For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెడ్ అలర్ట్ అంటే ఏమిటి? భారీ వర్షాల సమయంలో ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి...

|

ఒకవైపు కరోనా మహమ్మారి.. మరోవైపు ప్రకృతి విలయ తాండవంతో అందరూ అల్లాడిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో గత వారం రోజులుగా నిరంతరాంయంగా వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి.

దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.. నగరాల్లో నాలాలు పొంగి పొర్లుతున్నాయి. కొన్ని చోట్ల కొండచరియలు కూడా విరిగిపడుతున్నాయి. దీంతో అలాంటి ప్రాంతాల్లో నివాసముండే వారు వెంటనే ఖాళీ చేయాలని అధికారులు సూచించారు. తెలంగాణ ప్రభుత్వం రెడ్ అలర్ట్ కూడా ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ లోనూ కొన్ని ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.

ఈ సందర్భంగా రెడ్ అలర్ట్ అంటే ఏమిటి? అసలు దీనిని ఎందుకు ప్రకటిస్తారు. దీని వల్ల కలిగే ప్రయోజనాలేంటి? అలాగే వరదలు వచ్చినప్పుడే దీన్ని ఎందుకు అమలు చేస్తారు. ఇదిలా ఉండగా.. వరదలు వచ్చిన సమయంలో మనం ఏమి చేయలేం. కానీ కొంచెం ముందు జాగ్రత్తతో వ్యవహరిస్తే పెద్ద విపత్తుల నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు, వరదలు వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం...

రెడ్ అలర్ట్ అంటే?

రెడ్ అలర్ట్ అంటే?

అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు.. ఏదైనా సంఘటన గురించి ప్రజలను అప్రమత్తం చేస్తూ.. కొందరికి హెచ్చరికలు చేయడం.. మాస్ కమ్యూనికేషన్ వంటి వాటి కోసం ఉపయోగించేదానిని రెడ్ అలర్ట్ అంటారు. ఉదాహరణకు వరదలు.. భయంకరమైన ఈదురుగాలలు, తుఫాను, సునామీ, వేడి తీవ్రత, బహిరంగ ప్రదేశాల్లో ఏదైనా అల్లర్లు జరిగినప్పుడు.. బాంబు ముప్పు ఉన్నప్పుడు ప్రజలు అడుగు బయటపెట్టలేని పరిస్థితి నెలకొన్నప్పుడు ఈ రెడ్ అలర్ట్ ను ప్రభుత్వాలు ఉపయోగిస్తుంటాయి.

కంట్రోల్ రూమ్ ల ఏర్పాటు..

కంట్రోల్ రూమ్ ల ఏర్పాటు..

రెడ్ అలర్ట్ సమయంలో అత్యవసరంగా కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేస్తారు. ప్రమాదంలో చిక్కుకున్న వారు ఫిర్యాదు చేసేందుకు.. ఇతర సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేస్తారు. కింద ఉన్న ఈ నెంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే.. తగిన సమయంలో మీకు సహాయం అందే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

నేషనల్ ఎమర్జెన్సీ నెంబర్ : 112

పోలీసు నెంబర్ : 100

రైల్వే హెల్ప్ లైన్ : 1072

రోడ్ హెల్ప్ లైన్ : 1073

అంబులెన్స్ : 108

ఆంధ్రప్రదేశ్ హెల్ప్ లైన్ : 1100

తెలంగాణ హెల్ప్ లైన్ నెంబర్ : 1070

హైదరాబాద్ టోల్ ఫ్రీ నెంబర్ : 1800-599-0099

పునరావాసం కేంద్రాలకు వెళ్లాలి..

పునరావాసం కేంద్రాలకు వెళ్లాలి..

మీరు లోతట్టు ప్రాంతాలు లేదా ఇతర ప్రమాదకరమైన ప్రాంతాల్లో నివసిస్తుంటే.. వెంటనే పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలి. అందుకోసం హెల్ప్ లైన్ నెంబర్లను ఉపయోగించుకోవాలి. ఇందుకోసం మీరు ముందుగానే అప్రమత్తంగా ఉండాలి.

ప్రవహించే నీటిలో నడవకండి..

ప్రవహించే నీటిలో నడవకండి..

భారీ వర్షాల సమయంలో ఎక్కడబడితే అక్కడ నీరు నిలిచి ఉంటుంది.. కొన్నిచోట్ల వేగంగా.. మరికొన్ని చోట్ల మెల్లగా ప్రవహిస్తూ ఉంటుంది. ఇలాంటి సమయంలో మీరు ప్రవహించే నీటిలో ఎట్టి పరిస్థితిలో నడవకండి. ఎందుకంటే పైన చూడటానికి ప్రవాహం మెల్లగా ఉన్నప్పటికీ.. లోపల ప్రవాహ వేగం ఎక్కువగా ఉంటుంది. ఆ వేగానికి మీరు కొట్టుకుపొయే ప్రమాదం ఉంటుంది.

వరదలో డ్రైవింగ్ చేయొద్దు..

వరదలో డ్రైవింగ్ చేయొద్దు..

వరదల సమయంలో ఎంత అవసరం పడినప్పటికీ వాహనాలను తీసుకుని బయటకు వెళ్లకండి.. ఎందుకంటే వరదల సమయంలో డ్రైవింగ్ చేయడం అంత మంచిది కాదు. ఎక్కడ ఏ వాగు పొంగుతుందో.. ఎక్కడ ఏ గుంటలో మీ వెహికల్ ఇరుక్కుపోతుందో ఎవ్వరికీ తెలీదు. అందుకే వరదల సమయంలో వాహనాలలో బయటకు వెళ్లకపోవడం మంచిది.

కరెంట్ స్తంబాలను ముట్టుకోకండి..

కరెంట్ స్తంబాలను ముట్టుకోకండి..

వర్షాల సమయంలో కరెంటు స్తంబాలు.. విద్యుత్ తీగల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే వర్షాల సమయంలో వచ్చే ఈదురుగాలులకు విద్యుత్ తీగలు నీళ్లలో పడే ప్రమాదం ఉంటుంది. ఒకవేళ మీకు అలా ఎక్కడైనా కనిపిస్తే వెంటనే విద్యుత్ శాఖాధికారులకు తెలియజేయండి.

తెలంగాణ విద్యుత్ హెల్ప్ లైన్ నెంబర్ : 04023431464

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ హెల్ప్ లైన్ నెంబర్ : 1800425155333

పిల్లల విషయంలో జాగ్రత్త..

పిల్లల విషయంలో జాగ్రత్త..

వరదల సమయంలో పిల్లలపై ఎక్కువ నిఘా పెట్టండి. వారిపై ఎప్పుడూ ఓ కన్ను వేసి ఉంచండి. ఏ మాత్రం అడుగు బయటపెట్టనివ్వకండి. ఎందుకంటే రోడ్ల మీద నడుములోతు నీళ్లు.. కాలనీలు చెరువులు మారిపోతున్నాయి. ఇక నాలాలు నదుల్లాగా ప్రవహిస్తున్నాయి. కాబట్టి పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి.

ప్రయాణాలు వాయిదా వేసుకోండి..

ప్రయాణాలు వాయిదా వేసుకోండి..

వర్షాలు మరో రెండు లేదా మూడురోజుల పాటు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన కారణంగా మీ ప్రయాణాలన్నింటినీ వాయిదా వేసుకోండి. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో మొత్తం దాదాపు ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ఇప్పటికే చాలా చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. రైల్వేస్టేషన్లలో, బస్టాండ్లలో నీరు ఎక్కువగా చేరింది.

వేడి నీటిని తాగండి..

వేడి నీటిని తాగండి..

వర్షాల సమయంలో సాధ్యమైనంత వరకు నీటిని వేడి చేసుకుని చల్లారక తాగండి. ఎందుకంటే వర్షాకాలంలో నీరు కలుషితమై మీరు రోగాల బారిన పడొచ్చు. ఒకవేళ అత్యవసరంగా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే.. కచ్చితంగా రెయిన్ కోర్టు లేదా గొడుగును తీసుకెళ్లడం మాత్రం మరచిపోవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ తల తడవకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే వర్షంలో మీ తల తడిస్తే.. వెంటనే మీరు జలుబు బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

వర్షంలో తడిచి ఇంటికొస్తే..

వర్షంలో తడిచి ఇంటికొస్తే..

వర్షంలో తడిచి.. ఇంటికి చేరుకున్న వెంటనే మీ పవర్ స్విచ్ బటన్ ను తాకొద్దు.

మీ చేతులు, కాళ్లు పూర్తిగా ఆరిపోయే వరకు విద్యుత్ సంబంధిత వస్తువులను అస్సలు తాకకండి.

మీ బాడీని టవల్ తో శుభ్రం చేసుకునేంత వరకు ఏ పదార్థాలను తినకండి.

మీరు నివసిస్తున్నది మట్టి మిద్దె అయితే.. అది ఏ స్టేజీలో ఉందో చెక్ చేసుకోండి.

వరదలు తగ్గినప్పుడు..

వరదలు తగ్గినప్పుడు..

వరదల సమయంలో మరియు వరదలు తగ్గినప్పుడు మీ ఇల్లు.. మీ కాలనీలో ఎంత నష్టం జరిగిందో తెలిసేలా వీడియో లేదా ఫొటోలను తీయొచ్చు. ఆ తర్వాత మీ ఇంటిని, చుట్టుపక్కల ఉండే పరిసరాలను శుభ్రం చేసుకోవాలి. మళ్లీ వాతావరణ శాఖ చెప్పే సమాచారాన్ని బట్టి బయటికి వెళ్లాలా వద్దా అనేది డిసైడ్ చేసుకోవాలి...

English summary

What is red alert, Precautions during heavy rainfall and high winds in telugu

Here we talking about what is red alert, precautions during heavy rainfall and high winds in telugu. Read on