For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ 4 రాశుల వారు అమ్మాయిలను ఇట్టే ఆకర్షిస్తారట... మీ రాశి కూడా ఉందేమో చూడండి...!

|

ఈ విశ్వంలో ఏ ఒక్క స్త్రీని అయినా ఆకర్షించడం అనేది అంత సులభం కాదు. అయినా కూడా అబ్బాయిలు అమ్మాయిలను ఆకర్షించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.

తమకు ఇష్టమైన మహిళ కనబడితే చాలు ఎప్పటికీ చేయని పనులు కూడా అవలీలగా చేసేస్తుంటారు కొందరు అబ్బాయిలు. మరికొందరు తాము ఇష్టపడ్డ అమ్మాయి కోసం చాలా విషయాల్లో కాంప్రమైజ్ అవుతారు. అయినా కూడా అమ్మాయిలు వారిని ఇష్టపడరు.

ఇక వివాహం విషయానికొస్తే అమ్మాయిలకు ప్రస్తుతం మరింత డిమాండ్ పెరిగిపోయింది. ముఖ్యంగా సరైన జీవిత భాగస్వామిని ఎన్నో క్యాలిక్యులేషన్స్ పెట్టుకుంటారు. వాటన్నింటిలో క్వాలిఫై అయితే అబ్బాయిలకు ఆ అమ్మాయి దొరుకుతుంది.

అయతే జ్యోతిష్య శాస్త్రం సరైన భాగస్వామిని ఎన్నుకోవడానికి అనేక సూచనలు చేసింది. అయితే అమ్మాయిలు కూడా ఎలాంటి రాశిచక్రాల వారిని ఇష్టపడతారు? ఎలాంటి లక్షణాలున్న అబ్బాయిలను పెళ్లి చేసుకుంటే మీ జీవితంలో కలిసి వస్తుంది అనే విషయాలను వివరించింది.

ఇదిలా ఉంటే జ్యోతిష్యశాస్త్రం ప్రకారమే ద్వాదశ రాశులలోని కొన్ని రాశుల వారు మాత్రం ఎలాంటి ప్రయత్నాలు చేయకుండానే అమ్మాయిలను తెగ ఆకర్షించేస్తారట. అందులోనూ ముఖ్యంగా నాలుగు రాశుల వారు మాత్రం అమ్మాయిల మనసులో ఏముందో కనిపెట్టి.. వారితో బాగా పరిచయం పెంచుకుంటారట. అంతేకాదు ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి అనే మూడుముళ్ల బంధం వరకు తీసుకెళ్తారంట. ఇంతకీ ఆ నాలుగు రాశి చక్రాలేవో ఇప్పుడు తెలుసుకుందాం...

మీ రాశిని బట్టి ఏ వయసులో మీరు వివాహం చేసుకోవాలో తెలుసుకోండి...!

తుల రాశి

తుల రాశి

ఈ రాశి వారికి కళ్లలోకి కళ్లు పెట్టి చూసే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. వీరు చాలా తక్కువ సమయంలోనే అందమైన అమ్మాయిలను ఆకర్షించేస్తారు. వీరి స్టైల్ అందరి కంటే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. వీరు ప్రతి విషయంలో పూర్తి అవగాహన కలిగి ఉంటారు. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో. అలాగే ప్రేమ, బాధ్యతల మధ్య సమతూకం పాటిస్తారు. అలాగే ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించి ముందడుగు వేస్తారు. ఒకటికి మూడు నాలుగు సార్లు ఆలోచిస్తారు. అప్పుడే ఒక నిర్ణయం తీసుకుంటారు. అయితే వీరికి పిరికితనం, స్వీయ విధ్వంసక స్వభావం కలిగి ఉంటారు. వీరు ఎవరైనా అమ్మాయితో కొంత సమయం మాట్లాడితే చాలు, ఆమెను తన ఫ్రెండ్స్ గా మార్చేసుకుంటారు.

మకర రాశి..

మకర రాశి..

ఈ రాశి వారు అమ్మాయిలను చూసిన వెంటనే ఆకట్టుకుంటారు. మహిళల మనసులను మార్చడంలో వీరు మంచి నైపుణ్యం కలవారు. వీరు అందరికంటే మంచి మాటకారిగా ఉంటారు. వీరి హావభావాలతో అమ్మాయిలను మరింత సులభంగా ఆకర్షిస్తారు. అంతేకాదు ఈ రాశి వారు నిత్యం సంతోషంగా ఉంటారు. వీరు ఇతరుల కన్నా ప్రవర్తనలో మరియు వ్యక్తిత్వంలో చాలా ప్రత్యేకంగా ఉంటారు. అంతేకాదు వీరు ఎల్లప్పుడూ చురుకుగా ఉంటారు. వీరు అందరికంటే తెలివైన వ్యక్తులు కూడా. ఇలాంటి మగవారితో మహిళలు ఎప్పుడూ స్నేహం చేయాలని కోరుకుంటూ ఉంటారు.

మిధున రాశి..

మిధున రాశి..

ఈ రాశి వారు అమ్మాయిలను ఆకట్టుకునేందుకు పెద్దగా ప్రయత్నాలేవీ చేయాల్సిన అవసరం లేదు. వీరి సహజ స్వభావం కారణంగానే వీరు అమ్మాయిల చేత ఆకర్షించబడతారు. అంతేకాదు ఈ రాశి చక్రాల వారు సహజంగానే సున్నితంగా మరియు రొమాంటిక్ గా ఉంటారు. దీని వల్లే చాలా మంది అమ్మాయిలు చాలా ఈజీగా వీరిని ఇష్టపడతారట. అలాగే వీరు చాలా ఎక్కువగా భావోద్వేగానికి గురవుతారు. అలాగే వీరు మహిళల మనసులో ఏముందో ఇట్టే అర్థం చేసుకోగలరు. అయితే ఇలాంటి వారిని పెళ్లి చేసుకునేటట్టయితే అమ్మాయిలు అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించాలట.

ఈ సంకేతాలను బట్టి అమ్మాయిల వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకోవచ్చు...!

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశి వారు మానసికంగా చాలా బలంగా ఉంటారు. వీరు అందరికంటే భిన్నమైన సంబంధాలను కోరుకుంటారు. అయితే వీరు ఎవరినైనా ప్రేమిస్తే, ప్రేమ కోసం ఎంత దూరమైన వెళతారు. ఇలాంటి వారితో అమ్మాయిలు మాట్లాడటానికి అస్సలు సిగ్గుపడరు. అలాగే ఈ రాశి వారు అమ్మాయిలతో చాలా స్నేహపూర్వకంగా మరియు గౌరవంగా ఉంటారు. స్నేహానికి వీరు ఎక్కువ విలువ ఇస్తారు. ఇలాంటి లక్షణాలనే అమ్మాయిలు ఎక్కువగా కోరుకుంటారు. అంతేకాదు వీరు ఫస్ట్ సైట్ లోనే ఏ అమ్మాయినైనా ఆకర్షించే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది.

English summary

Women are attracted to these 4 zodiac signs in telugu

Here are the women are attracted to these 4 zodiac signs in telugu. Take a look.