For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనా వైరస్ : మార్చి 29 నుండి ఏప్రిల్ 2వ తేదీ వరకు ఏమి జరుగబోతోందో తెలుసా....!

అతి చిన్న వయసులోనే ఆ కుర్రాడు ఈ విషయం గురించి యూట్యూబ్ లో వీడియోలో చెప్పడం ప్రస్తుతం బాగా వైరల్ అయిపోతోంది.

|

కరోనా వైరస్ గురించి కర్నాటకలోని ఓ వేద విద్యార్థి ఏడు నెలల కిందటే అంటే గత ఏడాదే హెచ్చరించాడట. ఆ కుర్రాడు వేదాలతో పాటు జాతకాలు, భవిష్యత్తు గురించి చెబుతుండేవాడట.

 MARCH 29TH-APRIL2ND :

అతి చిన్న వయసులోనే ఆ కుర్రాడు ఈ విషయం గురించి యూట్యూబ్ లో వీడియోలో చెప్పడం ప్రస్తుతం బాగా వైరల్ అయిపోతోంది. అయితే జాతకాలు నమ్మని వారు అంటే నాస్తికులందరూ ఈ విషయాన్ని కొట్టి పారేస్తున్నారు.

వీటన్నింటి సంగతి పక్కనబెడితే తను కరోనా వైరస్ గురించి ఏమి చెప్పాడు.. ఆ వీడియోలో మే మాసం ఆఖరువరకూ పరిస్థితి ఇలాగే ఉంటుందనే విషయాలను చెప్పడంతో ప్రస్తుతం ఆ విషయం గురించి అందరూ చర్చించుకుంటున్నారు. అలాగే మార్చి 29వ తేదీ నుండి ఏప్రిల్ 2వ తేదీ గురించి ఆ కుర్రాడు పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడట. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

ఏడు నెలల క్రితమే..

ఏడు నెలల క్రితమే..

ఈ వేద విద్యార్థి ఏడు నెలల క్రితమే అంటే 2019 సంవత్సరంలోని ఆగస్టు నెలలోనే రోనా వైరస్ ను ఉద్దేశించి జోస్యం చెప్పాడట. అది ఏంటంటే అచ్చం సూర్య నటించిన సెవెన్త్ సెన్స్ సినిమాలో లాగా మరి కొద్ది నెలల్లో బయో వార్ జరిగే అవకాశం ఉందని చెప్పాడట. అందుకు సంబంధించి తాజాగా ఓ వివరణ కూడా ఇచ్చాడు.

29 నుండి ఏప్రిల్ 2 వరకు

29 నుండి ఏప్రిల్ 2 వరకు

ఈ కరోనా వైరస్ మహమ్మారి మార్చి 29వ తేదీ నుండి ఏప్రిల్ 2వ తేదీ వరకు మరింత వేగంగా వ్యాపిస్తుందని చెప్పాడు. ఈ సమయంలో చాలా మంది అంటే లక్షలాది మంది ఈ వ్యాధి బారిన పడతారని చెప్పాడు. ఈ భయోత్పాతమంతా మే మాసం వరకు ఉండే అవకాశం ఉందని చెప్పాడు.

రవాణా మొత్తం ఆగిపోతుంది..

రవాణా మొత్తం ఆగిపోతుంది..

అంతేకాదు కరోనా వైరస్ వల్ల వాయు, జల, రోడ్డు రవాణా మొత్తం స్తంభించిపోతుందని కూడా చెప్పాడట. అది కూడా ఒక్క మన దేశంలోనే కాదు. ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా వైరస్ కారణంగా మొత్తం రవాణా ఆగిపోతుందని చెప్పాడట. అయితే అప్పుడు ఆ విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే చాలా మంది జ్యోతిష్యులు లేదా వేద పండితులు చెప్పే విషయాల్లో 90 శాతం జరగవని, కేవలం 10 శాతం మాత్రమే జరిగే అవకాశం ఉందని, అందులో ఇది జరగొచ్చు లేదా జరగకపోవచ్చు అని అనుకున్నారు.

మళ్లీ చర్చకు..

మళ్లీ చర్చకు..

అయితే ఆ పది శాతంలో ఉన్న నిజం వల్ల ప్రస్తుతం రోడ్డు, రైలు, జల, వాయు మార్గాలన్నీ ఆగిపోయాయి. అంతేకాదు దేశాలకు, దేశాలకు మధ్య అడ్డు గోడలు, రాష్ట్రాలు, జిల్లాల సరిహద్దుల్లో బ్యారికేడ్లు, పల్లెటూళ్లలో ముళ్ల కంచెలు వంటి వాటిని అడ్డు పెట్టుకోవడంతో ఈ విషయం మరోసారి చర్చకు వచ్చింది.

అందుకు తగ్గట్టే..

అందుకు తగ్గట్టే..

అయితే ఈ కుర్రాడు చెప్పిన దాంట్లో ఏ మేరకు నిజం ఉందో తెలియదు. కానీ ప్రభుత్వాలు, అధికారులు ఈ కరోనా వైరస్ ప్రభావం దాదాపు రెండు నెలల వరకు ఉంటుందని చెబుతున్నారు. అంటే మే నెలఖారు వరకు అంటే ఈ కరోనా కంట్రోల్ లోకి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇది క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు.

కోలుకోనే వారు..

కోలుకోనే వారు..

అయితే ఈ కరోనా వైరస్ మహమ్మారి గురించి ప్రపంచంలోని చాలా దేశాలు ఇప్పటికే అప్రమత్తమయ్యాయి. ఈ వ్యాధిని కంట్రోల్ లో పెట్టేందుకు టెక్నికల్ గా, ఇతర మార్గాల ద్వారా అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. వారు చేసే ప్రయత్నాలు కూడా ప్రస్తుతానికి సఫలం అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో లక్షల మందికి పాజిటివ్ వచ్చినా వేలాది సంఖ్యలో రోగులు కోలుకుంటున్నారు..

తెలంగాణలోనూ..

తెలంగాణలోనూ..

ప్రపంచ వ్యాప్తంగా కరోనా బారిన పడ్డ వారు విజయవంతంగా కోలుకోని మళ్లీ మామూలు స్థితిలోకి వస్తున్నారు. ఇదే సందర్భంలో మన తెలంగాణలో కూడా సుమారు 11 మంది కోలుకున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం స్వయంగా ప్రకటించారు. అంతేకాదు కరోనా నుండి కోలుకున్న బాధితుడితో మోడీ ఫోన్ చేసి స్వయంగా మాట్లాడారని చెప్పారు. సోమవారం ఉదయం వారిని డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు.

గమనిక : ఈ ఆర్టికల్ లో జ్యోతిష్య వివరాలన్నీ 14 ఏళ్ల వేద విద్యార్థి అజ్ణాతి ఆనంద్ చెప్పిన వివరాలను ఆధారం చేసుకుని రాసినది. ఈ వివరాలను మీరు నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం. దీనికి బోల్డ్ స్కై తెలుగుకు ఎటువంటి సంబంధం లేదని మీరు గుర్తుంచుకోవాలి.

English summary

What may happen from MARCH 29th-APRIL 2nd : Abhigna Anand

Here we talking about what may happen from march 29th to april 2nd : abhigna anand. Read on
Desktop Bottom Promotion