For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వైరల్ వీడియో : మందు బాబులం.. మేమే మహారాజులం.. అంటున్న చిన్నారులు..

|

మన దేశంలో మద్యం సేవించాలంటే కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అయితే 21 సంవత్సరాలు కచ్చితంగా పూర్తి అవ్వాలి. మద్యం దుకాణాలలో కూడా చిన్న పిల్లలకు మద్యం అమ్మబడదు అని బోర్డులు అక్కడక్కడా మనకు దర్శనమిస్తుంటాయి. అయితే ఆ ఊరిలో మాత్రం అవేవీ పట్టించుకోకుండా.. స్కూలుకు వెళ్లే చిన్నారులకు మద్యాన్ని మంచి నీళ్లలా పంచుతున్నారు. అది ఆరోగ్యానికి ఎంత హానికరమో తెలియని చిన్నారులు దాన్ని గట గటా ముక్కు మూసుకుని, కళ్లు మూసుకుని గ్లాసుల మీద గ్లాసులు లాగేస్తున్నారు.

Viral Video

అయితే వారు మద్యం తాగుతున్న వీడియోను ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే నిమిషాల్లో అది వైరల్ అయిపోయింది. ఇది చూసిన నెటిజన్లు వారికి మద్యం సరఫరా చేసిన వారిపై మండిపడుతున్నారు. ట్వీట్లతో రెచ్చిపోతున్నారు. ఇంతకీ ఇదంతా ఎక్కడ జరిగింది.. ఎప్పుడు జరిగింది.. తెలియాలంటే మీరు ఈ స్టోరీని పూర్తిగా చూడాల్సిందే...

మందు బాబులు..

మందు బాబులు..

‘మందు బాబులం మేము మందు బాబులం.. మందు కొడితే మాకు మేమే మహారాజులం.. అరే కల్లు తాగి గెంతేస్తాం.. సారా తాగి చిందేస్తాం..మందంతా దిగే దాకా లోకాలే పాలిస్తాం‘‘ అని గబ్బర్ సింగ్ లో కోట శ్రీనివాసరావు గారు పాట పాడితే అందరూ ఎంజాయ్ చేస్తారు. అయితే అలాంటి సీనే రియల్ లైఫ్ లోనూ జరిగింది. కాకపోతే ఇక్కడ తాగింది.. వాగింది.. చిందేసింది మాత్రం చిన్న మందుబాబులు.

ట్విట్టర్లో వైరల్..

ఈ చిన్నారులకు మద్యం సరఫరా చేస్తున్న మరియు పిల్లలు మద్యం తాగుతున్న ఎవరో ఒకరు వీడియో తీసి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అంతే కాస్త కొన్ని గంటల్లోనే షేర్ అయిపోయింది. ఈ షాకింగ్ సంఘటన ఎక్కడ అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. అయితే అక్కడి పరిస్థితిని చూస్తే అది కర్నాటక-తమిళనాడు సరిహద్దు ప్రాంతం అని కొంతమంది నెటిజన్లు చెబుతున్నారు.

పిల్లలకు విషమిచ్చినట్టే..

పిల్లలకు విషమిచ్చినట్టే..

చిన్న పిల్లలకు మద్యం అలవాటును నేర్పితే మన చేతులారా మనమే విషమిచ్చేనట్టేనని మరికొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఈ వీడియో ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు. అమాయక పిల్లలకు మద్యం ఇచ్చి వారి జీవితాన్ని నాశనం చేసినట్టే అని మరికొందరు నెటిజన్లు బాధపడుతున్నారు.

పిల్లలు మద్యం తాగితే...

పిల్లలు మద్యం తాగితే...

చిన్న పిల్లలు ఆల్కహాల్ ను తెలిసి తాగినా.. తెలియక తాగినా వారిలో కేంద్ర నాడీ వ్యవస్థ క్షీణించిపోతుంది. అలాగే నిరంతరం మద్యం సేవించే పిల్లలకు ఫిట్స్, మూర్ఛ, కోమా వంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చేస్తుంది. అంతేకాదు పిల్లలు మద్యం తాగడం వల్ల అది వారి నేరాలకు పాల్పడేలా చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మద్యం అనేది ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అనేక నేరాలకు సంబంధించింది. మద్యం, బాల్యం కలసిపోతే వారికి తెలియకుండా సామాజిక వ్యతిరేక కార్యకలాపాలకు మరియు రాబోయే కాలంలో హింసాత్మక చర్యలకు పాల్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

English summary

Viral Video : Have you ever seen children drinking alcohol?

The harrowing intolerable video of children being suppled with alcohol is going viral now on Twitter. The location of this tracking act is still unknown but speculations are that the video.
Story first published: Wednesday, December 11, 2019, 18:11 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more