనాలు ఉంటాయి.మరోవైపు మీ వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఎదురువుతాయి. ఆరోగ్య పరంగా మంచిగా ఉంటుంది.

పరిహారం : ప్రతిరోజూ మహాలక్ష్మీ దేవిని స్తుతించడంలో ‘శ్రీ సూక్తం' పఠించాలి.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ రాశి నుండి శుక్రుడు ఐదో స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో కన్య రాశి వారికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కెరీర్ పరంగా మీకు శుభ ఫలితాలొస్తాయి. మీ పిల్లలతో గడిపేందుకు సమయం దొరుకుతుంది. విదేశాలలో చదువుకోవాలనుకునే విద్యార్థుల కల ఈ సమయంలో నెరవేరొచ్చు. మరోవైపు మీ జీవిత భాగస్వామితో సంబంధంలో సాన్నిహిత్యం పెరుగుతుంది.

పరిహారం : శుక్రుడి రవాణా సమయంలో యువతులకు కొన్ని వస్తువులను దానం చేయాలి.

Shukra Neeti Rules : ఇలా చేస్తే మీ వయసు మంచులా కరిగిపోతుందని మీకు తెలుసా...!

తుల రాశి..

తుల రాశి..

ఈ రాశి నుండి శుక్రుడు నాలుగో స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. ముందుగా మీ ప్రియమైన వారితో బంధం మరింత బలపడుతుంది. ఉద్యోగులు కెరీర్ పరంగా మంచి పురోగతి సాధించే అవకాశం ఉంది. వ్యాపారులు కూడా మంచి లాభాలను పొందుతారు. విద్యార్థులు తమ అధ్యయనాలపై ఎక్కువ ఫోకస్ పెడతారు.

ఈ సమ

పరిహారం : మీ కుడి చేతి ఉంగరపు వేలికి వెండి లేదా బంగారంతో రూపొందించిన మంచి నాణ్యత గల వజ్రాన్ని ధరించాలి.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

ఈ రాశి నుండి శుక్రుడు మూడో స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో ఈ రాశి వారికి మంచి ఫలితాలు వస్తాయి. మీ జీవిత భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది. వివాహితులు తమ పిల్లల విషయంలో సంతోషంగా ఉంటారు. ఉద్యోగులు మరియు వ్యాపారులు పురోగతి చూసి ఆనందిస్తారు. ఇదే సమయంలో మీకు శత్రువుల బాధ కూడా తగ్గుతుంది. అయితే ఆరోగ్య పరంగా కొన్ని ప్రతికూల ప్రభావాలు ఉన్నాయి. విద్యార్థులు క్రీడల్లో తమ ప్రతిభను ప్రదర్శిస్తారు.

పరిహారం : ప్రతిరోజూ ఉదయం శివలింగానికి గులాబీ పూలతో పూజించాలి.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

ఈ రాశిలోకి శుక్రుడు రెండో స్థానం సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో ధనస్సు రాశి వారికి ఆర్థిక పరంగా మంచి ఫలితాలు రానున్నాయి. మీరు ఈ సమయంలో విలువైన రత్నాలు, వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆరోగ్య పరంగా మంచిగా ఉంటుంది. మీ కోరికలన్నీ నెరవెరే అవకాశం కనిపిస్తోంది. మీ కెరీర్లో గొప్ప పురోగతి సాధించే అవకాశం ఉంది. విద్యార్థులు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. అయితే వాటి నుండి కొత్తగా నేర్చుకుంటే కచ్చితంగా ప్రయోజనం ఉంటుంది.

పరిహారం : శుక్రుడు ఆగ్నేయుని ప్రభువు కాబట్టి.. మీరు ఆగ్నేయ దిశలో ఉండి దేవుడిని ఆరాధించాలి.

మకర రాశి..

మకర రాశి..

శుక్రుడు ధనస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇప్పటికే ఈ రాశిలో బుధుడు, గురుడు, సూర్యుడు, శని గ్రహాలు నివాసముంటున్నాయి. తాజాగా శుక్రుడి చేరికతో ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. ముందుగా మీ జీవిత భాగస్వామితో సంబంధం స్నేహపూర్వకంగా మారే అవకాశం ఉంది. విద్యార్థులు తమ విద్యా రంగంలో పురోగతిని సాధించే అవకాశం ఉంది. ఇవి మీ కెరీర్లో గొప్ప విజయాలను తెస్తాయి.

పరిహారం : మీ కుడి చేతి ఉంగరపు వేలికి వెండి లేదా బంగారంతో రూపొందించిన మంచి నాణ్యమైన తెలుపు రత్నాన్ని ధరించాలి.

కుంభ రాశి..

కుంభ రాశి..

ఈ రాశి నుండి శుక్రుడు పన్నెండో స్థానం గుండా ప్రయాణం చేయనున్నాడు. ఈ సమయంలో కుంభ రాశి వారికి సానుకూల ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఆరోగ్య పరంగా మాత్రం కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఉద్యోగులకు మరియు వ్యాపారులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మొత్తం శుక్రుడి రవాణా ఈ రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

పరిహారం : శుక్రుడి రవాణా సమయంలో సూర్యోదయం సమయాన ‘లలితా సహస్రనామం' పఠించాలి.

మీన రాశి..

మీన రాశి..

ఈ రాశి నుండి శుక్రుడు పదకొండో స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో మీన రాశి వారికి సానుకూల ప్రయోజనాలు ఉంటాయి. వ్యాపారులకు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. విద్యార్థులకు తమ ప్రతిభ కనబరిచేందుకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంటుంది.

పరిహారం : శుక్రుడి రవాణా సమయంలో మీ చేతికి క్రిస్టల్ క్వార్ట్జ్ ని రోసరీని ధరించాలి.

English summary

Venus Transit in Capricorn on 28 January 2021 Effects on Zodiac Signs in Telugu

Venus Transit in Capricorn Effects on Zodiac Signs in Telugu : The Venus Transit in Capricorn will take place on 28 January 2021. Learn about remedies to perform in Telugu.