For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Vijay Diwas 2021:బంగ్లాకు అండగా నిలిచి.. పాక్ ను చిత్తు చిత్తుగా ఓడించి.. భారత్ సత్తా ఏంటో ప్రపంచానికి చూపింది

విజయ్ దివాస్ 2021 సందర్భంగా 1971లో భారత్-పాక్ యుద్ధం మరియు బంగ్లాదేశ్ విముక్తి గురించి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

|

1971 సంవత్సరంలో బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిగిన పోరాటంలో పాకిస్థాన్ దేశంపై భారత సైనికులు ఘన విజయం సాధించారు. దీని ఫలితంగా బంగ్లాదేశ్ ప్రత్యేక దేశంగా ఏర్పడింది.

Vijay Diwas 2021: Interesting facts about 1971 Indo-Pak war and Bangladesh Mukti Sangram in Telugu

ఈ యుద్ధం వల్లే భారత ఆర్మీ, వాయు, నావికా దళంతో పాటు ఇతర సాయుధ బలగాల సత్తా ఏంటనే విషయం ప్రపంచానికి తెలిసింది. కేవలం రెండు వారాల్లోపే పాకిస్థాన్ సైన్యం మన దేశానికి లోంగిపోయింది. తమ ఓటమిని అంగీకరించింది. దీంతో బంగ్లాదేశ్ దేశానికి పూర్తి విముక్తి లభించింది.

Vijay Diwas 2021: Interesting facts about 1971 Indo-Pak war and Bangladesh Mukti Sangram in Telugu

అప్పటి నుండి ఈ యుద్ధంలో సాధించిన విజయాన్ని గుర్తు చేసుకుంటూ.. మన సైనికుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం డిసెంబర్ 16వ తేదీన భారతదేశంతో పాటు బంగ్లాదేశ్ లోనూ 'విజయ్ దివాస్' వేడుకలను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా 1971 సంవత్సరంలో భారత్-పాక్ మధ్య జరిగిన యుద్ధం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

బంగ్లాదేశ్ విముక్తి కోసం..

బంగ్లాదేశ్ విముక్తి కోసం..

1971 సంవత్సరంలో తూర్పు పాకిస్థాన్ లో జరిగిన ఎన్నికల ఫలితాల గురించి అప్పటి నాయకులు, అధికారులు ఉల్లంఘించారు. దీంతో బంగ్లాదేశ్ విముక్తి అనే అంశం తెరపైకి వచ్చింది. ఈ వివాదం కాస్త యుద్ధం వరకు వెళ్లింది. అప్పుడే పాకిస్థాన్ నుండి తమకు విముక్తి కావాలని.. తామే సొంత దేశాన్ని ఏర్పాటు చేసుకోవాలని భావించింది. ఆ మరుసటి రోజే వారి పోరాటానికి భారత్ కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించింది.

బెంగాలీ శరణార్థులకు ఆశ్రయం..

బెంగాలీ శరణార్థులకు ఆశ్రయం..

అదే సమయంలో పాకిస్థాన్ ఆర్మీ బెంగాలీలపై, మరీ ముఖ్యంగా హిందువులను లక్ష్యంగా చేసుకుని, వారిని ఎన్నో చిత్రహింసలకు గురి చేశారు. దీంతో సుమారు కోటి మంది బెంగాలీ శరణార్థులు భారతదేశానికి వలస వచ్చారు. వీరందరికి మన దేశం ఆశ్రయం ఇచ్చింది.

అధికారికంగా యుద్ధంలో..

అధికారికంగా యుద్ధంలో..

1971 సంవత్సరంలో డిసెంబర్ 3వ తేదీన పాకిస్థాన్ తన కుట్రలను మరింత వేగవంతం చేసింది. పాక్ వాయు సేన మన దేశంలోని వాయువ్య ప్రాంతాలపై దాడులు చేయడంతో.. భారత త్రివిధ దళాలు అధికారికంగా యుద్ధంలోకి దిగాయి. అప్పటికే ‘ఆపరేషన్ చెంగిజ్ ఖాన్' పేరిట ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా, తాజ్ మహాల్ లపై దాడులు చేసేందుకు ప్లాన్ వేసుకున్నట్లు తెలిసింది. దాయాదుల ద్రుష్టిని మళ్లీంచేందుకు ఆ సమయంలో తాజ్ మహాల్ పై ఆకులు, కొమ్మలతో కప్పివేశారు.

భారీ బందోబస్తు..

భారీ బందోబస్తు..

అనంతరం పాకిస్థాన్ కు ధీటుగా భారత వైమానిక దళం బదులిచ్చింది. వెస్ట్రన్ ఫ్రంటులో భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. అయినా కూడా పాకిస్థాన్ వాయు దళం యుద్ధం ముగిసే వరకు మన స్థావరాలపై దాడి చేస్తూనే ఉంది. అయితే మరోవైపు భారత నావికా దళం రంగంలోకి దిగింది. ‘ఆపరేషన్ ట్రైడెంట్' పేరుతో కరాచీ పోర్టుపై భారత నావికా దళం డిసెంబర్ 4, 5వ తేదీన దాడి చేసింది. అప్పటికే మన సైన్యం పాకిస్థాన్ భూభాగంలోకి దూసుకెళ్లింది.

భారత్ సాయం..

భారత్ సాయం..

తూర్పు పాకిస్థాన్(బంగ్లాదేశ్)లోకి ముక్తి బాహిని గెరిల్లా బలగాలు భారత బలగాలతో కలిసి పాకిస్థాన్ బలగాలపై పోరాటం చేశాయి. మన భారత సైన్యం కూడా గెరిల్లా బలగాలకు శిక్షణ ఇవ్వడమే కాదు.. ఆయుధాలను అందజేసి సహాయపడింది. మరోవైపు బంగ్లాదేశ్ విముక్తి కోసం సోవియట్ యూనియన్ కూడా మద్దతు ప్రకటించింది. అయితే అమెరికా మాత్రం పాకిస్థాన్ కు సపోర్ట్ చేసింది. యుద్ధం ముగిసేనాటికి అప్పటి అమెరికా ప్రెసిడెంట్ రిచర్డ్ నిక్సన్ పాక్ కు మద్దతుగా ఓ యుద్ధ విమానాన్ని బంగాళాఖాతం వద్ద మోహరించారు.

దాయాదికి భారీ నష్టం..

దాయాదికి భారీ నష్టం..

అయితే యుద్ధం చివరి దశకు వచ్చేసరికి పాకిస్థాన్ దేశానికి భారీ నష్టం వాటిల్లింది. దీంతో రెండు వారాలలోపే పాక్ జనరల్ అమీర్ అబ్దుల్లా ఖాన్ నియాజీ సారథ్యంలోని సుమారు 93 వేల మంది పాక్ దళాలు మన దేశ సైన్యం ముందు లొంగిపోయారు. ఆ తర్వాత 1972లో జరిగిన సిమ్లా ఒప్పందంలో భాగంగా వారికి విముక్తి కల్పించారు. ఈ యుద్ధంలో భారత త్రివిధ దళాలు సైన్యం, వాయుసేన, నావికా బలగాలు వ్యూహాత్మకంగా దాయాది దేశంపై పై చేయి సాధించేలా చాకచక్యంగా వ్యవహరించాయి.

శత్రువులు నేలమట్టం..

శత్రువులు నేలమట్టం..

ఈ యుద్ధంలో పాకిస్థాన్ దేశానికి చెందిన 8 వేల మంది సైనికులు మరణించగా.. సుమారు 25 వేల మంది వరకు గాయపడ్డారు. మరోవైపు భారత సైనికులలో 3 వేల మంది వీరమరణం పొందారు. దాదాపు 12 వేల మంది సైనికులకు గాయాలయ్యాయి.

FAQ's
  • 1971లో భారత్-పాక్ మధ్య జరిగిన యుద్ధంలో ఎవరు గెలిచారు?

    1971 సంవత్సరంలో బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిగిన పోరాటంలో పాకిస్థాన్ దేశంపై భారత సైనికులు ఘన విజయం సాధించారు. దీని ఫలితంగా బంగ్లాదేశ్ ప్రత్యేక దేశంగా ఏర్పడింది. ఈ యుద్ధం వల్లే భారత ఆర్మీ, వాయు, నావికా దళంతో పాటు ఇతర సాయుధ బలగాల సత్తా ఏంటనే విషయం ప్రపంచానికి తెలిసింది.

English summary

Vijay Diwas 2021: Interesting facts about 1971 Indo-Pak war and Bangladesh Mukti Sangram in Telugu

Here we are discussing about the vijay diwas 2021: Interesting facts about 1971 Indo-pak war and bangladesh mukti sangram in Telugu. Have a look
Story first published:Thursday, December 16, 2021, 11:17 [IST]
Desktop Bottom Promotion