For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Friendship Day 2021 Date: ఈ ఏడాది ఇండియాలో ఫ్రెండ్ షిప్ ఎప్పుడు జరుపుకుంటారో తెలుసా...

|

ఈ లోకంలో ఎన్ని బంధాలున్నా స్నేహ బంధానికి ఉన్న విలువ దేనికి లేదని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాంటి స్నేహితులందరి కోసం క్యాలెండర్లో ఓ రోజు కేటాయించబడిది.

ఆ రోజున స్నేహితులందరికీ అంకితం చేయబడింది. ప్రపంచ దేశాలతో పాటు మన దేశంలో కూడా ఫ్రెండ్ షిప్ జరుపుకోవడానికి అందరూ మంచి ఉత్సాహం కనబరుస్తారు. స్నేహితుల దినోత్సవాన్ని ఆయా వర్గాల ప్రజలు వివిధ రకాలుగా జరుపుకుంటారు.

ఫ్రెండ్ షిప్ డే రోజున తమ స్నేహితులందరికీ మధురమైన క్షణాలు గుర్తొచ్చేలా స్నేహితులకు ప్రేమపూర్వక సందేశాలను పంపడం వంటివి చేస్తూ ఉంటారు. ఇక టెక్నాలజీ పెరగడం వల్ల ఫ్రెండ్ షిప్ డే రోజు సోషల్ మీడియాలో ట్వీట్లు, కామెంట్లు, పోస్టుల మోత మోగిపోతుంది.

ఇప్పటికే చాలా మంది అడ్వాన్స్ ఫ్రెండ్ షిప్ డే పోస్టులతో సోషల్ మీడియాలో రెచ్చిపోతన్నారు. అయితే 2021 సంవత్సరంలో ఈ స్నేహితుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు... ముఖ్యంగా మన దేశంలో ఏ తేదీన జరుపుకుంటారు.. అసలు ఈ వేడుక ఎప్పుడు.. ఎలా మొదలైందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

International Friendship Day 2021: నిజమైన స్నేహితులు తోడుంటే.. ప్రపంచాన్నే జయించొచ్చు...!International Friendship Day 2021: నిజమైన స్నేహితులు తోడుంటే.. ప్రపంచాన్నే జయించొచ్చు...!

ఫ్రెండ్ షిప్ ఎప్పుడంటే..

ఫ్రెండ్ షిప్ ఎప్పుడంటే..

ప్రతి సంవత్సరం ఆగస్టు మాసంలో తొలి ఆదివారం రోజున ఫ్రెండ్ షిప్ డే వేడుకలను ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో 2021 సంవత్సరంలో ఆగస్టు ఒకటో తేదీన స్నేహితుల దినోత్సవం ప్రారంభమవుతుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకునేందుకు సన్నాహాలు కూడా ప్రారంభమయ్యాయి. సోషల్ మీడియాలో అడ్వాన్స్ ఫ్రెండ్ షిప్ డే ట్రెండింగ్ గా నిలుస్తోంది.

ఫ్రెండ్ షిప్ ఎలా ప్రారంభమైందంటే..

ఫ్రెండ్ షిప్ ఎలా ప్రారంభమైందంటే..

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న స్నేహితుల దినోత్సవం తొలిసారిగా 1919 సంవత్సరంలో ప్రారంభమైంది. క్రెడిట్ ప్రసిద్ధ హాల్ మార్క్ కార్డుల వ్యవస్థాపకుడు జాయిస్ హాల్ కు చెందుతుంది. అప్పటి నుండి స్నేహితులకు అందమైన శుభాకాంక్షలు పంపే ప్రక్రియ నేటికీ కొనసాగుతుంది. 2011 సంవత్సరం నుండి దీనిని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు జరుపుకోవచ్చని ఐక్యరాజ్య సమితి తీర్మానం చేసింది.

మరో కథనం..

మరో కథనం..

స్నేహితుల దినోత్సవానికి సంబంధించిన మూలం 1960వ సంవత్సరంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో ముడి పడి ఉందని చెబుతుంటారు. ఆ సమయంలో ఫ్రెండ్ షిప్ డే బ్యాండ్లను కట్టే సంప్రదాయం అమెరికా రాజకీయ ర్యాలీల నుండి ప్రారంభమైంది. ప్రస్తుతం అదే ధోరణి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. ఇప్పుడు ప్రతి దేశంలో యువతీ యువకులు తమ స్నేహితులకు స్నేహ బ్యాండ్లు కట్టి, వారి స్నేహాన్ని బలోపేతం చేసుకుని ఈరోజును జరుపుకుంటారు.

మీ స్నేహితులను హత్తుకునే బెస్ట్ విషెస్, కోట్స్, వాట్సాప్ మెసెజెస్ ను ఇప్పుడే షేర్ చేసుకోండి...మీ స్నేహితులను హత్తుకునే బెస్ట్ విషెస్, కోట్స్, వాట్సాప్ మెసెజెస్ ను ఇప్పుడే షేర్ చేసుకోండి...

స్నేహమే మీ బలహీనత..

స్నేహమే మీ బలహీనత..

స్నేహం చేయడమే మీ బలహీనత అయితే.. మీకన్నా బలవంతుడు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరని ఓ ఆంగ్ల కవి స్నేహానికి ఉన్న గొప్పదనాన్ని ఇలా వర్ణించారు. దీన్ని బట్టే ప్రపంచంలో స్నేహమంటే ఎంత అద్భుతమో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అమ్మానాన్నలు, సోదరీ, సోదరులను దేవుడు బహుమతిగా ఇస్తే.. స్నేహితులను మాత్రం ఎంపిక చేసుకునే అద్భుత అవకాశాన్ని దేవుడు మనకే ఇచ్చాడు. అమ్మ అనే పదం తర్వాత మనలో ఆత్మీయతను మరింత పెంచే మాట స్నేహం.

మంచి స్నేహితులను..

మంచి స్నేహితులను..

మన జీవితంలో ఎవరినైనా మంచి స్నేహితుడిని సంపాదించుకుని.. వారిని భద్రంగా కాపాడుకుంటే వారు జీవితాంతం సంతోషంగా ఉంటారనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. మన మిత్రుడు మనలా ఆలోచించి.. ఓ గురువులా క్లాస్ తీసుకుంటూ.. తప్పు చేసినప్పుడు మనల్ని సరైన దారిలో నడిపేవాడే నిజమైన స్నేహితుడు.

ఎలాంటి తేడాలుండవు..

ఎలాంటి తేడాలుండవు..

స్నేహానికి కులం, మతం, ప్రాంతం.. పని వంటి వాటితో పెద్దగా అవసరం లేదు. మనుషులు వేరైనా మనసులో ఒకటిగా పెనవేసుకునేది చెలిమి. దీనికి ఎలాంటి తేడాలు అనేవే ఉండవు. ఎందుకంటే స్నేహం చాలా పవిత్రమైంది. నిజమైన స్నేహానికి మించిన ఆస్తులు ఉండవు. అందుకే చాలా మంది తమ కుటుంబ సభ్యులు, తోబుట్టువులతో చెప్పుకోలేని ఎన్నో విషయాలను స్నేహితులతో చెప్పుకోవడానికే ప్రాధాన్యత ఇస్తారు.

ఈ సందర్భంగా బోల్డ్ స్కై తెలుగు తరపున అందరికంటే ముందుగా అడ్వాన్స్ Happy Friendship Day.

English summary

when is friendship day 2021 in india? july 30 or august 1?

Friendship Day 2021 Date: When is Friendship Day in India in 2021?
Story first published: Friday, July 30, 2021, 13:51 [IST]