Latest Updates
-
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే
బంగారం, వెండి పెరుగుదల ఆగిపోలేదు.. పసిడి ప్రియులకు UBS నివేదిక షాక్.. పెట్టుబడిదారులకు మాత్రం..
బంగారం ధరల ర్యాలీపై సస్పెన్స్ కొనసాగుతోంది. 2026 ఆరంభంలు చుక్కలు చూపించిన బంగారం ధరలు నెల తర్వాత నేల చూపులు చూశాయి. జనవరి నెలలో సామాన్యులకు అందనంద దూరం దూసుకువెళ్లిన పసిడి ధరలు ఫిబ్రవరి నెల వచ్చేసరికి పాతాళానికి పడిపోయాయి. గత వారం రోజులుగా బంగారం, వెండి ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. దీంతో పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొంది.
అధిక ధరల వద్ద ఈ విలువైన లోహాల్లో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లు టెన్షన్‌కు గురవుతున్నారు. సిల్వర్ ధరలు ఇప్పటికీ ఒత్తిడిలో కొనసాగుతుండగా.. పసిబి మాత్రం ఆ ఒత్తిడిని క్రమంగా అధిగమిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో UBS విడుదల చేసిన తాజా నివేదిక బంగారం పెట్టుబడిదారులకు ఊరటనిచ్చేలా కనిపిస్తోంది.బంగారం ర్యాలీ ఇక్కడితో ముగిసినట్టుకాదు. వచ్చే ఐదు నెలల్లో Gold ధరలు ఔన్సుకు 6,200 డాలర్ల స్థాయిని చేరుకునే అవకాశం ఉందని గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ UBS అంచనా వేస్తోంది.ఇది ప్రస్తుత స్థాయిలతో పోలిస్తే దాదాపు 25 శాతం పెరుగుదలగా భావిస్తున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్‌లో కొంతకాలం పాటు ఆందోళన, అస్థిరత కొనసాగవచ్చని UBS అంచనా వేస్తోంది. మార్జిన్ కాల్స్, ఫ్యూచర్స్ మార్కెట్లో లిక్విడిటీ తగ్గడం వంటి కారణాల వల్ల సమీప కాలంలో బంగారం ధరలు ఔన్సుకు 4,500 డాలర్ల నుంచి 4,800 డాలర్ల మధ్యలోనే ఊగిసలాడే అవకాశం ఉందని తెలిపింది. అయితే, ఇది బుల్ మార్కెట్ ముగింపు కాదని.. కేవలం ఒక తాత్కాలిక విరామం మాత్రమేనని UBS స్పష్టం చేసింది. ఈ దశ పూర్తయిన తర్వాత, బంగారం తిరిగి దాని బలమైన బుల్లిష్ ట్రెండ్‌ను కొనసాగించే అవకాశం ఉందని పేర్కొంది.
బంగారం కొంత స్థిరత్వం కోసం ప్రయత్నిస్తుండగా.. వెండి మార్కెట్ మాత్రం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధరలు ఒక్కరోజులోనే 7 శాతం కంటే ఎక్కువగా పడిపోయి ఔన్సుకు 77 డాలర్లకి చేరాయి. భారత మార్కెట్లో పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉంది. MCXలో వెండి ధరలు కిలోకు దాదాపు రూ. 2.44 లక్షలకు చేరుకొని, కేవలం ఒక వారంలోనే 21 శాతం కంటే ఎక్కువ పతనాన్ని నమోదు చేశాయి.
ఈ నేపథ్యంలో UBS పెట్టుబడిదారులకు స్పష్టమైన హెచ్చరిక జారీ చేసింది. వెండిలో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టేందుకు ఇది సరైన సమయం కాదని పేర్కొంది. ఇటీవలి తీవ్ర హెచ్చుతగ్గులు ప్రమాదాన్ని పెంచాయని.. మరింత తగ్గుదల వచ్చిన తర్వాత మాత్రమే వెండిలో ప్రమాదం-రాబడి సమతుల్యత మెరుగుపడుతుందని UBS అభిప్రాయపడింది. జనవరి 30న బంగారం ధరలు పెట్టుబడిదారులను షాక్‌కు గురిచేశాయి. అంతకుముందు రోజు రికార్డు స్థాయిలను తాకిన బంగారం, మరుసటి రోజే దాదాపు 12 శాతం వరకు పడిపోయింది. అనంతరం స్వల్పంగా కోలుకున్నప్పటికీ.. ఆ రోజంతా 8.5 శాతం నష్టంతో ముగిసింది. UBS ప్రకారం ఇది గత 13 సంవత్సరాలలో ఒకే రోజులో నమోదైన అతిపెద్ద పతనం.
ఈ Gold పతనం వెనుక ఒక్క కారణం లేదని UBS విశ్లేషించింది. ఇటీవలి ర్యాలీ తర్వాత పెట్టుబడిదారులు లాభాల బుకింగ్‌కు దిగడం, ఫ్యూచర్స్ మార్కెట్లో లిక్విడిటీ క్షీణించడం, వడ్డీ రేట్లు పెరగవచ్చనే అంచనాలు, అమెరికన్ డాలర్ బలపడటం కలిసి మార్కెట్‌పై తీవ్ర ఒత్తిడి తెచ్చాయి. అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కెవిన్ వార్ష్‌ను ఫెడరల్ రిజర్వ్ చైర్మన్‌గా నామినేట్ చేయడం కూడా మార్కెట్ ఆందోళనను పెంచింది. వార్ష్ కఠినమైన ద్రవ్య విధానానికి మద్దతుదారుడిగా పేరుగాంచారు. ఈ వార్తల తర్వాత బంగారం, బిట్‌కాయిన్ వంటి ఆస్తులు ఒత్తిడికి గురవగా.. డాలర్ స్వల్పంగా బలపడింది.
డివెరే గ్రూప్ CEO నిగెల్ గ్రీన్ మాట్లాడుతూ.. ఈ పతనం బంగారంపై విశ్వాసం కోల్పోవడం వల్ల కాదని తెలిపారు. అధిక రుణాలతో పెట్టుబడులు పెట్టినవారు బలవంతపు అమ్మకాలకు దిగడమే ప్రధాన కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ బలవంతపు అమ్మకాలు ముగిసిన తర్వాత మార్కెట్‌పై ఒత్తిడి తగ్గి, బంగారం మళ్లీ స్థిరపడే అవకాశం ఉందని అన్నారు.
UBS ప్రకారం కేంద్ర బ్యాంకులు పూర్తిస్థాయిలో తమ విశ్వసనీయతను తిరిగి పొందినప్పుడు, ద్రవ్య విధానంలో పెద్ద మార్పు వచ్చినప్పుడే గోల్డ్ బుల్ మార్కెట్ ముగుస్తుంది. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు ఇంకా కనిపించడం లేదని సంస్థ స్పష్టం చేసింది. బంగారం ఇప్పుడు దాని బుల్ మార్కెట్‌లో మధ్య నుంచి చివరి దశల్లో ఉందని, ఈ దశలో కొత్త రికార్డులతో పాటు 5 నుంచి 8 శాతం వరకు దిద్దుబాట్లు సహజమే అని UBS విశ్లేషిస్తోంది. క్లుప్తంగా చెప్పాలంటే వెండి ఇంకా ఒత్తిడిలో ఉండగా, బంగారం మాత్రం క్రమంగా కోలుకుంటూ దీర్ఘకాలంలో మళ్లీ బలమైన ర్యాలీ చూపే అవకాశముందని UBS నివేదిక సూచిస్తోంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
Credit: Goodreturns



Click it and Unblock the Notifications











