Latest Updates
-
వేడి వేడి అన్నంలోకి అమృతం లాంటి ధనియాల రసం.. ఇలా చేస్తే గిన్నెలు గిన్నెలు తాగేస్తారు! -
స్ట్రీట్ ఫుడ్ టేస్ట్ ఇంట్లోనే..ఎలాంటి సాస్ లు లేకుండానే అదిరిపోయే వెల్లుల్లి కారం ఎగ్ ఫ్రైడ్ రైస్.. -
పెసరపప్పు వెజిటేబుల్ ఇడ్లీ..బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కేవలం 15 నిమిషాల్లో రెడీ! -
ఎప్పుడూ అలసిపోతున్నారా? అయితే మీ శరీరంలో ఈ విటమిన్ తగ్గినట్లే..డాక్టర్ చెప్పిన సంచలన నిజం! -
కరకరలాడే కాకరకాయ కాజు ఫ్రై..ఒక్కసారి వండితే రుచి మర్చిపోలేరు..అన్నం, పప్పు, రసంలోకి కేక! -
ఉగాది స్పెషల్ తమిళనాడు ఫేమస్ వెప్పం పూ రసం..హెల్త్ కి హెల్త్.. టేస్ట్ కి టేస్ట్! -
షుగర్ పేషెంట్లకు శుభవార్త.. ఈ స్వామిని దర్శిస్తే డయాబెటిస్ పూర్తిగా నయం! -
కస్టర్డ్ పౌడర్,చక్కెర లేకుండానే..ఇంట్లోనే క్రీమీ,హెల్తీ ఫ్రూట్ కస్టర్డ్..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీ ఫేమస్ చికెన్ చంగేజీ..నాన్, బటర్ రోటీ, చపాతీ, బగారా రైస్, అన్నంలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
అమ్మమ్మల నాటి పచ్చి టమాటా రోటి పచ్చడి..చికెన్, మటన్ కూడా దేనికీ పనికిరావు!
ట్రంప్‌కు భారీ షాక్.. సుంకాలకు ప్రతీకారంగా భారత్‌తో జత కట్టిన రెండు దేశాలు
ప్రపంచంలో మూడు పెద్ద అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలైన భారతదేశం, బ్రెజిల్, దక్షిణాఫ్రికా ఇప్పుడు ఒక్కటవ్వబోతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న దూకుడు వాణిజ్య, రాజకీయ చర్యలు అని చెప్పవచ్చు. గతంలో వాషింగ్టన్ ఈ దేశాలతో శాంతియుతంగా, జాగ్రత్తగా దౌత్యం కొనసాగిస్తుండేది.
అయితే ట్రంప్ వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆయన అధిక సుంకాలతో ఈ దేశాలను లక్ష్యంగా చేసుకున్నారు. మూడు దేశాల నాయకుల దేశీయ విధానాలపై బహిరంగ విమర్శలు చేశారు. ప్రపంచ వేదికలపై కూడా వీరిపై ఒత్తిడి పెంచారు. ఈ ఒత్తిళ్లే ఇప్పుడు భారతదేశం, బ్రెజిల్, దక్షిణాఫ్రికా ఒకరికి ఒకరు మరింత దగ్గరవ్వడానికి కారణమవుతున్నాయి.
ఇటీవలి G20 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా జోహన్నెస్‌బర్గ్‌లో ఈ మూడు దేశాల నాయకులు ప్రత్యేకంగా ఒకే వేదికపై IBSA ఫోరమ్ పేరుతో సమావేశమయ్యారు. అయితే ఇది చాలా సంవత్సరాలుగా ఉంది కానీ దాదాపు పది ఏళ్ల తరువాత నాయకుల స్థాయిలో సమావేశం జరగడం ఇదే మొదటిసారి.
ఇదొక విధంగా ట్రంప్ ఒత్తిడి ప్రభావమేనని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. చిన్న సమూహంగా ఉండడం వల్ల IBSAలో నిర్ణయాలు త్వరగా తీసుకోవచ్చు. పరస్పర సమస్యలు సులభంగా చర్చించవచ్చు, ఆచరణాత్మక పరిష్కారాలు త్వరగా అమలు చేయవచ్చు.

దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా ఈ ఫోరమ్‌ను వైవిధ్యంలో బలం అని పేర్కొన్నారు. ప్రపంచ బహుపాక్షిక వ్యవస్థలు (UN, WTO వంటివి) ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న దేశాల అవసరాలను సరిగ్గా ప్రతిబింబించడం లేదని ఆయన స్పష్టం చేశారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తూ IBSA సమ్మిట్‌ను చరిత్రాత్మకమైనదిగా పేర్కొన్నారు.
350 శాతం సుంకాలకు భయపడి పాకిస్తాన్ మీద యుద్దాన్ని మోదీ ఆపేశారు.. మరోసారి ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
ఈ నేపథ్యంలో మరో ముఖ్యమైన అంశం ఏంటంటే.. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ G20కి హాజరుకాకపోవడం. ఇది IBSA త్రైపాక్షిక సమూహాన్ని తిరిగి ముందుకు తీసుకురావడానికి ఒక అవకాశం కలిగించింది. BRICS దేశాలలో చైనా, రష్యా వంటి పెద్ద శక్తులు అజెండాను పూర్తిగా ఆధారపడి నడిపిస్తున్న నేపథ్యంలో..IBSA వంటి చిన్న సమూహం మూడు దేశాలకు సమాన అవకాశాలతో చర్చించడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. బ్రెజిల్ అధ్యక్షుడు లులా కూడా BRICS అజెండాను కాపీ చేస్తే IBSAని ముందుకు తీసుకెళ్లలేమని స్పష్టం చేశారు.
Trump విధానాలు ఈ దేశాలను ఎందుకు దగ్గర చేశాయంటే.. భారతదేశంపై ఆయన పెద్దమొత్తంలో సుంకాలు విధించారు, పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వంటి విషయాలలో జోక్యం చూపారు. దక్షిణాఫ్రికాపై తప్పుడు ఆరోపణలు చేశారు. బ్రెజిల్‌పై కూడా ట్రంప్ విపరీతమైన ఒత్తిడి తెచ్చి, వారి ఎగుమతులపై భారీ సుంకాలు పెట్టారు. ఈ చర్యలన్ని ఈ దేశాలకు ఒక సందేశం ఇచ్చాయి: తమ స్వంత ప్రయోజనాలకు అనుగుణంగా వారు మరింత బలమైన ఆర్థిక, రాజకీయ కూటమిని నిర్మించుకునేందుకు దోహదం చేశాయి.
అందుకే IBSA పునరుద్ధరణ చాలా ప్రాముఖ్యత పొందింది. ఇది ప్రపంచ దక్షిణ దేశాల ఆర్థిక ఏకీకరణకు దారి తీసే సూచనగా చెప్పవచ్చు. సరఫరా గొలుసులను స్థిరంగా ఉంచుకోవడం, మార్కెట్ వైవిధ్యం పెంచుకోవడం, పరస్పర పెట్టుబడులు, మార్కెట్ యాక్సెస్ వంటి విషయాల్లో ఈ మూడు దేశాలు ఇప్పుడు మరింత చురుకైన సహకారం చేపట్టే అవకాశం ఉంది. ట్రంప్ దూకుడు చర్యలు అభివృద్ధి చెందుతున్న దేశాలను వెనక్కి తగ్గించకుండా, వారిని మరింత దగ్గర చేసి, బలమైన కొత్త గ్లోబల్ సౌత్ బ్లాక్‌ను ఏర్పరుస్తున్నాయి. IBSA పునరుజ్జీవనం భవిష్యత్తులో వారి సహకారానికి కొత్త దిశను ఇవ్వొచ్చని నిపుణులు చెబుతున్నారు.
Credit: Goodreturns



Click it and Unblock the Notifications











