Latest Updates
-
గణేశ్ చతుర్థి స్పెషల్: మీ ఇంటి గణపతికి శనగపప్పు మోదకాలు. ఇలా చేస్తే వారం రోజుల పాటు నిల్వ.! -
ఆంధ్రా విలేజ్ స్టైల్ పప్పు రొయ్యల వంకాయ కర్రీ.. ఇలా చేశారంటే ఇల్లంతా ఘుమఘుమలే.! -
ఐరన్, ప్రొటీన్ అబ్బా.. సూపర్ హెల్తీ, టేస్టీ పాలక్ పన్నీర్ చపాతీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
నీకు టీబీ ఉంది,అడిగితే లేవదు,నన్ను సుఖపెట్టలేవు..రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్తపైనే తిరగబడ్డ భార్య! -
మూషిక వాహనంపై బొజ్జ గణపయ్య.. గణేశ్ పూజలో ఎలుక ప్రాముఖ్యత, సందేశం ఇదే.! -
రాత్రి అన్నం మిగిలిందా? ఉదయం ఇలా హోటల్ స్టైల్ క్రిస్పీ దోసె వేసుకోండి! -
ఈ టేస్ట్ నెవర్ బిఫోర్.. సండే స్పెషల్ పాలకూర చికెన్, చిక్కటి గ్రేవీకి మైమరిచిపోతారు.! -
సెప్టెంబర్ 17 న కన్యారాశిలోకి సూర్యుడు.. నెల రోజులపాటు మహర్జాతకులు అంటే వీరే.! -
పసిపిల్లలకు డ్రై ఫ్రూట్స్ ఎప్పటినుంచి ఇవ్వాలి? ఎలా పెడితే ఆరోగ్యానికి మంచిది? -
వినాయక చవితి స్పెషల్: గణనాథుడికి కారం ఉండ్రాళ్లు.. త్వరగా, పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా చేయండి.!
Akhanda 2: అఖండ 2 విడుదల నిలిపివేత.. బాలకృష్ణ మూవీకి కోర్టు షాక్
అఖండ 2 సినిమా రిలీజ్‌ను నిలిపివేయాలంటూ మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో ఈ సినిమాకు భారీ దెబ్బ పడే అవకాశం ఉంది. ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఎరోస్ ఇంటర్నేషనల్ మీడియా లిమిటెడ్ (Eros) దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన మద్రాస్ కోర్టు సంచలన ఆదేశాలను జారీ చేసింది. ఎరోస్ సంస్థతో వివాదం పరిష్కారం అయ్యేంత వరకు సినిమాను విడుదల చేయకూడదని కోర్టు తన ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొన్నది. ఈ వివాదానికి సంబంధించిన వార్త వివరాల్లోకి వెళితే..
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన అఖండ సినిమాకు సీక్వెల్‌గా అఖండ 2 తాండవం డిసెంబర్ 5వ తేదీన రిలీజ్‌కు సిద్దమైంది. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మించింది. అయితే గతంలో ఈ సంస్థకు ఎరోస్ సంస్థతో ఉన్న ఆర్థిక లావాదేవీలు వివాదాస్పద కావడంతో సంచలనంగా మారింది.

ఎరోస్ సంస్థకు అఖండ 2 నిర్మాతలకు గతంలో చేసుకొన్న ఒప్పందం ప్రకారం సుమారుగా 28 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. అయితే వాటి చెల్లింపు కోసం పలు దఫాలుగా చర్చలు జరిగాయి. కానీ వాటి చెల్లింపు జరగకపోవడంతో ఎరోస్ సంస్థ మద్రాస్ కోర్టును ఆశ్రయించారు. తమకు చెల్లించాల్సిన మొత్తాన్ని ఇచ్చిన తర్వాతే అఖండ 2 సినిమా విడుదలకు అనుమతించాలని ఎరోస్ లీగల్ టీమ్ పీఎస్ రామన్, ఏఆర్ఎల్ సుందరేశన్, నిత్యాయేష్ నటరాజ్ కూడిన బృందం కోర్టును వేడుకొన్నారు.
14 రీల్స్ ప్లస్ ఎల్ఎల్‌పీ సంస్థకు గతంలో 17 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ అనుబంధం ఉంది. తమకు చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించకుండా అఖండ 2 సినిమాను రిలీజ్ చేస్తున్నదని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎరోస్ సంస్థ పిటిషన్ విచారించిన కోర్టు.. 28 కోట్ల రూపాయలతోపాటు అదనంగా 14 శాతం వడ్డీతో కలిపి చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నది. ఈ వివాదం పరిష్కారం కానంత వరకు సినిమాను రిలీజ్ చేయడానికి వీలు లేదు అంటూ కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నది. ఈ పిటిషన్‌ను జస్టిస్ సుబ్రమణ్యం, జస్టిస్ కుమారప్పన్‌తో కూడిన డివిజన్ బెంచ్ విచారించి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం.. సినిమా విడుదల, డిస్ట్రిబ్యూషన్, వ్యాపార, వాణిజ్యపరమైన లావాదేవీలు జరపకూడదని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నది.
Credit: Filmibeat



Click it and Unblock the Notifications
